janaki ram
-
హీరోగా ఎంట్రీ ఇస్తున్న 'జానకీ రామ్' కుమారుడు.. కథ రెడీ చేసిన డైరెక్టర్
‘సీతారామరాజు, సీతారాముల కళ్యాణం చూతము రారండి, యువరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు’ వంటి చిత్రాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వైవీఎస్ చౌదరి. తెలుగుదనం ఉట్టిపడేలా విభిన్న కథలతో సినిమాలు రూపొందించిన ఆయన కొంతకాలం బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ ఆయన ఒక సినిమాను డైరెక్ట్ చేసే పనిలో ఉన్నారట.. అది కూడా కొత్త హీరోతో ఒక ప్రాజెక్ట్‌ను సిద్ధం చేస్తున్నాడట. వైవీఎస్ చౌదరి సినీ కెరీర్లో మంచి హిట్స్ ఇచ్చి గుర్తింపు తెచ్చుకున్నారు. 2015లో సాయి ధరమ్ తేజ్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఆయనే నిర్మాతగా 'రేయ్' సినిమాను డైరెక్ట్ చేశారు. ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో మెప్పించలేదు. ఆ తర్వాత ఆయన నుంచి సినిమా రాలేదు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ఆయన మెగా ఫోన్ పట్టనున్నారని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. అందుకోసం నందమూరి కుటుంబానికి చెందిన ఒకరిని హీరోగా ఆయన ఎంచుకున్నారట. స్వర్గీయ హరికృష్ణ గారి మనమడిని హీరోగా పరిచయం చేయాలని వైవీఎస్ చౌదరి ఉన్నారట. హరికృష్ణ పెద్ద కుమారుడు జానకీ రామ్ అబ్బాయి 'తారక రామారావు'ను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ఆయన ప్లాన్‌లో ఉన్నారట. జానకీ రామ్ కుమారుడికి కూడా సినిమాలంటే ఇష్టం.. అందుకే పిల్లలతో రూపొందిన పౌరాణిక చిత్రం ‘దానవీర శూర కర్ణ’లో కృష్ణుడి పాత్రలో ఆయన నటించాడు. అదే చిత్రంలో జానకీ రామ్ రెండో కుమారుడు సౌమిత్ర కూడా సహదేవుడి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. వీరిలో తారక రామారావుతో డైరెక్టర్ వైవీఎస్ చౌదరి సినిమా ప్లాన్ చేశారు. తెలుగు సంస్కృతి, సంగీతం, సాహిత్యం కలబోతగా ఓ శక్తివంతమైన కథాంశంతో కథ ఉండబోతుందట. చక్కటి ప్రేమకథగా ఈ మూవీ ఉండబోతుందని సమాచారం. ఈ చిత్రానికి తెలుగమ్మాయిని హీరోయిన్గా తీసుకోవాలనుకుంటున్నట్లు డైరెక్టర్ ఉన్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే తారక రామారావుకు జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్‌తో పాటు ఆయన ఫ్యాన్స్ అండ కూడా బలంగా ఉంటుంది. ప్రస్తుతం తారక్ గ్లోబల్ మార్కెట్‌నే శాసిస్తున్నాడు. ఆయనకు ఫ్యాన్స్ కూడ కోట్లలో ఉన్న విషయం తెలిసిందే. జానకీ రామ్ అంటే తారక్‌కు ఎనలేని ప్రేమ.. ఇన్నీ ఎమోషన్స్ మధ్య తారక రామారావు లాంచ్ జరిగితే ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పవచ్చు. వాస్తవంగా జానకీ రామ్ కూడా తన కుమారులను సినిమా ఇండస్ట్రీలో కొనసాగించాలని గతంలో పలు సందర్భాల్లో చెప్పేవారట. కానీ 2014 డిసెంబరు నెలలో కారు ప్రమాదంలో ఆయన మరణించిన విషయం తెలిసిందే. -
పాకిస్తాన్ నుంచి క్షేమంగా..
మహారాణిపేట (విశాఖ): ఐదు సంవత్సరాల పాటు పాకిస్తాన్ జైలులో మగ్గిపోయిన ముగ్గురు మత్స్యకారులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో బయట పడ్డారని ఆంధ్రప్రదేశ్ మరపడవల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాసుపల్లి జానకీరామ్ తెలిపారు. మంగళవారం విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఏపీ మరపడవల సంఘం కార్యాలయంలో విశాఖ చేరుకున్న మత్స్యకారులు పి.నారాయణరావు(ఐ.పోలవరం,పసుపులంకగ్రామం), మైలపల్లి భాస్కరరావు (ఎచ్చెర్ల, కొయ్యాం గ్రామం), మాదే అన్నవరం (గజ్జికాయలపురం,కాట్రేకు కోన)తో కలిసి జానకీరామ్ విలేకరులతో మాట్లాడారు. పాకిస్తాన్ బాధిత మత్స్యకారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, వీరికి అయిదు లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేíÙయా, మత్స్యకార భరోసా ఇవ్వాలని కోరారు. బతుకు తెరువు కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ ముగ్గురు మత్స్యకారులు గుజరాత్ వీరావల్ ప్రాంతానికి వలస వెళ్లి చేపల వేట చేస్తూ 2018 నవంబర్‌లో పాకిస్తాన్ కోస్ట్ గార్డుకి చిక్కుకున్నారని ఏపీ సీఎం చొరవతో ఇప్పుడు బయట పడ్డారని వివరించారు. బుధవారం మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు సమక్షంలో వీరిని కుటుంబసభ్యులకు అప్పగిస్తామని జానకీరామ్ తెలిపారు. -
ఫిషింగ్ హార్బర్‌పై వైఎస్సార్సీపీ జెండా
మహారాణిపేట (విశాఖ దక్షిణ): విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌పై వైఎస్సార్సీపీ జెండా ఎగిరింది. 32 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అధీనంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మరపడవల సంఘాన్ని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. సంఘం కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా వైఎస్సార్సీపీకి చెందిన వాసుపల్లి జానకీరామ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లోని ఆంధ్రప్రదేశ్ మరపడవల సంఘంలో 300 మంది సభ్యులున్నారు. వీరికి 680 బోట్లున్నాయి. ఈ సంఘానికి అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీకి చెందిన పి.సి.అప్పారావు కొన్నేళ్లుగా ఎన్నికవుతున్నారు. ఎప్పుడూ ఓటింగ్ నిర్వహించకుండా చేతులు ఎత్తే పద్ధతినే అనుసరిస్తూ గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న అప్పారావు మరపడవల సంఘం అధ్యక్షుడిగాను కొనసాగుతుండేవారు. ఈ నేపథ్యంలో దివంగత మాజీ కార్పొరేటర్ బి.నీలకంఠం అల్లుడు వాసుపల్లి జానకీరామ్ సంఘంలో చేరడానికి చేసిన ప్రయత్నాలను అప్పారావు అడ్డుకునేవారు. ఏపీ మరపడవల సంఘంలోని అవకతవకలను పలుమార్లు లేవనెత్తిన వాసుపల్లి జానకీరామ్ ఎన్నికలు నిర్వహించాలని కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సంఘం కార్యవర్గానికి కాలపరిమితి ముగియడంతో ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. సోమవారం పోలీసు బందోబస్తు మధ్య జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికలు వద్దని అప్పారావు వర్గం, నిర్వహించాలని జానకీరామ్ వర్గం ఈ సమావేశంలో పట్టుబట్టాయి. రెండువర్గాల మధ్య వాదోపవాదాలు సాగాయి. పరిస్థితి గమనించిన పి.సి.అప్పారావు పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. అనంతరం నిర్వహించిన ఎన్నికల్లో జానకీరామ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జానకీరామ్ మాట్లాడుతూ మత్స్యకారుల సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తానని చెప్పారు. మత్స్యకారుల సంక్షేమం కోసం సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. -
త్వరలో రెండు కొత్త నిమ్మ రకాలు
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ ద్వారా రెండు కొత్త నిమ్మ రకాలను విడుదల చేయనున్నట్లు వర్సిటీ వీసీ డాక్టర్ టి.జానకీరాం తెలిపారు. తిరుపతిలోని చీనీ, నిమ్మ పరిశోధన స్థానాన్ని ఆయన శనివారం సందర్శించారు. ఇక్కడ అభివృద్ధి చేస్తున్న చీనీ, నిమ్మ మొక్కల నర్సరీని పరిశీలించారు. రైతులతో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఏఎల్–94–14, టీఏఎల్–94–13 అనే రెండు కొత్త నిమ్మ రకాలను రూపొందించామన్నారు. త్వరలోనే వీటిని విడుదల చేస్తామని తెలిపారు. ఇందులో టీఏఎల్–94–14 రకం ఊరగాయ తయారీకి ఉపయోగకరమన్నారు. సీఎస్ఐఆర్ సంస్థ నుంచి పరిశోధన ప్రాజెక్ట్ లభించిందని, తిరుపతి పరిశోధన స్థానంలో ఈ ప్రాజెక్ట్ చేపడతామని చెప్పారు. వర్సిటీ ఈ ఏడాదిని చీనీ, నిమ్మ సంవత్సరంగా గుర్తించి ఈ పంటల సాగు విస్తీర్ణం పెంపునకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గత ఏడాది కాలంలో 1.5 లక్షల చీనీ, నిమ్మ మొక్కలను రైతులకు అందించినట్టు చెప్పారు. గుంటూరు లాం ఫామ్‌లో మిరప, అనంతరాజు పేట పరిశోధన స్థానంలో కనకాంబరం పూలపై పరిశోధనల కోసం రెండు సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వర్సిటీ పరిశోధన సంచాలకులు ఆర్వీఎస్కే రెడ్డి, విస్తరణ సంచాలకులు బి.శ్రీనివాసులు, తిరుపతి చీనీ, నిమ్మ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త ఆర్.నాగరాజు పాల్గొన్నారు. -
నందమూరి ఫ్యామిలీని వెంటాడిన రోడ్డు ప్రమాదాలు
-
నందమూరి కుటుంబానికే ఎందుకిలా..
సాక్షి, హైదరాబాద్ : ఈ మధ్య విడుదలైన నందమూరి వారసుల చిత్రాల ప్రారంభానికి ముందు వచ్చే వాయిస్ ఓవర్ వినే ఉంటారు. ‘అతి వేగం ప్రమాదకరం.. యాక్సిడెంట్ వల్ల మేము ఇప్పటికే మా ప్రియ సోదరున్ని కోల్పోయాము. ఆ పరిస్థితి మరేవరికి రావద్దు’ అనే మాటలు వినిపిస్తాయి. కానీ అతివేగమే నందమూరి కుటుంబం పాలిట శాపమవుతోంది. హరికృష్ణ మరణంతో కలిపి ఇప్పటికే వారి ఇంట మూడు యాక్సిడెంట్లు జరిగాయి. జూ ఎన్టీఆర్‌తో ప్రారంభమైన ఈ రోడ్డు ప్రమాదాల పరంపర నందమూరి హరికృష్ణ మరణం వరకూ కొనసాగింది. ఓ సారి ఆ ప్రమాదాల వివరాలు.. 2009 నుంచి ప్రారంభం.. నందమూరి ఇంట తొలి రోడ్డు ప్రమాదం 2009లో చోటు చేసుకుంది. 2009 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జూ. ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ తరపున ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో జూ. ఎన్టీఆర్ ఖమ్మంలో ప్రచారం నిర్వహించి హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు. ఆ సమయంలో నల్గొండ జిల్లాలోని చివ్వెంల మండలం మోతే వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జూనియర్ ఎన్టీఆర్ కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జూ. ఎన్టీఆర్ తీవ్రంగా గాయపడినా.. సురక్షితంగా బయటపడ్డారు. నాలుగేళ్ల క్రితం జానకీరామ్ దుర్మరణం.. నాలుగేళ్ల కిందట నల్లగొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన పెద్ద కుమారుడు జానకిరామ్ దుర్మరణం చెందారు. 2014 డిసెంబరు 6 న హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పడంతో జానకిరామ్ మృతిచెందారు. ట్రాక్టర్‌ను తప్పించబోయి జానకిరామ్ కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మరణించారు. నాడు కుమారుడు.. నేడు తండ్రి ఈ రోజు ఉదయం నల్లగొండ జిల్లా అన్నెపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ దుర్మరణం పాలయ్యారు. నెల్లూరులో ఓ వివాహానికి వెళ్తున్న హరికృష్ణ స్వయంగా తానే వాహనం నడిపారు. ఈ సందర్భంగా అతి వేగంగా దూసుకెళ్లిన హరికృష్ణ వాహనం ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హరికృష్ణ కారులోంచి ఎగిరి 30 అడుగుల దూరంలో పడ్డారు. తీవ్ర గాయల పాలైన ఆయన కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అయితే నందమూరి వారి ఇంట జరిగిన యాక్సిడెంట్లు అన్ని నల్గొండ జిల్లాలోనే జరగడం గమనార్హం. మరో ఆసక్తికర అంశం ఏంటంటే నాడు జానకీరామ్ వాహనం నెంబర్.. నేడు హరికృష్ణ ప్రయాణం చేసిన వాహనం నంబర్లు రెండు కూడా ఒక్కటే (AP 29 BD 2323) కావటం విశేషం. సంబంధిత కథనాలు... ఇష్టమైన డ్రైవింగే.. విషాదం నింపింది! హరికృష్ణ మృతికి కారణాలివే..! ప్రముఖుల ఇంట విషాదం రేపిన రోడ్డుప్రమాదాలు! -
ఇష్టమైన డ్రైవింగే.. విషాదం నింపింది!
సాక్షి, హైదరాబాద్ : నందమూరి హరికృష్ణతోపాటు ఆయన కుటుంబసభ్యులకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ఆయన చైతన్యరథాన్ని హరికృష్ణ స్వయంగా నడిపారు. ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారంలో హరికృష్ణ చైతన్యరథం నడుపుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తండ్రి ఎన్టీఆర్‌ను సినిమా షూటింగ్‌లకు తానే స్వయంగా కారు నడుపుతూ తీసుకెళ్లేవారు. ఇంట్లో పలువురు డ్రైవర్లు ఉన్నా.. స్వయంగా వాహనం నడపడానికే ఆయన ఇష్టపడేవారు. డ్రైవింగ్‌లో ఆయన నిష్ణాతుడు అని పేరు ఉంది. ఈ క్రమంలోనే నెల్లారు జిల్లా కావలిలో ఓ పెళ్లికి హాజరయ్యేందుకు బుధవారం తెల్లవారుజామున స్వయంగా వాహనం నడుపుతూ బయలుదేరి వెళ్లారు. ఇంతలో జరిగిన తాజా విషాదం నందమూరి కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. నందమూరి అభిమానులు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నందమూరి హరికృష్ణ కుటుంబానికి ఎంతో ఇష్టమైన డ్రైవింగే.. వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిందని, 2009లో నల్లగొండ జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ రోడ్డుప్రమాదంలో గాయాలపాలై.. అదృష్టవశాత్తు బయటపడ్డారని, నాలుగేళ్ల కిందట హరికృష్ణ తనయుడు జానకీరామ్ రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా.. ఇప్పుడు హరికృష్ణ సైతం రోడ్డుప్రమాదంలో ప్రాణాలు విడిచారని అభిమానులు అంటున్నారు. -
జానకిరామ్ ప్రమాద ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ అరెస్ట్
మునగాల: నందమూరి జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడానికి కారకుడైన ట్రాక్టర్ డ్రైవర్‌ను అరెస్ట్ చేసినట్టు మునగాల ఎస్ఐ రమేష్ తెలిపారు. శనివారం హైదరాబాద్ నుంచి విజయవాడకు కారులో వెళుతున్న జానకిరామ్ నల్లగొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ట్రాక్టర్‌ను ఢీకొట్టి దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. గరిడేపల్లి మండలం కోనాయిగూడెం గ్రామానికి చెందిన యలమంచి వెంకన్న ట్రాక్టర్‌ను జాతీయ రహదారిపై క్రాసింగ్ వద్ద రాంగ్రూట్లో యూటర్న్ తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా, వెంకన్న సోమవారం స్వగ్రామంలో ఉన్నాడని సమాచారం తెలుసుకుని వెళ్లి అదుపులోకి తీసుకున్నట్టు ఎస్ఐ వివరించారు. అదేరోజు ట్రాక్టర్ డ్రైవర్‌పై సెక్షన్ 304(ఏ) కింద కేసు నమోదు చేశామని తెలిపారు. అనంతరం నిందితుడిని కోదాడ మున్సిఫ్ కోర్టులో హాజరుపర్చినట్టు చెప్పారు. -
పరారీలో ట్రాక్టర్ డ్రైవర్: కేసు నమోదు
నల్గొండ: నందమూరి హరికృష్ణ కుమారుడు జానకిరామ్ (42) మృతికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం సాయంత్రం జానకిరామ్ ప్రయాణిస్తున్నటాటా సఫారీ ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి కారణమైన ఆ ట్రాక్టర్ గరిడేపల్లి మండలం కోనాయిగూడెం చెందినదిగా గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ట్రాక్టర్ డ్రైవర్ పై 304(ఏ) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. నందమూరి జానకిరామ్ శనివారం హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు టాటా సఫా రీ వాహనం (ఏపీ 29 బీడీ 2323)లో బయలుదేరారు. సాయంత్రం 6:45 నిమిషాల సమయంలో నల్లగొండ జిల్లా ఆకుపాముల శివారులో ఉండగా.. వరినారు తీసుకొని రాంగ్రూట్లో వెళుతున్న ట్రాక్టర్‌ను తప్పించబోయి దాని ట్రాలీని ఆయన వాహనం ఢీకొట్టడంతో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. -
నందమూరి హరికృష్ణ కుమారుడు జానకిరామ్ దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో పెద్ద కుమారుడు జానకిరామ్ మృతి రాంగ్ రూట్లో వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొన్న వాహనం విరిగిన జానకిరామ్ కుడిచెయ్యి, కడుపులో తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూత నల్లగొండ జిల్లా ఆకుపాముల శివారులో 65 నంబర్ జాతీయ రహదారిపై దుర్ఘటన హైదరాబాద్‌లోని జానకిరామ్ నివాసానికి వెళ్లిన చంద్రబాబు తరలివచ్చిన సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు తెలంగాణ సీఎం కేసీఆర్, వైఎస్ జగన్ సంతాపం మునగాల, కోదాడ, హైదరాబాద్: టీడీపీ పొలి ట్‌బ్యూరో సభ్యుడు, సినీనటుడు నందమూరి హరికృష్ణ కుమారుడు జానకిరామ్(42) శని వారం రోడ్డు ప్రమాదంలో మరణించారు. హైదరాబాద్-విజయవాడ 65 నంబర్ జాతీ య రహదారిపై నల్లగొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ఈ ఘటన జరి గింది. జానకిరామ్ ప్రయాణిస్తున్న టాటా సఫారీ వాహనం ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. నందమూరి జానకిరామ్ శనివారం హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు టాటా సఫా రీ వాహనం (ఏపీ 29 బీడీ 2323)లో బయలుదేరారు. సాయంత్రం 6:45 నిమిషాల సమయంలో నల్లగొండ జిల్లా ఆకుపాముల శివారులో ఉండగా.. వరినారు తీసుకొని రాంగ్రూట్లో వెళుతున్న ట్రాక్టర్‌ను తప్పించబోయి దాని ట్రాలీని ఆయన వాహనం ఢీకొంది. ఈ సమయంలో వాహనాన్ని నడుపుతున్న జానకిరామ్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. గ్రామస్తులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని 108కు సమాచారం ఇచ్చారు. జానకిరామ్ సెల్‌ఫోన్ తీసుకుని అందులో ఉన్న డయల్ నంబర్‌కు ఫోన్ చేయగా.. హరికృష్ణ లిఫ్ట్ చేశారు. దీంతో గాయపడిన వ్యక్తిని జానకిరామ్గా గుర్తించా రు. ఆయనను చికిత్స నిమిత్తం కోదాడకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. కుడిచేయి విరగడంతో పాటు, కడుపులో తీవ్రగాయాలు కావడంతో జానకిరామ్ మృతి చెందారని వైద్యులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న కోదాడ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కాగా.. జానకిరామ్ మృతదేహాన్ని శనివారం రాత్రి 8 గంట లకు కోదాడ నుంచి హైదరాబాద్‌కు తరలించా రు. ఉస్మానియా ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని హరికృష్ణ ఇంటికి తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం.. రాంగ్రూట్లో వచ్చిన ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఎదురుగా వాహనాలు వస్తు న్నా.. దాదాపు రెండు కిలోమీటర్ల దూరం ట్రా క్టర్ డ్రైవర్ రాంగ్రూట్లోనే వచ్చాడు. అక్కడ ఆకుపాముల గ్రామంలోకి వెళ్లడానికి రోడ్డు దాటాల్సి ఉన్న క్రమంలో.. జానకిరామ్ వాహ నం వేగంగా దూసుకువచ్చింది. ఆ ట్రాక్టర్‌ను తప్పించబోయిన జానకిరామ్... దాదాపు 130 కిలోమీటర్ల వేగంతో ఉన్న తన వాహనాన్ని నియంత్రించలేక ట్రక్కును ఢీకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇంటివద్ద విషాద ఛాయలు.. జానకిరామ్ మృతితో నందమూరి కుటుంబం లో, బంధువుల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. భార్య దీపిక, కుమారులు మాస్టర్ ఎన్టీఆర్, సౌమిత్ర తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగి పోయారు. మృతి సమాచారం తెలిసిన ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వ రి, కుమారుడు లోకేష్‌తో రాత్రి 8:30 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌లోని ఎన్ఎండీసీ ప్రాంతంలో ఉన్న జానకిరామ్ నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులను ఓదార్చారు. వారి సమీప బంధువులు, అభిమానులు పెద్ద సంఖ్యలో జానకిరామ్ నివాసానికి తరలివచ్చారు. కాకినాడలో వ్యాపారం.. నందమూరి హరికృష్ణ మొదటి భార్య పెద్ద కుమారుడు జానకిరామ్. ప్రస్తుతం కాకినాడలో వ్యాపార రంగంలో ఉన్న ఆయన హీరో కల్యాణ్‌రామ్‌కి అన్నయ్య. జానకిరామ్‌కు ఇద్దరు కుమారులు. వారిలో ఒకబ్బాయి పేరు నందమూరి తారక రామారావు. అందరూ పిల్లలతో రూపొందుతున్న పౌరాణిక చిత్రం ‘దానవీర శూర కర్ణ’లో కృష్ణుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో జానకిరామ్ చిన్న కుమారుడు సౌమిత్ర సహదేవుడి పాత్రలో నటిస్తున్నాడు. కల్యాణ్‌రామ్ ‘అతనొక్కడే’ చిత్రానికి మొదట జానకిరామే నిర్మాతగా వ్యవహరించారు కూడా. జానకిరామ్ మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి హరికృష్ణ కుటుంబానికి సానుభూతి తెలియజేసిన కేసీఆర్, చంద్రబాబు, జగన్ సాక్షి, హైదరాబాద్: జానకిరామ్ మృతి పట్ల తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని, సం తాపాన్ని వ్యక్తం చేశారు. వార్త తెలిసిన చంద్రబాబు హరికృష్ణ నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులను ఓదార్చారు. ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, కేంద్రమంత్రి వై.సత్యనారాయణ చౌదరి, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కె.రామ్మోహనరావు, ఏపీ మంత్రులు అచ్చన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, నారా లోకేశ్ తదితరులు సంతాపం ప్రకటించినవారిలో ఉన్నారు. తన సోదరుని కుమారుడి మృతి పట్ల హిందూపురం ఎమ్మెల్యే ఎన్.బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.