సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ నుంచి నేరుగా అమెరికాకు విమానసర్వీసులు ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి యూఎస్‌ఏ ఎన్నారైలు వినతిపత్రం సమరి్పంచారు. ఈ మేరకు అమెరికాలో పర్యటిస్తున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని తెలుగు ఎన్నారైలు కలిశారు. ఢిల్లీ, ముంబై వంటి అనేక ఇతర భారతీయ నగరాలు ఇప్పటికే అమెరికాలోని ప్రధాన నగరాలతో నేరుగా విమాన కనెక్షన్లు కలిగి ఉన్నాయని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
వాణిజ్యం, పెట్టుబడులు, పర్యాటకం కోసం ప్రపంచ గమ్యస్థానంగా హైదరాబాద్ మరింత ఎదుగుతుందని పేర్కొన్నారు. కాగా ఎయిర్ ఇండియా కొత్త ఫ్లైట్లను ఆర్డర్ చేయటంతోపాటు, కొత్త రూట్లలో విమాన సర్వి సులను తెచ్చేందుకు కృషి చేస్తోందని, కేంద్ర అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా ప్రవాసుల కోరిక నెరవేరేలా చూస్తామని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో విలాస్ జంబుల, లక్ష్మణ్ అనుగు, సంతోష్ రెడ్డి, శ్రీకాంత్ తుమ్మల, ప్రదీప్ కట్టా, వంశీ యమజాల, మధుకర్ రెడ్డి, రామ్ వేముల, రఘువీర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్ నేతలు భేటీ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కిషన్ రెడ్డితో అమెరికాలోని ప్రవాస తెలంగాణవాదులు, తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్ నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. టీడీఎఫ్ మాజీ అధ్యక్షుడు మురళి చింతలపాని, లక్ష్మణ్ అనుగు, ఇతర కార్యవర్గసభ్యులు కిషన్‌రెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్ర సాధనలో ప్రవాస తెలంగాణవాసులు, టీడీఎఫ్ పోషించిన పాత్రను కిషన్‌రెడ్డి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment