![Singapore Airlines to launch Airbus A350-900 services to Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/15/14HYD06-600475.jpg.webp?itok=aA8OffrF)
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సింగపూర్ ఎయిర్‌లైన్స్ (ఎస్‌ఐఏ) అక్టోబర్ 30 నుంచి హైదరాబాద్–సింగపూర్ రూట్లో విశాలమైన ఏ350–900 విమానాలతో సర్వీసులు ప్రారంభించనుంది. ఇవి ప్రతి గురు, శుక్ర, శని, ఆదివారాల్లో నడుస్తాయని సంస్థ భారత విభాగ జనరల్ మేనేజర్ సయ్ యెన్ చెన్ తెలిపారు.
మిగతా రోజుల్లో ప్రస్తుతం ఉన్న చిన్న విమానాలను (బీ737–8) నడుపుతామని చెప్పారు. కార్గో సేవలను కూడా పెంచుకునేందుకు విశాలమైన వైడ్ బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉపయోగకరంగా ఉంటాయని చెన్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment