nandamuri
-
హీరోగా ఎంట్రీ ఇస్తున్న 'జానకీ రామ్' కుమారుడు.. కథ రెడీ చేసిన డైరెక్టర్
‘సీతారామరాజు, సీతారాముల కళ్యాణం చూతము రారండి, యువరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు’ వంటి చిత్రాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వైవీఎస్ చౌదరి. తెలుగుదనం ఉట్టిపడేలా విభిన్న కథలతో సినిమాలు రూపొందించిన ఆయన కొంతకాలం బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ ఆయన ఒక సినిమాను డైరెక్ట్ చేసే పనిలో ఉన్నారట.. అది కూడా కొత్త హీరోతో ఒక ప్రాజెక్ట్‌ను సిద్ధం చేస్తున్నాడట. వైవీఎస్ చౌదరి సినీ కెరీర్లో మంచి హిట్స్ ఇచ్చి గుర్తింపు తెచ్చుకున్నారు. 2015లో సాయి ధరమ్ తేజ్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఆయనే నిర్మాతగా 'రేయ్' సినిమాను డైరెక్ట్ చేశారు. ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో మెప్పించలేదు. ఆ తర్వాత ఆయన నుంచి సినిమా రాలేదు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ఆయన మెగా ఫోన్ పట్టనున్నారని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. అందుకోసం నందమూరి కుటుంబానికి చెందిన ఒకరిని హీరోగా ఆయన ఎంచుకున్నారట. స్వర్గీయ హరికృష్ణ గారి మనమడిని హీరోగా పరిచయం చేయాలని వైవీఎస్ చౌదరి ఉన్నారట. హరికృష్ణ పెద్ద కుమారుడు జానకీ రామ్ అబ్బాయి 'తారక రామారావు'ను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ఆయన ప్లాన్‌లో ఉన్నారట. జానకీ రామ్ కుమారుడికి కూడా సినిమాలంటే ఇష్టం.. అందుకే పిల్లలతో రూపొందిన పౌరాణిక చిత్రం ‘దానవీర శూర కర్ణ’లో కృష్ణుడి పాత్రలో ఆయన నటించాడు. అదే చిత్రంలో జానకీ రామ్ రెండో కుమారుడు సౌమిత్ర కూడా సహదేవుడి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. వీరిలో తారక రామారావుతో డైరెక్టర్ వైవీఎస్ చౌదరి సినిమా ప్లాన్ చేశారు. తెలుగు సంస్కృతి, సంగీతం, సాహిత్యం కలబోతగా ఓ శక్తివంతమైన కథాంశంతో కథ ఉండబోతుందట. చక్కటి ప్రేమకథగా ఈ మూవీ ఉండబోతుందని సమాచారం. ఈ చిత్రానికి తెలుగమ్మాయిని హీరోయిన్గా తీసుకోవాలనుకుంటున్నట్లు డైరెక్టర్ ఉన్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే తారక రామారావుకు జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్‌తో పాటు ఆయన ఫ్యాన్స్ అండ కూడా బలంగా ఉంటుంది. ప్రస్తుతం తారక్ గ్లోబల్ మార్కెట్‌నే శాసిస్తున్నాడు. ఆయనకు ఫ్యాన్స్ కూడ కోట్లలో ఉన్న విషయం తెలిసిందే. జానకీ రామ్ అంటే తారక్‌కు ఎనలేని ప్రేమ.. ఇన్నీ ఎమోషన్స్ మధ్య తారక రామారావు లాంచ్ జరిగితే ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పవచ్చు. వాస్తవంగా జానకీ రామ్ కూడా తన కుమారులను సినిమా ఇండస్ట్రీలో కొనసాగించాలని గతంలో పలు సందర్భాల్లో చెప్పేవారట. కానీ 2014 డిసెంబరు నెలలో కారు ప్రమాదంలో ఆయన మరణించిన విషయం తెలిసిందే. -
వెన్నుపోటు రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు
-
ఐడీఎఫ్సీ రీజినల్ ఆఫీస్‌ను ప్రారంభించిన నందమూరి కల్యాణ్ రామ్ (ఫొటోలు)
-
Tarakaratna: నందమూరి తారకరత్న పెద్దకర్మ (ఫొటోలు)
-
టీడీపీ కౌన్సిలర్ దౌర్జన్యం
భీమవరం టౌన్: ప్రజా సమస్యలపై మునిసిపల్ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో ధర్నా చేస్తున్న వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ కోడే యుగంధర్‌పై పోలీసుల సమక్షంలోనే టీడీపీకి చెందిన కౌన్సిలర్ నందమూరి ఆంజనేయులు దాడి చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలో ప్రధాన సమస్యల పరిష్కారంలో వైఫల్యం చెందుతున్న మునిసిపాలిటీ పండుగ రోజుల్లో వివిధ వర్గాల ప్రజలు ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలను, బ్యానర్లను తొలగించడంపై వైఎస్సార్ సీపీ నాయకులు శనివారం మునిసిపాలిటీలో శాంతియుతంగా ధర్నా చేపట్టారు. వైఎస్సార్ సీపీ భీమవరం నియోజకవర్గ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నివాసం నుంచి నాయకులు, కార్యకర్తలు ప్రదర్శనగా మునిసిపాలిటీకి చేరుకున్నారు. కమిషనర్ సీహెచ్ నాగనర్సింహరావు చాంబర్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. వన్‌టౌన్ సీఐ డి.వెంకటేశ్వరరావుఆధ్వర్యంలో పోలీసులు అక్కడకు చేరకుని విషయం తెలుసుకున్నారు. చైర్మన్ కొటికలపూడి గోవిందరావు చాంబర్లో ఉన్న కమిషనర్ బయటకు వచ్చి పార్టీ శ్రేణులతో మాట్లాడారు. పోలీసులు ట్రాఫిక్సమస్యకు అవరోథంగా ఉన్న ఫ్లెక్సీలను, బ్యానర్లు తొలగించాలని మునిసిపాలిటీని కోరారని, అనుమతి లేకుండా పెట్టిన బ్యానర్లను తొలగించేందుకు జీఓ కూడా ఉందన్నారు. దీనిపై పార్టీ పట్టణ కన్వీనర్ కోడే యుగంధర్, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ గాదిరాజు తాతరాజు అభ్యంతరం తెలిపారు. సంక్రాంతి ముగిసే వరకూ ప్రజల మనోభావాలను గౌరవించాలని కోరడంతో ఉన్నతాధికారులతో మాట్లాడి అనుమతి కోరతామని నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. దీనికి వైఎస్సార్ సీపీ శ్రేణులు సానుకూలంగా స్పందిస్తుండగా టీడీపీ కౌన్సిలర్ నందమూరి ఆంజనేయులు దూకుడుగా ముందుకు వచ్చి కోడే యుగంధర్ మెడ పట్టుకుని వెనక్కి నెట్టి వేయడంతో అక్కడే ఉన్న సీఐ డి.వెంకటేశ్వరరావు, ఎస్సై పి.అప్పారావు వెంటనే తేరుకుని అడ్డుకున్నారు. పార్టీ శ్రేణులు స్పందిస్తుండగానే కౌన్సిలర్ ఆంజనేయులను కొందరు అక్కడి నుంచి కమిషనర్ చాంబర్లోకి తీసుకువెళ్లి తలుపులు గడియ పెట్టారు. విషయం తెలుసుకున్న చైర్మన్ గోవిందరావు, వైస్ చైర్మన్ ముదునూరి సూర్యనారాయణరాజు అక్కడికి వచ్చి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ప్రజా సమస్యలపై అడిగేందుకు వస్తే కౌన్సిలర్ రౌడీయుజంతో దాడి చేస్తే వెనకేసుకువస్తారా అంటూ చైర్మన్‌ను వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నించారు. సమస్యను సామరస్యంగా పరిష్కరిద్దామని చైర్మన్ సూచించగా కౌన్సిలర్ ఆంజనేయులతో క్షమాపణ చెప్పించాలని నాయకులు కామన నాగేశ్వరరావు, పేరిచర్ల సత్యనారాయణరాజు, కొల్లి ప్రసాద్, సుంకర బాబూరావు, గూడూరి ఓంకారం, భూసారపు సాయి సత్యనారాయణ, కొప్పర్తి జనార్థన్, చికిలే మంగతాయారు, నెల్సన్, కందికట్ల డేవిడ్ డిమాండ్ చేశారు. చైర్మన్, వైస్ చైర్మన్లు వైఎస్సార్ సీపీ నాయకులను చర్చలకు ఆహ్వానించారు. కమిషనర్ చాంబర్లో ఇరువర్గాలు చర్చలు జరిపారు. బహిరంగంగా దాడి చేసిన కౌన్సిలర్ ఆంజనేయులు అందరి సమక్షంలో క్షమాపణ చెప్పాలని సుంకర బాబూరావు కోరడంతో చైర్మన్ దానికి అంగీకరించకుండా లేచి వెళ్లిపోయారు. దీంతో వైఎస్సార్సీపీ శ్రేణులు మళ్లీ ధర్నా చేపట్టారు. కౌన్సిల్ హాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా సీఐలు డి.వెంకటేశ్వరరావు, ఎ.చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల సమక్షంలోనే ప్రతిపక్ష నాయకులపై దాడి చేస్తే సామాన్యుల పరిస్థితి ఏమిటని పోలీసులను కోడే యుగంధర్ ప్రశ్నించడంతో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని సీఐ డి.వెంకటేశ్వరరావు చెప్పారు. సమస్యలపై స్పందించమంటే దాడులు చేస్తారా? ప్రజా సమస్యలపై స్పందిస్తే పీక నొక్కి టీడీపీ నాయకులు రౌడీయిజం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ కోడే యుగంధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మునిసిపల్ కార్యాలయం ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పండుగ రోజుల్లో ప్రజల మనోభిప్రాయాన్ని గౌరవించి సంక్రాంతి వరకూ ఫ్లెక్సీలు తొలగించవద్దని ప్రజా స్వామ్య పద్ధతిలో శాంతియుతంగా ధర్నా చేస్తుంటే మునిసిపల్ కార్యాలయంలో అధికార పక్ష కౌన్సిలర్ దాడి చేయడం దారుణమన్నారు. కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ గాదిరాజు తాతరాజు, సీనియర్ నాయకుడు కామన నాగేశ్వరరావు, పేరిచర్ల సత్యనారాయణరాజు, నెల్సన్లు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్షంపై రాష్ట్రంలో తెలుగు దేశం దాడులు చేసే విష సంస్కృతి భీమవరం మునిసిపాలిటీకి కూడా చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. కౌన్సిలర్ నందమూరి ఆంజనేయులుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కౌన్సిలర్లు పాలవెల్లి మంగ, కానుబోయిన వెంకటరమణ, వేండ్ర విజయదుర్గ, విజ్జురోతి రాఘవకుమారి, సుంకర విజయలక్ష్మి, చెన్ను శాం తి, నాయకులు గంటా సుందర్‌కుమార్, రేవూరి గోగురాజు, పెనుమాల నర్సింహస్వామి, బి.గోపి తదితరులు పాల్గొన్నారు. -
మెగా, నందమూరి వారసుల మల్టీ స్టారర్
టాలీవుడ్లో టాప్ క్రేజ్ ఉన్న రెండు ఫ్యామిలీలు మెగా, నందమూరి ఫ్యామిలీలు. అలాంటిది ఈ రెండు ఫ్యామిలీల నుంచి వచ్చిన హీరోలు తెరను పంచుకుంటే అది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారుతుంది. అలాంటి ఆసక్తి కరమైన వార్తే ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. మెగా వారసుడు సాయిధరమ్ తేజ్, నందమూరి చిన్నోడు కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో సినిమాను తెరకెక్కించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 'పిల్లా నువ్వు లేని జీవితం' సినిమాతో సూపర్ కొట్టి తరువాత సౌఖ్యం సినిమాతో నిరాశపరిచిన దర్శకుడు ఎఎస్ రవికుమార్ చౌదరి, ఈ క్రేజీ కాంబినేషన్‌ను వెండితెర మీద ఆవిష్కరించడానికి రెడీ అవుతున్నాడు. సాయిధరమ్ తేజ్ కెరీర్‌కు మెమరబుల్ హిట్ ఇచ్చిన రవికుమార్ చౌదరికి కళ్యాణ్ రామ్‌తో కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. దీంతో ఈ ఇద్దరు హీరోలు సినిమాకు అంగీకరిస్తారన్న నమ్మకంతో ఉన్నాడు. అనుకున్నట్టగా ఈ సినిమా పట్టాలెక్కితే, యంగ్ జనరేషన్లో ఇదే క్రేజీ ప్రాజెక్ట్ అవుతుందంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. -
నారా vs నందమూరి
ప్రస్తుతం టాలీవుడ్ అందరికంటే బిజీగా ఉన్న యంగ్ హీరో నారా రోహిత్. దాదాపు పది సినిమాలు చేతిలో ఉన్న ఈ యంగ్ హీరో ఇటీవలే 'రాజా చెయ్యి వేస్తే' అనే సినిమా అంగీకరించాడు. అంతేకాదు ఈ సినిమా కోసం ఓ ఆసక్తికరమైన కాంబినేషన్‌ను కూడా సెట్ చేస్తున్నాడు రోహిత్. కొత్త దర్శకుడు ప్రదీప్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్‌గా నందమూరి వారసుడిని ఎంపిక చేశారు. నందమూరి వారసుడిగా ఎంట్రీ ఇచ్చి హీరోగా నిలదొక్కుకోవడానికి తంటాలు పడుతున్న నటుడు తారక రత్న. గ్రాండ్‌గా లాంచ్ అయినా, తరువాత ఆ ఫాంను కొనసాగించలేకపోయాడు తారకరత్న. రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన అమరావతి సినిమాతో విలన్‌గా మారిన ఈ నందమూరి చిన్నోడు చాలాకాలం తర్వాత మరోసారి ప్రతినాయక నటిస్తున్నాడు. అది నారా రోహిత్‌కు ప్రతినాయకుడిగా కావటంతో ఈ వార్త మరింత హాట్ టాపిక్‌గా మారింది. వారాహి చలనచిత్ర బ్యానర్‌పై సక్సెస్ఫుల్ నిర్మాత సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. రోహిత్ కెరీర్లో గతంలో ఎన్నడూ చేయని విధంగా ఫుల్‌లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు దర్శకుడు ప్రదీప్. వెండితెర మీద నారా వర్సెస్ నందమూరి ఫార్ములా ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి. -
బాలయ్యకు అభిమాని ఉత్తరం
-
పెద బావ ఎక్కడ?