సింగపూర్ ఎయిర్ లైన్స్ టు-టు-గో ఆఫర్ | Singapore Airlines to Allow Passengers to Bid for Seat Upgrades | Sakshi
Sakshi News home page

సింగపూర్ ఎయిర్ లైన్స్ టు-టు-గో ఆఫర్

Published Thu, Jul 7 2016 12:46 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

సింగపూర్ ఎయిర్ లైన్స్ టు-టు-గో ఆఫర్ - Sakshi

సింగపూర్ ఎయిర్ లైన్స్ టు-టు-గో ఆఫర్

హైదరాబాద్: సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంస్థ టు-టు-గో పేరుతో ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తోంది. సింగపూర్ టూరిజమ్ బోర్డ్ సహకారంతో ఈ ప్రత్యేక ఆఫర్‌లను అందిస్తున్నామని సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. 11 భారత నగరాలు- హైదరాబాద్, విశాఖపట్టణం, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కత, కోచి, త్రివేం డ్రమ్, కోయంబత్తూర్ నుంచి ఎకానమి క్లాస్ రిటర్న్ చార్జీలు రూ.22,000 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది.

ముంబై, ఢిల్లీల నుంచి ప్రీమియమ్ ఎకానమి క్లాస్‌కు సంబంధించి రిటర్న్ చార్జీలు రూ. 38,000(అన్నీ కలుపుకొని) నుంచి ప్రారంభమవుతాయని వివరించింది. ఈ ప్యాకేజీకి సంబంధించి టికెట్ల బుకింగ్ ఈ నెల 5న ప్రారంభమైందని, ఈ నెల 31 వరకూ ఉంటుందని, కనీసం ఇద్దరు ప్రయాణికులు ప్రయాణించాల్సి ఉంటుందని, సెప్టెంబర్ 30 వరకూ ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement