వాషింగ్టన్: ప్రపంచంలోనే అతి పెద్ద విమానయాన సంస్థ ఆవిర్భవించింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్, యూఎస్ ఎయిర్‌వేస్ ఈ రెండు సంస్థలు విలీనమై కొత్తగా అమెరికన్ ఎయిర్‌లైన్స్ గ్రూప్ సంస్థ ఏర్పడింది. విలీన ప్రక్రియను పూర్తి చేశామని అమెరికన్ ఎయిర్‌లైన్స్ మాజీ మాతృసంస్థ ఏఎంఆర్ కార్పొరేషన్, యూఎస్ ఎయిర్‌వేస్‌లు పేర్కొన్నాయి. కొత్తగా ఏర్పడిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ గ్రూప్ సోమవారం నాస్‌డాక్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ అయింది. ఈ సంస్థ రోజుకు 6,700 విమానాలను 50 దేశాల్లోని 330 నగరాలకు నడుపుతుంది. యూఎస్ ఎయిర్‌వేస్, అమెరికన్ ఎయిర్‌లైన్స్ సంస్థలు కలిసి అజేయమైన సంస్థను స్థాపించాయని కొత్తగా ఏర్పాటైన అమెరికన్ ఎయిర్‌లైన్స్ గ్రూప్‌కు సీఈవోగా వ్యవహరిస్తున్న పార్కర్ పేర్కొన్నారు.