మెగా, నందమూరి వారసుల మల్టీ స్టారర్ | as ravikumar movie with kalyan ram, sai dharam tej | Sakshi
Sakshi News home page

మెగా, నందమూరి వారసుల మల్టీ స్టారర్

Published Thu, Feb 4 2016 8:27 AM | Last Updated on Sun, Sep 3 2017 4:53 PM

మెగా, నందమూరి వారసుల మల్టీ స్టారర్

మెగా, నందమూరి వారసుల మల్టీ స్టారర్

టాలీవుడ్లో టాప్ క్రేజ్ ఉన్న రెండు ఫ్యామిలీలు మెగా, నందమూరి ఫ్యామిలీలు. అలాంటిది ఈ రెండు ఫ్యామిలీల నుంచి వచ్చిన హీరోలు తెరను పంచుకుంటే అది ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారుతుంది. అలాంటి ఆసక్తి కరమైన వార్తే ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. మెగా వారసుడు సాయిధరమ్ తేజ్, నందమూరి చిన్నోడు కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో సినిమాను తెరకెక్కించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

'పిల్లా నువ్వు లేని జీవితం' సినిమాతో సూపర్ కొట్టి తరువాత సౌఖ్యం సినిమాతో నిరాశపరిచిన దర్శకుడు ఎఎస్ రవికుమార్ చౌదరి, ఈ క్రేజీ కాంబినేషన్ను వెండితెర మీద ఆవిష్కరించడానికి రెడీ అవుతున్నాడు. సాయిధరమ్ తేజ్ కెరీర్కు మెమరబుల్ హిట్ ఇచ్చిన రవికుమార్ చౌదరికి కళ్యాణ్ రామ్తో కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. దీంతో ఈ ఇద్దరు హీరోలు సినిమాకు అంగీకరిస్తారన్న నమ్మకంతో ఉన్నాడు. అనుకున్నట్టగా ఈ సినిమా పట్టాలెక్కితే, యంగ్ జనరేషన్లో ఇదే క్రేజీ ప్రాజెక్ట్ అవుతుందంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement