నందమూరి హరికృష్ణ కుమారుడు జానకిరామ్ దుర్మరణం | tdp leader nandamuri hari krishna son janiki ram dies in car accident | Sakshi
Sakshi News home page

నందమూరి హరికృష్ణ కుమారుడు జానకిరామ్ దుర్మరణం

Published Sun, Dec 7 2014 5:26 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

జానకిరామ్ - Sakshi

జానకిరామ్

  • రోడ్డు ప్రమాదంలో పెద్ద కుమారుడు జానకిరామ్ మృతి
  • రాంగ్ రూట్‌లో వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొన్న వాహనం
  • విరిగిన జానకిరామ్ కుడిచెయ్యి, కడుపులో తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూత
  • నల్లగొండ జిల్లా ఆకుపాముల శివారులో  65 నంబర్ జాతీయ రహదారిపై దుర్ఘటన
  • హైదరాబాద్‌లోని జానకిరామ్ నివాసానికి వెళ్లిన చంద్రబాబు
  • తరలివచ్చిన సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు
  • తెలంగాణ సీఎం కేసీఆర్, వైఎస్ జగన్ సంతాపం
  • మునగాల, కోదాడ, హైదరాబాద్: టీడీపీ పొలి ట్‌బ్యూరో సభ్యుడు, సినీనటుడు నందమూరి హరికృష్ణ కుమారుడు జానకిరామ్(42) శని వారం రోడ్డు ప్రమాదంలో మరణించారు. హైదరాబాద్-విజయవాడ 65 నంబర్ జాతీ య రహదారిపై నల్లగొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ఈ ఘటన జరి గింది. జానకిరామ్ ప్రయాణిస్తున్న టాటా సఫారీ వాహనం ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
     
    నందమూరి జానకిరామ్ శనివారం హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు టాటా సఫా రీ వాహనం (ఏపీ 29 బీడీ 2323)లో బయలుదేరారు. సాయంత్రం 6:45 నిమిషాల సమయంలో నల్లగొండ జిల్లా ఆకుపాముల శివారులో ఉండగా.. వరినారు తీసుకొని రాంగ్‌రూట్‌లో వెళుతున్న ట్రాక్టర్‌ను తప్పించబోయి దాని ట్రాలీని ఆయన వాహనం ఢీకొంది. ఈ సమయంలో వాహనాన్ని నడుపుతున్న జానకిరామ్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి.

    గ్రామస్తులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని 108కు సమాచారం ఇచ్చారు. జానకిరామ్ సెల్‌ఫోన్ తీసుకుని అందులో ఉన్న డయల్ నంబర్‌కు ఫోన్ చేయగా.. హరికృష్ణ లిఫ్ట్ చేశారు. దీంతో గాయపడిన వ్యక్తిని జానకిరామ్‌గా గుర్తించా రు. ఆయనను చికిత్స నిమిత్తం కోదాడకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. కుడిచేయి విరగడంతో పాటు, కడుపులో తీవ్రగాయాలు కావడంతో జానకిరామ్ మృతి చెందారని వైద్యులు వెల్లడించారు.

    విషయం తెలుసుకున్న కోదాడ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కాగా.. జానకిరామ్ మృతదేహాన్ని శనివారం రాత్రి 8 గంట లకు కోదాడ నుంచి హైదరాబాద్‌కు తరలించా రు. ఉస్మానియా ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని హరికృష్ణ ఇంటికి తరలించారు.
     
    ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం..

    రాంగ్‌రూట్‌లో వచ్చిన ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఎదురుగా వాహనాలు వస్తు న్నా.. దాదాపు రెండు కిలోమీటర్ల దూరం ట్రా క్టర్ డ్రైవర్ రాంగ్‌రూట్‌లోనే వచ్చాడు. అక్కడ ఆకుపాముల గ్రామంలోకి వెళ్లడానికి రోడ్డు దాటాల్సి ఉన్న క్రమంలో.. జానకిరామ్ వాహ నం వేగంగా దూసుకువచ్చింది. ఆ ట్రాక్టర్‌ను తప్పించబోయిన జానకిరామ్... దాదాపు 130 కిలోమీటర్ల వేగంతో ఉన్న తన వాహనాన్ని నియంత్రించలేక ట్రక్కును ఢీకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
     
    ఇంటివద్ద విషాద ఛాయలు..

    జానకిరామ్ మృతితో నందమూరి కుటుంబం లో, బంధువుల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. భార్య దీపిక, కుమారులు మాస్టర్ ఎన్టీఆర్, సౌమిత్ర తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగి పోయారు. మృతి సమాచారం తెలిసిన ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వ రి, కుమారుడు లోకేష్‌తో రాత్రి 8:30 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌లోని ఎన్‌ఎండీసీ ప్రాంతంలో ఉన్న జానకిరామ్ నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులను ఓదార్చారు. వారి సమీప బంధువులు, అభిమానులు పెద్ద సంఖ్యలో జానకిరామ్ నివాసానికి తరలివచ్చారు.
     
    కాకినాడలో వ్యాపారం..

    నందమూరి హరికృష్ణ మొదటి భార్య పెద్ద కుమారుడు జానకిరామ్. ప్రస్తుతం కాకినాడలో వ్యాపార రంగంలో ఉన్న ఆయన హీరో కల్యాణ్‌రామ్‌కి అన్నయ్య. జానకిరామ్‌కు ఇద్దరు కుమారులు. వారిలో ఒకబ్బాయి పేరు నందమూరి తారక రామారావు. అందరూ పిల్లలతో రూపొందుతున్న పౌరాణిక చిత్రం ‘దానవీర శూర కర్ణ’లో కృష్ణుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో జానకిరామ్ చిన్న కుమారుడు సౌమిత్ర సహదేవుడి పాత్రలో నటిస్తున్నాడు. కల్యాణ్‌రామ్ ‘అతనొక్కడే’ చిత్రానికి మొదట జానకిరామే నిర్మాతగా వ్యవహరించారు కూడా.
     
    జానకిరామ్ మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి

    హరికృష్ణ కుటుంబానికి సానుభూతి తెలియజేసిన కేసీఆర్, చంద్రబాబు, జగన్
    సాక్షి, హైదరాబాద్: జానకిరామ్ మృతి పట్ల తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని, సం తాపాన్ని వ్యక్తం చేశారు. వార్త తెలిసిన చంద్రబాబు హరికృష్ణ నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులను ఓదార్చారు. ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, కేంద్రమంత్రి వై.సత్యనారాయణ చౌదరి, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కె.రామ్మోహనరావు, ఏపీ మంత్రులు అచ్చన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, నారా లోకేశ్ తదితరులు సంతాపం ప్రకటించినవారిలో ఉన్నారు. తన సోదరుని కుమారుడి మృతి పట్ల హిందూపురం ఎమ్మెల్యే ఎన్.బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement