
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఎన్‌కేఆర్ 21’ (వర్కింగ్ టైటిల్). ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. విజయశాంతి, శ్రీకాంత్, పృథ్వీరాజ్ కీలక పాత్రలు చేస్తున్నారు. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మాతలు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు సోహైల్ ఖాన్ తెలుగు తెరకు పరిచయం కానున్నారు.
శుక్రవారం (డిసెంబరు 20) సోహైల్ పుట్టినరోజు సందర్భంగా ‘ఎన్‌కేఆర్ 21’లో ఆయన చేస్తున్న పాత్ర ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ‘‘సోహైల్ ఖాన్ చేస్తున్న విలన్ పాత్ర, హీరో, ఈ పాత్ర మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్‌గా ఉంటాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. కల్యాణ్ రామ్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సమర్పణ: ముప్పా వెంకయ్య చౌదరి, సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, కెమెరా: రామ్ ప్రసాద్.
Comments
Please login to add a commentAdd a comment