Singapore Airlines
-
ఒకే సంస్థ.. ఒకే హోదా.. రిటైర్మెంట్ వయసులో తేడా!
టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంయుక్త యాజమాన్యంలోని విస్తారా నవంబర్ 11 నుంచి ఎయిరిండియా ఎయిర్‌లైన్స్‌లో విలీనం అవుతుంది. ఈ విలీనం వల్ల ఇప్పటివరకు ఎయిరిండియా సర్వీసులో ఉన్న పైలట్లు మాత్రం కొంత అసంతృప్తిగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. విస్తారా, ఎయిరిండియాలో పనిచేస్తున్న పైలట్ల రిటైర్మెంట్ వయసే అందుకు కారణమని తెలియజేశారు.నవంబర్ 11 నుంచి విస్తారా ఎయిర్‌లైన్స్ ఎయిరిండియాలో విలీనం అవుతుంది. ఈమేరకు గతంలోనే ఇరు సంస్థల మధ్య ఒప్పందం జరిగింది. అయితే ఎయిరిండియా పైలట్లు మాత్రం కొంత అసంతృప్తిగా ఉన్నట్లు కొందరు అధికారులు తెలిపారు. ఎయిరిండియా పైలట్ల రిటైర్మెంట్ వయసు 58 ఏళ్లుగా ఉంది. ఇప్పటివరకు విస్తారాలో పని చేసిన పైలట్లు రిటైర్మెంట్ వయసు మాత్రం 60 ఏళ్లుగా ఉంది. ఒకే సంస్థలో, ఒకే స్థానంలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసులో తేడా ఉండడంపై ఎయిరిండియా పైలట్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎయిరిండియా యాజమాన్యం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. డీజీసీఏ నిబంధనల ప్రకారం పైలట్లు తమకు 65 ఏళ్లు వచ్చేవరకు సేవ చేయవచ్చు. ఈ ఏడాది ఆగస్టులో ఎయిరిండియా ఎంపిక చేసిన పైలట్లను కాంట్రాక్ట్ ప్రాతిపదికన పదవీ విరమణ తర్వాత 65 ఏళ్ల వరకు సర్వీసు పొడిగించే పాలసీని ప్రకటించింది.ఇదీ చదవండి: పెళ్లిరోజున భార్యను బాధపెట్టిన నారాయణమూర్తి!రూ.2,058.50 కోట్ల డీల్పదేళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్న విమానయాన సంస్థ విస్తారా ఈరోజు నుంచి కనుమరుగు కానుంది. నవంబర్ 11 నుంచి విస్తారా సేవలు నిలిపేయనుంది. నవంబర్ 12 నుంచి సంస్థ విమానాలు, సిబ్బంది ఎయిరిండియాకు బదిలీ అవుతారని గతంలో కంపెనీ సీఈవో, ఎండీ క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. విలీన డీల్‌లో భాగంగా ఎయిరిండియాలో రూ.2,058.50 కోట్ల మేర సింగపూర్ ఎయిర్‌లైన్స్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెట్టే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం గతంలో ఆమోదముద్ర వేసింది. దీనితో విలీనానికి మార్గం సుగమమైంది. విలీనానంతరం ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కి 25.1 శాతం వాటా లభిస్తుంది. -
టాటా.. గుడ్‌బై.. విస్తారా ఇక కనుమరుగు..
న్యూఢిల్లీ: పదేళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్న విమానయాన సంస్థ విస్తారా ఇక కనుమరుగు కానుంది. నవంబర్ 12 నుంచి టాటా గ్రూప్‌లో భాగమైన మరో సంస్థ ఎయిరిండియాలో విలీనం కానుంది. విస్తారా సేవల నిలిపివేతకు నవంబర్ 11 ఆఖరు తేదీగా నిర్ణయించారు. నవంబర్ 12 నుంచి సంస్థ విమానాలు, సిబ్బంది ఎయిరిండియాకు బదిలీ అవుతారని కంపెనీ సీఈవో, ఎండీ క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. నవంబర్ 12 లేదా ఆ తర్వాత చేసే ప్రయాణాలకు సంబంధించి సెపె్టంబర్ 3 నుంచి బుకింగ్స్ నిలిచిపోతాయని విస్తారా ఒక ప్రకటనలో తెలిపింది. ఆ తర్వాత నుంచి తమ వెబ్సైట్లో బుకింగ్స్ అన్ని ఎయిరిండియా సైటుకు రీడైరెక్ట్ అవుతాయని పేర్కొంది. నవంబర్ 12 తర్వాత ప్రయాణాలకు బుక్ చేసుకున్నవారి ఫ్లయిట్ నంబర్లను సెపె్టంబర్లో దశలవారీగా ఆటోమేటిక్‌గా ఎయిరిండియాకు మారుస్తారు. కస్టమర్లకు ఆ వివరాలు తెలియజేస్తారు. మరింత విస్తృత నెట్వర్క్, విమానాలతో మెరుగైన ప్రయాణ అనుభూతిని అందించేందుకు ఈ విలీనం తోడ్పడగలదని విస్తారా సీఈవో వినోద్ కణ్ణన్ తెలిపారు. ఎయిరిండియాలో ఎస్‌ఐఏకి 25.1 శాతం వాటా.. విలీన డీల్‌లో భాగంగా ఎయిరిండియాలో రూ. 2,058.50 కోట్ల మేర సింగపూర్ ఎయిర్‌లైన్స్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెట్టే ప్రతిపాదనకు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. దీనితో విలీనానికి మార్గం సుగమమైందని, ఈ ఏడాది ఆఖరు నాటికి ప్రక్రియ పూర్తి కావచ్చని సింగపూర్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. విలీనానంతరం ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కి 25.1 శాతం వాటా లభిస్తుంది. ఫిట్మెంట్ ప్రక్రియ ప్రారంభం.. ఎయిరిండియా, విస్తారా విలీన ప్రక్రియపై ప్యాసింజర్లకు స్పష్టతనిచ్చేందుకు ఇప్పటికే ఎఫ్ఏక్యూలను (సందేహాలు, సమాధానాలు) సిద్ధం చేశారు. అలాగే ఫిట్మెంట్ ప్రక్రియను కూడా ప్రారంభించారు. టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ జాయింట్ వెంచర్‌గా విస్తారా 2015 జనవరిలో కార్యకలాపాలు ప్రారంభించింది. విస్తారాకు 70 విమానాలు ఉండగా, 50 పైచిలుకు గమ్యస్థానాలకు సరీ్వసులు నిర్వహిస్తోంది. ఎయిరిండియాలో కంపెనీ విలీనాన్ని 2022 నవంబర్‌లో ప్రకటించారు. 2023 సెపె్టంబర్లో ఈ డీల్‌కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. నష్టాల్లోనే కొనసాగుతున్న ఎయిరిండియా, విస్తారాలో 23,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం ఎయిరిండియా గ్రూప్ గొడుగు కింద ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఏఐఎక్స్ కనెక్ట్ (గతంలో ఎయిర్ఏషియా ఇండియా) కార్యకలాపాలు సాగిస్తున్నాయి. -
విమానంలో భయానక ఘటన.. సారీ చెప్పిన సింగపూర్ ఎయిర్‌లైన్స్
బ్యాంకాక్: లండన్ నుంచి సింగపూర్‌కు బయల్దేరిన సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో మార్గమధ్యంలో భారీ కుదుపులకు లోనైంది. దీంతో విమానంలోని ప్రయాణికులు ఒక్కసారిగా సీలింగ్ తగిలి, చెల్లాచెదురుగా పడి గాయాలపాలయ్యారు. ఊహించని పరిణామంతో హతాశుడైన ఓ ప్రయాణికుడు (73) అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రుల్లో ముగ్గురు భారతీయులు ఉన్నారు. ఘటనపై ఎయిర్‌లైన్స్ క్షమాపణలు చెప్పింది. ప్రయాణికులకు అవసరమైన వైద్య సాయం అందించేందుకు థాయ్‌లాండ్ అధికారులతో కలిసి పనిచేస్తున్నామని, పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఓ బృందాన్ని బ్యాంకాక్‌కు పంపుతున్నట్లు తెలిపింది.అసలేమైంది?211 మంది ప్రయాణికులు, 18 సిబ్బందితో విమానం లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం నుంచి బయల్దేరింది. బోయింగ్ 777 రకం ఎస్క్యూ321 విమానం మంగళవారం ఉదయం మయన్మార్ దగ్గర్లోని అండమాన్ సముద్ర జలాలపై ప్రయాణిస్తున్నపుడు ఈ ఘటన జరిగింది. విమానం బయల్దేరిన 10 గంటల తర్వాత జరిగిన ఈ ఘటన చోటు చేసుకుంది. ఎయి ర్‌హోస్టెస్ ప్రయాణికులకు అల్పాహారం అందిస్తున్న సమయంలో విమానం 37,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. హఠాత్తుగా విమానం కుదుపులకు లోనైంది. మూడు నిమిషాల వ్యవధిలో ఆరువేల అడుగులు అంటే 37వేల అడుగుల ఎత్తు నుంచి 31వేల అడుగుల స్థాయికి పడిపోయింది. దీంతో విమానంలో బెల్ట్ పెట్టుకోని ప్రయాణికులంతా ఒక్క ఉదుటున గాల్లోకి లేచి సీలింగ్‌కు ఢీకొన్నారు. Aftermath of Singapore Airlines flight 321 from London to Singapore which had to divert to Bangkok due to severe turbulence. One death passenger and several injured. Blood everywhere, destroyed cabin. #singaporeairlines #sq321 pic.twitter.com/C2FgrVt9yv— Josh Cahill (@gotravelyourway) May 21, 2024 Severe turbulence on #SingaporeAirlines flight from London to Singapore results in 1 death and several injured passengers. This is a reminder - always have your seat belts fastened when inflight. #SQ321 pic.twitter.com/NV9yoe32ZC— Bandit (@BanditOnYour6) May 21, 2024 మూడు నిమిషాల పాటు విమానం అటూఇటూ ఊగుతూ కిందకు పడిపోతుండటంతో లోపలున్న వారంతా చెల్లా చెదు రుగా పడిపోయారు. అసలేం జరుగుతుందోనన్న భయం, ఆందోళనతో అస్వస్థతకు గురై 73 ఏళ్ల బ్రిటిష్ జాతీయుడు అక్కడికక్కడే మరణించారు. గుండెపోటు కారణంగా ఆయన మరణించి ఉంటారని వైద్యులు భావిస్తున్నారు. 31 వేల అడుగుల ఎత్తుకు చేరుకున్నాక విమానం మళ్లీ స్థిరత్వాన్ని సాధించింది. వెంటనే తేరుకున్న పైలట్లు 30 నిమిషాల్లోపే బ్యాంకాక్‌లోని సువర్ణభూమి ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రయాణికుల్లో ఎక్కువ మంది బ్రిటన్, ఆస్ట్రేలియా, మలేసియా, సింగపూర్, న్యూజిలాండ్ దేశస్తులున్నారు.ఘటన తర్వాత విమానాన్ని దారి మళ్లించి దగ్గర్లోని బ్యాంకాక్‌లోని సువర్ణభూమి విమానాశ్రయంలో ల్యాండ్చేశారు. గాయపడని ప్రయాణికులను వేరే విమానాల్లో గమ్యస్థానమైన సింగపూర్‌కు పంపేశారు. -
సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో కుదుపులు.. ఒకరు మృతి
సరైన రోడ్డు మార్గాలు లేకపోవడం వల్ల బస్సులు కుదుపులకు గురవుతాయి. కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటనలో విమానం తీవ్ర కుదుపులకు గురైంది. వినటానికి వింతగా ఉన్నా ఇది నిజం. దీనిని సింగపూర్ ఎయిర్‌లైన్స్ కూడా ధ్రువీకరించింది.సోమవారం లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు బయలుదేరిన SQ321 విమానం మార్గమధ్యంలో తీవ్రమైన అల్లకల్లోలాన్ని ఎదుర్కొందని.. సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో విమానం బ్యాంకాక్‌లోని సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం మధ్యాహ్నం 3.45 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ల్యాండ్ అయింది.బోయింగ్ 777-300 ER విమానంలో మొత్తం 211 మంది ప్రయాణికులతో పాటు 18 మంది సిబ్బంది ఉన్నారు. ఇందులో 30 మంది గాయపడగా, ఒకరు మృతి చెందారు. ఈ విషయాన్ని సింగపూర్ ఎయిర్‌లైన్స్ ధ్రువీకరిస్తూ.. మరణించిన వ్యక్తి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేసింది.విమానం ల్యాండ్ అయిన తరువాత అవసరమైన వైద్య సహాయం అందించడానికి థాయ్‌లాండ్‌లోని స్థానిక అధికారులతో కలిసి పని పనిచేస్తున్నట్లు.. ఇంకా అదనపు సహాయాన్ని అందించడానికి బ్యాంకాక్‌కు ఒక బృందాన్ని పంపినట్లు సింగపూర్ ఎయిర్‌లైన్స్ పేర్కొంది.ప్రయాణికులు సీటు బెల్ట్ ధరించనప్పుడు ఇటువంటి గాయాలు సాధారణంగా జరుగుతాయని నిపుణులు తెలిపారు. వాతావరణ రాడార్ నుంచి ముందస్తు సమాచారం అందకపోవడంతో పైలెట్ కూడా ముందుగా ప్రయాణికులను హెచ్చరికను ఇవ్వలేకపోయారని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులు సీటు బెల్టు ధరించకపోవడం వల్ల.. వారు కాక్‌పిట్‌లోకి పడే అవకాశం ఉంటుంది. అలంటి సమయంలో ఊహకందని ప్రమాదం జరుగుతుంది.Singapore Airlines flight #SQ321, operating from London (Heathrow) to Singapore on 20 May 2024, encountered severe turbulence en-route. The aircraft diverted to Bangkok and landed at 1545hrs local time on 21 May 2024.We can confirm that there are injuries and one fatality on…— Singapore Airlines (@SingaporeAir) May 21, 2024 -
ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్!.. శుభవార్త చెప్పిన కంపెనీ
గత కొన్ని రోజులుగా దిగ్గజ కంపెనీలు ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఉద్యోగాలు ఎప్పుడు పోతాయో తెలియకుండా ఇప్పటికీ చాలామంది బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ఈ తరుణంలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ తన ఉద్యోగులకు ఎగిరి గంతేసే శుభవార్త ప్రకటించింది. ఇందులో భాగంగానే ఎనిమిది నెలల బోనస్ అందిస్తామని పేర్కొంది.2023-24 ఆర్థిక సంవత్సరంలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ రికార్డు స్థాయిలో 1.98 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు పేర్కొంది. ఏడాది పొడవునా విమాన ప్రయాణాలకు డిమాండ్ భారీగా పెరిగిన కారణంగా ఈ సంస్థ గొప్ప లాభాలను ఆర్జించింది. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తరువాత చైనా, హాంకాంగ్, జపాన్, తైవాన్ తమ సరిహద్దుల మళ్లీ ప్రారంభమయ్యాయి. దీంతో ఎయిర్‌లైన్స్ లాభాలను గడించింది.ప్రపంచంలోనే అత్యుత్తమ విమానయాన సంస్థగా సింగపూర్ ఎయిర్‌లైన్స్.. 'స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌లైన్ అవార్డ్' పొందింది. ఈ అవార్డును ఈ ఎయిర్‌లైన్స్ గతంలో ఐదు సార్లు సొంతం చేసుకుంది. 23 ఏళ్ల చరిత్ర కలిగిం సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఆరు సార్లు ఈ అవార్డును దక్కించుకుని సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. -
హైదరాబాద్ నుంచి మరిన్ని ఫ్లయిట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్–సింగపూర్ రూట్లో అక్టోబర్ 29 నుంచి మరిన్ని ఫ్లయిట్లు నడపనున్నట్లు సింగపూర్ ఎయిర్‌లైన్స్ జీఎం (ఇండియా) సై యెన్ చెన్ తెలిపారు. ప్రస్తుతం వారానికి ఏడు సరీ్వసులు ఉండగా 12కి పెంచుకోనున్నట్లు వివరించారు. అనుబంధ బడ్జెట్ విమానయాన సంస్థ స్కూట్ నిర్వహించే ఫ్లయిట్స్ స్థానంలో వీటిని నడపనున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి సరీ్వసులు ప్రారంభించి 20 ఏళ్లవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాలు తెలిపారు. హైదరాబాద్ మార్కెట్ నుంచి ఫుల్ సరీ్వస్‌లు, కార్గోకు డిమాండ్ పెరిగినట్లు చెన్ చెప్పారు. -
విమానంలో ప్రయాణించాలా.. ఇదిగో స్పెషల్ ఆఫర్స్!
న్యూఢిల్లీ: సింగపూర్ ఎయిర్‌లైన్స్‌లో భాగమైన స్కూట్ తాజాగా మరిన్ని ఆఫర్లు ప్రకటించింది. వీటి కింద పలు దేశాలకు విమాన ప్రయాణ చార్జీలు అత్యంత తక్కువగా రూ. 7,600 నుండి (వన్ వే) ప్రారంభమవుతాయి. ఈ సేల్ సెప్టెంబర్ 18 వరకు ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి వచ్చే ఏడాది ఆగస్టు వరకు ప్రయాణాలకు వీటిని బుక్ చేసుకోవచ్చు. క్రిస్‌ఫ్లయర్ సభ్యులు టికెట్‌ను కొనుగోలు చేయడం ద్వారా మైల్స్‌ను పొందవచ్చని, వాటిని క్రిస్‌ప్లస్ యాప్‌లో రిడీమ్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. ఆఫర్ ప్రకారం హైదరాబాద్, వైజాగ్ వంటి ప్రాంతాల నుంచి కౌలాలంపూర్‌కు టికెట్ చార్జీ రూ. 8,900 నుండి ప్రారంభమవుతుంది. బాలీ, సింగపూర్, సిడ్నీ తదితర ప్రాంతాలకు ప్రయాణించవచ్చు. -
ఎయిరిండియా-విస్తారా విలీనానికి గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా-విస్తారా విలీనబాటలో కీలక అడుగు పడింది. కొన్ని షరతులకు లోబడి ఎయిర్ ఇండియా–విస్తారా ప్రతిపాదిత విలీనాన్ని కాంపిటీషన్ కమిషన్ శుక్రవారం ఆమోదించింది. తన విమానయాన వ్యాపారాన్ని ఒకే గొడుగు కిందకు తీసుకురావడానికి సంబంధించి టాటా గ్రూప్‌కు ఇది ఒక ప్రధాన ముందడుగు. ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ పై చేసిన ఒక పోస్టింగ్‌లో విలీనానికి ఆమోదముద్ర వేసినట్లు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తెలిపింది. (ఉద్యోగులకు బంపర్ ఆఫర్: రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన) ‘‘ఎయిరిండియాలో టాటా ఎస్ఐఏ ఎయిర్‌లైన్స్ విలీనానికి సీసీఐ ఆమోదం తెలిపింది. పారీ్టలు అందించే స్వచ్ఛంద కట్టుబాట్లకు, విధి విధానాలకు లోబడి ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ నిర్దిష్ట వాటాలను కొనుగోలు చేస్తుంది‘ అని సీసీఐ పేర్కొంది. విస్తారా, ఎయిర్ ఇండియా టాటా గ్రూప్‌లో భాగంగా ఉన్న రెండు వేర్వేరు విమానయాన సంస్థలు. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు విస్తారాలో 49% వాటా ఉంటే, టాటా సన్స్ వాటా 51%గా ఉంది. ఎయిరిండియా లో 25.1% వాటాను సింగపూర్ ఎయిర్‌లైన్స్ కొను గోలు చేయనున్న ఒప్పందం ప్రకారం విస్తారాను ఎయిర్ ఇండియాతో విలీనం చేస్తున్నట్లు గతేడాది నవంబర్‌లో టాటా గ్రూప్ ప్రకటించింది. -
వైజాగ్–సింగపూర్ రూ. 6,300కే విమాన టికెట్
ముంబై: సింగపూర్ ఎయిర్‌లైన్స్‌లో భాగమైన బడ్జెట్ విమానయాన సంస్థ స్కూట్ తాజాగా ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. వైజాగ్ తదితర నగరాల నుంచి సింగపూర్‌కు అత్యంత తక్కువ రేటు రూ. 6,300 నుంచి (వన్–వే) ఫ్లయిట్ టికెట్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. ఆగస్టు 28న ప్రారంభమైన ఈ సేల్ సెపె్టంబర్ 1 వరకు అయిదు రోజుల పాటు ఉంటుందని వివరించింది. ప్రయాణాలకు సంబంధించి ప్రాంతాన్ని బట్టి డిసెంబర్ 14 వరకు ఈ టికెట్లను వినియోగించుకోవచ్చు. -
ప్రపంచంలో ఇదే బెస్ట్ ఎయిర్ లైన్! భారత్ ఎక్కడుందంటే?
Best Airlines In 2023: ఆధునిక ప్రపంచంలో విమాన ప్రయాణం సర్వ సాధారణమైపోయింది. అందులో కూడా చాలా మంది ప్రయాణికులు ఉత్తమ సేవలను అందించే బెస్ట్ ఎయిర్ లైన్స్‌ని ఎక్కువగా ఎంచుకుంటారు. ఈ ఏడాది టాప్ 20 అత్యుత్తమ విమానయాన సంస్థలు ఏవి? ఇందులో మొదటి స్థానంలో ఉన్న ఎయిర్ లైన్.. చివరి స్థానంలో ఉన్న ఎయిర్ లైన్ ఏది అనేది ఈ కథనంలో తెలుసుకుందాం. 2023లో బెస్ట్ ఎయిర్ లైన్స్ జాబితాలో సింగపూర్ ఎయిర్ లైన్స్ మొదటి స్థానంలో నిలిచి రికార్డ్ బద్దలు కొట్టింది. ఆ తరువాత ఖతార్, ఆల్ నిప్పన్, ఎమిరేట్స్ వంటివి ఉన్నాయి. స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్ లైన్ అవార్డ్ 2023 ఎయిర్ లైన్స్‌కు ఈ ర్యాంకింగ్స్ అందిస్తుంది. ఇందులో ఖతార్ రెండవ స్థానంలో ఉన్నప్పటికీ బెస్ట్ బిజినెస్ క్లాస్ ఎయిర్ లైన్, సీట్ అండ్ లాంజ్ కేటగిరీల్లో మొదటి స్థానంలో నిలిచింది. ఇక బడ్జెస్ట్ ఎయిర్ లైన్స్ కేటగిరీలో ఎయిర్ఆసియా తొలి స్థానంలో నిలిచింది. ఆ తరువాత లో కాస్ట్ లాంగ్ హాల్ కేటగిరిలో డెల్టా ఎయిర్ లైన్స్ మొదటి స్థానంలో నిలిచింది. అత్యంత క్లీనెస్ట్ ఎయిర్‌లైన్ అవార్డు ఏఎన్ఏ (ఆల్ నిప్పన్ ఎయిర్ వేస్)కు దక్కింది. 2022 సెప్టెంబర్ 2022 నుంచి మే 2023 వరకు 100 కు పైగా దేశాలకు చెందిన విమాన ప్రయాణికుల నుంచి మొత్తం 335 ఎయిర్ లైన్స్ సంస్థల పనితీరుపై సమాచారం సేకరించి ఈ లిస్ట్ రూపొందించారు. (ఇదీ చదవండి: హెయిర్ ఆయిల్ అమ్మి వేలకోట్ల సామ్రాజ్యం.. తల్లి పెట్టుబడితో కుబేరుడైన కొడుకు!) టాప్ 20 బెస్ట్ ఎయిర్ లైన్స్ సింగపూర్ ఎయిర్ లైన్స్ ఖతార్ ఎయిర్ వేస్ ఆల్ నిప్పన్ ఎయిర్ వేస్ (ఏఎన్ఏ) ఎమిరేట్స్ జపాన్ ఎయిర్ లైన్స్ టర్కిష్ ఎయిర్ లైన్స్ ఎయిర్ ఫ్రాన్స్ కాథే ఫసిఫిక్ ఎయిర్ లైన్స్ ఇవా ఎయిర్ కొరియన్ ఎయిర్ హైనన్ ఎయిర్ లైన్స్ స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ ఎతిహాద్ ఎయిర్ వేస్ ఐబేరియా ఫిజి ఎయిర్ వేస్ విస్తారా క్వాంటాస్ ఎయిర్ వేస్ బ్రిటిష్ ఎయిర్ వేస్ ఎయిర్ న్యూజిలాండ్ డెల్టా ఎయిర్ లైన్స్ -
మెగా బోనస్: 8 నెలల జీతం, ఎయిర్‌లెన్స్ ఉద్యోగుల సంబరాలు
సాక్షి, ముంబై: సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఉద్యోగులకు అద్భుతమైన వార్త. తన ఉద్యోగులకు భారీ బోనస్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది కంపెనీ. రికార్డు స్థాయిలో రూ.13,000 కోట్ల వార్షిక లాభాన్ని ఆర్జించిన తర్వాత, ఎయిర్‌లైన్ దాని సిబ్బందికి ఎనిమిది నెలల జీతంతో సమానమైన బోనస్‌ను అందించనుంది. మెగా బోనస్ కోవిడ్ మహమ్మారి సమయంలో విశిష్ట సేవలందించిన, అర్హత కలిగిన ఉద్యోగులు 6.65 నెలల వేతనానికి సమానమైన లాభాల-భాగస్వామ్య ప్రోత్సాహకాన్ని, గరిష్టంగా 1.5 నెలల ఆదాయాన్ని ఎక్స్-గ్రేషియా బోనస్‌గా అందిస్తున్నామని ఎయిర్‌లైన్ ప్రతినిధి తెలిపారు. అయితే సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు అదనపు ఎక్స్‌గ్రేషియా ఇన్సెంటివ్ ఉండదని చెప్పారు.(గూగుల్ సీఈవో ప్రైమరీ ఫోన్ ఏదో తెలుసా, ఏఐపై కీలక వ్యాఖ్యలు) స్టాఫ్ యూనియన్లతో ఒప్పందం ప్రకారం తమ దీర్ఘకాలిక వార్షిక లాభాల-భాగస్వామ్య బోనస్ ఫార్ములాపై ఆధారపడి ఉంటుంని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. సింగపూర్ ఎయిర్‌లైన్స్ మార్చి 31న ముగిసిన ఆర్థిక సంవత్సరానికి 1.62 బిలియన్ డాలర్లు (రూ.13వేల కోట్లు) నికర లాభాన్ని ప్రకటించింది. (Massive layoffs: 55వేలమందిని తొలగించనున్న అతిపెద్ద టెలికాం సంస్థ) అన్ని క్యాబిన్ తరగతుల్లో ఫార్వర్డ్ సేల్స్ చైనా, జపాన్ , దక్షిణ కొరియాలకు రిజర్వేషన్లు బలంగా ఉన్నాయని కంపెనీ పేర్కొంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్ , బడ్జెట్ ధరల అనుబంధ సంస్థ స్కూట్‌లో ఒకే ఏడాదిలో ఆరు రెట్లు ఎక్కువ మంది ప్రయాణీకులు ప్రయాణించారు (26.5 మిలియన్లు). (ఈ పిక్స్ చూశారా? గుండెలు బాదుకుంటున్న కృతి సనన్ ఫ్యాన్స్) మార్చిలో 79శాతంతో ప్రీ-కోవిడ్ స్థాయిలకు చేరుకుంది, సింగపూర్ ఎయిర్‌లైన్స్ షేర్లు గురువారం 1.2శాతం పెరిగాయి సింగపూర్ ఎయిర్ ఏప్రిల్‌లో 1.75 మిలియన్ల మంది ప్రయాణీకులు ప్రయాణించినట్లు సోమవారం నివేదించింది, గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 53శాతం పెరిగింది. ఇలాంటిమరెన్నో అద్భుతమైన వార్తలు, విశేషాల కోసం చదవండి :సాక్షి, బిజినెస్ -
టాటా దూకుడు: ఏవియేషన్ మార్కెట్లో సంచలనం
న్యూఢిల్లీ: దేశీ ఏవియేషన్ మార్కెట్లో భారీ కన్సాలిడేషన్‌కు తెర తీస్తూ ఎయిరిండియాలో విస్తారాను విలీనం చేయనున్నట్లు టాటా గ్రూప్ మంగళవారం ప్రకటించింది. ఒప్పందం ప్రకారం ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు 25.1 శాతం వాటా దక్కనుంది. ఈ డీల్ 2024 మార్చి నాటికి పూర్తి కాగలదని భావిస్తున్నారు. ప్రస్తుతం విస్తారాలో టాటా గ్రూప్‌నకు 51 శాతం, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు (ఎస్ఐఏ) 49 శాతం వాటాలు ఉన్నాయి. ఈ కన్సాలిడేషన్‌తో దేశ, విదేశ రూట్లలో అత్యధికంగా సర్వీసులు నడిపిస్తున్న భారీ ఎయిర్‌లైన్స్‌గా ఎయిరిండియా ఆవిర్భవిస్తుందని టాటా గ్రూప్ తెలిపింది. అంతర్జాతీయ రూట్లకు సంబంధించి దేశీయంగా అతి పెద్ద సంస్థగాను, దేశీ రూట్లలో రెండో పెద్ద సంస్థగాను ఎయిరిండియా ఉంటుందని వివరించింది. విలీనానంతరం సంస్థ చేతిలో 218 విమానాలు ఉంటాయి. విలీన ఒప్పందం కింద ఎయిరిండియాలో రూ. 2,058.5 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఎస్ఐఏ తెలిపింది. తద్వారా తమకు ఎయిరిండియాలో 25.1 శాతం వాటా లభిస్తుందని, అలాగే అన్ని కీలక మార్కెట్ విభాగాల్లోనూ తమకు గణనీయంగా చోటు దక్కుతుందని పేర్కొంది. కీలక మైలురాయి .. ఎయిరిండియాను ప్రపంచ స్థాయి ఎయిర్‌లైన్‌గా తీర్చిదిద్దే క్రమంలో రెండు సంస్థల విలీనం కీలక మైలురాయి వంటిదని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ వ్యాఖ్యానించారు. ‘ఎయిరిండియా ఇటు నెట్‌వర్క్‌ను, అటు విమానాలను పెంచు కోవడంపై, కస్టమర్లకు అందించే సర్వీసులు మెరుగుపర్చుకోవడంపై, భద్రత.. విశ్వసనీయత.. సమయ పాలనను మెరుగు పర్చుకోవడంపై ప్రధానంగా దృష్టి పెడుతోంది‘ అని ఆయన చెప్పారు. టాటా గ్రూప్‌తో సంబంధాలను మరింత పటిష్టపర్చుకునేందుకు, దేశీ ఏవియేషన్ మార్కెట్ వృద్ధిలో పాలుపంచుకునేందుకు ఈ విలీనం చక్కని అవకాశం కాగలదని ఎస్ఐఏ సీఈవో గోహ్ చూన్ ఫోంగ్ తెలిపారు. విలీన ప్రక్రియ పూర్తయ్యే వరకు కార్యకలాపాలు యథాప్రకారం కొనసాగుతాయని విస్తారా సీఈవో వినోద్ కణ్ణన్ చెప్పారు. ఎయిరిండియా రూపాంతరం చెందే ప్రయత్నాలకు విలీన ఒప్పందం మరింత ఊతమివ్వగలదని సంస్థ సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. మరిన్ని పెట్టుబడులు .. ఎయిరిండియా భారీ విస్తరణ, కార్యకలాపాల నిర్వహణ కోసం అవసరమైతే 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో ఎస్ఐఏ, టాటా సన్స్ మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నాయి. ‘విలీనానంతరం మాకు ఉండే 25.1 శాతం వాటా ప్రకారం మేము అదనంగా రూ.5,020 కోట్ల వరకూ ఇన్వెస్ట్ చేయాల్సి రావచ్చు. విలీనం పూర్తయ్యాకే చెల్లించాల్సి ఉంటుంది‘ అని ఎస్ఐఏ తెలిపింది. టాటా గ్రూప్‌లో నాలుగు ఎయిర్‌లైన్స్.. టాటా గ్రూప్‌లో ప్రస్తుతం ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్ఏషియా ఇండియా, విస్తారా అని నాలుగు విమానయాన సంస్థలు ఉన్నాయి. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ను ఈ ఏడాది జనవరిలోనే కొనుగోలు చేసింది. ఎయిర్ఏషియా ఇండియా 2014లో, విస్తారా 2015లో, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ 2005లో కార్యకలాపాలు ప్రారంభించాయి. ప్రస్తుతం విస్తారా, ఎయిరిండియా దేశీయంగా అతి పెద్ద ఎయిర్‌లైన్స్ జాబితాలో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అక్టోబర్‌లో రెండింటి మార్కెట్ వాటా కలిపి 18.3 శాతంగా ఉంది. ఎయిర్‌ఏషియాతో కలిపితే 25.9 శాతంగా ఉంది. ఎయిరిండియాలో విలీనంతో విస్తారా బ్రాండ్ కనుమరుగు కానున్నట్లు తెలుస్తోంది. ఎనిమిదేళ్ల విస్తారా.. తాము స్థాపించిన ఎయిరిండియా.. ప్రభుత్వం చేతికి చేరాక, టాటా గ్రూప్ దశాబ్దాల పాటు తిరిగి విమానయాన రంగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు కొనసాగించింది. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి ఎయిర్‌లైన్స్‌ను ప్రారంభించేందుకు 1994లో ప్రయత్నించినా కుదరలేదు. ఆరేళ్ల తర్వాత ఎయిరిండియాలో వాటాలు కొనుగోలు చేసి ఏవియేషన్‌లోకి ప్రవేశిద్దామనుకున్నా సాధ్యపడలేదు. చివరికి 2012లో ఏవియేషన్‌లో విదేశీ పెట్టుబడులపై పరిమితులను సడలించడంతో మళ్లీ ఎస్‌ఐఏతోనే జత కట్టి ఎట్టకేలకు 2015లో విస్తారా విమానయాన సంస్థను ఏర్పాటు చేసింది. తద్వారా విమానయాన మార్కెట్లోకి తిరిగి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం విస్తారా దేశీ, విదేశీ రూట్లలో 41 ప్రాంతాలకు రోజూ 260 పైగా ఫ్లైట్లు నడుపుతోంది. 54 విమానాలు, దాదాపు 4,500 మంది ఉద్యోగులు ఉన్నారు. -
హైదరాబాద్ నుంచి సింగపూర్‌కి ఏ350 ఫ్లయిట్ సర్వీసులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సింగపూర్ ఎయిర్‌లైన్స్ (ఎస్ఐఏ) అక్టోబర్ 30 నుంచి హైదరాబాద్–సింగపూర్ రూట్లో విశాలమైన ఏ350–900 విమానాలతో సర్వీసులు ప్రారంభించనుంది. ఇవి ప్రతి గురు, శుక్ర, శని, ఆదివారాల్లో నడుస్తాయని సంస్థ భారత విభాగ జనరల్ మేనేజర్ సయ్ యెన్ చెన్ తెలిపారు. మిగతా రోజుల్లో ప్రస్తుతం ఉన్న చిన్న విమానాలను (బీ737–8) నడుపుతామని చెప్పారు. కార్గో సేవలను కూడా పెంచుకునేందుకు విశాలమైన వైడ్ బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉపయోగకరంగా ఉంటాయని చెన్ వివరించారు. -
విస్తారాపై టాటా గ్రూపు కన్ను, విలీన చర్చలు
న్యూఢిల్లీ: విస్తారాను ఎయిరిండియాలో విలీనం చేయడంపై టాటా గ్రూపుతో రహస్య చర్చలు నిర్వహిస్తున్నట్టు సింగపూర్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. విస్తారాలో టాటాలకు 51 శాతం వాటా ఉంటే, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు 49 శాతం వాటా ఉంది. టాటాలతో చర్చలు కొనసాగుతున్నాయని, ఇంకా కచ్చితమైన నిబంధనలపై అంగీకారానికి రాలేదని సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజ్కుకు సింగపూర్ ఎయిర్‌లైన్స్ సమాచారం ఇచ్చింది. టాటా, సింగపూర్ ఎయిర్‌లైన్స్ మధ్య ప్రస్తుత భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా ఈ చర్చలు నడుస్తున్నట్టు తెలిపింది. ఎయిర్ ఇండియాను టాటాలు కొనుగోలు చేసిన తర్వాత.. అప్పటికే తమ నిర్వహణలోని విస్తారా, ఎయిరేషియా ఇండియా కార్యకలాపాలను ఒకే గొడుగు కింద కు తీసుకురావాలన్న ప్రణాళికలతో ఉన్న విషయం తెలిసిందే. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్ర శేఖరన్ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే ఎయిర్ ఇండియా-విస్తారా విలీనంపై చర్చలు నడుస్తున్నట్టు అధికారికంగా ప్రకటన రావడం ఇదే మొదటిసారి. ఎయిరేషియా ఇండియాలో టాటాలకు 83.67 శాతం వాటా ఉంది. -
బంపర్ ఆఫర్: మలేషియా,థాయిలాండ్‌కి ‘ఎగిరి’పోదామా!
హైదరాబాద్: ఆసియా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు హైదరాబాద్, చెన్నై తదితర నగరాల నుంచి ప్రయాణం చేసే వారి కోసం సింగపూర్ ఎయిర్‌లైన్స్ (ఎస్ఐఎ) ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. అహ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్ , కొచ్చి నుండి ఆసియా అంతటా ప్రత్యేక ప్రమోషనల్ ఛార్జీలను అందిస్తోంది. మలేషియా, ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, వియత్నాం, ఇతర ఆసియా దేశాలకు వెళ్లేవారికి తక్కువ రేట్లలో విమాన టికెట్లను అందిస్తోంది. ఈ ఆఫర్లో ఫ్లయిట్ టికెట్లను రూ. 16,200 రేటు నుంచి పొందవచ్చని కంపెనీ పేర్కొంది. ఆగస్టు 5 వరకూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్, చెన్నైకి సంబంధించి పెప్టెంబర్ 2 నుంచి 2023 మార్చి 31 వరకూ చేసే ప్రయాణాలకు ఈ రేట్లు వర్తిస్తాయి. అలాగే అహ్మదాబాద్, కొచ్చిల నుంచి ఆగస్టు 2, 2023 మార్చి 31 మధ్య కాలంలో చేసే ప్రయాణాలకు ఆఫర్ ధర వర్తిస్తుంది. భారతదేశం నుండి పెరుగుతున్న డిమాండ్ కనుగుణంగా రాబోయే నెలల్లో చెన్నై, హైదరాబాద్ , కొచ్చి నుండి కార్యకలాపాలను గణనీయంగా పెంచడానికి కూడా సిద్ధమవుతోంది సింగపూర్ ఎయిర్‌లైన్స్. -
ఐటీ కంపెనీలకు ‘బ్లో’యింగ్
న్యూఢిల్లీ: భారత ఐటీ కంపెనీలకు బోయింగ్ సంస్థ నుంచి వచ్చే వ్యాపారానికి గండిపడనుంది! ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ నుంచి బిలియన్ డాలర్ల వ్యాపారం ఆగిపోయే ప్రమాదం పొంచి ఉంది. బోయింగ్ తన ప్రతిష్టాత్మక 737 మ్యాక్స్ సిరీస్ విమానాల తయారీని జనవరి నుంచి నిలిపివేయనుంది. టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, సైయంట్, ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్ ప్రస్తుతం బోయింగ్ సంస్థతో వ్యాపార అనుబంధం కలిగి ఉన్నాయి. ‘‘చాలా భారత ఐటీ కంపెనీలకు బోయింగ్ ప్రముఖ క్లయింట్‌గా ఉంది. కనుక స్వల్పకాలంలో ఈ కంపెనీలపై తప్పక ప్రభావం ఉంటుంది. బోయింగ్ ఎదుర్కొంటున్న సమస్యల వల్ల ఏరోస్పేస్ విభాగంలో వ్యయాలు కూడా తగ్గిపోతాయి’’ అని ఐటీ అవుట్సోర్సింగ్ అడ్వైజర్, పారీక్ కన్సల్టింగ్ వ్యవస్థాపకుడు పారీక్ జైన్ తెలిపారు. మ్యాక్స్ 737 విమాన తయారీని ఈ నెలారంభంలోనే బోయింగ్ తాత్కాలికంగా నిలిపివేయగా, జనవరి నుంచి తన సరఫరాదారులు సరఫరాను నిలిపివేయనున్నట్టు ప్రకటించింది. ఈ సంస్థ తన సీఈవో డెన్నిస్ ములెన్బర్గ్కు ఈ వారమే ఉద్వాసన కూడా పలకడం గమనార్హం. ఇండోనేసియా, ఇథియోపియాల్లో బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు కూలిపోయిన ఘటనల నేపథ్యంలో నియంత్రణ సంస్థల విశ్వాసాన్ని బోయింగ్ కోల్పోయింది. ఇదే సీఈవోను సాగనంపేందుకు దారితీసింది. సగం వాటా మన ఐటీ కంపెనీలదే.. విమానయాన ఇంజనీరింగ్ అవుట్సోర్సింగ్ మార్కెట్ పరిమాణం ప్రపంచవ్యాప్తంగా ఏటా 4 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. బోయింగ్, ఎయిర్‌బస్ సమానంగా వాటా కలిగి ఉన్నాయి. బోయింగ్ సంస్థ 2 బిలియన్ డాలర్ల విలువైన సేవలను అవుట్సోర్సింగ్ ఇస్తుండగా, ఇందులో సగానికి సగం మన దేశ ఐటీ కంపెనీలే సొంతం చేసుకుంటున్నాయి. వీటితోపాటు అస్సెంచుర్, క్యాప్‌జెమినీ సంస్థలు కూడా ఈ విభాగంలో ముందున్నాయి. బోయింగ్‌కు ఇంజన్లను ప్రట్ అండ్ విట్నే, రోల్స్‌రాయిస్, జనరల్ ఎలక్ట్రిక్, శాఫ్రాన్.. విమాన విడిభాగాలను స్పిరిట్ ఏరోసిస్టమ్స్, శాఫ్రాన్ సమకూరుస్తున్నాయి. రాక్వెల్, హానీవెల్ సంస్థలు ఏవియోనిక్స్ను సమకూరుస్తున్నాయి. ‘‘చాలా వరకు భారత ఐటీ సంస్థలు నేరుగా బోయింగ్ సంస్థతో, సరఫరా వ్యవస్థతో అనుబంధం కలిగి ఉన్నాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, సైయింట్ నేరుగా బోయింగ్‌తో వ్యాపారం కలిగి ఉంటే, విడిభాగాల సరఫరాదారు స్పిరిట్ ఏరోసిస్టమ్ ఇన్ఫోసిస్ క్లయింట్‌గా ఉంది’’ అని అవుట్సోర్సింగ్ మార్కెట్ ప్రముఖుడొకరు తెలిపారు. ఒప్పందాల్లో రక్షణ ఉంటుంది.. ‘‘సాధారణంగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్టుల్లో రక్షణకు సంబంధించి నిబంధనలు ఉంటాయి. రద్దు కారణంగా తలెత్తే నష్టాల నుంచి ఐటీ కంపెనీలకు రక్షణ ఉంటుంది. అయితే, స్వల్ప కాలానికి లాభదాయకతపై కచ్చితంగా ప్రభావం పడుతుంది’’ అని గ్రేహౌండ్ రీసెర్చ్ వ్యవస్థాపకుడు, సీఈవో సంచిత్విర్ గోగియా వివరించారు. ‘‘ఇంజనీరింగ్ సేవల సంస్థలు మాత్రం ఇప్పటికీ ఆశావహంగానే ఉన్నాయి. ఎందుకంటే బోయింగ్ 737 మ్యాక్స్‌ను నిలిపివేస్తే, అప్పుడు 797 మోడల్‌పై అధిక వ్యయాలు చేస్తుందన్న అంచనాతో ఉన్నాయి. భారత ఇంజనీరింగ్ సేవల సంస్థలకు ఇది సానుకూలమే’’ అని మరొక నిపుణుడు పేర్కొన్నారు. బోయింగ్ 797 కొత్త తరహా విమానం. ఇది 225–275 సీట్ల సైజుతో ఉంటుంది. బోయింగ్ సరఫరా వ్యవస్థ ఇంజిన్ తయారీదారులు: ప్రట్ అండ్ విట్నే, రోల్స్‌రాయిస్, జనరల్ ఎలక్ట్రిక్, శాఫ్రాన్ విడిభాగాల సరఫరాదారులు: స్పిరిట్ ఏరోసిస్టమ్స్, శాఫ్రాన్ ఏవియోనిక్స్ (ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్): రాక్వెల్, హనీవెల్ భారత కంపెనీలు: భారత ఐటీ కంపెనీలు అప్లికేషన్ డెవలప్మెంట్, టెస్టింగ్, ఇంజనీరింగ్, ఏవియోనిక్స్, బీపీఓ సేవలను బోయింగ్ 737 మ్యాక్స్ విమాన తయారీ కార్యక్రమానికి అందిస్తున్నాయి. -
వైరల్ వీడియో : అదృష్టం అంటే ఈ పక్షిదే..!
ఈ వార్త చదివాక ‘అరే ఈ పక్షికున్న పాటి అదృష్టం మనకు లేకుండా పోయిందే’ అనుకుంటారు. ఎందుకంటే మనలో చాలా మందికి విమానంలో ప్రయాణించడం ఓ కల. అది బిజినేస్ క్లాస్ ప్రయాణం అంటే అబ్బో ఇంకేముంది. ఎందుకంటే బిజినేస్ క్లాస్ టూర్ అంటే ఖర్చుతో కూడుకున్నది కాబట్టి. కానీ ఈ పక్షి మాత్రం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా బిజినేస్ క్లాస్‌లో దర్జాగా సింగపూర్ నుంచి లండన్ ప్రయాణించింది. ప్రస్తుతం ఈ పక్షి బిజినెస్ క్లాస్ టూర్ నెట్టింట్లో హాట్‌టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్‌మీడియాలో తెగ వైరలవుతోంది. సామాన్య వ్యక్తికి దక్కని అదృష్టం పక్షికి దక్కిందని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. వివరాలు.. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం సింగపూర్ నుంచి లండన్ బయలుదేరింది. అయితే ఎలా జరిగిందో తెలీదు కానీ విమానంలోని బిజినెస్ క్లాస్‌లోని ఓ సీటుపై పక్షి ప్రత్యక్షమైంది. అలా అది దాదాపు 12 గంటలపాటు విమానంలో ప్రయాణించి లండన్ చేరుకుంది. పక్షి ప్రయాణాన్ని కొందరు వీడియో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. దాంతో సిబ్బంది ఈ సంఘటన గురించి వివరణ ఇచ్చింది. జనవరి 7న విమానంలో ఈ పక్షి కనిపించిందని పేర్కొంది. ‘ప్రయాణీకులు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది పక్షిని పట్టుకున్నారు’ అని తెలిపింది. పాపం పక్షిని పట్టుకోవడానికి సిబ్బంది చాలా కష్టపడ్డట్లు వీడియోలో కనిపిస్తోంది. ఎలా అయితేనేం చివరకూ ఆ పక్షిని పట్టుకున్న సిబ్బంది తర్వాత దాన్ని లండన్‌లోని జంతు సంరక్షణ అధికారులకు అప్పంగిచారు. ‘వావ్.. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ను ఎంచుకోవాలని పక్షికి కూడా తెలుసు’, ‘ఈ పక్షికి ఏ క్లాస్‌లో ప్రయాణించాలో బాగా తెలిసినట్లు ఉంది’, ‘ఈ పక్షి ఇమిగ్రేషన్‌ను ఎలా క్లియర్ చేసుకుందో?.. ఆశ్చర్యంగా ఉంది’, ‘పక్షుల్ని ఎలా పట్టుకోవాలి అనే విషయంలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ తమ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
గ‘ఘన’ ఖ్యాతి!
రెండో ప్రపంచ యుద్ధ అవసరాల నిమిత్తం నిర్మించిన గన్నవరం విమానాశ్రయం.. అంచెలంచెలుగా ఎదిగి అంతర్జాతీయ ఖ్యాతిని అందుకుంది. ఒకప్పుడు చిన్నస్థాయి బస్టాండ్‌ను తలపించే రేకుల షెడ్డుతో ప్రారంభమైన పౌర విమాన సేవల ప్రస్థానం.. ఇంతింతై వటుడింతై అన్నట్లు నేడు విదేశీ ప్రయాణికులకు ఆతిథ్యం ఇచ్చే స్థాయికి చేరుకుంది. ఇక దేశీయ సర్వీస్‌లలోనూ ఘనమైన ప్రగతి సాధించింది. పదిహేడేళ్ల క్రితం ఒక్క విమానంతో పునఃప్రారంభమైన దేశీయ సర్వీస్‌లు.. ప్రస్తుతం రోజుకు 56కు చేరుకున్నాయి. కృష్ణాజిల్లా, విమానాశ్రయం(గన్నవరం): అమరావతి రాజధాని రాకతో గన్నవరం విమానాశ్రయ దశ తిరిగిందనే చెప్పాలి. కేవలం ఐదారు ప్రాంతీయ విమాన సర్వీస్‌లకు పరిమితమైన ఈ ఎయిర్‌పోర్టుకు క్రమంగా ప్రయాణికుల తాకిడి పెరిగింది. దీంతో ఎయిరిండియా, స్పైస్‌జెట్, ట్రూజెట్, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో విమాన సర్వీస్‌లు విస్తరించాయి. ప్రస్తుతం న్యూఢిల్లీ, ముంబాయి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కడప, తిరుపతి, వైజాగ్ నుంచి ఇక్కడికి రోజుకు 56 సర్వీస్‌ల్లో సుమారుగా మూడు వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రయాణికుల ఆదరణకు అనుగుణంగా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా సుమారు రూ. 162 కోట్లు ట్రాన్సిట్ టెర్మినల్‌ను గతేడాది అందుబాటులోకి తీసుకువచ్చింది. రూ. 5 కోట్లతో ఆధునికీకరణ.. విభజన హామీల్లో భాగంగా రాజధాని ప్రాంతంలోని ఈ ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ విమానాశ్రయ హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం 2017 మార్చిలో గజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. దీంతో అంతర్జాతీయ ప్రయాణికుల సేవల కోసం నిరుపయోగంగా ఉన్న పాత టెర్మినల్‌ను సుమారు రూ. 5 కోట్లతో ఆధునీకరించారు. కస్టమ్స్, ఇమిగ్రేషన్ అనుమతులు వచ్చినప్పటికీ విదేశీ సర్వీస్‌లు నడిపేందుకు తొలుత విమాన సంస్థలు ముందుకురాలేదు. చివరికి రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు ఇండిగో విమాన సంస్థ సింగపూర్‌కు విమానసర్వీస్‌లు నడిపేందుకు ముందుకువచ్చింది. నేటి నుంచి సర్వీస్‌లు ఈ నెల 4 నుంచి వారంలో ప్రతి మంగళ, గురువారాల్లో సింగపూర్ నుంచి ఇక్కడికి సర్వీస్‌లను ఇండిగో నడపనుంది. ఇప్పటి వరకు సింగపూర్‌కు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి రాకపోకలు సాగిస్తున్న ఈ ప్రాంత విమాన ప్రయాణికులు ఇప్పుడు నేరుగా వెళ్లే సదుపాయం లభించింది. సింగపూర్–గన్నవరం మధ్య విమాన ప్రయాణ సమయం కూడా నాలుగు గంటలు మాత్రమే. టికెట్ ధరలు ఇలా.. టికెట్ ప్రారంభ ధరను ఇక్కడి నుంచి సింగపూర్‌కు రూ. 7,508, సింగపూర్ నుంచి ఇక్కడికి రూ. 10,422గా ఆ సంస్థ నిర్ణయించింది. 180 మంది ప్రయాణ సామర్థ్యం కలిగిన ఎయిర్‌బస్ ఎ320 విమానం సింగపూర్ నుంచి ఉదయం 11.40 గంటలకు బయలుదేరి సాయంత్రం 3.45కు ఇక్కడికి చేరుకుంది. తిరిగి అదే రోజు సాయంత్రం 6.40కు ఇక్కడి నుంచి బయలుదేరి రాత్రి 10.40కు సింగపూర్‌కు చేరుకుంటుందని ఇండిగో ప్రతినిధులు పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా.. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టు టెర్మినల్‌లో సింగపూర్ వెళ్లే తొలి ప్రయాణికులకు ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు చేతుల మీదుగా బోర్డింగ్ పాస్‌లను అందజేయనున్నారు. అనంతరం సింగపూర్ వెళ్లనున్న సర్వీస్‌కు ఉపరాష్ట్రపతితో పాటు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి సురేష్‌ప్రభు జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఆదరణ పెరిగే అవకాశం.. మంగళవారం ప్రారంభంకానున్న తొలి సర్వీస్‌కు ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సింగపూర్ నుంచి ఇక్కడికి వచ్చే విమానానికి సుమారు 137, ఇక్కడి నుంచి సింగపూర్‌కు వెళ్లే సర్వీస్‌కు 85 టికెట్లు బుక్ అయినట్లు చెప్పారు. సింగపూర్ నుంచి కౌలాలంపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, పిలిప్పీన్స్, న్యూజీలాండ్ వెళ్లేందుకు సులువైన కనెక్టివిటి కూడా ఉండడంతో ఈ సర్వీస్‌కు ప్రయాణికుల ఆదరణ పెరగవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
విస్తారాలో భారీ పెట్టుబడులు
టాటా-సింగపూర్ ఎయిర్‌లైన్స్ భాగస్వామ్యంతో ఏర్పాటైన ఎయిర్‌లైన్స్ సంస్థ 'విస్తారా'లో సింగపూర్ఎయిర్లైన్స్ భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. దాదాపు 100 మిలియన్లకు పైగా సింగపూర్ డాలర్లను ఇన్వెస్ట్చేయనుంది. విస్తారా పనితీరుపట్ల ఆకర్షితమై అనుకున్నదానికి కంటే దాదాపు రెట్టింపు పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఇరు సంస్థలు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అయితే పెట్టుబడులను ధృవీకరించిన ఎస్ఏఐ ఎంత పెద్దమొత్తంలో అనేది వెల్లడించడానికి మాత్రం నిరాకరించింది. కమర్షియల్ కాన్ఫిడెన్సియల్ అని తెలిపింది. న్యూఢిల్లీ-ఆధారిత క్యారియర్ 2020వరకు లాభాలను ఆశించకపోయినప్పటికీ రెండు సంవత్సరాలకు పైగా దేశీయంగా సేవలందిస్తూ మంచి గ్రోత్‌ను సాధిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. తమ ప్రాంతీయ క్యారియర్ సిల్క్ ఎయిర్ ద్వారా వినియోగదారులను పెంచుకునేందుకు విస్తారాతోభాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని ద్వారా సింగపూర్క స్టమర్ సింగపూర్ నుంచి ఢిల్లీకి వెళ్లడానికి టికెట్ బుక్ చేసుకోవడానికి, అక్కడినుంచి 10 దేశీయ గమ్యస్థానాలకు విస్తారా ద్వారా బుక్ చేసుకునే సౌలభ్యం లభించనుంది. అంతర్జాతీయ మార్కెట్లలో తమ బ్రాండ్ గురించి ఎక్కువ అవగాహనను విస్తరించడంలో ఈ ఒప్పందం కీలక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని, తమ అంతర్జాతీయ ఆకాంక్షలకు మద్దతు ఇస్తుందని విస్తారా ప్రతినిధి తెలిపారు. ఇప్పటికే విస్తారాలో ఎస్ఏఐ 49శాతం వాటాను కలిగిఉంది. వచ్చే ఏడాది జూన్‌నాటికి విస్టారా దాని 20 వ విమానం కొనుగోలుతో ముఖ్యమైన మైలురాయిని తాకుతుందని, అంతర్జాతీయ విమానాలను నిర్వహించడానికి వైమానిక మార్గాలను సుగమం చేస్తుందని భావిస్తున్నారు. జాయింట్ వెంచర్ వైమానిక సంస్థలో టాటా గ్రూప్ 51 శాతం వాటాను కలిగి ఉంది. ప్రస్తుతం 45 దేశీయ రూట్లలో13 విమానాలను విస్తారా కలిగింది. భారత పౌరవిమానయాన నియమాల ప్రకారం, ఇంర్నేషనల్ సేవలందించలంటే విస్టారాకు కనీసం 20 విమానాలు ఉండాలి. ఈ నేపథ్యంలో సుమారు 50 వైడ్ బాడీస్ సహా 100 విమానాలను కొనుగోలు ప్రణాళికలోఉన్నట్టు సమాచారం. అయితేఈ వార్తలను విస్తారా కొట్టిపారేసింది. టఫ్ ఆపరేటింగ్ వాతావరణం ఉన్నప్పటికీ ఇండియన్ మార్కెట్ విస్తరించాలనేప్రణాళికలను పదేపదే ఎస్ఐఏ ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రకారం ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్ గా భారతదేశం ఉంది. -
నోట్ల రద్దు : కుప్పకూలిన విమానయానం
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు ప్రభావం అన్ని రంగాలపై భారీగా ఎఫెక్ట్ చూపుతోంది. ఈ ప్రభావంతో జోరుమీదున్న విమానరంగం ఒక్కసారిగా కుప్పకూలింది. టిక్కెట్ బుకింగ్స్ లేక సీట్లను ఖాళీగా ఉండిపోతున్నాయి. ప్రయాణాలకు ఇది అత్యంత కీలకమైన సమయం కావడంతో ఖాళీగా ఉన్న సీట్లను నింపుకోవడానికి విమానయాన సంస్థలు స్పెషల్ స్కీమ్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి. మంగళవారం రాత్రి ప్రధాని మోదీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దు హఠాత్తు పరిణామంతో ఇటు దేశీయంగానే కాక, అంతర్జాతీయ విమాన టిక్కెట్ల బుకింగ్ భారీగా దెబ్బతిన్నాయని విమానయాన సంస్థలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. లోకాస్ట్ ఎయిర్‌లైన్ పేరున్న సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన స్కూట్ సంస్థకు ఐలాండ్ నుంచి ఇండియాలోని జైపూర్, అమృత్సర్, చైన్నై ప్రాంతాలకు ఒక్కరోజు నమోదయ్యే బుకింగ్స్ 10 శాతం పడిపోయినట్టు ఆ సంస్థ భారత అధినేత భరత్ మహాదేవన్ తెలిపారు. మంగళవారం అనంతరం తమ విమానయాన సంస్థకు ఈ పరిణామం చోటుచేసుకున్నట్టు పేర్కొన్నారు. సింగపూర్ ఎయిర్‌లైన్‌కు చెందిన మరో బడ్జెట్ ఎయిర్‌లైన్ టైగర్ కూడా భారత్ నుంచి నమోదయ్యే టిక్కెట్ల బుకింగ్స్ ఒక్కరోజుకు 10 శాతం పడిపోయాయని తెలిసింది. ఫిబ్రవరి నుంచి ప్రమోషనల్ రేట్లను ఆఫర్ చేయాలని తాము భావిస్తున్నామని, కానీ నోట్ల రద్దు ఎఫెక్ట్‌తో ట్రావెల్ డిమాండ్ దారుణంగా పతనమైందని పేర్కొంది. దీంతో డిసెంబర్ నుంచే ఈ ఆఫర్లు ప్రారంభిస్తామని మహదేవన్ చెప్పారు. పెద్ద నోట్ల రద్దుతో విదేశీలకు ప్రయాణించే వారి లగ్జరీ ట్రావెల్ డిమాండ్ తగ్గినట్టు ఇంటర్నేషనల్ ట్రావెల్ పోర్టల్ తెలిపింది. చిన్న పట్టణాల్లో నివసించే వారు నగదు రూపంలోనే టిక్కెట్ చెల్లింపులు చేస్తారని, ప్రస్తుతం అది వీలుపడటం లేదని అధికారులు పేర్కొన్నారు. -
సింగపూర్ ఎయిర్ లైన్స్ టు-టు-గో ఆఫర్
హైదరాబాద్: సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంస్థ టు-టు-గో పేరుతో ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తోంది. సింగపూర్ టూరిజమ్ బోర్డ్ సహకారంతో ఈ ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నామని సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. 11 భారత నగరాలు- హైదరాబాద్, విశాఖపట్టణం, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కత, కోచి, త్రివేం డ్రమ్, కోయంబత్తూర్ నుంచి ఎకానమి క్లాస్ రిటర్న్ చార్జీలు రూ.22,000 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. ముంబై, ఢిల్లీల నుంచి ప్రీమియమ్ ఎకానమి క్లాస్‌కు సంబంధించి రిటర్న్ చార్జీలు రూ. 38,000(అన్నీ కలుపుకొని) నుంచి ప్రారంభమవుతాయని వివరించింది. ఈ ప్యాకేజీకి సంబంధించి టికెట్ల బుకింగ్ ఈ నెల 5న ప్రారంభమైందని, ఈ నెల 31 వరకూ ఉంటుందని, కనీసం ఇద్దరు ప్రయాణికులు ప్రయాణించాల్సి ఉంటుందని, సెప్టెంబర్ 30 వరకూ ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించింది. -
అడిగినన్ని రాయితీలు
- సింగపూర్ సంస్థలకు సర్కారు వరాలు - ఫ్రీ హోల్డ్ విధానంలో అభివృద్ధి చేసిన ప్లాట్ల అమ్మకం సాక్షి, హైదరాబాద్ : అమరావతి అభివృద్ధి భాగస్వామి పేరుతో సింగపూర్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అలవిమాలిన వరాలను కురిపించింది. ఆ సంస్థల కోరిన మేరకు రాయితీలివ్వడమే కాకుండా ఆ సంస్థలకు ఇచ్చే 1,691 ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు కేపిటల్ రీజియన్ డెవలప్మెంట్ నిర్వహణ కంపెనీ (సీసీడీఎంసీ) 5,500 కోట్ల వ్యయంతో వసతులు కల్పించనుంది. స్టార్ట్ అప్ ఏరియా (1,691 ఎకరాల్లో)లో అభివృద్ధి చేసిన ప్లాట్లను ఫ్రీ హోల్డింగ్ విధానంలో విక్రయించనున్నారు. ఈ మేరకు సింగపూర్ సంస్థలు ఇచ్చిన స్విస్ చాలెంజ్ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ, వాటికి కౌంటర్ ప్రతిపాదనలు ఆహ్వానించేందుకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఆర్డీఏ ముఖ్యకార్యదర్శి అజేయ జైన్ జీవో 170 జారీ చేశారు. ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి. సింగపూర్ సంస్థలకిచ్చిన రాయితీలివీ... ► స్టాంప్ డ్యూటీ రద్దుఊ కృష్ణా కరకట్ట ఎత్తు పెంపు, పటిష్టం, హై..,లో టెన్షన్, విద్యుత్ తీగల బదిలీకయ్యే ఖర్చును సీఆర్డీఏ బడ్జెట్లో పొందుపరచాలి. ► ఇసుకను ఉచితంగా ఇవ్వాలి. స్టార్ట్అప్ ఏరియాకు దగ్గరలో ఇసుక క్వారీని సీఆర్డీఏ కేటాయించాలి. ► అమరావతి అభివృద్ధి భాగస్వామిలో సీసీడీఎంసీ 42 శాతం ఈక్విటీతో ఒప్పందం చేసుకోవాలి. షేర్ హోల్డర్ అగ్రిమెంట్ ప్రకారం సీసీడీఎంసీ వాటా కింద 209 కోట్ల రూపాయలను పెట్టుబడి పెడుతుంది. ► 2014 డిసెంబర్ 8న సింగపూర్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పంద కాలపరిమితి ముగిసింది. ఏడాది పాటు మాత్రమే అమల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ అవగాహన ఒప్పంద కాలపరిమితి పొడిగింపు. ► రాయితీ అండ్ డెవలప్మెంట్ ఒప్పందం, రాష్ట్ర ప్రభుత్వం మద్ధతిచ్చే ఒప్పందం చేసుకోవడానికి ముందే టెండర్ డాక్యుమెంట్లు అధ్యయానికి కమిటీ ఏర్పాటుతో పాటు న్యాయశాఖ ఆమోదం పొందాలి. అనంతరమే ఒప్పందాలు చేసుకోవాలి. ► సింగపూర్ కంపెనీలు సమర్పించిన రాయితీ అండ్ డెవలప్మెంట్ ఒప్పందం, షేర్ హోల్డర్స్ ఒప్పందం మేరకు మౌలిక వసతుల కల్పనకు సీసీడీఎంసీ రూ.5,500 కోట్లు బడ్జెట్ కేటాయింపులు చేయాలి. నిర్ణీత సమయంలోగా వసతుల కల్పన పూర్తి చేయకుండా జాప్యం చేస్తే ఆర్థికపరమైన సమస్యలు తలెత్తుతాయి.ఊ స్విస్ చాలెంజ్ విధానంలో కౌంటర్ ప్రతిపాదనల ఆహ్వానం, సంస్థ ఎంపిక మొత్తం రెవెన్యూలో ఎంత వాటా ఇస్తారనే ప్రాతిపదికన ఉంటుంది. ఆ రెవెన్యూ వాటా ఎంత శాతం అనేది మంత్రులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ చేసిన ప్రతిపాదనల మేరకు ఉంటుంది. ► సింగపూర్ సంస్థలు ఎంపిక కాని పక్షంలో ఆ సంస్థలు చేసిన ఒరిజనల్ ప్రాజెక్టు ప్రతిపాదనలకైన వ్యయం రూ.7.5 కోట్లను తిరిగి చెల్లించాలి. ► సింగపూర్ సంస్థల ప్రతిపాదించిన రాయితీ మరియు అభివృద్ధి ఒప్పందం మేరకు స్టార్ట్ అప్ ఏరియా 1,691 ఎకరాల్లో అభివృద్ధి చేసిన ప్లాట్లను ఫ్రీ హోల్డింగ్ విధానంలో విక్రయిస్తారు. ► సింగపూర్ సంస్థల స్విస్ చాలెంజ్ ప్రతిపాదనలకు కౌంటర్ ప్రతిపాదనలను ఆహ్వానించే ప్రక్రియను సీఆర్డీఏ కమిషనర్ చేయాలి. -
సింగపూర్ విమానంలో మంటలు
సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానం ఒకటి అత్యవసర ల్యాండింగ్ చేస్తుండగా, దానికి మంటలు అంటుకున్నాయి. చాంగి విమానాశ్రయంలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. సింగపూర్ నుంచి ఇటలీలోని మిలన్ వెళ్లాల్సిన ఈ విమానం ఉదయం 2.05 గంటలకు బయల్దేరింది. కొంత సేపు ప్రయాణించిన తర్వాత, ఇంజన్లో సమస్య వచ్చిందని, అందువల్ల విమానాన్ని సింగపూర్‌కు తీసుకెళ్లిపోతున్నామని పైలట్ ప్రకటించాడు. ఆ సమయానికి విమానంలో 222 మంది ప్రయాణికులు, 19 మంది సిబ్బంది ఉన్నారు. ఉదయం 7 గంటల సమయంలో విమానం ల్యాండ్ అవుతుండగా... దాని కుడివైపు రెక్కలకు మంటలు అంటుకున్నాయి. అయితే మంటలను వెంటనే ఆర్పేసినట్లు విమానంలోని ప్రయాణికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో చేసిన పోస్టింగుల ద్వారా తెలిసింది. ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించేశామని, ఎవరికీ గాయాలు కాలేదని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. వాళ్లందరినీ మెట్ల మార్గం గుండా కిందకు దింపి, అక్కడి నుంచి వాహనాలలో విమానాశ్రయంలోకి పంపారు. లీ బీ యీ అనే ప్రయాణికురాలు కిటికీలోంచి తన స్మార్ట్‌ఫోన్‌తో వీడియో తీసి దాన్ని వెంటనే ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. తాను ఇప్పుడే చావును తప్పించుకున్నానని ఆమె చెప్పారు. విమానంలో ఉండగా తనకు ఇంధనం వాసన బాగా ఎక్కువగా వచ్చిందని, కాసేపటికి కుడివైపు ఇంజన్లో ఆయిల్ లీకవుతుండటంతో విమానాన్ని తిరిగి సింగపూర్ తీసుకెళ్తున్నట్లు పైలట్ ప్రకటించాడని ఆమె తెలిపారు. విమానం ల్యాండయ్యి, మంటలు అంటుకున్న ఐదు నిమిషాల తర్వాత ఫైరింజన్లు వచ్చాయని.. ఆ ఐదు నిమిషాలు మాత్రం తమ పాలిట నరకమేనని చెప్పారు. -
హైదరాబాద్ టూ చంఢీగర్ వయా ఢిల్లీ
విస్తారా కొత్త సర్వీసు ప్రారంభం చంఢీగర్: దేశీయ విమానయాన సంస్థ విస్తారా మరో నూతన సర్వీసును ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది. సింగపూర్ ఎయిర్‌లైన్సు, టాటాసన్స్ తో సంయుక్తంగా పనిచేసే విస్తారా ఢిల్లీ మీదుగా హైదరాబాద్ నుంచి చంఢీగర్కు కొత్త సర్వీసును సోమవారం ప్రారంభించారు. త్వరలో ఢిల్లీ మీదుగా చంఢీగర్ నుంచి బెంగుళూరు, పుణే, ముంబై, భువనేశ్వర్, అహ్మదాబాద్ సర్వీసులను కూడా నడుపుతామని విస్తారా చీఫ్ స్ట్రాటజీ, కమర్షియల్ అధికారి సంజీవ్ కపూర్ తెలిపారు. చంఢీగర్, ఢిల్లీ మధ్య ధర రూ. 1990 గా ఉంది. ఈ రూటులో బిజినెస్, ఎకానమీనే కాకుండా ప్రీమియం ఎకానమీ క్లాస్‌ను ప్రవేశపెట్టాం. ఉత్తర భారతంలో చంఢీగర్ కీలక ప్రాంతం. ఇక్కడ పర్యాటకానికి, వ్యాపారానికి పుష్కల అవకాశాలు ఉన్నాయి. కార్పొరేట్, విశ్రాంత ప్రయాణికులపైనే ప్రధానంగా దృష్టి సారించాం. కొత్త రూటు అంతర్జాతీయ సర్వీసులకు అనుసంధానం చేసేందుకు వీలుగా ఉంటుందని సంజయ్ కపూర్ అన్నారు. నూతనంగా ప్రారంభమైన సర్వీసుతో కలిపి ఉత్తర భారతంలో ఆరు, దేశవ్యాప్తంగా 12 మార్గాల్లో విస్తారా సేవలు అందిస్తోంది. ప్రస్తుతానికి తొమ్మిది విమానాలున్నాయి. అక్టోబర్ కల్లా మరో నాలుగు కొనుగోలు చేస్తాం. వారానికి 16 మార్గాల్లో 417 సర్వీసులు నడుపుతున్నాం. త్వరలో వీటిని 580 కి పెంచుతామని కపూర్ పేర్కొన్నారు. -
రన్‌వేపై కూలిన విమానం..
రన్ వేపై ల్యాండ్ అవుతోన్న సమయంలో జెట్ విమానం ఒక్కసారిగా కుప్పకూలిన సంఘటన కలకలం రేపింది. అదృష్టవశాత్తు విమానంలో ప్రయాణికులుగానీ, సిబ్బందిగానీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ సంఘటన సింగపూర్ లోని చంగి ఎయిర్ పోర్టులో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఎయిర్ బస్ ఏ330-300 జెట్ విమానం.. ఉదయం 7:35 గంటలకు హాంకాంగ్ వెళ్లాల్సిఉంది. షాంఘై పుడాంగ్ విమానాశ్రయం నుంచి తెల్లవారుజామున సింగపూర్ కు చేరుకున్న ఈ విమానానికి తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ల్యాండింగ్ గేర్ లో సాంకేతిక సమస్య తలెత్తిందని, ఆ సమయంలో లోపల ఒక ఇంజనీర్ మాత్రమే ఉన్నాడని, అతనికి కూడా ఎలాంటిగాయాలు కాలేదని, విమానం ముందుభాగం దెబ్బదినట్లు సింగపూర్ ఎయిర్ లైన్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. -
గాలిలో విమానం... ఊపిరి బిగపట్టిన ప్రయాణికులు
సింగపూర్: గగనతలంలో ప్రయాణిస్తున్న విమానంలోని రెండు ఇంజిన్లలో విద్యుత్ సరఫరా ఆకస్మాత్తుగా ఆగిపోతే.. పరిస్థితి ఎలా ఉంటుంది. పైలట్లు కంగారు పడతారు. ప్రయాణికులు ముచ్చెమట్లు పడతాయి. అసలే గాల్లో ఉన్న ప్రాణాలు అటునుంచి అటే ఎగిరిపోతాయి. సరిగ్గా అలాంటి పరిస్థితే గత శనివారం సింగపూర్ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానంలో ప్రయాణిస్తున్న 194 మందికి ఎదురైంది. ఇక వివరాల్లోకి వెళ్లితే 182 మంది ప్రయాణికులు ... 12 మంది సిబ్బంది మొత్తం 194 మందితో ఎస్క్యూ 836 సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానం సింగపూర్ నుంచి చైనాలోని షాంఘై బయలుదేరింది. విమానం బయలుదేరిన దాదాపు 3.5 గంటల అనంతరం 39 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానంలోని రెండు ఇంజన్లల్లో తత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆ విషయం తెలిసిన ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇంతలో పైలట్లు వెంటనే అప్రమత్తమై... విద్యుత్ సరఫరాను పునరుద్దరించేందుకు చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో వారు సఫలీకృతులయ్యారు. దీంతో ప్రయాణికులతోపాటు విమాన సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. రాత్రి 10.56 గంటలకు షాంఘై ఎయిర్‌పోర్ట్‌లో దిగింది. ఆ తర్వాత విమాన ఇంజన్లను ఎయిర్ పోర్ట్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఎక్కడ ఎలాంటి లోపం లేదని ఉన్నతాధికారులు నిర్థారించారు. ఈ ఘటనపై సింగపూర్ ఎయిర్ లైన్స్ సమీక్ష సమావేశం నిర్వహించింది. -
విమాన టాయిలెట్లో కిలో బంగారం
చెన్నై : సింగపూర్ నుంచి చెన్నైకి చేరుకున్న విమాన టాయిలెట్లో కిలో బంగారాన్ని చెన్నై విమానాశ్రయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్ విమానం ఆదివారం రాత్రి 10.45 గంటలకు చెన్నైకి చేరుకుంది. విమానాన్ని శుభ్రం చేసేందుకు లోనికి వెళ్లిన పారిశుధ్య సిబ్బంది టాయిలెట్లోకి వెళ్లి చూడ గా ఎరుపురంగు బ్యాగు దొరికింది. అందులో రూ.30 లక్షల విలువ చేసే కిలో బరువున్న బం గారు కడ్డీలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలకు భయపడిన ప్రయాణికుడు ఎవరో టాయిలెట్లో వదిలేసినట్లు భావిస్తున్నారు. -
ఏపీ రాజధాని.. ‘అమరావతి’
-
ఏపీ రాజధాని.. ‘అమరావతి’
త్వరలో అధికారికంగా వెల్లడి సిద్ధమైన కేపిటల్ మాస్టర్‌ప్లాన్ హైదరాబాద్: ఏపీ నూతన రాజధాని ప్రాంతానికి ‘అమరావతి’ అని పేరు పెట్టాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో ఈ మేరకు అధికారిక ప్రకటన చేయనుంది. ఈ నెల 21న గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంత వరం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మన్మథనామ సంవత్సర ఉగాది వేడుకల్లోనే రాజధాని ప్రాంతానికి అమరావతిగా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించాలని సీఎం చంద్రబాబు భావించారు. అందుకు అనుగుణంగా అమరావతి ప్రాశస్త్యాన్ని తెలియజేసే సమాచారాన్ని ఆయన తన వెంట తీసుకెళ్లారు. అయితే స్థానికంగా ఉగాది వేడుకల కార్యక్రమం సుదీర్ఘంగా సాగడంతో చంద్రబాబు ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. ఈ క్రమంలో త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 29న సింగపూర్‌కు బాబు: ఏపీ రాజధాని నిర్మాణానికి సింగపూర్ సంస్థలు రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు బృందం ఈ నెల 29న సింగపూర్ వెళుతోంది. ఈ నెల 31 రాత్రికి తిరిగి హైదరాబాద్ చేరుకుంటుంది. ఆ తర్వాత మంచి రోజు చూసుకుని నూతన రాజధాని ప్రాంతం పేరును సీఎం వెల్లడిస్తారు. సింగపూర్ వెళ్లే బృందంలో చంద్రబాబుతో పాటు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి.నారాయణ తదితరులున్నారు. -
‘విస్తార’ ఎగిరింది..
నెరవేరిన టాటాల ఆరు దశాబ్దాల కల ♦ ఏవియేషన్‌లోకి రీఎంట్రీ ♦ ఢిల్లీ నుంచి ముంబైకి తొలి ఫ్లయిట్ ♦ జేఆర్డీకి అంకితం ఇచ్చిన రతన్ టాటా న్యూఢిల్లీ/ముంబై: పారిశ్రామిక దిగ్గజ టాటా గ్రూప్ ఆరు దశాబ్దాల కల సాకారమైంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలసి గ్రూప్ ఏర్పాటు చేసిన విస్తార సంస్థ సర్వీసులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తొలి ఫ్లయిట్ ఢిల్లీ నుంచి ముంబైకి ఎగిరింది. దీంతో టాటాలు మళ్లీ ఏవియేషన్ రంగంలోకి రీఎంట్రీ ఇచ్చినట్లయింది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 12.51కి ఎగిరిన విమానం ముంబైలో 2.46కి చేరుకుంది. ఢిల్లీలో టేకాఫ్‌కి ముందు టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా శుభాకాంక్షలు తెలియజేయగా.. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ స్వాగతం పలికారు. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్వహిస్తున్న జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జీఎం రావు, పలువురు ప్రముఖులు, సలాం బాలక్ ట్రస్ట్‌కి చెందిన బాలలు ఇందులో ప్రయాణించారు. ఆరు దశాబ్దాల క్రితం టాటా ఎయిర్‌లైన్స్.. ఎయిరిండియాగా రూపాంతరం చెందిన తర్వాత 1950వ దశకంలో ప్రభుత్వం దానిని జాతీయం చేసిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి, టాటాలు పలు మార్లు విమానయాన రంగంలోకి పునఃప్రవేశానికి ప్రయత్నించినా కుదరలేదు. ఇటీవలే మలేషియాకి చెందిన విమానయాన సంస్థ ఎయిర్‌ఏషియాతో కలసి కొత్తగా ఎయిర్ఏషియా ఇండియాను టాటా గ్రూప్ ఏర్పాటు చేసింది. ఇందులో టాటా గ్రూప్‌కి 30% మైనారిటీ వాటాలు ఉన్నప్పటికీ.. రోజువారీ నిర్వహణ కార్యకలాపాల్లో జోక్యం ఉండదు. ఈ నేపథ్యంలోనే సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలసి విస్తారను ఏర్పాటు చేసింది. ఇందులో టాటాలకు 51% మెజారిటీ వాటా ఉంది. ప్రభుత్వ రంగ ఎయిరిండియా, ప్రైవేట్ సంస్థ జెట్ ఎయిర్వేస్ తర్వాత పూర్తి స్థాయి సర్వీసులు అందించే మూడో సంస్థ అవుతుంది విస్తార. జేఆర్డీకి అంకితం.. భారత్‌లో ప్రపంచ స్థాయిలో పూర్తి సర్వీసులతో విమానయాన సంస్థ ఏర్పాటు చేయాలన్నది టాటా గ్రూప్ చిరకాల స్వప్నం అని రతన్ టాటా చెప్పారు. ‘ఆ కల నేడు సాకారమైంది. దీన్ని గ్రూప్ మాజీ చైర్మన్, దివంగత జేఆర్డీ టాటాకు అంకితమిస్తున్నాను’ అని ఆయన తెలిపారు. భారీ అంచనాలతో ప్రారంభించి, ఆ తర్వాత నిరాశపర్చకుండా ఎయిర్‌లైన్స్‌ను సవ్యంగా నిర్వహించాలన్నదే తమ లక్ష్యమని విస్తార చైర్మన్ ప్రసాద్ మీనన్ తెలిపారు. ‘పోటీ గురించి భయపడుతూ కూర్చుంటే ఏ వ్యాపారమూ ప్రారంభించలేము. అందరికీ అవకాశాలు ఉంటాయి. పోటీ అనేది అంతిమంగా కస్టమర్లకు ప్రయోజనం చేకూరుస్తుంది’ అని మీనన్ చెప్పారు. చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకునేందుకు తాము అనేక సంవత్సరాలుగా చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు సఫలమయ్యాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, అత్యంత వేగంగా ఎదుగుతున్న భారత ఏవియేషన్ మార్కెట్ వృద్ధిలో తమ వంతు పాత్ర పోషించేందుకుఎదురుచూస్తున్నామని, అది ఇప్పటికి సాకారం అయ్యిందని సింగపూర్ ఎయిర్‌లైన్స్(సియా) సీఈవో గో చూన్ ఫోంగ్ చెప్పారు. 2020 నాటి కి భారత్ మూడో అతి పెద్ద ఏవియషన్ మార్కెట్‌గా ఎదుగుతుందని కార్యక్రమంలో పాల్గొన్న పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మ చెప్పారు. ఇందులో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 49% మేర అనుమతించ డం వల్ల మరిన్ని సంస్థలు రాగలవని ఆయన తెలిపారు. విస్తార వివరమిదీ... టాటా గ్రూప్, ఎస్ఐఏ ఎయిర్‌లైన్స్ కలసి భారత్‌లో విమానయాన సర్వీసులు ప్రారంభించేం దుకు గతంలో పలుమార్లు ప్రయత్నిం చినప్పటికీ కుదరలేదు. ఎట్టకేలకు గతేడాది ఇరు కంపెనీలు విస్తార బ్రాండ్‌నేమ్‌తో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయగలిగాయి. ఫ్లయింగ్ పర్మిట్ల కోసం ఏప్రిల్‌లోనే దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. సంవత్సరం ఆఖర్లో గానీ అనుమతులు లభించలేదు. ఎట్టకేలకు జనవరి 9 నుంచి ఫ్లయిట్ సర్వీసులు ప్రారంభించబోతున్నట్లు డిసెంబర్ 18న సంస్థ ప్రకటించింది. విస్తార ప్రస్తుతం రెండు ఎ320 విమానాలను లీజుకి తీసుకుంది. ఢిల్లీ కేంద్రంగా ప్రారంభంలో ముంబై, అహ్మదాబాద్‌కు సర్వీసులు నడపనుంది. తొలి ఏడాదిలో హైదరాబాద్, గోవా, ముంబై తదితర ప్రాంతాలకు సేవలు విస్తరిస్తుంది. -
టాటా ఎస్ఐఏ ఎయిర్‌లైన్స్‌కు 20 ఎయిర్‌బస్‌లు
-
టాటా ఎస్ఐఏ ఎయిర్‌లైన్స్‌కు 20 ఎయిర్‌బస్‌లు
దోహా: టాటా-ఎస్ఐఏ ఎయిర్‌లైన్స్ సంస్థ సింగపూర్‌కు చెందిన బీఓసీ ఏవియేషన్ ప్రైవేట్ కంపెనీ నుంచి 20 ఎయిర్‌బస్ విమానాలను లీజుకు తీసుకోనున్నది. ఈ సెప్టెంబర్-అక్టోబర్ నుంచి ఈ విమానాలను టాటా-ఎస్ఐఏకు అందజేయడం ప్రారంభిస్తామని బీఓసీకు చెందిన ఇన్వెస్టర్ రిలేషన్స్ హెడ్ క్లెయిరీ లియో వెల్లడించారు. ఇక్కడ జరుగుతున్న ఐఏటీఏ వార్షిక సాధారణ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన ఆమె ఈ వివరాలు తెలిపారు. కాగా ఈ సంస్థ ఇప్పటికే జెట్ ఎయిర్వేస్, స్పైస్‌జెట్- ఈ రెండు భారత విమానయాన సంస్థలకు కొన్ని విమానాలను లీజుకు ఇచ్చింది. టాటా సన్స్ సంస్థ సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి 51:49 భాగస్వామ్యంతో టాటా-ఎస్ఐఏ ఎయిర్‌లైన్స్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సంస్థ ఏ 320-200, ఏ 320-200(నియో) విమానాల ద్వారా తన సర్వీసులనందజేయనున్నది. ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించనున్నది. ఢిల్లీ కేంద్రంగా ముంబై, గోవా, పాట్నా, చంఢీగర్, శ్రీనగర్, హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాలకు విమాన సర్వీసులను నిర్వహించాలని ఈ సంస్థ యోచిస్తోంది. ఆ తర్వాత పుణే, లక్నో, వారణాసి, జైపూర్, కోల్‌కత, అమృత్సర్, బగ్దోగ్రా, ఇండోర్, కొచ్చిన్‌లకు విమాన సర్వీసులను విస్తరించనున్నది. ఈ సంస్థ విమానయాన సర్వీసులకు అనుమతిని ఇంకా పొందలేదు. కాగా టాటా గ్రూప్, ఢిల్లీకి చెందిన టెలిస్ట్రాలు భారత వెంచర్ భాగస్వాములుగా ఉన్న ఎయిర్ ఏషియా విమాన సర్వీసులు ఈ నెలలోనే ప్రారంభం కానున్నాయి. -
జూలై నుంచి భారత్‌కు ఎమిరేట్స్ ఏ-380 విమాన సేవలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమాన సంస్థలు ఒక్కొక్కటిగా భారత్‌కు సూపర్ జంబో ఏ-380 విమాన సర్వీసులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. తాజాగా ఎమిరేట్స్ సంస్థ .. జూలైలో దుబాయ్-ముంబై రూట్లో ఏ-380 విమానాలను నడపనున్నట్లు ప్రకటించింది. జూన్ 1 నుంచి హైదరాబాద్, ఢిల్లీ, ముంబై నగరాలకు భారీ బోయింగ్-777 విమానాలను నడపాలని యోచిస్తున్నట్లు ఎమిరేట్స్ అధికారి తెలిపారు. ఈ నెల 30 నుంచి ఢిల్లీ, ముంబై నగరాల నుంచి ఏ-380 విమానాలను నడపనున్నట్లు సింగపూర్ ఎయిర్‌లైన్స్ ప్రకటించిన నేపథ్యంలో ఎమిరేట్స్ తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. డబుల్ డెక్కర్ తరహాలో ఉండే సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఏ-380 విమానంలో ఒకే సారి వివిధ తరగతుల్లో 471 మంది ప్రయాణించవచ్చు. వీటి వల్ల దేశీయ విమాన సంస్థల వ్యాపారం దెబ్బతింటుందనే ఉద్దేశంతో ఏ-380 విమానాలను అయిదేళ్ల క్రితం భారత్ నిషేధించింది. అయితే, అంతర్జాతీయ విమానయాన సంస్థల ఒత్తిడితో జనవరిలో నిషేధాన్ని ఎత్తివేసింది. -
30 నుంచి సూపర్‌జంబో విమానాలు
న్యూఢిల్లీ: ఒకేసారి 471 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ఎయిర్‌బస్ ఏ-380 విమానాలు ఈ నెల 30వ తేదీ నుంచి భారత్‌కు రాకపోకలు ప్రారంభించనున్నాయి. సూపర్జంబోలుగా పిలిచే వీటిని భారత్‌లో తొలిసారిగా ఢిల్లీ, ముంబై నగరాలకు సింగపూర్ ఎయిర్‌లైన్స్ నడపనుంది. ఈ రెండు నగరాలతో పాటు హైదరాబాద్, బెంగళూరుల నుంచి ఈ విమానాలు నడపడానికి ప్రభుత్వం గత జనవరిలో అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై నగరాలకు రోజూ రాకపోకలు సాగిస్తున్న బోయింగ్ 777 విమానాల స్థానంలో ఏ-380లను ప్రవేశపెడుతున్నామని సింగపూర్ ఎయిర్‌లైన్స్ జనరల్ మేనేజర్ (ఇండియా) డేవిడ్ లౌ మంగళవారం న్యూఢిల్లీలో మీడియాకు తెలిపారు. ఏ-380 విమానంలో ఫస్ట్‌క్లాస్ సూట్స్, బిజినెస్ క్లాస్, ఎకానమీ క్లాస్‌లలో మొత్తం 471 సీట్లుంటాయని వివరించారు. భారత్‌కు ఏ-380 విమాన సర్వీసులు నడపాలని తాము ఎంతో ఆసక్తితో ఎదురుచూశామనీ, ఇప్పుడు తమకు అనుమతి లభించిందనీ చెప్పారు. ఢిల్లీ, ముంబైల నుంచి సింగపూర్ ఎయిర్‌లైన్స్‌లో వారానికి ఆరువేల సీట్లు అందుబాటులో ఉంటాయని అన్నారు. సింగపూర్ ఎయిర్‌లైన్స్ 10 శాతం డిస్కౌంట్ ముంబై: విమాన ప్రయాణికులపై ఆఫర్ల వర్షం కురుస్తోంది. వచ్చే నెల నుంచి ఏ380 విమానాన్ని నడపనున్న సింగపూర్ ఎయిర్‌లైన్స్ కంపెనీ ప్రీమియం క్లాస్ టికెట్లపై 10 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. దేశీయ విమాన ప్రయాణికులకు ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. తరుచుగా విమాన ప్రయాణాలు చేసే- క్రిస్ప్లైయర్కు 10 శాతం బోనస్ మైల్స్‌ను కూడా ఆఫర్ చేస్తోంది. ఇక తరుచుగా ప్రీమియం క్లాస్‌లో ప్రయాణించే వారికి ఏ380 విమానంలో సూట్స్ టికెట్ల కొనుగోళ్లపై 10 శాతం అదనపు డిస్కౌంట్‌ను ఇస్తామని, ఈ ఆఫర్ ఈ నెల 1 నుంచి 15 లోపు బుక్ చేసుకునే టికెట్లకే వర్తిస్తుందని వివరించింది. జూన్ 1 నుంచి జూలై 15 ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. ఈ కంపెనీ ఈ నెల 30 నుంచి ముంబై-న్యూఢిల్లీ రూట్లలో ఏ380ను నడపనున్నది. -
మలేషియా విమానం పై వింత థియరీ!
అంత పెద్ద విమానం ఆకాశంలో ఆవిరైపోతుందా? అజా అయిపూ లేకుండా పోతుందా? గమ్యం చేర్చాల్సిన మలేషియా ఫ్లైట్ 370, దాని లోని 239 మంది వ్యక్తులు చిరునామా లేకుండా ఎక్కడికి వెళ్లిపోయారు? ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న ప్రశ్నలు ఇవి. విమానం దారిమళ్లింపులు, విమానంలో విస్ఫోటనాలు మాత్రమే ఇప్పటి వరకూ ప్రపంచానికి తెలుసు. ఆకాశానికి, అగాథానికి కూడా తెలియకుండా కనికట్టు చేయడం మాత్రం ఇప్పటి వరకూ ఎవరికీ తెలియదు. విమాన ప్రయాణ భద్రతకు, యాత్రీకుల సురక్షకు సరికొత్త సవాలు విసురుతోంది మటుమాయమైన మలేషియా విమానం! ఇప్పుడు ఈ విషయంలో ఎన్నెన్నో అంచనాలు, ఇంకెన్నో థియరీలు, మరెన్నో ఊహాగానాలకు ఊపిరిపోస్తోంది. ఈ క్రమంలోనే కీత్ లెడ్జర్వుడ్ అనే ఆయన ఒక కొత్త థియరీని ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంటర్నెట్ అంతా ఆ థియరీ హల్చల్ చేస్తోంది. లెడ్జర్వుడ్ సంచలన థియరీ లెడ్జర్వుడ్ టంబ్లర్ లో తన వాదనను పోస్ట్ చేశారు. ఆయన హాబీ విమానాలను నడపడం. ఏవియేషన్ రంగాన్ని మధించడం. ఆయన స్కై వెక్టర్ డాట్ కామ్ అనే ఆకాశయాన అధ్యయన వెబ్ సైట్ లో విమానం వెళ్లిన మార్గాన్ని, అది సందేశాలు పంపడం ఆగిపోయిన చోట ఆ సమయంలో నడుస్తున్న ఇతర విమానాల వివరాలను సేకరించారు. స్కై వెక్టర్ డాట్ కామ్ లో ఆ సమయంలో ఆకాశయానంలో ఉన్న విమానాలు, వాటి మార్గాల చిత్రం ఇలా ఉంది. ఎం హెచ్ 370 వెళ్తున్న మార్గంలో దాని ముందు సింగపూర్ ఎయిర్ లైన్స్ కి చెందిన ఎస్ ఐ ఏ 68 విమానం వెళ్తోందని గుర్తించారు. ఒక్క పావు గంట పాటు ఎస్ ఐఏ 68 వెనక వెళ్లాక సిగ్నల్స్ ఆపేసిందని ఆయన అంటున్నారు. దీనితో ఎం హెచ్ 320 ట్రాన్స్పాండర్లు పనిచేయకుండానే ముందుకు వెళ్తోంది. అంటే ఎస్ ఐ ఏ 68 నీడలో ఎంహెచ్ 320 వెళ్లింది. దీని వల్ల రేడార్ పై ఈ రెండూ ఒకటిగానే కనిపించాయని లెడ్జర్వుడ్ అంటున్నారు. ఈ రెండూ బోయింగ్ 777 విమానాలే. లెడ్జర్ వుడ్ ప్రకారం ఈ పటంలో చూపించినట్టు విమానాలు ఒకదానికి వెనుక వెళ్లాయి. ఈ మోసం తోటే మలేశియన్ విమాన పైలట్ భారత, పాకిస్తాన్, అఫ్గనిస్తాన్‌ల మీదుగా, కిర్గిజిస్తాన్ వరకూ వెళ్లగలిగాడని అంటున్నారు. ముందున్న విమానానికి కూడా వెనక వస్తున్న విమానం ట్రాన్స్ పాండర్ ఆపివేయడంతో దాని కదలికలు తెలియలేదు. ఇలా విమానంలోని ట్రాన్స్ పాండర్ ను ఆపివేయడానికి వీలుంటుంది. లెడ్జర్ వుడ్ అంచనా ప్రకారం విమానాలు రెండూ ఈ పటంలో చూపిన మార్గంలో వెళ్లి ఉండవచ్చు. చాలా ప్రమాదకమైన ఆలోచన ఇదే నిజమైతే ఇది చాలా ప్రమాదకరమైన అంశం. ఒక విమానం వెనుక రాడార్ కు చిక్కకుండా ఇంకో విమానం వచ్చి ఉన్నట్టుండి దాడి చేయవచ్చు. అపార ప్రాణనష్టం జరగవచ్చు. ఇదే టెక్నిక్ ను ఉగ్రవాదులు ఉపయోగించుకోవచ్చు. అందుకే లెడ్జర్ వుడ్ థియరీని ఇంత నిశితంగా పరిశీలిస్తున్నారు. అయితే ఏవియేషన్ రంగ నిపుణులు కొందరు మాత్రం ఈ థియరీపై పలు సందేహచిహ్నాలు పెడుతున్నారు. ఇలా అవడానికి వీల్లేదని కూడా అంటున్నారు. కానీ లెడ్జర్ వుడ్ థియరీని మాత్రం ఉగ్రవాద వ్యతిరేకపోరులో ఉన్న దేశాలు మాత్రం సీరియస్ గా తీసుకుంటున్నాయి. అయితే ఒక ప్రశ్నకి మాత్రం ఇప్పటికీ జవాబు దొరకడం లేదు. ఇంతకీ విమానాన్ని పైలట్ స్వయంగా హైజాక్ చేసినా ఈ పాటికి తన డిమాండ్లేమిటో చెప్పి ఉండాలి కదా! ఏ ఫలితమూ, లక్ష్యమూ లేకుండా ఇన్ని రోజులు ప్రయాణికులకు ఉచితభోజన సదుపాయం కల్పించేందుకు ఆ పైలట్ ఏమీ బిల్ గేట్స్ కాదు కదా! -
విదేశీ ఎయిర్‌లైన్స్ ఆఫర్ల వెల్లువ
న్యూఢిల్లీ: రాబోయే సీజన్‌ని పురస్కరించుకుని దక్షిణాసియా విమానయాన సంస్థలు భారీ ఆఫర్లతో భారతీయ విమాన ప్రయాణికులను ఊదరగొడుతున్నాయి. తాజాగా ఎయిర్ ఏషియా, సింగపూర్ ఎయిర్‌లైన్స్.. ప్రమోషనల్ ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించాయి. మలేసియా కేంద్రంగా పనిచేసే ఎయిర్ఏషియా భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించి అయిదేళ్లయిన సందర్భంగా కొన్ని ఉచిత టికెట్లను ప్రకటించింది. వచ్చే ఏడాది మే 5 నుంచి 2015 జనవరి 31 దాకా ప్రయాణించేందుకు ఈ టికెట్లు ఉపయోగపడతాయి. ఇందుకు సంబంధించి సోమవారం మొదలైన టికెట్ల బుకింగ్ డిసెంబర్ 1 దాకా కొనసాగుతుంది. దీని కింద ఒక వైపు ప్రయాణానికి బేస్ రేటు లేకుండా టికెట్లు పొందవచ్చు. పన్నులు, ఇతరత్రా ఫీజులు మాత్రం కట్టాల్సి ఉంటుంది. ఇవి రూ.500 పైగా ఉంటాయి. అలాగే, రూ. 500 బేస్ రేటుతో కూడా కంపెనీ సీట్లను ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ల కింద మొత్తం ముఫ్ఫై లక్షల టికెట్లను సంస్థ విక్రయించనుంది. దీని ప్రకారం కొచ్చి నుంచి కౌలాలంపూర్ టికెట్ ధర రూ. 2,259గాను, చెన్నై నుంచి బ్యాంకాక్/ కౌలాలంపూర్ టికెట్ రేటు రూ. 2,704గాను, బెంగళూరు నుంచి కౌలాలంపూర్‌కి రూ. 3,269గాను, కోల్‌కతా నుంచి కౌలాలంపూర్‌కి రూ. 3,228గాను టికెట్ రేట్లు (పన్నులు, ఫీజులు అన్నీ కలిపి) ఉంటాయి. మరోవైపు, సింగపూర్ ఎయిర్‌లైన్స్, దాని అనుబంధ సంస్థ సిల్క్‌ఎయిర్ కూడా ఆఫర్లు ప్రకటించాయి. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌లో ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించే వారికి 12.5% డిస్కౌంట్ లభించనుంది. టికెట్ల బుకింగ్ డిసెంబర్ 21 దాకా ఉంటుంది. డిసెంబర్ 1-31లోగా చేసే ప్రయాణాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇక ఆస్ట్రేలియాకి వెడుతూ మార్గమధ్యంలో సింగపూర్‌లో ఆగాల్సి వచ్చే ప్యాసింజర్స్‌కి కాంప్లిమెంటరీ వోచర్లు కూడా ఇవ్వనున్నట్లు సింగపూర్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. వీటిని సింగపూర్‌లోని చంగీ ఎయిర్‌పోర్టులో ఉండే షాప్‌లు, రెస్టారెంట్లలో ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. -
టాటా-సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో (ఎస్ఐఏ) కలిసి టాటా సన్స్ తలపెట్టిన జాయింట్ వెంచర్‌కి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ ప్రతిపాదనను విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్ఐపీబీ) ఆమోదముద్ర వేసినట్లు ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి అరవింద్ మాయారాం గురువారం తెలిపారు. ఈ జేవీకి ఎటువంటి షరతులు విధించలేదని పేర్కొన్నారు. ఎఫ్ఐపీబీ ఆమోదం లభించడంతో.. దేశీయంగా పూర్తి స్థాయిలో విమాన సర్వీసులు ప్రారంభిం చేందుకు టాటా-ఎస్‌ఐఏకి మార్గం సుగమమైంది. ఈ జేవీలో టాటా సన్స్‌కి 51%, ఎస్‌ఐఏకి 49% వాటాలు ఉంటాయి. ప్రారంభ దశలో ఇందులో ఇరు కంపెనీలు కలిసి 100 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నాయి. టాటా సన్స్ మరోవైపు మలేసియాకి చెందిన ఎయిర్ఏషియా తో కలిసి చౌక విమాన సర్వీసులను కూడా ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ వెంచర్‌కి ఏప్రిల్‌లో ఎఫ్ఐపీబీ అనుమతులు లభించాయి. -
జేవీతో మరిన్ని ఉద్యోగాలు: టాటా-సింగపూర్ ఎయిర్‌లైన్స్
న్యూఢిల్లీ: విమాన సర్వీసుల కోసం కొత్తగా ఏర్పాటు చేసే జాయింట్ వెంచర్‌తో మరిన్ని ఉద్యోగాల కల్పన జరుగుతుందని టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ తెలిపాయి. టాటా ఎస్ఐఏ ఎయిర్‌లైన్స్‌తో దేశీయ విమానయాన రంగానికీ ఊతం లభిస్తుందని పేర్కొన్నాయి. ఎయిర్‌లైన్స్ ఏర్పాటుకు అనుమతులు కోరుతూ విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ఐపీబీ)కి సమర్పించిన దరఖాస్తులో ఈ అంశాలు పేర్కొన్నాయి. పైలట్లు, టెక్నీషియన్లు, మేనేజర్లు, సుశిక్షి తులైన కార్మికులకు కొత్త సంస్థలో ఉద్యోగావకాశాలు ఉంటాయని తెలిపాయి. ప్రతిపాదిత జేవీలో టాటా సన్స్‌కి 51 శాతం, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కి 49 శాతం వాటాలు ఉంటాయి. -
భారత్ నియంత్రణలోనే టాటా ఎయిర్‌లైన్స్
న్యూఢిల్లీ: తాము ప్రారంభించనున్న విమానయాన సంస్థ ఎల్లవేళలా భారత చట్టాల నియంత్రణలోనే పనిచేస్తుందని ఒక సంయుక్త ప్రకటనలో సింగపూర్ ఎయిర్‌లైన్స్, టాటా గ్రూప్ పేర్కొన్నాయి. ఈ వెంచర్ నిర్వహణ దేశీయ సంస్థ చేతిలోనే ఉంటుందని తెలిపాయి. టాటా ఎస్ఐఏ ఎయిర్‌లైన్స్‌గా వ్యవహరిస్తున్న ఈ వెంచర్ ఇటు దేశీయంగా, అటు అంతర్జాతీయంగానూ విమానయాన సేవలను అందించేందుకు సిద్ధపడుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు అనుమతించమంటూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న సందర్భంగా దేశీయ నిర్వహణపై టాటా ఎస్ఐఏ తాజాగా వివరణ ఇచ్చింది. ఈ వెంచర్లో టాటా సన్స్‌కు 51%, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు 49% చొప్పున వాటా ఉంటుంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఇన్వెస్ట్‌చేయనున్న 4.9 కోట్ల డాలర్లకుగాను విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కింద ఎఫ్ఐపీబీ అనుమతిని పొందాల్సి ఉంది. దీంతోపాటు ఈ వెంచర్‌కు డీజీఎఫ్టీ, డీజీసీఏ, సీబీఈసీ వంటి ఇతర ప్రభుత్వ సంస్థల నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించాల్సి ఉంది. అంతేకాకుండా సంబంధిత మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల అనుమతులు సైతం తప్పనిసరి. -
ఎయిర్‌ఏషియాకు అంతా తెలుసు
ముంబై: రెండు విమానయాన సంస్థలతో జాయింట్ వెంచర్లు ఏర్పాటు చేసుకోవడంపై వస్తున్న ఆరోపణల మీద టాటా గ్రూప్ స్పందించింది. తాము సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో జేవీ ఏర్పాటు చేస్తున్న సంగతి గురించి ఎయిర్ఏషియాకి ముందు నుంచే తెలుసని టాటా గ్రూప్ ప్రతినిధి ముకుంద్ రాజన్ తెలిపారు. దీనిపై ఎయిర్ఏషియా ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదన్నారు. రెండు జేవీలను కొనసాగించేందుకే తాము కట్టుబడి ఉన్నామని, ఇందులో సమస్యలేమీ తలెత్తకపోవచ్చని రాజన్ అభిప్రాయపడ్డారు. చౌక విమాన సర్వీసులు అందించేందుకు ఎయిర్ఏషియా, టెలిస్ట్రా ట్రేడ్ప్లేస్తోనూ.. పూర్తి స్థాయి సేవలు అందించేందుకు సింగపూర్ ఎయిర్లైన్స్తోనూ టాటా గ్రూప్ చేతులు కలిపిన సంగతి తెలిసిందే. అయితే, సింగపూర్ ఎయిర్‌లైన్స్ గురించి టాటా గ్రూప్ తనకు చెప్పలేదంటూ టెలిస్ట్రా ట్రేడ్‌ప్లేస్ ప్రమోటర్ అరుణ్ భాటియా వ్యాఖ్యానించడం తాజా వివాదానికి దారి తీసింది.