సాక్షి, ముంబై: సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఉద్యోగులకు అద్భుతమైన వార్త. తన ఉద్యోగులకు భారీ బోనస్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది కంపెనీ. రికార్డు స్థాయిలో రూ.13,000 కోట్ల వార్షిక లాభాన్ని ఆర్జించిన తర్వాత, ఎయిర్‌లైన్ దాని సిబ్బందికి ఎనిమిది నెలల జీతంతో సమానమైన బోనస్‌ను అందించనుంది.
మెగా బోనస్
కోవిడ్ మహమ్మారి సమయంలో విశిష్ట సేవలందించిన, అర్హత కలిగిన ఉద్యోగులు 6.65 నెలల వేతనానికి సమానమైన లాభాల-భాగస్వామ్య ప్రోత్సాహకాన్ని, గరిష్టంగా 1.5 నెలల ఆదాయాన్ని ఎక్స్-గ్రేషియా బోనస్‌గా అందిస్తున్నామని ఎయిర్‌లైన్ ప్రతినిధి తెలిపారు. అయితే సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు అదనపు ఎక్స్‌గ్రేషియా ఇన్సెంటివ్ ఉండదని చెప్పారు.(గూగుల్ సీఈవో ప్రైమరీ ఫోన్ ఏదో తెలుసా, ఏఐపై కీలక వ్యాఖ్యలు)
స్టాఫ్ యూనియన్‌లతో ఒప్పందం ప్రకారం తమ దీర్ఘకాలిక వార్షిక లాభాల-భాగస్వామ్య బోనస్ ఫార్ములాపై ఆధారపడి ఉంటుంని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. సింగపూర్ ఎయిర్‌లైన్స్ మార్చి 31న ముగిసిన ఆర్థిక సంవత్సరానికి 1.62 బిలియన్ డాలర్లు (రూ.13వేల కోట్లు) నికర లాభాన్ని ప్రకటించింది. (Massive layoffs: 55వేలమందిని తొలగించనున్న అతిపెద్ద టెలికాం సంస్థ)
అన్ని క్యాబిన్ తరగతుల్లో ఫార్వర్డ్ సేల్స్ చైనా, జపాన్ , దక్షిణ కొరియాలకు రిజర్వేషన్‌లు బలంగా ఉన్నాయని కంపెనీ పేర్కొంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్ , బడ్జెట్ ధరల అనుబంధ సంస్థ స్కూట్‌లో ఒకే ఏడాదిలో ఆరు రెట్లు ఎక్కువ మంది ప్రయాణీకులు ప్రయాణించారు (26.5 మిలియన్లు). (ఈ పిక్స్ చూశారా? గుండెలు బాదుకుంటున్న కృతి సనన్ ఫ్యాన్స్)
మార్చిలో 79శాతంతో ప్రీ-కోవిడ్ స్థాయిలకు చేరుకుంది, సింగపూర్ ఎయిర్‌లైన్స్ షేర్లు గురువారం 1.2శాతం పెరిగాయి సింగపూర్ ఎయిర్ ఏప్రిల్‌లో 1.75 మిలియన్ల మంది ప్రయాణీకులు ప్రయాణించినట్లు సోమవారం నివేదించింది, గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 53శాతం పెరిగింది.
ఇలాంటిమరెన్నో అద్భుతమైన వార్తలు, విశేషాల కోసం చదవండి :సాక్షి, బిజినెస్
Comments
Please login to add a commentAdd a comment