- సింగపూర్ సంస్థలకు సర్కారు వరాలు
- ఫ్రీ హోల్డ్ విధానంలో అభివృద్ధి చేసిన ప్లాట్ల అమ్మకం
సాక్షి, హైదరాబాద్ : అమరావతి అభివృద్ధి భాగస్వామి పేరుతో సింగపూర్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అలవిమాలిన వరాలను కురిపించింది. ఆ సంస్థల కోరిన మేరకు రాయితీలివ్వడమే కాకుండా ఆ సంస్థలకు ఇచ్చే 1,691 ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు కేపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ నిర్వహణ కంపెనీ (సీసీడీఎంసీ) 5,500 కోట్ల వ్యయంతో వసతులు కల్పించనుంది. స్టార్ట్ అప్ ఏరియా (1,691 ఎకరాల్లో)లో అభివృద్ధి చేసిన ప్లాట్లను ఫ్రీ హోల్డింగ్ విధానంలో విక్రయించనున్నారు. ఈ మేరకు సింగపూర్ సంస్థలు ఇచ్చిన స్విస్ చాలెంజ్ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ, వాటికి కౌంటర్ ప్రతిపాదనలు ఆహ్వానించేందుకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఆర్‌డీఏ ముఖ్యకార్యదర్శి అజేయ జైన్ జీవో 170 జారీ చేశారు. ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి.
సింగపూర్ సంస్థలకిచ్చిన రాయితీలివీ...
► స్టాంప్ డ్యూటీ రద్దుఊ కృష్ణా కరకట్ట ఎత్తు పెంపు, పటిష్టం, హై..,లో టెన్షన్, విద్యుత్ తీగల బదిలీకయ్యే ఖర్చును సీఆర్‌డీఏ బడ్జెట్‌లో పొందుపరచాలి.
► ఇసుకను ఉచితంగా ఇవ్వాలి. స్టార్ట్‌అప్ ఏరియాకు దగ్గరలో ఇసుక క్వారీని సీఆర్‌డీఏ కేటాయించాలి.
► అమరావతి అభివృద్ధి భాగస్వామిలో సీసీడీఎంసీ 42 శాతం ఈక్విటీతో ఒప్పందం చేసుకోవాలి. షేర్ హోల్డర్ అగ్రిమెంట్ ప్రకారం సీసీడీఎంసీ వాటా కింద 209 కోట్ల రూపాయలను పెట్టుబడి పెడుతుంది.
► 2014 డిసెంబర్ 8న సింగపూర్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పంద కాలపరిమితి ముగిసింది. ఏడాది పాటు మాత్రమే అమల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ అవగాహన ఒప్పంద కాలపరిమితి పొడిగింపు.
► రాయితీ అండ్ డెవలప్‌మెంట్ ఒప్పందం, రాష్ట్ర ప్రభుత్వం మద్ధతిచ్చే ఒప్పందం చేసుకోవడానికి ముందే టెండర్ డాక్యుమెంట్లు అధ్యయానికి కమిటీ ఏర్పాటుతో పాటు న్యాయశాఖ ఆమోదం పొందాలి. అనంతరమే ఒప్పందాలు చేసుకోవాలి.
► సింగపూర్ కంపెనీలు సమర్పించిన రాయితీ అండ్ డెవలప్‌మెంట్ ఒప్పందం, షేర్ హోల్డర్స్ ఒప్పందం మేరకు మౌలిక వసతుల కల్పనకు సీసీడీఎంసీ రూ.5,500 కోట్లు బడ్జెట్ కేటాయింపులు చేయాలి. నిర్ణీత సమయంలోగా వసతుల కల్పన పూర్తి చేయకుండా జాప్యం చేస్తే ఆర్థికపరమైన సమస్యలు తలెత్తుతాయి.ఊ స్విస్ చాలెంజ్ విధానంలో కౌంటర్ ప్రతిపాదనల ఆహ్వానం, సంస్థ ఎంపిక మొత్తం రెవెన్యూలో ఎంత వాటా ఇస్తారనే ప్రాతిపదికన ఉంటుంది. ఆ రెవెన్యూ వాటా ఎంత శాతం అనేది మంత్రులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ చేసిన ప్రతిపాదనల మేరకు ఉంటుంది.
► సింగపూర్ సంస్థలు ఎంపిక కాని పక్షంలో ఆ సంస్థలు చేసిన ఒరిజనల్ ప్రాజెక్టు ప్రతిపాదనలకైన వ్యయం రూ.7.5 కోట్లను తిరిగి చెల్లించాలి.
► సింగపూర్ సంస్థల ప్రతిపాదించిన రాయితీ మరియు అభివృద్ధి ఒప్పందం మేరకు స్టార్ట్ అప్ ఏరియా 1,691 ఎకరాల్లో అభివృద్ధి చేసిన ప్లాట్లను ఫ్రీ హోల్డింగ్ విధానంలో విక్రయిస్తారు.
► సింగపూర్ సంస్థల స్విస్ చాలెంజ్ ప్రతిపాదనలకు కౌంటర్ ప్రతిపాదనలను ఆహ్వానించే ప్రక్రియను సీఆర్‌డీఏ కమిషనర్ చేయాలి.
అడిగినన్ని రాయితీలు
Published Tue, Jul 5 2016 1:37 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM
Advertisement