airline services
-
దేశీ విమాన ప్రయాణికుల్లో వృద్ధి
ముంబై: విమానయాన సేవలకు ఆదరణ కొనసాగుతోంది. మే నెలలో దేశీ విమాన ప్రయాణికుల్లో 4.4 శాతం వృద్ధి కనిపించింది. మొత్తం 1.37 కోట్ల మంది ప్రయాణించారు. క్రితం ఏడాది మే నెలలో ప్రయాణికుల సంఖ్య 1.32 కోట్లుగా ఉంది. ఇక ఈ ఏడాది మే వరకు మొదటి ఐదు నెలల్లో 6.61 కోట్ల మంది ప్రయాణించారు. క్రితం ఏడాది ఇదే ఐదు నెలలో విమాన ప్రయాణికుల రద్దీ 6.36 కోట్లుగా ఉన్నట్టు (3.99 శాతం వృద్ధికి సమానం) పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) ప్రకటించింది. సకాలంలో విమాన సేవలను నిర్వహించడంలో ఆకాశ ఎయిర్ మొదటి స్థానంలో నిలిచింది. మొత్తం మీద 85.9 శాతం మేర సకాలంలో సేవలు అందించింది. ఆ తర్వాత 81.9 శాతంతో విస్తారా, 74.9 శాతంతో ఏఐఎక్స్ కనెక్ట్ (ఎయిరేíÙయా), 72.8 శాతంతో ఇండిగో, 68.4 శాతంతో ఎయిర్ ఇండియా, 60.7 శాతంతో స్పైస్‌జెట్ వరుస స్థానాలో ఉన్నాయి. దేశీ మార్గాల్లో ఇండిగో మార్కెట్ వాటా 61.6 శాతానికి చేరింది. ఎయిర్ ఇండియా వాటా క్రితం నెలలో ఉన్న 14.2 శాతం నుంచి 13.7 శాతానికి క్షీణించింది. విస్తారా మార్కెట్ వాటా 9.2 శాతంగా ఉంది. ఏఐఎక్స్ కనెక్ట్ వాటా 5.4 శాతం నుంచి 5.1 శాతానికి పరిమితమైంది. ఎయిర్ ఇండియా, విస్తారా, ఏఐఎక్స్ కనెక్ట్ టాటా గ్రూపు సంస్థలే. ఆకాశ ఎయిర్ వాటా 4.4 శాతం నుంచి 4.8 శాతానికి పెరిగింది. స్పైస్‌జెట్ మార్కెట్ వాటా 4.7 శాతం నుంచి 4 శాతానికి క్షీణించింది. -
గో ఫస్ట్ కోసం స్పైస్‌జెట్
న్యూఢిల్లీ: దివాలా తీసిన గో ఫస్ట్ విమానయాన సంస్థను దక్కించుకునేందుకు బిడ్లు దాఖలయ్యాయి. బిజీ బీ ఎయిర్‌వేస్‌తో కలిసి స్పైస్‌జెట్ చీఫ్ అజయ్ సింగ్ బిడ్ వేశారు. స్పైస్‌జెట్ వ్యయాలు తగ్గించుకునేందుకు, నిధుల సమీకరించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో అజయ్ సింగ్.. గో ఫస్ట్ కోసం పోటీ పడుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన వ్యక్తిగత హోదాలో బిడ్డింగ్‌లో పాల్గొంటున్నట్లు స్పైస్‌జెట్ తెలిపింది. మరోవైపు, షార్జాకి చెందిన స్కై వన్ ఎఫ్జెడ్ఈ తాము కూడా బిడ్ వేసినట్లు వెల్లడించింది. -
హైదరాబాద్ నుంచి నేరుగా విమానాలు ఏర్పాటు చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ నుంచి నేరుగా అమెరికాకు విమానసర్వీసులు ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి యూఎస్ఏ ఎన్నారైలు వినతిపత్రం సమరి్పంచారు. ఈ మేరకు అమెరికాలో పర్యటిస్తున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని తెలుగు ఎన్నారైలు కలిశారు. ఢిల్లీ, ముంబై వంటి అనేక ఇతర భారతీయ నగరాలు ఇప్పటికే అమెరికాలోని ప్రధాన నగరాలతో నేరుగా విమాన కనెక్షన్లు కలిగి ఉన్నాయని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వాణిజ్యం, పెట్టుబడులు, పర్యాటకం కోసం ప్రపంచ గమ్యస్థానంగా హైదరాబాద్ మరింత ఎదుగుతుందని పేర్కొన్నారు. కాగా ఎయిర్ ఇండియా కొత్త ఫ్లైట్లను ఆర్డర్ చేయటంతోపాటు, కొత్త రూట్లలో విమాన సర్వి సులను తెచ్చేందుకు కృషి చేస్తోందని, కేంద్ర అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా ప్రవాసుల కోరిక నెరవేరేలా చూస్తామని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో విలాస్ జంబుల, లక్ష్మణ్ అనుగు, సంతోష్ రెడ్డి, శ్రీకాంత్ తుమ్మల, ప్రదీప్ కట్టా, వంశీ యమజాల, మధుకర్ రెడ్డి, రామ్ వేముల, రఘువీర్ రెడ్డి తదితరులు ఉన్నారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ నేతలు భేటీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కిషన్ రెడ్డితో అమెరికాలోని ప్రవాస తెలంగాణవాదులు, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. టీడీఎఫ్ మాజీ అధ్యక్షుడు మురళి చింతలపాని, లక్ష్మణ్ అనుగు, ఇతర కార్యవర్గసభ్యులు కిషన్‌రెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్ర సాధనలో ప్రవాస తెలంగాణవాసులు, టీడీఎఫ్ పోషించిన పాత్రను కిషన్‌రెడ్డి అభినందించారు. -
హైదరాబాద్ నుంచి సింగపూర్‌కి ఏ350 ఫ్లయిట్ సర్వీసులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సింగపూర్ ఎయిర్‌లైన్స్ (ఎస్ఐఏ) అక్టోబర్ 30 నుంచి హైదరాబాద్–సింగపూర్ రూట్లో విశాలమైన ఏ350–900 విమానాలతో సర్వీసులు ప్రారంభించనుంది. ఇవి ప్రతి గురు, శుక్ర, శని, ఆదివారాల్లో నడుస్తాయని సంస్థ భారత విభాగ జనరల్ మేనేజర్ సయ్ యెన్ చెన్ తెలిపారు. మిగతా రోజుల్లో ప్రస్తుతం ఉన్న చిన్న విమానాలను (బీ737–8) నడుపుతామని చెప్పారు. కార్గో సేవలను కూడా పెంచుకునేందుకు విశాలమైన వైడ్ బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉపయోగకరంగా ఉంటాయని చెన్ వివరించారు. -
మేఘాల దారుల్లో... వియత్నాంకు సైతం..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు భారీగా పెరిగాయి. కోవిడ్‌కు ముందున్న అంతర్జాతీయ విమాన సర్వీసులతో పాటు మరిన్ని సర్వీసులు నేరుగా అందుబాటులోకి వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక, వ్యాపార, పర్యాటక రంగాల్లో విశేషంగా ఆకర్షిస్తున్న హైదరాబాద్ మహానగరంపై అన్ని దేశాలూ దృష్టి సారించాయి. దీంతో అనేక దేశాల నుంచి నేరుగా విమాన సర్వీసులు నడిపేందుకు పలు ఎయిర్‌లైన్స్‌కి ఆసక్తి చూపిస్తున్నాయి. గతంలో హైదరాబాద్ నుంచి దుబాయ్, సౌదీ, ఖతార్ వంటి అరబ్ దేశాలకు మాత్రమే విమానాలు నడిచాయి. కోవిడ్ దృష్ట్యా ఆయా సరీ్వసులపై కూడా ఆంక్షలు విధించారు. కరోనా అనంతరం క్రమంగా 12 దేశాలకు మొదట సర్వీసులను పునరుద్ధరించగా ఇప్పుడు కొత్తగా మరిన్ని దేశాలకు నేరుగా అంతర్జాతీయ కనెక్టివిటీ పెరిగింది. దీంతో 18కి పైగా దేశాలకు హైదరాబాద్ నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి రావడం గమనార్హం. కోవిడ్‌కు ముందు.. తర్వాత.. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు ప్రధాన అనుసంధానంగా ఉన్న హైదరాబాద్ మహానగరం నుంచి దేశీయంగా, అంతర్జాతీయంగా ఏటా రాకపోకలు పెరగడంతో విమానాశ్రయం విస్తరణ పనులు చేపట్టారు. అంతర్జాతీయ విమానాలు రాకపోకల కోసం రెండేళ్ల క్రితమే అదనపు టరి్మనల్స్ అందుబాటులోకి వచ్చాయి. కాగా.. కోవిడ్ కారణంగా అన్ని రకాల పౌర విమానయాన సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. కోవిడ్ కాలంలో అత్యవసర సర్వీసులు మాత్రమే నడిపారు. ఈ ఏడాది ఆంక్షలను సడలించడంతో ప్రయాణికుల రద్దీ పెరిగింది. దేశీయ గమ్యస్థానాల సంఖ్య అసాధారణంగా పెరిగింది. కోవిడ్‌కు ముందు 55 గమ్యస్థానాలకు మాత్రమే డొమెస్టిక్ సర్వీసులు నడిచాయి. కోవిడ్ తర్వాత 15 నగరాలకు మొదటీ సర్వీసులను పునరుద్ధరించారు. ఇప్పుడు ఏకంగా 70కి పైగా డొమెస్టిక్ గమ్యస్థానాలకు అనుసంధానం పెరిగింది. కొత్తగా గుల్బర్గా, హుబ్లీ తదితర నగరాలకు సర్వీసులు ప్రారంభమయ్యాయి. కొత్తగా అంతర్జాతీయ గమ్యస్థానాలైన చికాగో, మాల్దీవులకు విమాన సర్వీసులను జోడించారు. ఈ సర్వీసులకు ప్రయాణికుల నుంచి అసాధారణమైన స్పందన లభించింది. త్వరలో హైదరాబాద్ నుంచి వియత్నాంకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇటీవల థాయ్ స్మైల్ ఎయిర్‌లైన్స్ హైదరాబాద్ నుంచి బ్యాంకాక్‌కు డైరెక్ట్ విమాన సరీ్వసును పునరుద్ధరించింది. అలాగే ఎయిర్ ఏషియా హైదరాబాద్–కౌలాలంపూర్ విమాన సర్వీసులను కూడా పునరుద్ధరించింది. దీంతో ఈ ఏడాది అబుదాబి, బహ్రెయిన్, కొలంబో, సింగపూర్, దుబాయ్, దోహా, లండన్, జెడ్డా, రియాద్, కౌలాలంపూర్, కువైట్, మస్కట్, షార్జా, బ్యాంకాక్, చికాగో, మాలే, ఢాకా నగరాలకు డైరెక్ట్ ఫ్లైట్లు అందుబాటులోకి వచ్చాయి. (చదవండి: కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించలేం: కేంద్రం) -
ఒక్క నెలలో కోటిమందికి పైగా.. ఎయిర్‌లైన్స్ చరిత్రలో మరో రికార్డు
న్యూఢిల్లీ: మళ్లీ విమాన ప్రయాణాలకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. నవంబర్ నెలలో 1.05 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించారు. అక్టోబర్ నెలలో 89.85 లక్షల మందితో పోల్చి చూస్తే.. నవంబర్‌లో ప్రయాణికుల రద్దీ 17.03 శాతం పెరిగినట్టు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) విడుదుల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. టాప్‌లో ఇండిగో ఇండిగో ఒక్కటే 57.06 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించింది. తద్వారా దేశీ పౌర విమానయాన మార్కెట్లో ఈ సంస్థ 54.3 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. స్పైస్‌జెట్ సేవలను 10.78 లక్షల మంది ప్రయాణికులు (10.3 శాతం మార్కెట్ వాటా) వినియోగించుకున్నారు. ఎయిర్ ఇండియా 9.98 లక్షల మంది, గోఫస్ట్ 11.56 లక్షల మంది, విస్తారా 7.93 లక్షల మంది, ఎయిరేషియా ఇండియా 6.23 లక్షల మంది, అలియన్స్ ఎయిర్ 1.23 లక్షల మందికి సేవలు అందించాయి. ఓఆర్‌లో స్పైస్‌జెట్ విమానాల ఆక్యుపెన్సీ రేటు (మొత్తం సీట్లలో భర్తీ అయినవి) చూస్తే.. స్పైస్‌జెట్ 86.7 శాతం, ఇండిగో 80.5 శాతం, విస్తారా 77 శాతం, గోఫస్ట్ 78.2 శాతం, ఎయిర్ ఇండియా 82 శాతం, ఎయిర్రేషియా 74.6 శాతం చొప్పున నవంబర్‌లో నమోదు చేశాయి. సకాలంలో సేవల విషయంలో విస్తారా ముందుంది. బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై విమానాశ్రయాల నుంచి సకాలంలో సేవల విషయంలో 84.4 శాతం రేటును నమోదు చేసింది. ఎయిరేషియా ఇండియా 82.4 శాతం, ఇండిగో 80.5 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. చదవండి: ఎయిర్‌బస్ ఏ380 మళ్లీ భారత్ ఎంట్రీ -
యూఎస్ మార్కెట్లకు కోవిడ్-19 ఫీవర్
కొద్ది రోజులుగా కోవిడ్-19 కేసులు తిరిగి రికార్డ్ స్థాయిలో పెరుగుతుండటంతో సోమవారం యూఎస్ మార్కెట్లకు షాక్ తగిలింది. దీనికితోడు కరోనా వైరస్ కారణంగా నీరసించిన ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ప్రతిపాదించిన సహాయక ప్యాకేజీ(స్టిములస్)పై కాంగ్రెస్‌లో అనిశ్చితి కొనసాగడం ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచింది. వెరసి సోమవారం యూఎస్ మార్కెట్లు గత నాలుగు వారాలలోనే అత్యధికంగా 2.3-1.7 శాతం మధ్య వెనకడుగు వేశాయి. డోజోన్స్ 650 పాయింట్లు(2.3 శాతం) క్షీణించి 27,685కు చేరగా.. ఎస్అండ్పీ 64 పాయింట్లు(1.9 శాతం) నష్టంతో 3,401 వద్ద ముగిసింది. నాస్డాక్ సైతం 189 పాయింట్లు(1.65 శాతం) కోల్పోయి 11,359 వద్ద స్థిరపడింది. ఎన్నికల్లోగా.. వచ్చే నెల మొదట్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ 2.2 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రతిపాదించారు. ప్రభుత్వ ప్రతిపాదిత ప్యాకేజీకంటే ఇది అధికంకాగా.. కొన్ని రాష్ట్రాలు, వర్గాలకు పెలోసీ అధిక ప్రాధాన్యతనిచ్చినట్లు ట్రంప్ గతంలో ఆరోపించారు. ఈ ప్యాకేజీపై రిపబ్లికన్లు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నప్పటికీ భారీ స్టిములస్కు తాను సిద్ధమేనంటూ ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఆర్థిక మంత్రి స్టీల్ ముచిన్‌తో పెలోసీ నిర్వహిస్తున్న చర్చలు కొనసాగుతూనే ఉండటంతో సెంటిమెంటుకు దెబ్బతగిలినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఎన్నికలలోగా ప్యాకేజీకి ఆమోదముద్ర లభించగలదని పెలోసీ ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ ఇటీవల రోజువారీ కోవిడ్-19 కేసులు దాదాపు లక్షకు చేరడంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగినట్లు వివరించారు. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇటలీలలో తిరిగి కోవిడ్-19 కేసులు ఉధృతంకావడంతో సోమవారం యూరోపియన్ మార్కెట్లు సైతం 2-3 శాతం మధ్య నష్టపోయాయి. నేలచూపులో.. ఈ వారంలో టెక్ దిగ్గజాలు, యాపిల్, గూగుల్, అమెజాన్, ఫేస్బుక్ తదితరాలు క్యూ3(జులై- సెప్టెంబర్) ఫలితాలు వెల్లడించనున్న సంగతి తెలిసిందే. కాగా.. సోమవారం ప్రధానంగా ట్రావెల్ సంబంధ రంగాలు నీరసించాయి. ఎయిర్‌లైన్ కౌంటర్లలో యునైటెడ్, అమెరికన్, డెల్టా, సౌత్‌వెస్ట్ 7-3.5 శాతం మధ్య పతనమయ్యాయి. క్రూయిజర్ కంపెనీలలో రాయల్ కరిబియన్ 10 శాతం, కార్నికాల్ కార్ప్ 9 శాతం చొప్పున కుప్పకూలాయి. కోవిడ్-19 ప్రభావం అంచనాల కంటే అధికకాలం కొనసాగవచ్చని ప్రత్యర్థి కంపెనీ ఎస్ఏపీ తాజాగా పేర్కొనడంతో సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం ఒరాకిల్ కార్ప్ 4 శాతం బోర్లా పడింది. రికవరీ ఆలస్యం కారణంగా మధ్యకాలానికి లాభాల అంచనాలను తొలగిస్తున్నట్లు ఎస్ఏపీ పేర్కొంది. ఇదేవిధంగా త్రైమాసిక ఫలితాలు నిరాశపరచడంతో హాస్బ్రో ఇంక్ 9.5 శాతం పడిపోయింది. అయితే ఈకామర్స్ దిగ్గజం అమెజాన్, వీడియో కమ్యూనికేషన్ సేవల కంపెనీ జూమ్, వీడియో గేమ్స్ సంస్థ యాక్టివిజన్ బిజార్డ్ స్వల్ప లాభాలతో నిలదొక్కుకోవడం గమనార్హం! -
మార్కెట్లు ర్యాలీ- బఫెట్‌కు నష్టాలు
కోవిడ్-19 నేపథ్యంలో నగదు నిల్వలను కదపని సుప్రసిద్ధ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ కంపెనీ బెర్క్‌షైర్ హాథవే ఎట్టకేలకు తొలి అడుగు వేస్తోంది. అనుబంధ విభాగం బెర్క్‌షైర్ హాథవే ఎనర్జీ ద్వారా డొమినియన్ ఎనర్జీ గ్యాస్ ఆస్తుల కొనుగోలుకి సిద్ధపడుతోంది. ఇందుకు 4 బిలియన్ డాలర్ల విలువైన డీల్ కుదుర్చుకుంది. తద్వారా 7700 మైళ్ల సహజవాయు పంపిణీ నెట్‌వర్క్‌తోపాటు.. 900 బిలియన్ క్యూబిక్ అడుగుల గ్యాస్ నిల్వలను సొంతం చేసుకోనుంది. మిడ్అమెరికన్ ఎనర్జీ, ఎన్వీ ఎనర్జీ, పసిఫిక్ కార్ప్ యుటిలిటీస్ తదితర ఇంధన ఆస్తులు కలిగిన బెర్క్‌షైర్ హాథవే ఎనర్జీలో బెర్క్‌షైర్‌కు 91.1 శాతం వాటా ఉంది. 20200 మార్చికల్లా బెర్క్‌షైర్ వద్ద 137 బిలియన్ డాలర్లకుపైగా నగదు నిల్వలున్నాయి. గత నాలుగేళ్లుగా బఫెట్ భారీ కొనుగోళ్లకు వెనుకాడుతున్న విషయం విదితమే. 50 బిలియన్ డాలర్లు ఇటీవల అమెరికా స్టాక్ మార్కెట్లు ర్యాలీ బాటలో సాగుతున్నాయి. నాస్డాక్ పలుమార్లు సరికొత్త గరిష్టాలను అందుకుంటోంది. డోజోన్స్, ఎస్అండ్పీ సైతం చరిత్రాత్మక గరిష్టాలకు చేరువలో నిలుస్తున్నాయి. అయితే ఈ ఏడాది తొలి క్వార్టర్(జనవరి-మార్చి)లో వారెన్ బఫెట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ బెర్క్‌షైర్ హాథవే 50 బిలియన్ డాలర్ల నష్టాలను ప్రకటించింది. కాగా.. ఈ ఏడాది ఇప్పటివరకూ యూఎస్ మార్కెట్లు 40 శాతం ర్యాలీ చేశాయి. ఇదే సమయంలో బెర్క్‌షైర్ హాథవే చైర్మన్ వారెన్ బఫెట్ సంపదకు 19 బిలియన్ డాలర్లు(రూ. 1.4 లక్షల కోట్లు) చిల్లు పడినట్లు బ్లూమ్‌బెర్గ్ ఇండెక్స్ తెలియజేసింది. అయినప్పటికీ 70 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో ప్రపంచ కుబేరుల్లో ఆరో ర్యాంకులో నిలుస్తున్నట్లు పేర్కొంది. బేరిష్‌గా ఉన్నారు మార్కెట్లు దూకుడు చూపుతున్నప్పటికీ బఫెట్ ఇటీవల బేరిష్ వ్యూతో వ్యవహరిస్తున్నట్లు ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెంట్ సంజీవ్ భసిన్ పేర్కొంటున్నారు. మార్చిలో మార్కెట్లు పతనమైనప్పుడు బెర్క్‌షైర్ నాలుగు ప్రధాన అమెరికన్ ఎయిర్‌లైన్స్ కంపెనీల వాటాలను విక్రయించింది. కోవిడ్-19 కారణంగా ప్రయాణాలు నిలిచిపోవడం ప్రభావం చూపగా..మార్చి క్వార్టర్లో బెర్క్‌షైర్ భారీగా 50 బిలియన్ డాలర్ల నష్టాలను ప్రకటించింది. కాగా.. ఈ త్రైమాసికంలో బఫెట్ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్కూ ఆసక్తి చూపలేదంటూ కానవ్ క్యాపిటల్ మేజేజింగ్ పార్టనర్ గౌరవ్ సూద్ పేర్కొన్నారు. పలు అవకాశాలను అందుకోలేకపోయారని వ్యాఖ్యానించారు. అయితే క్రికెట్లో సచిన్ సైతం సున్నాకు ఔట్ అయిన సందర్భాలున్నట్లే.. ఒక్కోసారి తప్పులు జరుగుతుంటాయని.. ఇన్వెస్ట్‌మెంట్స్‌లో వారెన్ బఫెట్ గొప్ప దిగ్గజమని కొటక్ ఏంఎసీ ఎండీ నీలేష్ షా తదితర పలువురు నిపుణులు ప్రశంసిస్తున్నారు! -
‘గాలి ఆడక.. చెమటతో చాలా ఇబ్బంది పడ్డాం’
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ వల్ల నిలిచిపోయిన విమాన సర్వీసులు రెండు నెలల తర్వాత సోమవారం పునఃప్రారంభమయిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వల్ల విమానాశ్రయాలు, విమానం లోపల పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు విమానాయన సిబ్బంది తొలి రోజు తమ అనుభవాలను మీడియాకు వెల్లడించారు. ‘రెండు నెలల తర్వాత ప్రయాణం చేస్తున్నాము. పద్దతుల్లో ఎలాంటి మార్పు లేదు.. విమానాలు సమాయానికి అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ప్రయాణికుల సంఖ్య చాలా తక్కువగా ఉంది.. మేం కాక్‌పిట్‌లో ఉన్నాం కాబట్టి చాలా భద్రంగా ఉన్నాము’ అని పైలెట్, కో పైలెట్ తెలిపారు. (ముఖానికి మాస్కులు.. షీల్డులు) అయితే క్యాబిన్ క్రూ మాత్రం పీపీఈ కిట్లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. ‘మా యూనిఫామ్‌లు చాలా సౌకర్యంగా ఉండేవి. అసలే వేసవి, అధిక ఉష్ణోగ్రత ఇలాంటి సమయంలో పీపీఈ కిట్లు ధరించి పని చేయడం చాలా కష్టంగా ఉంది. గాలి సరిగా ఆడదు. కొన్ని సార్లు చెమట పట్టి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ఏదైనా అత్యసర పరిస్థితి ఎదురైతే వెంటనే స్పందించడానికి కుదరదు. అయితే ప్రస్తుతం విమానం లోపల ఆహారం, కూల్‌డ్రింక్‌లు వంటివి అనుమతించకపోవడం వల్ల మా పని కాస్తా సులువు అయ్యింది’ అన్నారు. (కరోనా ప్రభావమే ఎక్కువ..) విమానాశ్రయం లోపల కూడా చాలా మార్పులు వచ్చాయి. ప్రయాణికుల వస్తువులను ఓ డిసిన్ఫెక్టెంట్ కన్వేయర్ బెల్టు గుండా వెళ్లాయి. ప్రయాణికులు రాగానే భద్రతా సిబ్బంది వారి గుర్తింపు కార్డులు చూపించమని కోరారు. సిబ్బంది భద్రత కోసం విమానాశ్రయ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రయాణికులు కూడా పూర్తి శరీర రక్షణ సూట్లు ధరించారు. ఓ వ్యక్తి మా తాతను కలవడానికి వెళ్లి అక్కడే చిక్కుకుపోయాను. రెండు నెలల తర్వాత ఇంటికి వెళ్తున్నందుకు సంతోషంగా ఉంది అన్నారు.(విడతలుగా విమాన సర్వీసులు?) కరోనా భయంతో విమానాల రాకపోకలకు కొన్ని రాష్ట్రాలు ఆసక్తి చూపకపోవడం, కొన్ని ఎయిర్‌పోర్టుల్లో పరిమిత సంఖ్యలోనే విమానాలకు అనుమతించడంతో తొలిరోజే 630 విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని విమానయాన పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతుండడంతో పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలు విమానాల సర్వీసులను ఇప్పుడే ప్రారంభించడానికి విముఖత వ్యక్తం చేశాయి. అలాగే ముంబై, చెన్నై, హైదరాబాద్ తదితర ప్రధాన ఎయిర్‌పోర్టుల నుంచి సర్వీసుల సంఖ్యను కుదించారు. రాష్ట్రాల అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వ ప్రకటన మేరకు సోమవారం 630 విమానాలను రద్దు చేశారు. ఈ విషయం తెలియక చాలామంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులకు చేరుకున్నారు. విమానాలు రద్దయ్యాయని తెలిసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.(630 విమానాలు రద్దు) -
తొలిరోజే 630 విమానాలు రద్దు
న్యూఢిల్లీ/బెంగళూరు: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ వల్ల నిలిచిపోయిన విమాన సర్వీసులు రెండు నెలల తర్వాత సోమవారం పునఃప్రారంభమయ్యాయి. స్వస్థలాలకు వెళ్లేందుకు విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయాలకు చేరుకున్నారు. ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్టులు కొంత రద్దీగా కనిపించాయి. ఢిల్లీ నుంచి మొదటి విమానం ఉదయం 4.45 గంటలకు పుణేకు బయలుదేరింది. ముంబై నుంచి తొలి ఫ్లైట్ ఉదయం 6.45 గంటలకు బిహార్ రాజధాని పట్నాకు బయలుదేరింది. అయితే, కరోనా భయంతో విమానాల రాకపోకలకు కొన్ని రాష్ట్రాలు ఆసక్తి చూపకపోవడం, కొన్ని ఎయిర్‌పోర్టుల్లో పరిమిత సంఖ్యలోనే విమానాలకు అనుమతించడంతో తొలిరోజే 630 విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని విమానయాన పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతుండడంతో పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలు విమానాల సర్వీసులను ఇప్పుడే ప్రారంభించడానికి విముఖత వ్యక్తం చేశాయి. అలాగే ముంబై, చెన్నై, హైదరాబాద్ తదితర ప్రధాన ఎయిర్‌పోర్టుల నుంచి సర్వీసుల సంఖ్యను కుదించారు. రాష్ట్రాల అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వ ప్రకటన మేరకు సోమవారం 630 విమానాలను రద్దు చేశారు. ఈ విషయం తెలియక చాలామంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులకు చేరుకున్నారు. విమానాలు రద్దయ్యాయని తెలిసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దేశీయ విమాన సేవలు పునఃప్రారంభం అయ్యాక తొలిరోజు సోమవారం 532 విమానాలు రాకపోకలు సాగించాయని, 39,231 మంది ప్రయాణించారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీ చెప్పారు. మంగళవారం నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. 28 నుంచి పశ్చిమ బెంగాల్లో విమానయాన సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. మున్ముందు దేశీయ విమానాలు, ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మార్గదర్శకాలు పాటిస్తేనే..: ప్రయాణికుల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నియంత్రించేందుకు విమానయాన శాఖ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఫేస్ మాస్కులు ధరించిన వారినే విమానాల్లోకి అనుమతించాలని పేర్కొంది. విమానాల్లో ఆహారం సరఫరా ఉండరాదంది. మొబైల్ ఫోన్లు ఉన్నవారు ఆరోగ్యసేతు యాప్‌లో తమ ఆరోగ్యం వివరాలు నమోదు చేయాలని, లేనివారు సెల్ఫ్ డిక్లరేషన్ పత్రం సమర్పించాలని సూచించింది. టికెట్ల ధరల విషయంలోనూ పరిమితి విధించింది. తమ రాష్ట్రాల్లోని ఎయిర్‌పోర్టులకు విమానాల్లో చేరుకునేవారి విషయంలో సొంతంగా క్వారంటైన్ నిబంధనలు అమలు చేస్తామని కర్ణాటక, తమిళనాడు, కేరళ, బిహార్, పంజాబ్, అస్సాం, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలు ప్రకటించాయి. వివాదంలో కేంద్ర మంత్రి సదానంద కేంద్ర మంత్రి సదానంద గౌడ వివాదంలో చిక్కుకున్నారు. ఢిల్లీ నుంచి విమానంలో బెంగళూరు వచ్చి, క్వారంటైన్‌కు వెళ్లకుండా, నేరుగా ఇంటికి వెళ్లడంతో ఆయనపై విమర్శలు వచ్చాయి. నిత్యావసర వస్తువుల కిందకు వచ్చే ఔషధ విభాగ ఇన్చార్జి మంత్రిగా తనకు క్వారంటైన్ నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. ఔషధాల ఉత్పత్తి, సరఫరా తదితర కీలక అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిన తను క్వారంటైన్లో ఉండటం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. నిత్యావసర వస్తు విభాగాలకు చెందినవారికి కేంద్రం మినహాయింపు ఇచ్చిందని కర్ణాటక ప్రభుత్వం కూడా పేర్కొంది. అయితే, గౌడ తీరుపై సోషల్ మీడియాలో పలు విమర్శలు వచ్చాయి. నిబంధనలు సామాన్యులకే కానీ, వీఐపీలకు కాదంటూ పలువురు వ్యాఖ్యానించారు. జూన్ 6 వరకు అన్ని సీట్లలో కూర్చోవచ్చు ఎయిర్ ఇండియాను అనుమతించిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి రప్పించేందుకు జూన్ 6 వరకు నడిపే అంతర్జాతీయ విమానాల్లో మధ్య సీటుని సైతం భర్తీ చేసుకునేందుకు ఎయిర్ ఇండియాను సుప్రీంకోర్టు అనుమతించింది. విమానయాన సంస్థల లాభం కంటే ప్రజల ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలని ప్రభుత్వానికీ, ఎయిర్ ఇండియాకీ స్పష్టం చేసింది. జూన్ 6 తరువాత మాత్రం బాంబే హైకోర్టు ఆదేశాలననుసరించి ఎయిర్ ఇండియా విమానాల్లో మధ్య సీటుని తప్పనిసరిగా ఖాళీగా ఉంచాలని తేల్చింది. మధ్యసీటు ఖాళీగా ఉంచాలన్న హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేంద్రం, ఎయిర్ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రంజాన్ సందర్భంగా కోర్టుకి సెలవు ఉన్నప్పటికీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారించింది. విమానాల్లో భౌతిక దూరం ఆవశ్యకతను అధికారులు గుర్తించాలని, కోవిడ్ నేపథ్యంలో దగ్గరగా కూర్చోవడం ప్రమాదమని నొక్కి చెప్పింది. ఇప్పటికే షెడ్యూల్ ఖరారు అయిన విమానమైతే జూన్ 6 వరకు మధ్య సీటుని భర్తీచేసుకునే అవకాశాన్నిస్తున్నట్టు తెలిపింది. -
తమిళనాట విమాన సర్వీసులు వాయిదా?
చెన్నై: తమిళనాడులో నగరాల మధ్య విమాన సర్వీసులను ఈ నెలాఖరు వరకు అనుమతించరాదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. విదేశాల నుంచి విమానాల్లో, ఇతర రాష్ట్రాల నుంచి రైళ్లలో వచ్చిన వారిని పరీక్షించగా 66 కోవిడ్ పాజిటివ్ కేసులు బయటపడ్డాయని ఆయన తెలిపారు. ఈ నెల 25 నుంచి విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఈ విషయం వెల్లడించింది. -
విడతలుగా విమాన సర్వీసులు?
న్యూఢిల్లీ: దేశవ్యాప్త లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత దశలవారీగా విమాన సర్వీసులను ప్రారంభించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి తర్వాత 21 రోజుల కరోనా లాక్డౌన్ ముగియనుంది. ఆ తర్వాత దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను దశలవారీగా ప్రారంభించే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ‘దేశంలో వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ 14వ తేదీ తర్వాత దశల వారీగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించాలని యోచిస్తున్నాం. ఏప్రిల్ 14 తర్వాత ప్రయాణాలకు విమానయాన సంస్థలు టికెట్లు చేసుకోవచ్చు’అని ఓ అధికారి తెలిపారు. లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజుల పాటు పొడిగిస్తే మాత్రం ఆ మేరకు టికెట్లు క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుందని ఆయన వివరించారు. ఎయిరిండియా మినహా ఇప్పటికే ప్రముఖ విమానయాన సంస్థలు 14వ తేదీ నుంచి జరిగే దేశీయ ప్రయాణాలకు టికెట్ల బుకింగ్స్ మొదలుపెట్టగా ఎయిరిండియా మాత్రం ఈ నెల 30 తర్వాత ప్రయాణాలకు మాత్రమే బుకింగ్స్ ప్రారంభించింది. దెబ్బతిన్న విమానయాన రంగం లాక్డౌన్ కారణంగా ఆదాయం పడిపోవడంతో విమానయాన రంగం తీవ్రంగా దెబ్బతింది. దీంతో ఎయిర్ డెక్కన్ సంస్థ అన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతానికి ఉద్యోగులంతా ఇళ్లలోనే ఉండాలని కోరింది. 14 తర్వాత రైళ్లు ! దేశంలో లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ప్రయాణికులు కనీస ముందు జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకుంటూ విడతల వారీగా సర్వీసులను ప్రారంభించాలని రైల్వేశాఖ యోచిస్తోంది. ప్రయాణికులు వ్యక్తిగత దూరం పాటించడం, మాస్కులు ధరించడం, ఆరోగ్య సేత్ యాప్ వాడుతూ ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవడం వంటి ముందు జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే వారిని అనుమతించాలని భావిస్తోంది. తద్వారా కోవిడ్ వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేయవచ్చని ఆశిస్తోంది. -
ఇండిగోకు ఇంధన సెగ..
-
ఇండిగోకు ఇంధన సెగ..
న్యూఢిల్లీ: ఇంధన ధరలు పెరిగిపోవడం, కరెన్సీ మారకం విలువ తగ్గడం విమానయాన సంస్థ ఇండిగో లాభాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ నికర లాభం ఏకంగా 75 శాతం క్షీణించి రూ.191 కోట్లకు పడిపోయింది. 2017–18 క్యూ3లో ఇండిగో రూ.762 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. సమీక్షా కాలంలో ఇండిగో మొత్తం ఆదాయం మాత్రం 28 శాతం పెరిగి రూ.6,409 కోట్ల నుంచి రూ.8,229 కోట్లకు చేరుకుంది. అధిక ఇంధన ధరలు, కరెన్సీ పతనం తదితర అంశాలు లాభదాయకతపై ప్రతికూల ప్రభావం చూపాయని కంపెనీ పేర్కొంది. బీఎస్ఈలో బుధవారం ఇండిగో షేరు 0.89 శాతం క్షీణించి రూ. 1,108 వద్ద క్లోజయ్యింది. -
కలగా అంతర్జాతీయ విమానయానం
తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం... పేరుకే అంతర్జాతీయం... కనీసం దేశంలో ఉన్న ప్రధాన నగరాలకు కూడా విమానాలు తిరగని పరిస్థితి. అంతర్జాతీయ ప్రమాణాలతో నూతన టెర్మినల్ ఏర్పాటు చేసి మూడేళ్లు దాటుతున్నా విమానాలు భాగ్యనగరాన్ని దాటి బయటకు వెళ్లడంలేదు. ఫలితంగా ఇతర దేశాలకు వెళ్లాల్సిన వారు పక్క రాష్ట్రాల్లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. రేణిగుంట: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవడానికి దేశ, విదేశాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తిరుపతికి వస్తుంటారు. భక్తుల సౌకర్యార్థం తిరుపతి సమీపంలోని రేణిగుంటను అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూపకల్పన జరిగింది. 2015లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా గరుడ పక్షి ఆకారంలో రూ.175 కోట్లతో నూతన టెర్మినల్‌ను ప్రారంభించారు. టెర్మినల్ ప్రాంగణంలో రూ.5కోట్లకు పైగా వెచ్చించి తుడా అధికారులతో సుందరీకరణ పనులు కూడా చేయించారు. 2017 జూన్‌లో అధికారికంగా అంతర్జాతీయ విమానాశ్రయంగా కేంద్ర విమానయాన శాఖ ప్రకటించింది. ఇక్కడ నుంచి కువైట్, దుబాయ్, శ్రీలంక వంటి దేశాలకు కనెక్టింగ్ ఫ్లెట్లను నడుపుతామని మూడు నెలల కిందట సాక్షాత్తూ అప్పటి కేంద్ర విమానయాన శాఖామంత్రి అశోక్‌గజపతిరాజు ప్రకటించినా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. గణనీయంగా పెరిగిన ప్రయాణికుల సంఖ్య.. గతంలో కేవలం హైదరాబాద్ నగరానికి మాత్రమే పరిమితమైన విమాన సేవలు ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ఢిల్లీ, ముంబైలకు విస్తరించాయి. ఎయిర్ ఇండియాతో పాటు స్పైస్‌జెట్, ట్రూజెట్, ఇండిగో, ఎయిర్ కోస్తా తమ సర్వీసులను ఇక్కడ నుంచి నడుపుతున్నాయి. ప్రస్తుతం రోజుకు 15 వరకు విమాన సర్వీసులు రాకపోకలను సాగిస్తున్నాయి. దీంతో గత ఏడాది ఏప్రిల్ నుంచి 2018 మార్చి వరకు 5,48,732మంది ప్రయాణికులు ఇక్కడ నుంచి విమాన ప్రయాణం చేసినట్లు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2015–16 ఏడాదికిగాను రేణిగుంట విమానాశ్రయం ‘బెస్ట్ టూరిస్ట్ ఫ్రెండ్లీ ఎయిర్‌పోర్టు’ అవార్డును సొంతం చేసుకుంది. అంతర్జాతీయానికి రాని అనుమతులు ఇప్పటికిప్పుడు అంతర్జాతీయ విమాన సర్వీసులను ఇక్కడి నుంచి ప్రారంభిస్తే 200మంది అంతర్జాతీయ, 55మంది డొమెస్టిక్ ప్రయాణికులకు సౌకర్యాలను కల్పించే సామర్థ్యం నూతన టెర్మినల్‌కు ఉంది. అయితే ఎయిర్పోర్ట్ అథారిటీ అంతర్జాతీయ సర్వీసులను నడిపేందుకు అనుమతులివ్వకపోవడంతో ప్రస్తుతం దేశీయ సర్వీసులే నడుస్తున్నాయి. అంతర్జాతీయ సర్వీసులను నడపాలి.. చిత్తూరు, వైఎస్సార్ కడప, నెల్లూరు జిల్లాల నుంచి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు అనేక మంది వెళుతున్నారు. వీరికి అనువుగా రేణిగుంట నుంచి కనీసం వారానికి ఒక్క కనెక్టింగ్ ఫ్లైట్‌ను నడిపితే ప్రయోజనకరంగా ఉంటుం ది. తిరుపతి పుణ్యక్షేత్రానికి దేశ, విదేశాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అంతర్జాతీయ విమానం ఇక్కడి నుంచి ఎగిరితే పేరుకు సార్థకత ఉంటుంది. – శ్రీనివాసులు రెడ్డి, ప్రయాణికుడు సౌకర్యాల కల్పనలో సఫలీకృతమయ్యాం.. రెండేళ్లలో నూతన టెర్మినల్‌లో ప్రయాణికుల అభిరుచికి అనుగుణంగా సౌకర్యాల కల్పనలో సఫలీకృతమయ్యాం. రూ.కోట్లు వెచ్చించి ఎయిర్‌పోర్టు ప్రాంగణమంతా సుందరీకరణ పనులు చేపట్టాం. విమాన సర్వీసులను విస్తరించాం. 2015–16 ఏడాదికి గాను ‘బెస్ట్ ఫ్రెండ్లీ టూరిస్ట్ ఎయిర్‌పోర్టు’గా అవార్డును అందుకున్నందుకు సంతోషంగా ఉంది. ఉన్నతాధికారుల అనుమతులతో అంతర్జాతీయ విమానయాన సేవలను త్వరితగతిన ప్రారంభిస్తాం. – హెచ్.పుల్లా, ఎయిర్పోర్ట్ డైరెక్టర్, తిరుపతి -
రాబోయే ఏళ్లలో దేశంలోకి 900 విమానాలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోని వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏవియేషన్ మార్కెట్లలో ఒకటైన భారతదేశంలో విమాన యాన సంస్థలు చాలా దూకుడును ప్రదర్శిస్తున్నాయి. ముఖ్యంగా ప్రాంతీయ మార్గాల్లో భారీ ప్రతిష్టాత్మక విస్తరణ ప్రణాళికలతో ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగానే 900 విమానాలను అదనంగా ప్రారంభించనున్నాయి. ఇతర రవాణా సంస్థలతో పాటు, దేశీయ ఎయిర్లైన్స మొత్తం 900 కన్నా ఎక్కువ విమానాలను ప్రారంభించనున్నాయని అధికారిక సమాచారం తెలిపింది. అధికారుల డేటా ప్రకారం.. బడ్జెట్ విమానయాన సంస్థలు ఇండిగో, స్పైస్‌జెట్, గోఎయిర్, ఎయిర్ఏషియా తమ విమానాల సంఖ్యను పెంచుకునేందుకు సిద్ధమయ్యాయి. ఇటీవల లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో భాగంగా పార్లమెంటుకు సమర్పించిన సమాచారం ప్రకారం, రానున్న సంవత్సరాల్లో దేశీయ విమాన సంస్థలు మరో 900 విమానాలను ప్రారంభించనున్నాయి. ఇందులో ఒక్క ఇండిగోనే ఏకంగా 448 కొత్త విమానాలను తీసుకురానుంది. ఇండిగో వద్ద 150 విమానాలున్నాయి. వచ్చే ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాల్లో మరో 448 విమానాలను కొనుగోలు చేయనుంది. వీటిలో 399 ఏ320 విమానాలు కాగా.. 49 ఏటీఆర్‌లు. మరో ప్రధాన పోటీదారు ఎయిర్‌లైన్ స్పైస్‌జెట్ కూడా ఇదే ప్రణాళికలతో ఉంది. 2018-23 మధ్య 157 కొత్త విమానాలను తీసుకురానుంది. ప్రస్తుతం ఈ సంస్థ వద్ద 57 విమానాలున్నాయి. మరో బడ్జెట్ క్యారియర్ గోఎయిర్ మరో నాలుగేళ్లలో 119 ఏ320 విమానాలను కొనుగోలు చేసి అంతర్జాతీయ సేవలను మొదలుపెట్టనుంది. గో ఎయిర్ వద్ద ప్రస్తుతం 34 విమానాలున్నాయి. ఎయిర్ఏషియా కూడా మరో ఐదేళ్లలో 60 విమానాలను తీసుకురానుంది. జెట్ ఎయిర్వేస్ ప్రస్తుతం ఉన్న 107 విమానాలకు మరో 86 విమానాలను చేర్చనుంది. ఇక ప్రభుత్వ రంగ ఎయిరిండియా 2019 మార్చి కల్లా మూడు బోయింగ్ విమానాలు, 16 ఏ320 విమానాలను తీసుకురానుంది. ప్రస్తుతం ఈ సంస్థ వద్ద 155 విమానాలున్నాయి. పౌరవిమానయాన మంత్రిత్వశాఖ సమాచారంప్రకారం విస్తారా, ట్రూజెట్, జూమ్ ఎయిర్ లాంటి సంస్థలు కూడా మరో ఐదేళ్లలో కొత్త విమానాలను కొనుగోలు చేయనున్నాయి. ఎయిర్ ఫ్రాన్స్ ఐదేళ్ల కాలంలో 60 విమానాలను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం ఈ బడ్జెట్ క్యారియర్ 14 విమానాలను కలిగి ఉంది. -
ఉత్తరాది నగరాలకూ ట్రూజెట్
♦ టెండర్లలో పాల్గొననున్న టర్బో మేఘా ♦ సెప్టెంబర్‌కల్లా మరో 18 సర్వీసులు ♦ ఆరు నెలల్లో కొత్తగా 4 విమానాలు ♦ ‘సాక్షి’తో కంపెనీ ఎండీ ఉమేశ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్రూజెట్ పేరుతో విమానయాన రంగంలో ఉన్న టర్బో మేఘా ఎయిర్వేస్ కొత్త నగరాలకు సర్వీసులు విస్తరించటంపై ఆసక్తి కనబరుస్తోంది. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థ మహారాష్ట్ర, గుజరాత్‌లోనూ అడుగుపెట్టడానికి ఉడాన్ ప్రాజెక్టు కింద ఈ నెలలో జరిగే టెండర్లలో పాల్గొనబోతోంది. ఈ రాష్ట్రాల్లో కమర్షియల్ రూట్లలో సైతం సర్వీసులు నడుపనున్నట్టు సంస్థ ఎండీ ఉమేష్ వంకాయలపాటి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. మూడు నాలుగు నెలల్లో టెండర్ల ప్రక్రియ పూర్తయి రూట్ల కేటాయింపు జరగొచ్చని వెల్లడించారు. జనవరి–ఫిబ్రవరికల్లా మహారాష్ట్ర, గుజరాత్‌లోని ప్రధాన ద్వితీయ శ్రేణి నగరాల్లో సేవలు ప్రారంభిస్తామని చెప్పారు. ట్రూజెట్ దేశంలో తొలిసారిగా షెడ్యూల్డ్ కమ్యూటర్ ఆపరేటర్‌గా మే నెలలో అనుమతి పొందింది. దీంతో మెట్రోల నుంచి ద్వితీయ శ్రేణి నగరాలకు విమాన సర్వీసులు అందించేందుకు కంపెనీకి వీలు కలిగింది. అదనపు సర్వీసులు.. ప్రస్తుతం ట్రూజెట్ 11 నగరాలకుగాను రోజుకు 28 సర్వీసులను నడిపిస్తోంది. సెప్టెంబర్ చివరినాటికి మరో నాలుగు నగరాలను అనుసంధానిస్తోంది. తద్వారా రోజుకు కొత్తగా 18 సర్వీసులను జోడించనుంది. కంపెనీ ఖాతాలో ఇప్పుడు ఏటీఆర్–72 రకం ఫ్లైట్లు నాలుగు ఉన్నాయి. ఆగస్టులో ఒకటి, సెప్టెంబర్‌లో మరొక విమానం వచ్చి చేరుతోంది. ఇవేగాక మహారాష్ట్ర, గుజరాత్ కోసం మరో రెండు విమానాలు అవసరం అవుతాయని కంపెనీ భావిస్తోంది. కంపెనీ దక్కించుకునే రూట్లనుబట్టి కొత్త విమానాలను కొనుగోలు చేయనుంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ కేంద్రంగా కొల్హాపూర్, షోలాపూర్, జల్గావ్, నాసిక్, గోందియా, లాతూర్ వంటి నగరాలకు సర్వీసులను విస్తరిస్తారు. ఇక కంపెనీలో ప్రస్తుతం 500 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. విస్తరణలో భాగంగా కొత్తగా 100 మందిని నియమించుకోనున్నారు. ఈ ఏడాది మరో రూ.70 కోట్లు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో రూ.60–70 కోట్లు వెచ్చించనున్నట్టు ఉమేష్ వెల్లడించారు. నిధుల సమీకరణ ఇప్పట్లో లేదని స్పష్టం చేశారు. ఉడాన్ ప్రాజెక్టుతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, కంపెనీకి ఆదాయం కూడా పెరుగుతుందని చెప్పారు. ‘‘టికెట్ల ధరల సవరణ ఇప్పట్లో లేదు. మా విమానాల్లో ఆక్యుపెన్సీ రేటు 80–85 శాతంగా ఉంది. సివిల్ ఏవియేషన్ నుంచి షిర్డీ విమానాశ్రయానికి ఇంకా క్లియరెన్సు రావాల్సి ఉంది. అనుమతి రాగానే అక్కడికి సర్వీసులు ఆరంభిస్తాం’’ అని వివరించారు. బుధవారం నాటితో కంపెనీ రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ రెండేళ్లలో 7.60 లక్షల మంది తమ విమానాల్లో ప్రయాణించినట్లు ఉమేష్ వెల్లడించారు.