mega
-
నిహారిక బర్త్‌డే సెలబ్రేషన్స్ .. దగ్గరుండి కేక్ కట్ చేయించిన అన్నావదిన (ఫోటోలు)
-
క్లాసికల్ డ్యాన్స్ మహోత్సవ్!
మైసూరు కళా దివస్‌లో వసుంధరోత్సవ– 2024 పేరుతో 10 రోజుల మెగా క్లాసికల్ డ్యాన్స్మహోత్సవం జరిగింది. మెగా క్లాసికల్ డ్యాన్స్ ఫెస్టివల్లో భాగంగా నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో 550 మందికి పైగా నృత్యకారులు పాల్గొన్నారు. నృత్యకళాకారిణి వసుంధర దొరస్వామి 75వ జన్మదిన వేడుకల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇంత మంది నృత్యకళాకారులు పాల్గొన్న ఈ వేడుక ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకుంది. ఈ నృత్యరూపకానికి ప్రఖ్యాత నృత్య కళాకారిణి వసుంధర దొరస్వామి నృత్య దర్శకత్వం వహించారు. నృత్యకారులలో ఆమె విద్యార్థులే కాకుండా ఇతర గురువుల వద్ద నృత్యం నేర్చుకున్న వారు కూడా తమ కళను ప్రదర్శించాను. మైసూరు కళా దివస్ పేరుతో శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి చెందిన దత్త విజయానంద తీర్థ స్వామి, సుత్తూరు మఠానికి చెందిన శివరాత్రి దేశికేంద్ర స్వామి, మైసూరు ఎంపీ యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్, సంగీత అకాడమీ పీఠాధిపతి సంధ్యా పురేచ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన శివరాత్రి దేశికేంద్ర స్వామి మాట్లాడుతూ ‘యోగా మాదిరిగానే భారతనాట్యం కూడా ఈ దేశం ప్రపంచానికి అందించింది. వసుంధర దొరస్వామి భరతనాట్యానికి చేసిన కృషికి, ప్రపంచ స్థాయిలో గొప్ప, ప్రాచీన నృత్య రూపాన్ని ప్రోత్సహించారు’ అని ప్రశంసించాడు. మైసూరు కళా దివస్ వసుంధర పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సెంటర్ నిర్వహించిన శాస్త్రీయ నృత్యం ఇది. వసుంధర దొరస్వామికి భరతనాట్యానికి 50 ఏళ్లుగా చేస్తున్న సేవను పురస్కరించుకొని ఈ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో మైసూరులోని కళాకారులు, నృత్య గురువులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులూ పాల్గొన్నారు. ఈ ఉత్సవం భరతనాట్యానికి అంకితం చేస్తుమన్నామని వివరించారు. క్లాసికల్ డ్యాన్స్ మహోత్సవ్! -
టీటీఏ అధ్యక్షులు వంశీరెడ్డి సారథ్యంలో కనీవినీ ఎరుగని రీతిలో టీటీఏ మెగా కన్వెన్షన్!
తెలంగాణ అమెరికా తెలుగు సంఘం టీటీఏ మెగా కన్వెన్షన్ అమెరికాలోని సియాటెల్ కన్వెన్షన్ సెంటర్లో అంగరంగా వైభవంగా జరిగింది. మే 24 నుంచి మూడు రోజులపాటు జరిగిన ఈ వేడుకల్లో.. ప్రతిరోజు ప్రత్యేకమైన కార్యక్రమాలు అలరించాయి. తెలుగు కన్వెన్షన్స్ చరిత్రలో మొట్ట మొదటి సారిగా వెస్ట్ కోస్ట్ సిటీలోని సియాటెల్ లో జరిగిన అతి పెద్ద టీటీఏ తెలుగు ఈవెంట్ విజయవంతంగా ముగిసింది. వాషింగ్టన్‌లోని సియాటెల్ కన్వెన్షన్ సెంటర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన టీటీఏ మెగా కన్వెన్షన్స్ సంబరాలు అంబరాన్నంటాయి. సియాటెల్ తెలుగు వారితో పోటెత్తింది. ఇంత భారీ ఎత్తున అమెరికాలో మహా సభలు నిర్వహించటం తెలుగు కన్వెన్షన్స్ చరిత్రలో మొట్ట మొదటి సారి కావటం విశేషం. ఈ భారీ మొదటి తెలుగు మహాసభలను వ్యయ ప్రయాసలకు వెరవకుండా ఎంతో గ్రాండ్‌గా నిర్వహించటం మరో విశేషం. .కార్యక్రమాల నుంచి కళా ప్రదర్శనల వరకు, అవార్డుల నుంచి హాస్పిటాలిటీ వరకు, స్వాగతాల నుంచి భోజనాల వరకు మూడు రోజుల పాటు వేటికవే వినూత్నమైన కార్యక్రమాలతో నభూతో నభవిష్యతీ అనేలా నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు వంశీరెడ్డి కంచరకుంట్ల సారథ్యంలో పలు కమిటీలు, వాలంటీర్లు అలుపెరుగకుండా కృషి చేసి టీటీఏ వేడుకలను గ్రాండ్ సక్సెస్ చేశారు. వచ్చిన అతిథులను ఆకట్టుకునేలా వినూత్నమైన కార్యక్రమాలను రూపొందించారు. ఈ వేడుకలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రాజకీయ, సినీ, వ్యాపార, అధికార ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి పెద్ద ఎత్తున సినీతారలు విచ్చేసి సందడి చేశారు. కన్వెన్షన్ రెండవ రోజు సాయంత్రం సుమారు 13,500 మందికి పైగా, ముగింపు వేడుకల్లో ఏకంగా 17,500 మందికి పైగా హాజరైనట్లు నిర్వహకులు పేర్కొన్నారు. కన్వెన్షన్ బాంక్వెట్ డిన్నర్ : టీటీఏ మహాసభల్లో భాగంగా బాంక్వెట్ డిన్నర్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఇండియా నుంచి విచ్చేసిన అతిథులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కన్వెన్షన్ సావనీర్ ఆవిష్కరించారు. వ్యాపార, ఆరోగ్య, క్రీడలు, సామాజికసేవ, టెక్నాలజీ వంటి వివిధ రంగాలలోని అత్యద్భుతమైన ప్రతిభ పాఠవాలు కనబరచిన వారికీ టీటీఏ అవార్డ్సుఅందజేశారు. ఈ సందర్భంగా కన్వెన్షన్ కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించారు. డోనార్స్ ని, ఇతర జాతీయ తెలుగు సంఘాల నేతలను శాలువా, పుష్పగుచ్ఛాలతో సన్మానించారు. ఈ మొత్తం బాంక్వెట్ డిన్నర్‌కి మూల స్తంభాలైన బాంక్వెట్ కమిటీని వేదిక మీదకు ఆహ్వానించి అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కల్చరల్ పోగ్రామ్స్ ఆకట్టుకున్నాయి. టాలీవుడ్ సెలెబ్రిటీస్ పాల్గొని యూత్ ని అలరించారు. వందేమాతరం శ్రీనివాస్ మ్యూజికల్ షో ఆకట్టుకుంది. వందేమాతరం శ్రీనివాస్ సారధ్యంలోని గాయనీగాయకులు జానపద పాటలు పాడి అందరినీ మెప్పించారు. భక్తి పాటలు, జానపదాలు, సినిమా పాటలతో అలరించారు. కార్యక్రమం ఆసాంతం ప్రముఖ యాంకర్ సుమ కనకాల తనదైన శైలి వ్యాఖ్యానంతో నవ్వులు పూయించారు. కన్వెన్షన్ రెండోవ రోజు : మెగా కన్వెన్షన్ రెండో రోజులో భాగంగా నిర్వహించిన కార్యక్రమాలు తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టాయి. భిన్నత్వంలో ఏకత్వాన్ని తెలియజేస్తూ నిర్వహించిన ఇండియా డే పెరేడ్ ఆకట్టుకుంది. బోనాలు, బతుకమ్మ, పోతురాజు తో మహిళలు, టీటీఏ నాయకులు ఊరేగింపుగా కన్వెన్షన్ ఇనాగరల్కి విచ్చేశారు. కన్వెన్షన్ రెండో రోజు కార్యక్రమాలు ఘనంగా ప్రారంబమయ్యాయి. అమెరికా, భారత్ జాతీయ గీతాల తోపాటు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి సమక్షంలో జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా టీటీఏ అధ్యక్షులు వంశీరెడ్డి కంచరకుంట్ల, వ్యవస్థాపకులు డా. పైళ్ల మల్లారెడ్డి, అడ్వైజరీ కౌన్సిల్ ఛైర్ డా. విజయపాల్ రెడ్డి, కోఛైర్ డా. మోహన్ రెడ్డి పటలోళ్ళ, సభ్యులు భరత్ రెడ్డి మాదాడి, తదితరులు ఆహ్వానితులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రెండో రోజు కన్వెన్షన్ లో బాగంగా బ్రేకౌట్ సెషన్స్ లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. టీటీఏ స్టార్ట్ప్ కబ్, మాట్రిమోనీ, సీఎంఈ, అష్టావధానం, టీటీఏ స్టార్ , బ్యూటీ పాజెంట్ , ఫైర్‌సైడ్ చాట్ , యూత్ సెషన్స్, పొలిటికల్ మీట్ & గ్రీట్స్ నిర్వహించారు. కన్వెన్షన్ లో భాగంగా టాలీవుడ్ హీరోయిన్స్ శ్రీలీల, మెహ్రీన్ లను వేదిపై ఆహ్వానించి, ప్రసంగాల అనంతరం సత్కరించారు. యాంకర్స్ సుమ, రవి యాంకరింగ్‌తో ఆకట్టుకున్నారు. ఈ సందర్బంగా పలువురికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందజేశారు. డా. హరనాథ్ పోలిచెర్ల చేసిన సేవలకుగాను టీటీఏ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందజేశారు. హైదరాబాద్ నుంచి వచ్చిన త్రీయరీ బ్యాండ్ లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ రెండోవ రోజు కన్వెన్షన్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వైఎస్సార్ జయంతి వేడుకలు :మెగా కన్వెన్షన్‌లో పొలిటికల్ మీట్ & గ్రీట్స్ ఏర్పాటు చేశారు. మహాసభలో భాగంగా వైఎస్సార్సీపీ మీట్ అండ్ గ్రీట్ తో పాటు డాక్టర్ వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్దసంఖ్యలో హాజరైన వైఎస్సార్సీపీ నేతలు, రాజన్న అభిమానులు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ అందరి గుండెల్లో చిరకాలం నిలిచిపోయారని కొనియాడారు ప్రవాసాంధ్రులు. ముఖ్యమంత్రిగా వైఎస్సార్ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, బడుగు, బలహీన వర్గాలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. జోహార్ వైఎస్సార్ అంటూ నినాదాలు చేశారు. వైఎస్సార్ కొడుకుగా ఏపీ సీఎం జగన్ తన పాలనతో తండ్రిని తలపిస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలపై చర్చించారు. కన్వెన్షన్ మూడోవ రోజు: కన్వెన్షన్ మూడో రోజు భధ్రాచలం నుంచి విచ్ఛేసిన పండితులు శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని కన్నుల పండువగా జరిపించారు. ప్రవాసులు కుటుంబ సమేతంగా తరలివచ్చి ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. మహాసభల్లో భాగంగా వివిధ ఎక్సిబిట్ రూమ్స్‌లో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలు వేటికవే సాటి అనేలా సాగాయి. టీటీఏ స్టార్ ఫైనల్స్, బ్యూటీ పాజంట్ ఫైనల్స్, బిజినెస్ సెమినర్స్, ఇన్ఫ్లుయెన్సర్ మీటింగ్, ఫిట్నెస్ వర్కషాప్ వంటి బ్రేకౌట్ సెషన్స్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఏర్పాటు చేసిన సెట్టింగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి . సాంస్కృతిక కార్యక్రమాలు వీనుల విందుగా జరిగాయి. డోనార్స్ ని, కార్పొరేట్ స్పాన్సర్ని ఘనంగా సత్కరించారు. బ్యూటీ పాజంట్, టీటీఏ స్టార్ విజేతలకు క్రౌన్, బహుమతులను అందజేశారు. డా. ప్రేమ్ సాగర్ రెడ్డికి జీవిత సాఫల్య పురస్కారం : మెగా కన్వెన్షన్‌లో జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. అమెరికాలోని ప్రముఖ డాక్టర్, ప్రైమ్ హెల్త్‌కేర్ అధినేత, తెలుగుసంఘాలకు, కమ్యూనిటికీ నేస్తంగా, దాతగా పేరు పొందిన డాక్టర్ ప్రేమ్‌సాగర్ రెడ్డికి టీటీఏ లైఫ్ టైం అచీవ్మెంట్ ర్డు దించి, ఘనంగా సత్కరించారు. నాటా వ్యవస్థాపకలు డా. ప్రేమ్ సాగర్ రెడ్డికి టీటీఏకార్యవర్గం, బోర్డు సభ్యులు మరియు నాటా లీడర్షిప్ సమక్షంలో ఈ అవార్డు అందించారు. ఈ సందర్భంగా డా. ప్రేమ్ రెడ్డి తన జీవిత సత్యాలను యువతను ఇన్స్పైర్ చేసేలా వివరించారు. అతిథులకు సన్మానం: కన్వెన్షన్ వేదికపై టాలీవుడ్ సెలబ్రేటీలను ఘనంగా సన్మానించి, సత్కరించారు. టీటీఏ అధ్యక్షులు వంశీరెడ్డి కంచరకుంట్ల, టీటీఏ కన్వెన్షన్ కన్వీనర్ చంద్రసేన శ్రీరామోజులను కుటుంబ సమేతంగా వేదిక మీదకు ఆహ్వానించి సన్మానించారు. ఈ సందర్భంగా వీరు ఈ కన్వెన్షన్ నిర్వహణ వివరాలు పంచుకొని అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వివిధ కన్వెన్షన్ కమిటీల సభ్యులను వేదిక మీదకు ఆహ్వానించి అభినందించారు. ప్రముఖ మ్యూజిక్ డైరక్టర్ తమన్ మ్యూజికల్ కాన్సర్ట్ యువతను అలరించింది. తమన్ టీమ్ సినిమా పాటలు పాడి ఆడియన్స్‌లో జోష్ నింపారు. థమన్ సంగీత విభావరి ప్రేక్షకులను మంత్రముగ్థులను చేసింది. టీటీఏ మహాసభలకు తమన్ మ్యూజిక్ కాన్సర్ట్ హైలైట్ గా నిలిచింది. టీటీఏ మెగా కన్వెన్షన్‌లో పాల్గొన్న అతిథులకు ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతిని, ఆనందాన్ని ఈ తెలుగు మహాసభలు అందించాయి. ఆహుతుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లు, వివిధ రకాల స్టాళ్లు, వేర్వేరు ఫుడ్ సెంటర్లు కనువిందు చేశాయి. ఒకే వేదికపై అభివృద్ధి, సంస్కృతి, కళలు, ప్రజా సంబంధాలు, సెమినార్లు, మాటా ముచ్చట్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో- మరెన్నో కార్యక్రమాలతో.. మూడు రోజుల పాటు సియాటెల్‌లో తెలుగు పండగ వాతావరణం నెలకొంది. తెలుగు మహా సభలు అంటే ఇలా ఉండాలి అనేలా ఈ వేడుకలు నిలిచాయి. భవిష్యత్ లో జరిగే మహాసభలకు సరి కొత్త మార్గాన్ని చూపించాయి.(చదవండి: -
పెదనందిపాడులో నాట్స్ మెగా కంటి ఉచిత వైద్య శిబిరం!
పేదలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు అన్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో నాట్స్ ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసిన సందర్భంగా నిర్వహించిన సభకు లక్ష్మణ్ రావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. పెదనందిపాడులో పలుమార్లు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించి వందలాది మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేయించి అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా చేయించడం నిజంగా చాలా గొప్ప విషయమన్నారు. జన్మభూమి రుణం తీర్చుకోవాలనే తపనతో పని చేస్తున్న నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు)నూతిని లక్ష్మణరావు అభినందించారు. అమెరికాలో ఉంటున్న బాపు నూతి తన స్వగ్రామమైన పెదనందిపాడులో చేస్తున్న సేవా కార్యక్రమాలు నేటి యువతలో సేవా భావాన్ని, దేశభక్తిని పెంపొందించడానికి తోడ్పడతాయని అన్నారు. నాట్స్ చేపడుతున్న కార్యక్రమాల్లో తాను కూడా భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని లక్ష్మణరావు అన్నారు. రెండు రాష్ట్రాల్లో కుట్టు మిషన్ శిక్షణ శిబిరాలు, ఉచిత కంటి వైద్య శిబిరాలు ,ప్రభుత్వ పాఠశాలలకు సైకిల్ స్టాండు నిర్మాణం,మెడికల్ క్యాంపులు నిర్వహించడం, గ్రూప్ 2 అభ్యర్థులకు ఉచితంగా మెటీరియల్ అందజేయడం వంటి కార్యక్రమాలపై లక్ష్మణరావు ప్రశంసల వర్షం కురిపించారు. వైద్యం పొందడానికి పేదరికం అనేది శాపం కాకూడదనేది నాట్స్ లక్ష్యమని నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి అన్నారు. గత కొన్నేళ్లుగా నాట్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పెదనందిపాడులో వందలాది మందికి ఉచిత కంటి పరీక్షలు చేయించడంతో పాటు.. అవసరమైన వారికి ఉచిత కంటి ఆపరేషన్లు చేయించామని తెలిపారు. నల్లమల అడవి ప్రాంతంలో మహిళా సాధికారత కోసం గిరిజన మహిళలకు కుట్టుశిక్షణ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. పేద ప్రజలకు సేవ చేయడంలో ఉన్న సంతృప్తి, ఆనందం మరే దానిలో తనకు లభించలేదని బాపు నూతి అన్నారు. ఈ సభకు కాకుమాను నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. మెగా కంటి వైద్య శిబిరాలు పేద ప్రజలు చక్కగా వినియోగించుకున్నారని ఆల్ ఇండియా లాయర్ యూనియన్ రాష్ట్ర నాయకులు నర్రా శ్రీనివాసరావు అన్నారు. ప్రాంగణంలో కంటి వైద్య శిబిరాన్ని శ్రీనివాసరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. సభలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, మాజీ ఎంపీపీ మర్ర బాలకృష్ణ ,ముద్దన నాగరాజుకుమారి ,పారిశ్రామిక వేత్తలు దాసరి శేషగిరిరావు, అరవపల్లి కృష్ణమూర్తి ,ముద్దన రాఘవయ్య, శీలం అంకారావు ,కొల్లా సాంబశివరావు తదితరులు బాపయ్య చౌదరి చేస్తున్న సేవలను కొనియాడారు. అనంతరం నూతి బాపయ్య చౌదరి ,ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, నర్రా శ్రీనివాస్‌లను రైతు సంఘాల ప్రతినిధులు శాలువాతో సత్కరించారు. ఉచిత మెగా కంటి వైద్య శిబిరంలో 620 మంది పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 374 మంది ఆపరేషన్లు అవసరమని వైద్యులు నిర్ధారించారు. ఈ కార్యక్రమంలో వైద్య శిబిరం నిర్వహణ కమిటీ సభ్యులు దాసరి సుబ్బారావు, దాసరి రమేష్ ,ఎస్ చౌదరి ,లావు శివప్రసాద్ ,పి.పోతురాజు,కాకుమాను చెన్నకేశవులు ,కే శ్రీనివాసరావు,పి. గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. నాట్స్ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని దిగ్విజయంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.పేద విద్యార్ధులకు సాయం చేయడంలో తాను ఎప్పుడూ ముందుంటానని ఉత్తర అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు)నూతి అన్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీని బాపు నూతి సందర్శించారు..ఎంతో మంది పేద రైతులు పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఏర్పాటుకు సహకరించారని బాపు నూతి అన్నారు. ఈ కాలేజీలో చదువుకున్న వారు అనేక రంగాల్లో మంచి విజయాలు సాధించారని.. అందులో తాను కూడా ఉన్నానని అన్నారు. పెదనందిపాడు అభివృద్ధికి తాను వంతు చేయూత అందించేందుకు ఎప్పుడూ ముందుంటానని చెప్పారు. పేద విద్యార్ధులకు ఉపకార వేతనాలు ఇచ్చి వారిని ప్రోత్సాహిస్తున్నామని బాపు నూతి తెలిపారు. అమెరికాలో తెలుగువారికి నాట్స్ కొండంత అండగా నిలుస్తుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో నాట్స్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతుందన్నారు. దివ్యాంగుల స్వశక్తితో నిలబడేలా వారికి చేయూత అందించే కార్యక్రమాలను నాట్స్ చేపడుతుందని వివరించారు. పెదనందిపాడు ఆర్ట్ అండ్ సైన్స్ కాలేజీ ప్రిన్సిపల్ వీరరాఘవయ్య, నంది పాఠశాల ప్రిన్సిపల్ సత్యనారాయణలతో కళశాల ఆధ్యాపకులు కలిసి బాపయ్య చౌదరిని ఘనంగా సన్మానించారు.(చదవండి: కర్నూల్లో నాట్స్ మెగా ఉచిత వైద్య శిబిరం!) -
అట్లాంటాలో అట్టహాసంగా ఆటా కన్వెన్షన్, యూత్ కాన్ఫరెన్స్!
జూన్ 7 నుంచి 9 వరకు అట్లాంటాలో అత్యంత భారీగా, మిన్నంటేలా జరగనున్న ఆటా కన్వెన్షన్, యూత్ కాన్ఫరెన్స్ ఏర్పాట్లు బ్రహ్మాండంగా సాగుతున్నాయి. సాంస్కృతిక, సాహిత్య, సంగీత, నృత్య, ఆధ్యాత్మిక, వ్యాపారం, వ్యవస్థాపకత, అవార్డులు, అంగళ్ళు, ఆరోగ్యం, నాయకత్వం, కళలు, మ్యాట్రిమోనీ, పేజంట్ వంటి ఎన్నెన్నో ప్రత్యేక కార్యక్రమాలు ఆ మూడు రోజులలో జరగనున్నాయి. ఆటా వారు యువత తమకు ఎంత ముఖ్యమో చాలాసార్లు తెలియజేసారు, చేతల్లో చూపిస్తున్నారు కూడా. యువతకు ఉపయోగకరంగా సరదాగా సాగే చాలా ఈవెంట్స్ ఉన్నాయి. వారికి ఒక ప్రత్యేక కమిటీ కూడా ఉంది. వినోద, వివేక, విజ్ఞానాల కలబోతగా ఉండనున్న కన్వెన్షన్ గురించి ఎంత సేపైనా మాట్లాడుకోవచ్చు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక విందు సరే సరి, తెలుగు వారి వంటకాలు నోరూరేలా, ఘుమ ఘుమ లాడుతూ చాలానే ఉండనున్నాయి. వివిధ రంగాలలో ప్రముఖులకు ఆటా అవార్డులు అందజేయటం ఆనవాయితీగా వస్తోంది. పొద్దు పోయాక జరిగే మ్యూజికల్ కాన్సర్ట్ లు ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణే. మహిళా సాధికారికత కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విశిష్ట అతిథుల విషయానికి వస్తే, తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు శ్రీ. రేవంత్ రెడ్డి, శ్రీ. జగన్ మోహన్ రెడ్డిని, ఎంతో మంది ప్రముఖ నటులను, దర్శకులను, సాహితీ వేత్తలను, శాస్త్రఘ్నులను, వ్యాపారవేత్తలను, న్యాయ కోవిదులను, వివిధ రంగాలలో నిష్ణాతులను ఆటా నాయకత్వం ఆహ్వానించడం జరిగింది. భారతదేశం నుంచి ఇప్పటికే విజయ్ దేవరకొండ, జాహ్నవి కపూర్, మెహ్రీన్, శ్రీకాంత్, థమన్, అనూప్ రూబెన్స్, సందీప్ రెడ్డి వంగా, తనికెళ్ళ భరణి వంటి వారు వస్తున్నామని నిర్ధారించారు, ఇంకా తెలంగాణా క్యాబినెట్ మంత్రులు, ఎందరో తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు విచ్చేస్తున్నారు. ఇన్ని కార్యక్రమాలు ఒకే చోట జరగడం చిరస్మరణీయం. ఆలస్యం దేనికీ, రండీ కదలి రండి, ఈ అత్యద్భుతాన్ని ఆస్వాదించండి. మరిన్ని వివరములకు https://ataconference.org, ఎర్లీ బర్డ్ టికెట్లకు https://ataconference.org/Registration/Attendee-Registration ని సందర్శించండి.జార్జియా కాంగ్రెస్ సెంటర్ ప్రాంగణం చాలా పెద్దది. కన్వెన్షన్ కి 15 నుండి 20 వేల మంది వస్తారని అంచనా, వీళ్ళందరికీ ఈ సెంటర్ చాలా వసతిగా ఉంటుంది. ఆటా ప్రెసిడెంట్ మధు బొమ్మినేని, కన్వీనర్ కిరణ్ పాశం ఆధ్వర్యంలో చాలా టీములు వెళ్లి సదుపాయాలు చూసి వచ్చారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ మధు గారు మాట్లాడుతూ.. వేల మంది వందల రోజులు ఈ కన్వెన్షన్ కోసం శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఇది అభినందనీయం. అందరూరండి, కన్వెన్షన్‌లో పాలు పంచుకోండని అన్నారు. అమెరికా విషయానికి వస్తే, జా2ర్జియా గవర్నర్ బ్రయాన్ కెంపిని ఆహ్వానించారు. ఆయన వీలుంటే తప్పకుండా వస్తాను అన్నారు. అట్లాంటాలోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ రమేష్ బాబు లక్ష్మణను సాదరంగా ఆహ్వానించారు. కన్వీనర్ కిరణ్ గారు మాట్లాడుతూ.. కాన్సులేట్ జనరల్ రావడం కార్యక్రమానికి ఎంతో వన్నె తెస్తుందని శ్లాఘించారు. అలానే, లోకల్ లీడర్స్ ఎందరినో పిలిచామనీ, వారందరూ విచేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ మెన్ రిచ్ మెకార్మిక్, సెనేటర్ జాన్ ఆసాఫ్, స్టేట్ రెప్రెసెంటేటివ్ టాడ్ జోన్స్, కమీషనర్లు లారా సేమాన్సన్, ఆల్ఫ్రెడ్ జాన్, సిటీ కౌన్సిల్ దిలీప్ తున్కి, బాబ్ ఎర్రమిల్లి, నరేందర్ రెడ్డి, ఇంకా సిటీ మేయర్లు, ఇతర నాయకులను ఆహ్వానించడం జరిగింది. కోర్ కమిటీ కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, డైరెక్టర్ అనిల్ బొద్దిరెడ్డి, నేషనల్ కోఆర్డినేటర్ సాయి సూదిని, కో కన్వీనర్ ప్రశాంతి ఆసిరెడ్డి, కో కోఆర్డినేటర్ ప్రశీల్ గూకంటి, కో డైరెక్టర్ శ్రీనివాస్ శ్రీరామ్ పలు కమిటీలను, నాయకులను, వాలంటీర్లను తదితరులు సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారని అన్నారు.ఇండియా నుంచి తేవలసిన వస్తువులు. ఇక్కడ కావలసినవి ఇప్పటికే సమకూరుస్తున్నారు. ఎక్సిబిట్స్ విషయానికి వస్తే, దాదాపు 200 లకు పైగా స్టాల్ల్స్ ఉండనున్నాయి. ఇంకా చాలా మంది పెడదామనుకున్నా, ఇంకే అవకాశం లేదని నిర్వాహకులు చెప్పారు. ఆటా ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా, పాస్ట్ ప్రెసిడెంట్ భువనేశ్ బూజాల, సెక్రటరీ రామకృష్ణ రెడ్డి ఆల, ట్రెజరర్ సతీష్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ తిరుపతి ఎర్రంరెడ్డి, జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు తోపాటు ఎంతో మంది కృషి చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే, చాలా విశేషాలు ఉన్నాయి. త్వరలో కలుద్దాం. ఈ మధ్యలో మీకు మరిన్ని వివరాలు కావాలంటే, ఆటా సోషల్ మీడియా, వెబ్ సైట్, టీవీ ఇంటర్వ్యూ లు, పత్రికలు చూస్తూ ఉండండి.(చదవండి: తానా ప్రపంచసాహిత్యవేదిక నాల్గవ వార్షికోత్సవ వేడుకలు !) -
మె...గా దోస వరల్డ్ రికార్డు: మనసు దో‘సు’కుంటోంది!
Megadosa: భారతీయులకు, అందులోనూ దక్షిణాది వారికి దోస అంటే ప్రాణం. ఈ దోసను ఎన్ని రకాలుగా తయారు చేసినా ఆహార ప్రియుల మనసు దో‘సు’ కుంటుంది. తాజాగా ఈ దోస ప్రపంచ రికార్డు కొట్టేసింది. దోస ఏంటి రికార్డు ఏంటి అనుకుంటున్నారా? మరి ఈ వివరాలు తెలియాలటే.. ఈ స్టోరీ చదవాల్సిందే..: కర్ణాటకలో 123 అడుగుల పొడవైన దోస లాంగెస్ట్ దోసగా గిన్నిస్ ప్రపంచ రికార్డు కొట్టేసింది. ప్రముఖ ఫుడ్ బ్రాండ్ ఎంటీఆర్ ఫుడ్స్‌కు చెందిన చెఫ్‌ల బృందం ఈ మెగా దోసను తయారు చేసింది. సంస్థ 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, లోర్మాన్ కిచెన్ ఎక్విప్మెంట్స్ భాగస్వామ్యంతో 123.03 అడుగుల పొడవైన దోసను తయారు చేసి, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సొంతం చేసుకుంది. అంతేకాదు తన మునుపటి ప్రపంచ రికార్డు టైటిల్‌ను తానే బద్దలు కొట్టింది. చెఫ్ రెగి మాథ్యూస్ నేతృత్వంలోని 75 మంది చెఫ్‌ల బృందం దీనికోసం కష్టపడింది. నెలల పాటు ప్లాన్లు వేసుకొని మరీ విజయవంతంగా ఈ రికార్డు సాధించింది. ఈ దోస తయారీ కోసం రెడ్ రైస్ దోస పిండిని ఉపయోగించారట. 2024 మార్చి 15న బెంగుళూరులోని MTR ఫ్యాక్టరీలో ఈ ఘనతను దక్కించుకున్నామని ఈ చారిత్రాత్మక మైలురాయిని సాధించడం సంతోషంగా ఉంది అని చెఫ్ రెగి మాథ్యూస్ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. ఈ విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. -
అతని తెలివితేటలు అపారం!
హర్ష సాయి హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మెగా’. మిత్ర ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తూ, నిర్మిస్తున్నారు. తాజాగా సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ‘ఈ కథ రాక్షసులతో నిండిన సముద్రాన్నే కుదిపేసే రాజైన మనిషిది’, ‘అతని తెలివితేటలు అపారం’ వంటి డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. హర్ష సాయి మాట్లాడుతూ– ‘‘మంచి కథలు చెప్పడానికి ప్రస్తుతం ఉన్న పెద్ద మాధ్యమం సినిమా. నేను చిత్రాలను ఎంచుకోవడానకి ఇదే తొలి కారణం. అలాగే యువ ప్రతిభను ప్రోత్సహించాలనుకోవడం మరో కారణం’’ అన్నారు. హీరోయిన్ , నిర్మాత మిత్ర మాట్లాడుతూ– ‘‘చిన్న ఆలోచనగా మొదలైన ఈ ప్రాజెక్ట్ చాలా భారీ స్థాయికి వెళ్లింది. 2024లో ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: వికాస్ బాడిసా, కెమెరా: కార్తీక్ పళని, సమర్పణ: కల్వకుంట్ల వంశీధర్‌రావు, సహ నిర్మాత: పడవల బాలచంద్ర. -
Klin Kaara Konidela First Photos: మెగా ప్రిన్సెస్ మొదటి వీడియో షేర్ చేసిన రామ్‌చరణ్ (ఫొటోలు)
-
గుంటూరు ఏఎన్‌యూలో వైఎస్ఆర్సీపీ మెగా జాబ్ మేళా
-
Apollo Hospital : అపోలో హాస్పిటల్ ముందు మెగా ఫ్యాన్స్ హంగామా (ఫొటోలు)
-
మెగా ప్రొడ్యూసర్ గా రామ్ చరణ్
-
మెగా బోనస్: 8 నెలల జీతం, ఎయిర్‌లెన్స్ ఉద్యోగుల సంబరాలు
సాక్షి, ముంబై: సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఉద్యోగులకు అద్భుతమైన వార్త. తన ఉద్యోగులకు భారీ బోనస్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది కంపెనీ. రికార్డు స్థాయిలో రూ.13,000 కోట్ల వార్షిక లాభాన్ని ఆర్జించిన తర్వాత, ఎయిర్‌లైన్ దాని సిబ్బందికి ఎనిమిది నెలల జీతంతో సమానమైన బోనస్‌ను అందించనుంది. మెగా బోనస్ కోవిడ్ మహమ్మారి సమయంలో విశిష్ట సేవలందించిన, అర్హత కలిగిన ఉద్యోగులు 6.65 నెలల వేతనానికి సమానమైన లాభాల-భాగస్వామ్య ప్రోత్సాహకాన్ని, గరిష్టంగా 1.5 నెలల ఆదాయాన్ని ఎక్స్-గ్రేషియా బోనస్‌గా అందిస్తున్నామని ఎయిర్‌లైన్ ప్రతినిధి తెలిపారు. అయితే సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు అదనపు ఎక్స్‌గ్రేషియా ఇన్సెంటివ్ ఉండదని చెప్పారు.(గూగుల్ సీఈవో ప్రైమరీ ఫోన్ ఏదో తెలుసా, ఏఐపై కీలక వ్యాఖ్యలు) స్టాఫ్ యూనియన్లతో ఒప్పందం ప్రకారం తమ దీర్ఘకాలిక వార్షిక లాభాల-భాగస్వామ్య బోనస్ ఫార్ములాపై ఆధారపడి ఉంటుంని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. సింగపూర్ ఎయిర్‌లైన్స్ మార్చి 31న ముగిసిన ఆర్థిక సంవత్సరానికి 1.62 బిలియన్ డాలర్లు (రూ.13వేల కోట్లు) నికర లాభాన్ని ప్రకటించింది. (Massive layoffs: 55వేలమందిని తొలగించనున్న అతిపెద్ద టెలికాం సంస్థ) అన్ని క్యాబిన్ తరగతుల్లో ఫార్వర్డ్ సేల్స్ చైనా, జపాన్ , దక్షిణ కొరియాలకు రిజర్వేషన్లు బలంగా ఉన్నాయని కంపెనీ పేర్కొంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్ , బడ్జెట్ ధరల అనుబంధ సంస్థ స్కూట్‌లో ఒకే ఏడాదిలో ఆరు రెట్లు ఎక్కువ మంది ప్రయాణీకులు ప్రయాణించారు (26.5 మిలియన్లు). (ఈ పిక్స్ చూశారా? గుండెలు బాదుకుంటున్న కృతి సనన్ ఫ్యాన్స్) మార్చిలో 79శాతంతో ప్రీ-కోవిడ్ స్థాయిలకు చేరుకుంది, సింగపూర్ ఎయిర్‌లైన్స్ షేర్లు గురువారం 1.2శాతం పెరిగాయి సింగపూర్ ఎయిర్ ఏప్రిల్‌లో 1.75 మిలియన్ల మంది ప్రయాణీకులు ప్రయాణించినట్లు సోమవారం నివేదించింది, గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 53శాతం పెరిగింది. ఇలాంటిమరెన్నో అద్భుతమైన వార్తలు, విశేషాల కోసం చదవండి :సాక్షి, బిజినెస్ -
జెట్ స్పీడ్‌లో బుల్లెట్ ట్రెయిన్ నిర్మాణ పనులు..రూ.3,681 కోట్లతో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హిందుస్తాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ (హెచ్‌సీసీ), మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) సంయుక్తంగా బుల్లెట్ ట్రెయిన్ స్టేషన్ ప్రాజెక్ట్‌ను చేజిక్కించుకున్నాయి. ప్రాజెక్ట్ విలువ రూ.3,681 కోట్లు. నేషనల్ హై–స్పీడ్ రైల్ కార్పొరేషన్ నుంచి ఈ కాంట్రాక్ట్‌ను దక్కించుకున్నాయి. 508.17 కిలోమీటర్ల ముంబై–అహ్మదాబాద్ హై–స్పీడ్ రైల్లో భాగంగా బాంద్రా కుర్లా కాంప్లెక్స్ స్టేషన్‌ను హెచ్‌సీసీ, ఎంఈఐఎల్ నిర్మిస్తాయి. ఆరు ప్లాట్‌ఫామ్స్‌ను ఏర్పాటు చేస్తారు. 16 కోచ్‌లు ఉన్న బుల్లెట్ ట్రెయిన్ నడవడానికి వీలుగా ఒక్కొక్కటి 414 మీటర్ల పొడవులో ఫ్లాట్‌ఫామ్‌ను నిర్మిస్తారు. మెట్రో, రోడ్డు మార్గాలకు అనుసంధానంగా బాంద్రా కుర్లా కాంప్లెక్స్ స్టేషన్ ఉంటుందని హెచ్‌సీసీ తెలిపింది. ముంబై–అహ్మదాబాద్ హై–స్పీడ్ రైల్ మార్గంలో భూగర్భంలో ఉండే ఏకైక స్టేషన్ ఇదే. నేల నుంచి 24 మీటర్ల లోపల ఏర్పాటు చేస్తారు. మూడు అంతస్తుల్లో స్టేషన్ ఉంటుంది. -
‘మేఘా’ మరో రికార్డు.. స్వదేశీ పరిజ్ఞానంతో ఆయిల్ రిగ్గులు
చమురు, ఇందనం వెలికితీసే రిగ్గులను ప్రైవేటు రంగంలో తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసి వినియోగంలోకి తెచ్చిన ఘనత మేఘా ఇంజనీరింగ్ (ఎంఈఐఎల్) సొంతం చేసుకుంది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ రిగ్గును దేశంలోనే మొదటిసారి ఎంఈఐఎల్ సొంతంగా తయారు చేసింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు హైడ్రాలిక్ వ్యవస్థతో పనిచేసేలా దీనిని రూపొందించారు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లోని కలోల్ చమురు క్షేత్రంలో ఈ రోజు 07.04.2021 న డ్రిల్లింగ్ కార్యకలాపాలను ప్రారంభించిందని మేఘా ఇంజనీరింగ్ ఇన్ప్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎంఈఐఎల్ వైస్ ప్రెసిడెంట్ పి.రాజేశ్ రెడ్డి తెలిపారు. 1500 హెచ్ పి సామర్థ్యంతో తయారు చేసిన ఈ డ్రిల్లింగ్ రిగ్గు భూ ఉపరితలం నుంచి 4000 మీటర్ల (4 కిలో మీటర్లు) లోతు వరకు చమురు బావులను సులభంగా తవ్వుతుంది. ఎంఈఐఎల్ ఈ రిగ్గును 40 సంవత్సరాల పాటు పని చేసేలా తయారు చేసింది. 6 వేల కోట్ల విలువైన 47 డ్రిల్లింగ్ రిగ్గులను తయారు చేసి సరఫరా చేసే ఆర్డర్ ను మేఘా ఇంజనీరింగ్ సంస్థ 2019లో ఓఎన్జీసి నుండి టెండర్లో దక్కించుకుంది. అందులో భాగంగా మొదటి రిగ్గును అహ్మదాబాద్ లోని చమురు క్షేత్రంలో వినియోగంలో తెచ్చింది. మిగిలిన 46 రిగ్గులు వివిధ దశల్లో తయారీలో ఉన్నాయి. మేకిన్ ఇండియాలో భాగంగా తొలిసారిగా ఇంత భారీ స్థాయిలో ప్రైవేటు రంగంలో తయారు చేస్తున్నారు. మొత్తం రిగ్గుల్లో 20 వర్క్వోవర్ రిగ్గులు (వర్కోవర్ రిగ్గులు అనేవి అప్పటికే తవ్విన చమురు బావిలోని నిక్షేపాలను పూర్తి స్థాయిలో వెలికితీయడం, చమురు బావి ఉత్పాదకతను పెంచడంతో పాటు చమురు బావులను మరమ్మతులు చేయడానికి ఉపయోగపడతాయి. సాధారణ రిగ్గులు అయితే ఈ విధంగా ఉపయోగపడవు), 27 ల్యాండ్ డ్రిల్లింగ్ రిగ్గులు (ల్యాండ్ డ్రిల్లింగ్ రిగ్గులు అంటే భూ ఉపరితలం నుండి భూగర్భంలో ఉన్న చమురు నిక్షేపాల వరకు భూ పొరలను తవ్వే అత్యాధునిక యంత్రం. ఇది 1500 మీటర్ల నుండి 6000 మీటర్ల వరకు తవ్వగలదు. మాములు రిగ్గులయితే 1000 మీటర్ల వరకు మాత్రమే తవ్వగలవు) ఉన్నాయి. 20 వర్కోవర్ రిగ్గులలో 50 ఎంటి సామర్థ్యం కలిగిన 12 ఆటోమేటెడ్ వి కాగా, 100 ఎంటి సామర్థ్యం కలిగినవి నాలుగు. మరో నాలుగు 150 ఎంటి సామర్థ్యం రిగ్గులు ఎంఈఐఎల్ తయారు చేస్తోంది. ఇక 27 ల్యాండ్ డ్రిల్లింగ్ రిగ్గులలో ఒక్కొక్కటి 1500 హెచ్ పి సామర్థ్యంతో 2 మోబైల్ హైడ్రాలిక్ రిగ్గులు కాగా, ఒక్కొక్కటి 1500 హెచ్ పి ఏసి వీఎఫ్ డి సామర్థ్యంతో 17 తయారవుతున్నాయి. మరో ఆరు రిగ్గులు ఒక్కొక్కటి 2000 హెచ్.పి. సామర్థ్యంతో తయారు చేస్తున్నారు. ఒక్కొక్కటి 2000 హెచ్ పి. సామర్థ్యంతో మరో రెండు రిగ్గులు రూపొందిస్తున్నారు. 2000 హెచ్ పి సామర్థ్యం గల డ్రిల్లింగ్ రిగ్గులు 6 వేల మీటర్ల (6 కిలో మీటర్లు) వరకు తవ్వగలవు. ఇంత సామర్థ్యం కలిగినవి ఈ తరహా లో తొలిసారిగా భారతదేశంలో తయారవుతున్నాయి. మొత్తం 47 రిగ్గులలో గుజరాత్లో ఒకటి పూర్తిస్థాయిలో ఉపయోగంలోకి రాగా రెండవ రిగ్గు డ్రిల్లింగ్ కార్యకలాపాలు మరి కొద్ది రోజుల్లో మొదలవ్వనున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రారంభ సన్నాహాలు మొదలయ్యాయి. ప్రస్తుతం తయారీలో ఉన్న 46 రిగ్గులలో రెండు రిగ్గులు ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి చమురు క్షేత్రంలో అసెంబ్లింగ్ దశలో ఉండగా మిగతా వాటిని అస్సాం, త్రిపుర, తమిళనాడులోని ఓన్జీసికి సంబంధించిన చమురు క్షేత్రాలకు ఎంఈఐఎల్ అందించనుంది. అహ్మదాబాద్ సమీపంలో గల కలోల్ క్షేత్రంలో దామాసన గ్రామంలో ఉన్న చమురు బావి కె.ఎల్.డి.డి.ఎక్స్ ను స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మొదటి రిగ్గు ద్వారా ప్రస్తుతం తవ్వకం ప్రారంభించినట్టు ఎంఈఐఎల్ వైస్ ప్రెసిడెంట్ పి.రాజేశ్ రెడ్డి చెప్పారు. ఈ రిగ్గు చమురు బావులను వేగంగా తవ్వడంతో పాటు తక్కువ విద్యుత్ తో పనిచేస్తుంది. ఇది పూర్తిగా అత్యాధునిక హైడ్రాలిక్ మరియు ఆటోమేటెడ్ టెక్నాలజీతో రూపొందించారు. ఈ రిగ్గు 1500 హెచ్‌పి సామర్థ్యంతో 4 వేల మీటర్ల వరకు సులువుగా తవ్వగలదు. భద్రతా ప్రమాణాల రీత్య కూడా ఇది అత్యాధునికమైనది. దేశంలో తొలిసారిగా దేశీయ పరిజ్ఞానంతో పాటు మేకిన్ ఇండియా కార్యక్రమం కింద తయారైన తొలి రిగ్గు కావటం అందులోను భారతీయ నవరత్న కంపెనీలలో ఒకటైన ఓఎన్జీసీ కి అందజేయటం ఎంతో గర్వకారణంగా ఉందని రాజేశ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దేశీయంగా చమురు ఉత్పత్తి పెంచి విదేశాలనుంచి దిగుమతి తగ్గించటం ద్వారా దేశీయ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహద పడుతుందన్నారు. అంతేకాకుండా ఓఎన్జీసీ కి కూడా ఈ అధునాతన టెక్నాలజీగల రిగ్గుల ద్వారా లాభం చేకూరుతుంది. చమురు బావులను డ్రిల్ చేయడం ద్వారా రాబోయే కాలంలో ఆధునిక టెక్నాలజీ సహాయంతో వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు ఆయన చెప్పారు. మేకిన్ ఇండియా నినాదాన్ని తన విధానంగా మేఘా మార్చుకున్నదన్నారు. చమురు, ఇంధనం వెలికితీసే రిగ్గుల కోసం ఇప్పటివరకు విదేశాలపైనే ఆధారపడ్డ భారత్‌కు మేఘా ఇంజనీరింగ్ ఒక ఆశాకిరణంగా మారిందని రాజేశ్ రెడ్డి తెలిపారు. రిగ్గుల తయారీలో విదేశీ సంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రిగ్గులను తయారు చేసిన ఘనత మేఘా సొంతం చేసుకుంది. ఇది మేఘాకే కాదు దేశం మొత్తం గర్వపడాల్సిన విషయమని అభిప్రాయపడ్డారు. చదవండి: టీటీడీ ప్రాజెక్టులన్నీ హెచ్‌డీపీపీలోకి విలీనం -
ఎస్బీఐ మెగా ఆఫర్: మార్కెట్ రేటు కంటే తక్కువకే
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మరోసారి బంపర్ ఆఫర్ ప్రకటించింది. మార్కెట్ రేట్ల కంటే చాలా తక్కువ ధరకే కొత్త ఆస్తిలను కొనుగోలు చేసే అవకాశాన్ని ప్రజలకు అందిస్తోంది. ఈ మేరకు మార్చి 5 న మెగా ఇ- వేలం నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. రుణ ఎగవేతదారుల తనఖా ఆస్తులను విక్రయించడానికి ఈ-వేలం నిర్వహిస్తుంది. తద్వారా బకాయిలను తిరిగి పొందనుంది. ఈ వేలంలో నివాస, వాణిజ్య ఆస్తులు భూమి, వాహనాలు, యంత్రాలు, తదితరాలను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చని ఎస్బీఐ ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఈ వేలం కోసం జారీ చేసిన పబ్లిక్ నోటీసులలో సంబంధిత వివరాలను అందించినట్టు తెలిపింది. (రెడ్మి నోట్ 10 స్మార్ట్ఫోన్లు వచ్చేసాయ్!) వేలంలోని ఆస్తి వివరాలను ఎలా పొందాలి? దీనికి సంబంధించి కొన్ని లింక్‌లను అందుబాటులో ఉంచింది. అలాగే ఆయా బ్రాంచ్‌లలో సంబంధింత సమాచారాన్ని అందించేందుకు ఒక ఉద్యోగి ప్రత్యేకంగా అందుబాటులో ఉంటారు. తద్వా వేలం వేయనున్న ప్రాపర్టీ వివరాలు, వేలం ప్రక్రియ, వివరాలను కొనుగోలుదారులు తెలుసుకోవచ్చని బ్యాంక్ పేర్కొంది. ఇ-వేలంలో పాల్గొనేందుకు అర్హత దీనికి బిడ్డర్లు కొన్ని ఫార్మాలిటీలను ముందుగానే పూర్తి చేయాలి. నోటీసులో పేర్కొన్న విధంగా నిర్దిష్ట ఆస్తి కొనుగోలుకు నిర్దేశిత సొమ్మును చెల్లించాలి. కేవైసీ పత్రాలు సంబంధిత శాఖకు సమర్పించాలి. చెల్లుబాటు అయ్యే డిజిటల్ సంతకాన్ని ఇవ్వాలి. ఇందుకు బిడ్డర్లు ఇ-వేలం వేసేవారిని లేదా మరే ఇతర అధీకృత ఏజెన్సీని సంప్రదించవచ్చు. ఈఎండీ డిపాజిట్ , కేవైసీ పత్రాలు అందించిన అనంతరం లాగిన్ ఐడీ, పాస్వర్డ్ బిడ్డర్ల ఇమెయిల్ పంపిస్తారు. దీంతో వేలం నిబంధనల ప్రకారం ఇ-వేలంలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. Bid for the best! Here’s your chance to buy cheaper Residential & Commercial Properties, Land, Plant & Machinery, Vehicles and many more. Attend SBI Mega E-Auction and place your best bid. Know more: https://t.co/vqhLcagoFF #Auction #MegaEAuction #Properties #DreamHome #Land pic.twitter.com/80CNZueg6k — State Bank of India (@TheOfficialSBI) March 1, 2021 -
వీళ్లదండీ విల్ పవర్
ఈ చిరునవ్వుల్ని చూడండి. విహంగమై ఎగరాలన్నంతగా.. వీల్ చెయిర్‌కే ఆశను కల్పించేలా ఉన్నాయి! జీవితంలో స్పీడ్ బ్రేకర్లు ఉండేవే. కొన్నిసార్లు దారే ఉండదు. ‘‘ప్రయాణం మాత్రం సాగాల్సిందే’’ అంటారు సాహితీ, మేఘ. నిస్పృహకు అందనంత ఎత్తులో నిరాశను చేరనీయని ఉత్సాహంతో స్ఫూర్తిగా నిలుస్తున్న అక్కచెల్లెళ్లు వీళ్లు. కాలాన్నే కదలించే చక్రాలు! సాహితీ శ్రీవత్ససకు వాష్‌రూమ్‌కి వెళ్లాలన్నా ఒకరి సాయం అవసరం. అలాంటిది ఒంటరిగా మనాలి మంచు జల్లులను మనసారా ఆస్వాదించి వచ్చారు! వెబ్ కంటెంట్ రైటర్‌గానూ రాణిస్తున్నారు. మేఘ కూడా సొంతంగా కాళ్ల మీద నిలబడే అవకాశం లేకపోయినా ప్రైవేట్ జాబ్ చేస్తూ స్వీయ సంపాదన పొందుతున్నారు. విధి వీల్ చెయిర్‌కే పరిమితం చేసినా లక్ష్య పెట్టని వీరిద్దరూ అక్కాచెల్లెళ్లు. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో ఉంటున్న సాహితీ, మేఘ అటాక్సియా అనే సమస్యతో నడవలేని స్థితిలో ఉన్నా కూడా జీవితాన్ని సవాల్‌గా తీసుకోవడం ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తోంది. సాహితి వయసు 29 ఏళ్లు. మేఘ వయసు 33. పన్నెండేళ్ల క్రితం అటాక్సియా వీరిని నడవటానికి లేకుండా చేసింది. అయినప్పటికీ తమ కలలను సాకారం చేసుకునే దిశగా పయనిస్తున్నారు. తమలాంటి వారిలో గుండె నిబ్బరం నింపుతున్నారు. ప్రయాణాలే శక్తి సాహితి వీల్ చెయిర్ నుంచే బ్లాగర్‌గానూ, వెబ్ కంటెంట్ రైటర్‌గానూ వర్క్ చేస్తున్నారు. ఆన్లైన్లో రోజూ భగవద్గీత క్లాసులు వింటారు. ‘రాహ్’ అని ఒక ఎంజీవోకు వర్క్ చేస్తున్నారు. ఆ సంస్థ ద్వారా డిసేబుల్డ్ వాళ్లందరికీ మనోధైర్యం, ఉద్యోగావకాశాలు ఇవ్వడానికి కృషి చేస్తున్నారు. దీపావళి తర్వాత జో«ద్‌పూర్‌లో ‘రాహ్’ క్యాంపెయిన్‌కి వెళ్లబోతున్నారు సాహితి. ‘‘మేం చేస్తున్న పనుల్లో ట్రావెల్ కూడా ముఖ్యమైనదే. నార్మల్‌గా ఉన్నవారే ప్రయాణాలంటే కష్టపడుతుంటారు. అలాంటిది డిజేబుల్డ్ పర్సన్స్ ప్రయాణాలు చేయడం అంటే కుదురుతుందా? అయినప్పటికీ వారు ఒకేదగ్గర ఉండిపోకూడదని ‘టూర్స్’ కూడా ప్లాన్ చేస్తుంటాం’’ అని చెప్పారు సాహితి. కాలేజీ రోజుల్లో ఫ్రెండ్స్‌తో కలిసి టూర్స్‌కి వెళ్లారు సాహితి. మనాలి చూడాలని ఆమెకు ఎప్పటి నుంచో ఆశ. అక్కడి మంచును చేత్తో తాకాలని ఆరాటం. తల్లిదండ్రులకు చెబితే ముందు వద్దన్నారు. ఒప్పిస్తే తర్వాత సరేనన్నారు. ‘‘డిజేబుల్డ్ గ్రూప్‌లో మెంబర్‌గా ఉన్నాను కాబట్టి వాలెంటీర్స్ను మాట్లాడుకున్నాను. బయట కూడా వాష్‌రూమ్స్ తప్ప వేరే అవసరం పడదు. అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకున్నాను. నా దగ్గర ఉన్న డబ్బు చెక్ చేసుకున్నాను. టికెట్స్, రూమ్ బుకింగ్.. అన్నీ పూర్తి చేసుకున్నాను. ఇంటి నుంచి ఎయిర్‌పోర్ట్‌లో కారు దిగగానే నా కోసం మా గ్రూపు వాలంటీర్ ఒకరు సిద్ధంగా ఉన్నారు. అక్కడ నాకు కావాల్సిన సాయం చేసి వెళ్లిపోయారు. ముందే అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవడంతో ఇబ్బంది అనిపించలేదు. మూడు రోజులు మనాలీ వెళ్లి వచ్చాను. అక్కడి ‘స్నో’ చూడాలన్న నా ఆశ తీరింది. రోప్‌వే, యార్క్ ఎక్కాను. కరోనా తగ్గాక కామాఖ్య మందిరం (అస్సాం) వెళ్లాలనేది ఇప్పుడున్న ప్లాన్’’ అని తెలిపారు సాహితీ. మొదట సాహితి అక్క మేఘకు ఇంటర్ సెకండియర్ చదువుతున్నప్పుడు ఇలా నిలబడలేని పరిస్థితి వచ్చింది. ఆమెది బైపీసీ. డాక్టర్ అవాలని ఆ గ్రూపు తీసుకుంది. ఆ తర్వాత ఫార్మసీ వైపు వెళ్లాలని తన ఉద్దేశం. కానీ అటాక్సియా వల్ల కుదర్లేదు. దీంతో ‘‘డిస్టెన్స్‌లో బి.ఎ చేశాను. జాబ్ రిక్రూటర్‌గా ఉద్యోగం చేస్తున్నాను. వర్క్ చేసే చోట లిఫ్ట్ సదుపాయం ఉండేది. నాన్న రోజూ తీసుకెళ్లి సీటులో కూచోబెట్టి వచ్చేవారు. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. న్యూరో సమస్య అన్నది ఒక డిజార్డర్. కానీ, అది మన మనోబలాన్ని తగ్గించలేదు. ఇలాంటి డిజార్డర్ ఉన్నవారికి మానసికంగా, శారీరకంగా ఫిట్నెస్ ఉండాలి. నాలాంటి వారికి ఫిట్నెస్ సూచనలతోపాటు ఫిజియోథెరపీ ఇవ్వాలనుకుంటున్నాను’’ అని చెప్పారు మేఘ. నైపుణ్యాలే నడక సాహితి తర్వాత ఇంకో అమ్మాయి కూడా ఉంది. మొత్తం ముగ్గురు అక్కచెల్లెళ్లు. ఉమ్మడి కుటుంబం. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉండేవారు. స్కూలు హిమాయత్ నగర్లో. బస్సులో వెళ్లివచ్చేవారు. చివరమ్మాయి ఇప్పుడు అమెరికాలో మాస్టర్ డిగ్రీ చేస్తోంది. ‘‘అక్క (మేఘ) ఇంటర్మీడియెట్ చదివేటప్పుడు తరచూ కిందపడిపోయేది. నడవలేకపోతుంటే డాక్టర్‌కి చూపించారు. అటాక్సియా అని చెప్పారు. నాక్కూడా.. బీటెక్‌లో ఉండగా నా నడకలో తేడా ఉందని నాకే అనిపించింది. ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. ఇంట్లో కూడా. ఘట్కేసర్లో కాలేజీ. బీటెక్ చివరి సంవత్సరంలో మాత్రం చాలా కష్టమయ్యింది. హాస్పిటల్‌కి వెళితే ‘పెద్దమ్మాయికి వచ్చిన సమస్యే ఈమెకూ ఉంది’ అన్నారు! అప్పటికే జాబ్స్‌కి ట్రై చేశాను. కానీ, రోజూ ఆఫీసుకు వెళ్లడం కష్టమని ఆగిపోయాను. ఇంటి నుంచే ఫ్రీ లాన్స్ చేయడం మొదలుపెట్టాను. కంటెంట్ రైటర్‌గా అవార్డులూ అందుకున్నాను. మాకున్నది శారీరక లోపం. కానీ, జీవన నైపుణ్యాలు ఉన్నాయి. వాటి మీదే ఫోకస్ చేస్తే వేరే లోపాలేవీ కనిపించకుండా పోతాయి. ముందు మన మైండ్ సెట్‌నిæమార్పు చేసుకోవాలి’’ అని నవ్వుతూ చెప్పింది సాహితీ. న్యూరో సమస్య అన్నది ఒక డిజార్డర్. కానీ, అది మన మనోబలాన్ని తగ్గించలేదు. ఇలాంటి డిసార్డర్ ఉన్నవారికి మానసికంగా, శారీరకంగా ఫిట్నెస్ ఉండాలి. నాలాంటి వారికి ఫిట్నెస్ సూచనలతోపాటు ఫిజియోథెరపీ ఇవ్వాలనుకుంటున్నాను. – మేఘ జీవన నైపుణ్యాల మీదే ఫోకస్ చేస్తే వేరే లోపాలేవీ కనిపించకుండా పోతాయి. ముందు మన మైండ్ సెట్‌నిæ ఛేంజ్ చేసుకోవాలి. – సాహితి పిల్లలే మా ధైర్యం పెద్ద పాపకు ఈ సమస్య వచ్చినప్పుడు ఇక జీవితమే లేదనుకున్నాం. ఏం చేయాలో అర్ధం కాదు. ఇప్పడైతే ఇక మా పిల్లల ధైర్యానికి నేనూ ధైర్యంగా ఉండగలుగుతున్నాను. ఇలాంటి వాళ్లను మా పిల్లల ద్వారానే కొంతమందిని కలిశాను. మొదట్లో గోడలు పట్టుకుని నడిచేవాళ్లు, తర్వాత చెయిర్ పట్టుకుని నడిచేవాళ్లు. ఇప్పుడు అస్సలు నడవలేరు. మమ్మల్ని ఆనందంగా ఉంచాలని పిల్లలు, వాళ్లు ఆనందంగా ఉండాలని మేమూ... రోజూ ప్రయత్నిస్తూనే ఉంటాం. సాహితీ మనాలి వెళ్తాననీ, తన పుట్టిన రోజుకు అక్కడ ఉండాలనీ అన్నప్పుడు మొదట వద్దన్నాను. తర్వాత కాదనలేకపోయాను. సంతోషంగా తిరిగి వచ్చింది. మేఘా, సాహితీ చండీగడ్ కూడా వెళ్లి వచ్చారు. – లలితా రంగాచారి (సాహితి, మేఘల తల్లి) – నిర్మలారెడ్డి ఫొటోలు: దేవేంద్రనాథ్ -
కాలేజీ మైదానమే.. వాణిజ్య సముదాయం..
-విద్యార్థులే వ్యాపారవేత్తలు –ఆర్ట్స్ కళాశాలలో ‘మెగా మార్కెట్ ఫెస్ట్’ –30 స్టాళ్లతో మూడు రోజులు నిర్వహణ కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : వారు చదివేది వాణిజ్యశాస్త్రం. క్షేత్రస్థాయిలో వివిధ వ్యాపారసంస్థల కార్యకలాపాలను పరిశీలించడమూ వారి కోర్సులో భాగమే కావచ్చు. అయితే రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు ఓ అడుగు ముందుకేసి తామే వ్యాపారులుగా మారారు. కళాశాల ప్రాంగణమే వారి వ్యాపార సముదాయమైంది. విద్యార్థులకు వ్యాపారదృక్పథాన్ని నేర్పే విధంగా కళాశాల వాణిజ్య, కామర్స్ విభాగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘మెగా మార్కెట్ ఫెస్ట్’ను సోమవారం నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ప్రారంభించారు. మూడురోజులు జరిగే ఈ ఫెస్ట్‌లో ఏమి వ్యాపారం చేయాలో ముగ్గురు నుంచి 10 మందితో ఏర్పడ్డ బృందాలు ముందే నిర్ణయించుకున్నాయి. తలో కొంత సొమ్ము పెట్టుబడి పెట్టి మార్కెట్‌కు వెళ్లి అందుకు అవసరమైన వస్తువులను కొన్నారు. వాటికి ఒక ధర నిర్ణయించి ఫెస్ట్లోనిఽ స్టాల్స్‌లో అమ్మకాలు ప్రారంభించారు. ఈ విధంగా 30 స్టాల్స్ ఏర్పాటు చేశారు. లాభాలతో శభాష్ అనిపించుకుంటాం.. ఆడవాళ్లకు ఇష్టమైన ఫ్యాన్సీ వస్తువుల వ్యాపారం ఏ ప్రాంతంలో పెట్టినా లాభదాయకంగా ఉంటుందని ఆ వ్యాపారం ఎన్నుకున్నాం. ఏడుగురం రెండేసి వందల చొప్పున వేసుకుని రూ.1400లతో గాజులు, చెవిదిద్దులు, డిజైన్ దండలు, పట్టీల వంటివి హోల్‌సేల్‌గా కొన్నాం. మార్కెట్‌కనుగుణంగా ధర నిర్ణయించి, స్టాల్లో అమ్ముతున్నాం. ఇప్పటివరకు రూ.700 వచ్చింది. మిగిలిన రెండు రోజుల్లో కచ్చితంగా లాభాలు తెచ్చి అందరితో శభాష్ అనిపించుకుంటాం. –టి.భవానీ, మహాలక్ష్మీ, దుర్గాభవాని, పవిత్ర, బీకాం ప్రథమ సంవత్సరం )మహిళల వస్తువులపై దృíష్టిసారించాం ప్రతి మహిళా ఫంక్షన్‌కో, బయటకో వెళ్లాలంటే కచ్చితంగా హ్యాండ్బ్యాగో, చిన్నపర్సో ఉంటాయి. అందుకే వాలెట్స్ వ్యాపారం బాగుంటుందనిపించింది. 13 మందిమి రూ.13 వేలు కూడబెట్టాం. దానితో సరుకులు కొనుగోలు చేశాం. ముందుగా మార్కెట్లో తిరిగి అవగాహన పెంచుకున్నాం. వినియోగదారునికి మొదట కావల్సింది వస్తువులో నాణ్యత. ఆ దిశగా సరుకులు కొన్నాం. నాణ్యత ద్వారా వినియోగదారుల్ని ఆకర్షించవచ్చు. –యు.గీత, ఎం.లలిత, ఎం.లావణ్య, ఎస్.శిరీష, ఎంకాం విద్యార్థులు లాభంతో పాటు తృప్తి ఇటీవల అందరూ ఇళ్లలో మొక్కలను పెంచుతున్నారు. ఆ వ్యాపారం బాగుందని కొందరు మిత్రుల ద్వారా తెలుసుకున్నాం. అందరం కలిసి చర్చించుకున్నాం. అతి తక్కువతో ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చు. ముగ్గురం కలిసి రూ.1500 తో మొక్కలు కొనుగోలు చేశాం. పెట్టుబడికి రెండింతలు లాభాలు తీసుకువస్తాం. వీటి అమ్మకం వల్ల మాకు లాభాలు, వ్యాపార అవగాహనతో పాటు పర్యావరణ పరిరక్షణలో మేమున్నామనే తృప్తి కూడా మిగులుతుంది. –భార్గవ్, డి.స్వాతి, ఎస్.పుష్ప, ఎంకాం విద్యార్థులు నష్టం ప్రసక్తే లేదు.. మార్కెట్లో రెడీమెడ్ డ్రెస్‌ల అమ్మకాలు బాగున్నాయన్న ఆలోచనతో వాటిని కొనుగోలు చేసాం. ఇప్పటివరకు రెండు డ్రెస్సులు అమ్మాం. ఈ వ్యాపారంలో ఒక మంచి వి«ధానముందని తెలిసింది. వ్యాపారం చేసేందుకు ముందుగా పెట్టుబడికి రుణమొత్తం అవసరం లేదు. కొంత సొమ్ము ఇస్తే హోల్‌సేల్ వ్యాపారులు మాకు కొంత సరుకు ఇచ్చారు. అమ్మలేనివి తిరిగి ఇవ్వవచ్చన్నారు. ఆ విధానంతో ఆ వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశం ఉండదనే ఆలోచన వచ్చింది. –పి.మహేష్, మోహిన్, సాయి, తేజ, బీకాం విద్యార్థులు అవగాహన లేక నష్టం.. ఆటలు, ఆహారం అనే విధానం కొత్తరకంగా అనిపించింది. తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభాలు ఆశించవచ్చనుకున్నాం. అయితే ఇది చాలా తెలివితో చేయాల్సిన వ్యాపారమని స్టాల్ పెట్టాక తెలిసింది. ఒక చాక్లెట్ ఇస్తాం..దాన్ని ఒక నిమిషంలో చప్పరించి తినేస్తే ఒక బహుమతి ఇస్తాం. ఎగ్జిబిషన్లలో మాత్రమే ఉండే ఈ విధానంపై అవగాహన లేకపోవడంతో తొలిరోజు నష్టం చవిచూశాం. మరో రెండురోజులుంది కాబట్టి దీనిపై అవగాహన పెంచుకుంటాం. –ఎం.సీత, సుప్రియ, రమ్య, వినయ్, బీకాం విద్యార్థులు వాస్తవికత తెలుస్తుంది.. విద్యార్థులు పాఠ్యాంశాల్లో నేర్చుకున్నది వేరు. వాస్తవం తెలుసుకోవడానికి మెగా మార్కెట్ ఫెస్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అమ్మకం, నైపుణ్యం, ఖాతాదారులను ఆకట్టుకోవడం వంటివి తెలుసుకుంటారనే దీన్ని ఏర్పాటు చేశాం. దీని ద్వారా విద్యార్థులకు వ్యాపారం అంటే ఎలా ఉంటుందో కళాశాలలోనే అర్థమౌతుంది. –డాక్టర్ ఆర్.డేవిడ్‌కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ నవకల్పనలు చేయాలి.. మార్కెట్లో సృజనాత్మక ఉత్పత్తులు తయారుచేసి ప్రదర్శనకు ఉంచి అమ్మడం ద్వారా ఆ వస్తువు తయారీ, అమ్మకం ధర బేరీజు వేసుకోవచ్చు. రాబోయే కాలంలో నవకల్పనలతో కూడిన వస్తువులు తయారుచేసి అందుబాటులోకి తేవాలి. విద్యార్థులు వ్యాపార మెళకువలు నేర్చుకునేందుకు ఫెస్ట్ దోహదం చేస్తుంది. –ఆకుల సత్యనారాయణ, నగర ఎమ్మెల్యే విద్యార్థి దశలోనే తెలుసుకోవాలి వ్యాపారం చేయడం ముఖ్యం కాదు. దానినిర్థి దశనుంచే అలవాటు చేసుకోవాలి. అప్పుడే అందులో మెళకువలు తెలుసుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చు. దీనికోసం విద్యార్థులు ముందుగా అవగాహన పెంపొందించుకోవాలి. ఆ దిశగానే మెగా మార్కెట్ ఫెస్ట్ ఏర్పాటు చేశాం. మంచి ఫలితమిస్తుందని ఆశిస్తున్నాం. –కె.రత్నమాణిక్యం, మెగా మార్కెట్ ఫెస్ట్ కో ఆర్డినేటర్ -
16, 17లో 'నన్నయ' ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా
పరీక్షలను వాయిదా వేసిన నన్నయ వర్సిటీ వీసీ రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈనెల 16, 17 తేదీల్లో రాజమహేంద్రవరంలో మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నామని ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే దీనిని భారీ జాబ్ మేళాగా పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వికాస్, ఎన్టీఆర్ ట్రస్టులతో కలసి నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో విప్రో, ఇన్ఫోసిస్ వంటి వంద కంపెనీలు పాల్గొంటాయన్నారు. సుమారు ఆరు వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయన్నారు. ఈ జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులకు ఇప్పటికే బెంగళూరు, హైదరాబాద్, విజయవాడలలో మూడు నెలలుగా శిక్షణ ఇస్తున్నామన్నారు. అయితే శిక్షణ పొందని వారు కూడా హాజరుకావొచ్చన్నారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఫార్మసీ, నర్సింగ్, బీటెక్, ఎంటెక్, తదితర అర్హతలున్న వారంతా హాజరుకావొచ్చన్నారు. సుమారు వంద కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చేందుకు వస్తున్నందున ఉభయ గోదావరి జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 'నన్నయ' లో పరీక్షలు వాయిదా రాజమహేంద్రవరంలో జరగనున్న మెగా జాబ్ మేళాకు తమ యూనివర్సిటీ పరిధిలోని అర్హత ఉన్న విద్యార్థులు కూడా హాజరయ్యేందుకు వీలుగా గురువారం (15వ తేదీ) నుంచి వరుసగా మూడు రోజులపాటు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశామన్నారు. ఆ పరీక్షలు తిరిగి 19వ తేదీ నుంచి జరుగుతాయని వీసీ తెలిపారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఆదేశాలను జారీ చేశామన్నారు. -
వచ్చే నెల 3న మెగా రక్తదాన శిబిరం
మోత్కూరు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యా ఫెడరేషన మోత్కూరు ప్రాంతీయ శాఖ ఆధ్వర్యంలో వచ్చేనెల 3న మోత్కూరులోని శ్రీలక్ష్మీ ఫెట్రోల్ బంక్ ఆవరణలో మెగా రక్తశిబిరం నిర్వహిస్తున్నట్టు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ లక్ష్మీనర్సింహారెడ్డి, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి మెతుకు సైదులు తెలిపారు. సోమవారం కార్యక్రమ కరపత్రాలను మండలకేంద్రంలో వారు ఆవిష్కరించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు సోమేశ్వర్, తొర్ర ఉప్పలయ్య, సుబ్రహ్మణ శర్మ, దొర్న వెంకన్న, మోత్కూరు రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షుడు చింతల సత్యనారాయణరెడ్డి, సభ్యులు అనిల్, సత్యంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
మెగాస్టార్ మూవీ సూపర్‌హిట్ కావాలి
అంతర్వేదిలో హీరో సాయి ధరమ్‌తేజ హోమం అంతర్వేది (సఖినేటిపల్లి) : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం పూర్తిస్థాయిలో విజయం సాధించాలని, ఆయన పూర్తి ఆరోగ్యంతో ఈ చిత్రానికి పని చేయాలని కోరుకుంటూ ఆయన మేనల్లుడు, యువ హీరో సాయి ధరమ్‌తేజ అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి బుధవారం హోమం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిరంజీవి భార్య సురేఖ, కుమారుడు రామ్‌చరణ్, మెగాస్టార్ కుటుంబం నుంచి వచ్చిన హీరోలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల హోమాలు నిర్వహించారని తెలిపారు. అభిమానులు కూడా ఆరోగ్యంగా ఉండాలని హోమంలో తాను ప్రార్థించానన్నారు. తాను ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘నక్షత్రం’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నానని, కొత్త చిత్రాన్ని త్వరలో ప్రకటిస్తానని చెప్పారు. ఈ మూవీలో సాయి ధరమ్ తేజ సరసన 'కంచె' ఫేమ్ ప్రగ్యా జైశ్వాల్ కూడా పోలీసు అధికారిణి పాత్రలో కనిపించనుంది. చిరంజీవి యూత్ రాష్ట్ర అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు, రావి మురళి, గుండాబత్తుల తాతాజీ, అడబాల రాజప్ప, నామన నాగభూషణం, అధిక సంఖ్యలో అభిమానులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
13న మెగా లోక్ అదాలత్
విశాఖ లీగల్: ప్రజా న్యాయపీఠం సేవలు శాశ్వతమైనవని విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.జయసూర్య అన్నారు. విశాఖ జిల్లా కోర్టు ఆవరణలో నగరంలోని వివిధ బ్యాంకుల అధికార ప్రతినిధులతో గురువారం సాయంత్రం సమావేశమయ్యారు. వచ్చేనెల 13న జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని కోరారు. ముఖ్యంగా భారత జాతీయ బ్యాంకుల చట్టం 138ని ఉటంకించారు. చట్టపరిధిలో రాజీ కాగలిగిన బ్యాంకు కేసులను తక్షణమే గుర్తించి రాజీ ప్రయత్నాలు చేయాలన్నారు. కక్షిదారులు, న్యాయవాదులు, కంపెనీలు యాజమాన్యాలను పిలిచి మాట్లాడాలని సూచించారు. లోక్‌అదాలత్ కార్యదర్శి ఆర్.వి.నాగసుందర్ మాట్లాడుతూ వచ్చే నెల 13న బ్యాంకులు, చెల్లని చెక్కులు, రాజీ కాగలిగిన సివిల్, క్రిమినల్ తగాదాలు, కుటుంబ న్యాయస్థానం పరిధిలోని కేసులు పరిష్కరిస్తామన్నారు. కేసులు పరిష్కరించుకోవాలనుకున్నవారు తక్షణమే తమ న్యాయస్థానం, న్యాయవాది లేదా తగిన వివరాలతో లోక్ అదాలత్‌ను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, బ్యాంకు అధికారులు, లోక్ అదాలత్ సీనియర్ సభ్యులు ప్రసన్నకుమార్, ఆర్.శ్రీనివాసరావు, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
మోదీ పాలన రెండేళ్ళ పండుగ!
న్యూఢిల్లీః మోదీ రెండేళ్ళ పాలన పూర్తయిన సందర్భంగా దేశరాజధాని ఢిల్లీలో జరుగుతున్న వేడుకలతో ఇండియా గేట్ ప్రాంతం సందడిగా మారింది. పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఎన్డీఏ ప్రభుత్వ పాలనే ఇతివృత్తంగా కొనసాగిన 'మేరా దేశ్ బఢ్ రహా హై... ఆగే బఢ్ రహా హై...' అంటూ సాగిన గీతం ఆహూతులను అలరించింది. 'ఏక్ నయీ సుబహ్' పేరిట నిర్వహిస్తున్న ఐదు గంటల సుదీర్ఘ మెగా ఈవెంట్ లో భాగంగా ఎన్గీఏ పాలనలోని విజయాలు, పథకాలను కేంద్రం వివరిస్తుంది. ఢిల్లీలోని ఇండియా గేట్ ప్రాంతం కార్యకర్తలు, అభిమానులు, ప్రేక్షకులతో కోలాహలంగా మారింది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న 'ఏక్ నయీ సుబహ్' కార్యక్రమాలు మనోరంజకంగా కొనసాగుతున్నాయి. ఐదు గంటలపాటు ఏకథాటిగా కొనసాగే కార్యక్రమానికి బాలీవుడ్ నటుడు అమితాబచ్చన్ ప్రయోక్తగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంలో ఆయన బేటీ బచావో, బేటీ పడావో వంటి ప్రభుత్వ పథకాలపై చిన్నారులతో ముచ్చటించారు. ఐదు గంటలపాటు జరిగే విజయోత్సవ కార్యక్రమాన్ని మొత్తం పది సెగ్మెంట్లుగా విభజించారు. వీటిలో రెండేళ్ళ పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలు, నెరవేర్చిన హామీలు, పలు పథకాలపై చర్చించేందుకు కేటాయించారు. కార్యక్రమంలో భాగంగా మంత్రులు సాధించిన విజయాలను ప్రదర్శించేందుకు, వారితో జరిపిన ఇంటర్వ్యూలు, పథకాలవల్ల లబ్ధిపొందినవారితో చర్చలు వంటి అనేక కార్యక్రమాలను వీడియోల రూపంలో ప్రదర్శిస్తున్నారు. రాజధాని ఢిల్లీకి మాత్రమే ప్రత్యేక ప్రాధాన్యతను ఇవ్వడం కాక, దేశంలో కేంద్ర మంత్రులు ఉన్న షిల్లాంగ్, ముంబై, విజయవాడ, జైపూర్, కర్నాల్, అహ్మదాబాద్ నగరాల్లో వారు చేపట్టిన కార్యక్రమాలపై దూరదర్శన్ ప్రత్యేక లైవ్ కార్యక్రమం కూడ నిర్వహిస్తోంది. కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన కేబినెట్ లోని మంత్రులు, పలువురు సినీ తారలు, హాజరయ్యారు. -
మెగా, నందమూరి వారసుల మల్టీ స్టారర్
టాలీవుడ్లో టాప్ క్రేజ్ ఉన్న రెండు ఫ్యామిలీలు మెగా, నందమూరి ఫ్యామిలీలు. అలాంటిది ఈ రెండు ఫ్యామిలీల నుంచి వచ్చిన హీరోలు తెరను పంచుకుంటే అది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారుతుంది. అలాంటి ఆసక్తి కరమైన వార్తే ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. మెగా వారసుడు సాయిధరమ్ తేజ్, నందమూరి చిన్నోడు కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో సినిమాను తెరకెక్కించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 'పిల్లా నువ్వు లేని జీవితం' సినిమాతో సూపర్ కొట్టి తరువాత సౌఖ్యం సినిమాతో నిరాశపరిచిన దర్శకుడు ఎఎస్ రవికుమార్ చౌదరి, ఈ క్రేజీ కాంబినేషన్‌ను వెండితెర మీద ఆవిష్కరించడానికి రెడీ అవుతున్నాడు. సాయిధరమ్ తేజ్ కెరీర్‌కు మెమరబుల్ హిట్ ఇచ్చిన రవికుమార్ చౌదరికి కళ్యాణ్ రామ్‌తో కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. దీంతో ఈ ఇద్దరు హీరోలు సినిమాకు అంగీకరిస్తారన్న నమ్మకంతో ఉన్నాడు. అనుకున్నట్టగా ఈ సినిమా పట్టాలెక్కితే, యంగ్ జనరేషన్లో ఇదే క్రేజీ ప్రాజెక్ట్ అవుతుందంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.