వాషింగ్టన్ : ఓ విమానం అట్లాంటిక్ మహా సముద్రంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఏడుగురు గల్లంతయ్యారు. ఈ విషాదకర ఘటన అమెరికా నార్త్ కరోలినా రాష్ట్రంలోని ఔటర్ బ్యాంక్స్ వద్ద చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఎనిమిది మంది యువకులతో హైడ్ కౌంటీ ఎయిర్పోర్ట్ నుంచి పిలాటస్ పీసీ-12/47 అనే సింగిల్ ఇంజిన్ విమానం టేకాఫ్అయింది. అనంతరం 25 నిమిషాల్లో 29 కిలోమీటర్ల(18 మైళ్లు) దూరం ప్రయాణించిన తర్వాత రాడార్‌తో ఆ విమాన సంబంధాలు తెగిపోయాయి.
దీంతో ఆ విమానం అట్లాంటిక్ మహా సముద్రంలో కూలిపోయిందని కోస్ట్ గార్డ్ అధికారులు నిర్ధారించుకున్నారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది సముద్రంలో సహాయక చర్యలను ప్రారంభించింది. ఈ క్రమంలో సముద్రంలో విమాన శకలాలను సిబ్బంది గుర్తించారు. ఆ ప్రాంతంలోనే ఓ వ్యక్తి మృతదేహాన్ని కూడా కోస్ట్ గార్డ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గల్లంతైన మరో ఏడుగురి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా, వీరంతా కార్టెరెట్ కౌంటీకి చెందిన వారిగా అధికారులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment