క్రిస్మస్ పండుగ సెలబ్రేషన్స్ మొదలైపోయాయి. ఈ తరుణంలో యూఎస్‌లో.. అమెరికన్ ఎయిర్‌లైన్స్ (American Airlines) తన అన్ని విమానాలను నిలిపివేసింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
విమాన సేవలను నిలిపివేయడానికి సాంకేతిక సమస్యలే కారణమని అమెరికన్ ఎయిర్‌లైన్స్ చెబుతోంది. అయితే కొందరు సైబర్ దాడి వల్ల ఈ పరిస్థితి నెలకొని ఉండవచ్చని చెబుతున్నారు.
క్రిస్మస్ (Christmas) పండుగకు ముందు ఇలా జరగడంతో.. పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఒకరు 'మేము ఇంటికి వెళ్లాలా వద్దా చెప్పండి. విమానాశ్రయంలో గంటల తరబడి వేచి ఉండేలా చేయకండి' అని అన్నారు.
మీరు మీ ఇళ్లకు సురక్షితంగా వెళ్లేందుకు మా బృందం పనిచేస్తోంది. మీ సహనానికి ధన్యవాదాలు అంటూ.. అమెరికన్ ఎయిర్‌లైన్స్ నెటిజన్ ప్రశ్నకు రిప్లై ఇచ్చింది.
Our team is working to get this rectified so that you can be safely on your way to your family. Your continued patience is appreciated.
— americanair (@AmericanAir) December 24, 2024
Comments
Please login to add a commentAdd a comment