‘సీతారామరాజు, సీతారాముల కళ్యాణం చూతము రారండి, యువరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు’ వంటి చిత్రాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వైవీఎస్ చౌదరి. తెలుగుదనం ఉట్టిపడేలా విభిన్న కథలతో సినిమాలు రూపొందించిన ఆయన కొంతకాలం బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ ఆయన ఒక సినిమాను డైరెక్ట్ చేసే పనిలో ఉన్నారట.. అది కూడా కొత్త హీరోతో ఒక ప్రాజెక్ట్‌ను సిద్ధం చేస్తున్నాడట.
వైవీఎస్ చౌదరి సినీ కెరీర్‌లో మంచి హిట్స్ ఇచ్చి గుర్తింపు తెచ్చుకున్నారు. 2015లో సాయి ధరమ్ తేజ్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఆయనే నిర్మాతగా 'రేయ్' సినిమాను డైరెక్ట్ చేశారు. ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో మెప్పించలేదు. ఆ తర్వాత ఆయన నుంచి సినిమా రాలేదు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ఆయన మెగా ఫోన్ పట్టనున్నారని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. అందుకోసం నందమూరి కుటుంబానికి చెందిన ఒకరిని హీరోగా ఆయన ఎంచుకున్నారట.
స్వర్గీయ హరికృష్ణ గారి మనమడిని హీరోగా పరిచయం చేయాలని వైవీఎస్ చౌదరి ఉన్నారట. హరికృష్ణ పెద్ద కుమారుడు జానకీ రామ్ అబ్బాయి 'తారక రామారావు'ను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ఆయన ప్లాన్‌లో ఉన్నారట. జానకీ రామ్ కుమారుడికి కూడా సినిమాలంటే ఇష్టం.. అందుకే పిల్లలతో రూపొందిన పౌరాణిక చిత్రం ‘దానవీర శూర కర్ణ’లో కృష్ణుడి పాత్రలో ఆయన నటించాడు. అదే చిత్రంలో జానకీ రామ్ రెండో కుమారుడు సౌమిత్ర కూడా సహదేవుడి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. వీరిలో తారక రామారావుతో డైరెక్టర్ వైవీఎస్ చౌదరి సినిమా ప్లాన్ చేశారు.
తెలుగు సంస్కృతి, సంగీతం, సాహిత్యం కలబోతగా ఓ శక్తివంతమైన కథాంశంతో కథ ఉండబోతుందట. చక్కటి ప్రేమకథగా ఈ మూవీ ఉండబోతుందని సమాచారం. ఈ చిత్రానికి తెలుగమ్మాయిని హీరోయిన్‌గా తీసుకోవాలనుకుంటున్నట్లు డైరెక్టర్ ఉన్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే తారక రామారావుకు జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్‌తో పాటు ఆయన ఫ్యాన్స్ అండ కూడా బలంగా ఉంటుంది. ప్రస్తుతం తారక్ గ్లోబల్ మార్కెట్‌నే శాసిస్తున్నాడు. ఆయనకు ఫ్యాన్స్ కూడ కోట్లలో ఉన్న విషయం తెలిసిందే.
జానకీ రామ్ అంటే తారక్‌కు ఎనలేని ప్రేమ.. ఇన్నీ ఎమోషన్స్ మధ్య తారక రామారావు లాంచ్ జరిగితే ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పవచ్చు. వాస్తవంగా జానకీ రామ్ కూడా తన కుమారులను సినిమా ఇండస్ట్రీలో కొనసాగించాలని గతంలో పలు సందర్భాల్లో చెప్పేవారట. కానీ 2014 డిసెంబరు నెలలో కారు ప్రమాదంలో ఆయన మరణించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment