పరారీలో ట్రాక్టర్ డ్రైవర్: కేసు నమోదు | case filed on tractor driver, | Sakshi
Sakshi News home page

పరారీలో ట్రాక్టర్ డ్రైవర్: కేసు నమోదు

Published Sun, Dec 7 2014 10:36 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

పరారీలో ట్రాక్టర్ డ్రైవర్: కేసు నమోదు - Sakshi

పరారీలో ట్రాక్టర్ డ్రైవర్: కేసు నమోదు

నల్గొండ:  నందమూరి హరికృష్ణ కుమారుడు జానకిరామ్ (42)  మృతికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం సాయంత్రం జానకిరామ్ ప్రయాణిస్తున్నటాటా సఫారీ  ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి కారణమైన ఆ ట్రాక్టర్ గరిడేపల్లి మండలం కోనాయిగూడెం చెందినదిగా గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ట్రాక్టర్ డ్రైవర్ పై 304(ఏ)  సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

 

నందమూరి జానకిరామ్ శనివారం హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు టాటా సఫా రీ వాహనం (ఏపీ 29 బీడీ 2323)లో బయలుదేరారు. సాయంత్రం 6:45 నిమిషాల సమయంలో నల్లగొండ జిల్లా ఆకుపాముల శివారులో ఉండగా.. వరినారు తీసుకొని రాంగ్‌రూట్‌లో వెళుతున్న ట్రాక్టర్‌ను తప్పించబోయి దాని ట్రాలీని ఆయన వాహనం ఢీకొట్టడంతో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement