tractor driver
-
ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
జంగారెడ్డిగూడెం: ఇసుక ఉచితమంటూ ప్రచారం చేస్తున్నారని.. తీసుకెళుతుంటే మాత్రం అధికారులు కేసులు నమోదు చేస్తున్నారంటూ శుక్రవారం ఓ ట్రాక్టర్ డ్రైవర్ ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. చుట్టుపక్కల వారు గమనించి నిలువరించడంతో ప్రమాదం తప్పింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం జల్లేరు వాగు నుంచి ఇసుకను రవాణా చేసేందుకు 8 ట్రాక్టర్లు వెళ్లాయి. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు జల్లేరు వాగు సమీపానికి వెళ్లి ట్రాక్టర్లను అడ్డుకున్నారు. అనంతరం వాటిని పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్న క్రమంలో ట్రాక్టర్ డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దుర్గారావు అనే ట్రాక్టర్ యజమాని ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన చుట్టుపక్కల వారు దుర్గారావును నిలువరించడంతో ప్రమాదం తప్పింది. ఎస్ఐ ఎస్కే జబీర్, సీఐ వి.కృష్ణబాబులు బైపాస్ రోడ్డుకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. వారికి సర్ది చెప్పి ఆందోళనను విరమింపజేశారు. ఇసుకను ఉచితంగా ఇస్తామని చెబితే చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లకు ఓట్లేసి ఇప్పుడు నట్టేట మునిగామని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇసుకను ఫ్రీగా ఇస్తామని చెప్పిన కూటమి పెద్దలు.. ప్రభుత్వం వచ్చాక ఆ హామీని విస్మరించారని, ఉపాధి లేక తమ పరిస్థితి దయనీయంగా మారిందని ట్రాక్టర్ డ్రైవర్ వెంకటే‹Ù, ట్రాక్టర్ యజమాని దుర్గారావు చెప్పారు. నమ్మి ఓట్లు వేశాం ఇసుక ఉచితంగా ఇస్తే గ్రామాల్లో ఉపాధి పెరుగుతుందని నమ్మి కూటమి పార్టీలకు ఓట్లేశాం. పవన్‌కళ్యాణ్, చంద్రబాబు చెబుతున్న మాటలకు, ప్రస్తుత పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదు. ట్రాక్టర్లు కొనుకున్న ఉపాధి పొందుతున్న యువతను సైతం నిర్వీర్యం చేసేలా కూటమి చర్యలున్నాయి. ఇకనైనా మేలుకోకుంటే కూటమి ప్రభుత్వ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. –కుక్కల సత్యనారాయణ, వేగవరం, జనసేన ఎంపీటీసీ -
సీట్ బెల్ట్ పెట్టుకోలేదని ట్రాక్టర్ డ్రైవర్‌కు ఫైన్ !
భద్రాద్రి: ట్రాక్టర్ డ్రైవర్ సీటు బెల్టు పెట్టుకోలేదంటూ బ్లూ కోల్ట్స్ పోలీసులు జరిమానా విధించిన ఘటన గురువారం వెలుగు చూసింది. పాల్వంచ మండలం నాగారం నుంచి పాల్వంచ వైపు మట్టిలోడ్‌తో ట్రాక్టర్ వస్తోంది. మార్గమధ్యలో ఆపిన బ్లూ కోల్ట్స్ పోలీసులు ట్రాక్టర్ డ్రైవర్ సీటు బెల్టు పెట్టుకోలేదంటూ రూ.వెయ్యి రూపాయలు జరిమానా విధించారు. అయితే, ట్రాక్టర్‌కు సీటు బెల్టు ఉండదని పోలీసులకు చెప్పినా వినిపించుకోకుండా జరిమానా విధించారని డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా స్టీరింగ్ ఉన్న ప్రతీ వాహనం డ్రైవర్ ట్రాఫిక్ నిబంధనల మేరకు సీట్ బెల్టు పెట్టుకోవాల్సిందేనని చెప్పడం గమనార్హం. -
ప్రమాద ఘటనపైనా పైత్యపు రాతలే
సాక్షి, నరసరావుపేట: ప్రమాదవశాత్తూ జరిగిన సంఘటనకూ రాజకీయాలు అంటగడుతున్నారు. లేనిపోని ఆరోపణలతో నిస్సిగ్గుగా కట్టుకథలు అల్లేస్తున్నారు. తమ కళ్లముందే సంఘటన జరిగినట్టు తప్పుడు సమాచారంతో అడ్డగోలు వార్తలు వండివార్చేస్తున్నారు. తాజాగా పల్నాడు జిల్లా రెంటచింతల మండలం మల్లవరం గ్రామంలో జరిగిన ఓ ప్రమాద ఘటనను కావాలనే వైఎస్సార్సీపీ సర్పంచ్ దగ్గరుండి చేయించినట్టు ఓ అబద్ధాన్ని ఈనాడులో అచ్చేశారు. ప్రతి చిన్న సంఘటన ద్వారా పచ్చనేతలకు మేలు చేసేలా ‘తాగు నీరు అడిగితే... తొక్కించి చంపాడు ‘ అంటూ రామోజీ పైత్యపు రాతకు తెగబడ్డారు. అసలేం జరిగిందంటే... మల్లవరం గ్రామంలో నీటి ఎద్దడి ఉండటంతో ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆదేశాలతో సర్పంచ్ షేక్ నన్నే సాహెబ్ నీళ్ల ట్యాంక్‌లను ఏర్పాటు చేసి తాగునీటి సరఫరా చేయిస్తున్నారు. రోజూ వాటర్ ట్యాంకర్ నడిపే ట్రాక్టర్ డ్రైవర్ శుక్రవారం సెలవు పెట్టాడు. అయినా నీటికోసం ప్రజలు ఇబ్బంది పడతారేమోనన్న ఉద్దేశంతో సర్పంచ్ సాహెబ్ శుక్రవారం ట్యాంకర్ బాధ్యత మణికంఠ నాయక్ అనే వేరే డ్రైవర్‌కు అప్పగించారు. ట్రాక్టర్ డ్రైవింగ్‌లో అంత నైపుణ్యంలేని మణికంఠ పొలం నుంచి గ్రామంలోకి వచ్చే క్రమంలో రివర్స్ చేస్తూ వెనుక ఉన్న సామునిబాయి అనే మహిళను చూసుకోకుండా ఢీకొట్టడంతో టైర్ కింద కాలు పడి విలవిలలాడింది. అది చూసి స్థానికులు కేకలు వేశారు. కంగారు పడిన డ్రైవర్ కాపాడుదామనే తొందరలో ట్రాక్టర్ మళ్లీ ముందుకు వెనక్కి నడిపారు దీంతో మరోసారి ఆమెపైకి ట్రాక్టర్ ఎక్కింది. తీవ్రమైన రక్తస్రావం కావడంతో మాచర్ల ఆస్పత్రికి తీసుకెళ్లే సమయంలో ఆ మహిళ చనిపోయింది. సమాచారం అందిన వెంటనే ఎస్ఐ కె.వెంకట నారాయణరెడ్డి మల్లవరం గ్రామంలో సంఘటన స్థలానికి చేరుకుని విచారించారు. ప్రత్యక్ష సాక్షి, మృతురాలి చెల్లి కొడుకు బాణావత్ కృష్ణనాయక్ మాట్లాడుతూ.. మృతురాలు తనకు స్వయానా పెద్దమ్మని ట్రాక్టర్ నడుపుతున్న యువకుడికి డ్రైవింగ్‌లో అనుభవం లేకపోవడంవల్లే ఈ ప్రమాదం జరిగిందని ఎస్ఐ వెంకటనారాయణరెడ్డికి వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. డ్రైవర్‌కు సరిగా ట్రాక్టర్‌ను నడపడం రాకపోవడమే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలోనూ తేలింది. పచ్చరాతలతో రాజకీయం... ప్రతి సంఘటననూ పచ్చనేతలకు అనుకూలంగా మలచుకోవాలన్న రామోజీ దురాలోచనవల్ల వాస్తవాన్ని దాచేసి అబద్దాన్ని అచ్చేశారు. సామునిబాయి తాగునీరు అడిగితే ఇవి కేవలం వైఎస్సార్సీపీ వారికే ఇస్తామని డ్రైవర్ మణికంఠ చెప్పినట్లు, అక్కడ గొడవ జరిగి ట్రాక్టర్‌తో తొక్కించి చంపినట్టు వండి వార్చారు. దీన్ని పట్టుకొని చంద్రబాబు, లోకేశ్‌లు సిగ్గులేకుండా విషప్రచారాలు మొదలుపెట్టేశారు. ఈనాడు రాతలు చూసి మల్లవరం గ్రామ ప్రజలు మాత్రం విస్తుపోతున్నారు. రాజకీయాల కోసం ప్రమాదంలో మహిళ మృతి చెందితే ఇలా విషపురాతలు రాస్తారా అంటూ ఛీత్కరించుకుంటున్నారు. -
‘పాలమూరు’ సొరంగంలో ప్రమాదం
కందనూలు (నాగర్‌కర్నూల్): పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల సొరంగం పనుల్లో రాయి కూలి ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందాడు. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ సమీపంలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సొరంగం పనులు కొంతకాలంగా జరుగుతున్నాయి. ఉయ్యాలవాడకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ గొంది శ్రీనివాస్‌రెడ్డి ఎప్పటిలాగే నీళ్ల ట్రాక్టర్ తీసుకుని, మరో నలుగురు కూలీలతో కలిసి బుధవారం ఉదయం లోపలికి వెళ్లాడు. సొరంగంలో 400మీటర్ల మేర చేరుకోగానే పైకప్పు నుంచి రాళ్లు విరిగి పడటంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంట ఉన్నవారు వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మిగిలిన నలుగురు కూలీలు సురక్షితంగా ఉన్నారు. డ్రైవర్ హెల్మెట్ లేకుండానే ట్రాక్టర్‌తో లోపలికి వెళ్లినట్టు తెలిసింది. -
యజమాని కొట్టాడని జంప్.. తిరిగి వచ్చేసరికి తనకు అంత్యక్రియలు, అంతా షాక్!
చర్ల (భద్రాద్రి కొత్తగూడెం): కుటుంబ సభ్యుడు ఒకరు అదృశ్యమయ్యాడు.. ఇంతలోనే గుర్తు పట్టలేని స్థితి మృతదేహం లభించింది. తమ వాడేనని ఆ కుటుంబీకులు అంత్యక్రియలు కూడా నిర్వహించారు.. ఇది జరిగిన 12 గంటలకు సదరు వ్యక్తి గ్రామంలో ప్రత్యక్షం కావడంతో అంతా అవాక్కయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని లింగాపురంపాడుకు చెందిన బొడ్డు ప్రసాద్ ట్రాక్టర్ డ్రైవర్‌గా గ్రామంలోనే ఓ వ్యక్తి వద్ద పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల యజమాని.. ప్రసాద్‌ను కొట్టాడు. తర్వాత చికిత్స చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించాడు. అయితే, కొన్ని రోజులకు డ్రైవర్ ప్రసాద్ అదృశ్యం కాగా.. ఆయన తల్లి ఈనెల 2న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు విచారణ సాగిస్తుండగానే ఈనెల 3న తాలిపేరు ప్రాజెక్ట్ రిజర్వాయర్‌లో గుర్తు తెలియని మృతదేహం బయటపడింది. ఈ మృతదేహాన్ని గురువారం వెలికితీసి ప్రసాద్ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. (చదవండి: Jubilee Hills: డ్రస్సింగ్ రూంలో మహిళల న్యూడ్ వీడియోలు చిత్రీకరణ) అప్పటికే కుళ్లిన స్థితిలో ఉండటంతో అది ప్రసాద్దిగానే భావించి రాత్రి ప్రాజెక్ట్ సమీపానే అంత్యక్రియలు నిర్వహించారు. ఈ క్రమంలో ప్రసాద్ పనిచేసిన ట్రాక్టర్ యజమానిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇంతలోనే శుక్రవారం ఉదయం ప్రసాద్ చర్లలో ప్రత్యక్షం కావడంతో కుటుంబసభ్యులు, పోలీసులు అవాక్కయ్యారు. ట్రాక్టర్ యజమాని మళ్లీ కొడతాడేమోననే భయంతో తాను ఛత్తీస్‌గఢ్‌లోని ఓ గ్రామంలో తలదాచుకున్నట్లు వివరించాడు. కాగా, రిజర్వాయర్‌లో ప్రత్యక్షమైన మృతదేహం ప్రసాద్‌ది కాదని తేలడం, మృతదేహం కాళ్లు, చేతులు కట్టేసి ఉండటంతో ఎవరినో హత్య చేసినట్లు భావిస్తూ కేసు దర్యాప్తు చేపట్టారు. (చదవండి: ప్రయాణికులకు బస్సు డ్రైవర్ షాక్.. ఏం చేశాడంటే..!) -
అన్నీ తామై ముందుకొచ్చారు
సాక్షి, పెద్దపల్లి కమాన్: కరోనాతో చనిపోయిన వ్యక్తుల విషయంలో వైద్యులు మానవత్వం చాటుతున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఆదివారం ఉదయం ప్రభుత్వాస్పత్రిలో కరోనా తో చనిపోయాడు. మృతదేహాన్ని తీసేయాలని పట్టుబట్టడంతో.. ఆస్పత్రి అధికారులు మున్సిపల్ సిబ్బందికి ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో మున్సిపాలిటీకి చెందిన చెత్తతీసుకెళ్లే ట్రాక్టర్‌ను డ్రైవర్ ఆస్పత్రి ఐసోలేషన్‌వార్డు ముందుకు తెచ్చి అక్కడే వదిలి వెళ్లిపోయా డు. దీంతో కరోనా జిల్లా ప్రత్యేకాధికారి డాక్టర్ శ్రీరాం, మృతదేహాన్ని సిబ్బంది సాయంతో ట్రాక్టర్లోకి ఎక్కించి, తానే నడుపుతూ శ్మశాన వాటి క వద్దకు తీసుకెళ్లి దహనసంస్కారాలు పూర్తి చేశారు. -
ట్రాక్టర్ డ్రైవర్ దారుణహత్య
సాక్షి, కె బిట్రగుంట (సింగరాయకొండ): అతి కిరాతకంగా ఒక వ్యక్తిని హత్య చేసిన సంఘటన ఆదివారం జరుగుమల్లి మండలం కె. బిట్రగుంట గ్రామ పరిధిలోని బీసీ కాలనీ సమీపంలో జరిగింది. మృతదేహాన్ని రోడ్డు పక్కన మార్జిన్లో పడవేశారు. పోలీసుల కథనం ప్రకారం మర్రిపూడి మండలం జువ్విగుంట గ్రామానికి చెందిన దేవరపల్లి మాధవరెడ్డి (35) కె బిట్రగుంట ప్రాంతంలో ట్రాక్టర్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఇతని మరణం పట్ల పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతదేహం తలపై రాయితో గాయపరిచారిచినట్లు కనిపిస్తుంది. ఇంకా ముఖంపై కూడా గాయాలున్నాయని, గొంతును తాడుతో బిగించి ఊపిరాడకుండా చేసి అతి కిరాతకంగా చంపేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఉదయాన్నే బహిర్బూమికి వచ్చిన కాలనీవాసులు అక్కడ మృతదేహం ఉండటం చూసి గ్రామస్తులకు తెలపడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ప్రాంతంలో గతంలో ఎన్నడూ హత్య జరగలేదని స్థానికులు తెలిపారు. హత్య జరిగిన సమాచారం అందిన వెంటనే ఒంగోలు ఇన్చార్జి డీఎస్పీ బాల సుందరం, ఒంగోలు రూరల్ సీఐ సుబ్బారావు, ఎస్ఐ కమలాకర్, టంగుటూరు, సింగరాయకొండ ఎస్సైలు వై.వి. రమణయ్య, పులిరాజేష్‌లు సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. తరువాత డాగ్ స్క్వాడ్‌ను, క్లూస్‌టీంను రంగంలోకి దింపారు. పోలీసు జాగిలం మృతదేహం పరిసరాలను వాసన చూసి అక్కడ నుంచి సింగరాయకొండ వైపు ఫ్లైఓవర్ చివరి వరకు వెళ్లి ఆగిపోయింది. దీనిని బట్టి హంతకులు ఏదైనా వాహనంలో వెళ్లి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్య పూర్తిగా పథకం ప్రకారం జరిగిందేనన్న అనుమానాలు పోలీసు వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. దీనికి సంబంధించి పోలీసులు మృతుడికి పరిచయం ఉన్న కొంతమందిని సింగరాయకొండ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారని గ్రామస్తులు చెప్తున్నారు. ఈ కేసును ఒంగోలు రూరల్ సీఐ సుబ్బారావు విచారిస్తున్నారని ఎస్సై కమలాకర్ పేర్కొన్నారు. ఈ హత్య కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నామని ఆర్థిక లావాదేవీలా లేక వివాహేతర సంబంధమా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తుమన్నారు. ఈ సంఘటనకు సంబంధించి కేసు రిజిష్టరు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఆయన వివరించారు. మృతుడి ముఖంపై గాయాలు ఉన్న దృశ్యం హత్యపై పలు అనుమానాలు: దేవరపల్లి మాధవరెడ్డి హత్యకు సంబంధించి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి మర్రిపూడి మండలం జువ్విగుంట గ్రామానికి చెందిన దేవరపల్లి కొండారెడ్డికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. మాధవరెడ్డి చివరి సంతానం. అయితే అన్నదమ్ములు ముగ్గురు కొద్ది సంవత్సరాల క్రితం ఒంగోలులో ఇల్లు తీసుకుని నివాసం ఉంటున్నారు. కొండారెడ్డికి సుమారు 30 ఎకరాల ఆస్తి ఉంది. గతంలో అతడి బంధువులు సుమారు 8 ఎకరాలకు కొండారెడ్డితో వేలు ముద్ర వేయించుకుని తరువాత ఆ పొలం మాదేనని కోర్డులో దావా వేసి గెలుపొందారు. వీరు కోర్టులో గెలుపొందినప్పటికీ పొలం మాత్రం కొండారెడ్డి కొడుకుల ఆధీనంలోనే ఉంది. అంతేకాక మాధవరెడ్డి ఈ ఎనిమిది ఎకరాల పొలాన్ని బ్యాంకులో తనఖా పెట్టి ఆ డబ్బుతో ట్రాక్టరు కొనుగోలు చేశాడు. ట్రాక్టరుకు నెలసరి వాయిదాలు సరిగా కట్టకపోవటంతో ఫైనాన్స్ కంపెనీ వారు ట్రాక్టర్‌ను తీసుకుని వెళ్లారు. ఆ తరువాత మాధవరెడ్డి ట్రాక్టరుకు డ్రైవర్‌గా వెళుతున్నాడు. మాధవరెడ్డి తన అక్క రమణమ్మ కూతురు రాధామాధవిని సుమారు 10 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. అయితే మద్యానికి, వివాహేతర సంబంధాలకు అలవాటుపడ్డ మాధవరెడ్డి తన భార్యను సరిగా పట్టించుకోకపోవటంతో ఆమె కొద్ది సంవత్సరాలుగా తన ఇద్దరు కూతుళ్లతో కొండపి మండలం కె ఉప్పలపాడు గ్రామంలోని అమ్మగారింట్లో ఉంటోంది. ఈ హత్యకు పొలం గొడవలా లేక వివాహేతర సంబంధమా లేక ఆర్థిక లావాదేవీలా అన్న విషయం పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. -
దర్జాగా దోచుకున్నాడు..!
అతడు దర్జాగా వచ్చాడు. ఆ ట్రాక్టర్ యజమానికి కాకమ్మ కబుర్లు చెప్పాడు. 28వేల రూపాయలు తీసుకుని, దర్జాగా వెళ్లిపోయాడు. అసలేం జరిగిందో ఆ ట్రాక్టర్ యజమానికి అర్థమవలేదు. ‘నువ్వు మోసపోయావ్’ అని ఇతరులు చెప్పేంతవరకు కూడా అతడికి తెలియలేదు. అసలేం జరిగిందంటే... కారేపల్లి: మండలంలోని దుబ్బతండా గ్రామానికి చెందిన ఆంగోతు కృష్ణకు ట్రాక్టర్ ఉంది. దానికి చిన్న రిపేర్ వచ్చింది. కారేపల్లిలోని మెకానిక్ షెడ్‌కు మంగళవారం తీసుకెళ్లాడు. అంతలోనే ఆ షెడ్ వద్దకు, టిప్‌టాప్‌గా తయారైన ఓ యువకుడు వచ్చాడు. ‘‘మాది ఆంధ్రా. ఇక్కడ రోడ్డు కాంట్రాక్ట్ వర్క్ చేయిస్తున్నాను. మాకు మూడు డోజర్లు ఉన్నాయి. కారేపల్లి పెట్రోల్ బంక్‌లో మాకు ఖాతా ఉంది’’ అని పరిచయం చేసుకున్నాడు. ‘‘మా ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయి. నేను అర్జంటుగా మా ఊరికి వెళ్లాలి. నాకు రూ.28వేలు కావాలి. లీటర్ డిజిల్ రూ.70 ఉంది కదా! బంక్‌లో రూ.65కే కొట్టిస్తాను. 400 లీటర్ల డీజిల్‌ను ఖాతాలో కొట్టిస్తాను’’ అని, ఆ ట్రాక్టర్ డ్రైవర్‌తో చెప్పాడు. చూడ్డానికి దర్జాగా ఉండి, మొహం దీనంగా పెట్టిన అతడిని చూసిన ఆ ట్రాక్టర్ యజమాని ఆంగోతు కృష్ణకు ఎటువంటి అనుమానం రాలేదు. పూర్తిగా నమ్మేశాడు. మనసులోనే లెక్కలేసుకున్నాడు. లీటర్‌కు రూ.65 చొప్పున 400 లీటర్లకు రెండువేల రూపాయలు మిగులుతాయని అనుకున్నాడు. ‘‘సరే.. ఆ డబ్బు నేనిస్తాను. నాకు డీజిల్ కొట్టించు’’ అని చెప్పాడు. ఆ దర్జా బాబు సరేనన్నాడు. కానీ, కృష్ణ వద్ద అంత మొత్తం లేదు. దీంతో, ఎనిమిది కిలోమీటర్ల దూరంలోగల దుబ్బతండా గ్రామంలోగల తన ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. ఇంట్లో నుంచి రూ.28వేలు తీసుకుని తిరిగొచ్చాడు. దర్జా బాబు, రెండువేల రూపాయలతో (డీజిల్ పట్టేందుకని) రెండు డ్రమ్ములను కొనిపెట్టాడు. వాటిని తన ట్రాక్టర్‌పై కృష్ణ చేర్చాడు. తన ద్విచక్ర వాహనంపై కారేపల్లి పెట్రోల్ బంక్ వద్దకు ఆ యువకుడు వెళ్లాడు. వాహనాన్ని బంక్ బయట రోడ్డుపై ఉంచాడు. నమోదు కాకుండా ఉండేందుకు తన ద్విచక్రవాహనాన్ని రోడ్డుపై నిలిపి బంక్ వద్దకు వెళ్లాడు. ‘‘మా ట్రాక్టర్ వెనుకాల రెండు డ్రమ్ములతో వస్తోంది. 200 లీటర్ల చొప్పున 400 లీటర్ల డీజిల్ నింపాలి. కంప్యూటర్ బిల్లు కాకుండా, చేతితో రాసిన రశీదులు కావాలి’’ అని, బంక్ ఆపరేటర్లతో చెప్పాడు. ఇంతలో ఆ ట్రాక్టర్ రానే వచ్చింది. డీజిల్ కొట్టే గన్ను ఆంగోతు కృష్ణకు ఆపరేటర్ ఇచ్చాడు. బిల్లులు రాసి, ఆ దర్జా బాబుకు ఇచ్చాడు. అతడు ఆ బిల్లులను ట్రాక్టర్ పైకి ఎక్కి కృష్ణకు ఇచ్చాడు. అతని నుంచి రూ.28వేలు తీసుకుని బంక్ బయటకు వచ్చాడు. రోడ్డు పక్కన ఆపిన తన ద్విచక్ర వాహనంపై దర్జాగా వెళ్లిపోయాడు. డీజిల్ పోయించడం పూర్తయింది. ట్రాక్టర్‌తో వెళుతున్న కృష్ణను బంక్ ఆపరేటర్లు ఆపి, ‘‘డబ్బులు ఇవ్వకుండా వెళుతున్నావేం..?’’ అని గట్టిగా అడిగారు. కృష్ణకు నోట మాట రాలేదు. ‘‘అదేమిటి..? ఆయనేగా కొట్టించింది..? బిల్లు కూడా ఇచ్చాడు’’ అన్నాడు. ఈసారి బంక్ ఆపరేటర్లు అవాక్కయ్యారు. వెంటనే తేరుకుని, ‘‘ఆయన ఎవరో మాకు తెలియదు. మా ట్రాక్టర్ వస్తుంది, డీజిల్ కొట్టాలన్నాడు. చేతితో రాసిన రశీదు బిల్లు కావాలంటే ఇచ్చాం’’ అని చెప్పారు. అతడితో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. బిల్లు చెల్లించాల్సిందేనన్నారు. ‘‘నువ్వు మోసపోయావ్’’ అని వాళ్లు చెప్పేదాకా, అసలు జరిగిందేమిటో కృష్ణకు అర్థమవలేదు. అతడు లబోదిబోమంటూ కారేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాలో బండి నెంబర్ కనిపించకుండా ఉండేందుకు, తప్పించుకునేందుకు వీలుగా ఆ ‘దర్జా’ మోసగాడు.. ముందుగానే ప్లాన్ ప్రకారంగా తన ద్విచక్ర వాహనాన్ని బంక్ బయట నిలిపాడన్న విషయం.. అప్పుడుగానీ అందరికీ అర్థమైంది. -
ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి
చిలమత్తూరు : అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడటంతో డ్రైవర్ మృతి చెందాడు. మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన ఆదినారాయణప్ప, పార్వతమ్మ దంపతుల కుమారుడు ప్రకాష్ (23) ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. బుధవారం వీరాపురం గ్రామానికి చెందిన గణేష్ అనే బాలుడిని వెంటబెట్టుకుని వీరాపురం చెరువు నుంచి ఇటుకల బట్టీలకు మట్టి తరలించారు. ఈ క్రమంలో చెరువు నుంచి తిరుగు ప్రయాణంలో వెంకటాపురం వెళ్తున్నపుడు ట్రాక్టర్ ఇంజన్లో సాంకేతిక లోపంతో ఎక్సలేటర్ సరిగా పనిచేయలేదు. దీంతో వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రకాష్ అక్కడిక్కడికే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన గణేష్‌ను చిక్సిత కోసం చిలమత్తూరు ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ జమాల్‌బాషా పరిశీలించి, కేసు నమోదు చేసుకున్నారు. -
ఎస్సై నంటూ వచ్చి డ్రైవర్‌పై దౌర్జన్యం
-
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కొమరోలు(ప్రకాశం జిల్లా): ప్రకాశం జిల్లా కొమరోలు మండలం దద్దవాడ సమీపంలో గడ్డి లోడుతో వెళుతున్న ట్రాక్టర్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం జరిగింది. మృతుడు మార్కాపురం మండలం పోతలపాడు గ్రామానికి చెందిన రమణారెడ్డి(50)గా గుర్తించారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతునికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. -
పురుగుల మందు తాగి వ్యక్తి మృతి
ఏలూరు(సెంట్రల్) : కడుపునొప్పి తాళలేక ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అవుట్ పోలీసుల కథనం ప్రకారం.. చింతపల్లి రామారావు(40) కృష్ణాజిల్లా ముసునూరు మండలం పెద్దపాటివారి గూడెంలో నివాసం ఉంటున్నాడు. అతను ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రామారావుకు తరచూ కడుపునొప్పి వస్తుంటుంది. బుధవారం కడుపునొప్పి ఎక్కువగా రావడంతో ఆ బాధను భరించలేక రామారావు తన ఇంట్లోనే పురుగుల మందును తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. దీనిని గమనించిన కుటుంబసభ్యులు అతడిని చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అక్కడ అతను మృతిచెందాడు. రామారావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి
ఖమ్మం: ఖమ్మం జిల్లా వైరా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ దుర్మరణం చెందాడు. తల్లాడ మండలం వెంకటగిరికి చెందిన మంగయ్య (45) శనివారం తెల్లవారు జామున ట్రాక్టర్ నడుపుకుంటూ ఖమ్మం నుంచి స్వగ్రామానికి వస్తున్నాడు... ఆ క్రమంలో వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ట్రాక్టర్‌ను ఢీకొట్టి వెళ్లి పోయింది. డ్రైవర్ మంగయ్య తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించాడు. ట్రాక్టర్‌పై ఉన్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రుడిని వెంటనే ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బెంజ్ సర్కిల్ వద్ద ప్రమాదం.. ఒకరు మృతి
విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలో నిర్మాల కాన్వెంట్ జంక్షన్ వద్ద బుధవారం ఉదయం ట్రాక్టర్, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందగా.. ఐదుగురు కూలీలకు గాయాలయ్యాయి. గాయపడినవారిని చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
మిషన్ కాకతీయ పనుల్లో అపశ్రుతి
ఫిట్స్ రావడంతో డ్రైవర్ మృతి భిక్కనూరు : నిజామాబాద్ జిల్లా భిక్కనూరు మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో జరుగుతున్న మిషన్ కాకతీయ పనుల్లో మంగళవారం అపశ్రుతి చోటుచేసుకుంది. చెరువు నుంచి మట్టిని తరలిస్తుండగా ట్రాక్టర్ డ్రైవర్‌కు ఆకస్మత్తుగా ఫిట్స్ రావడంతో కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలు.. గ్రామానికి చెందిన పి.రవి (23) టాక్టర్ డ్రైవర్. మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా మంగళవారం పూడికమట్టిని రైతుల పొలాలకు తరలిస్తున్నాడు. అయితే, చెరువు కట్ట పైనుంచి వెళ్తుండగా, ఫిట్స్ రావడంతో ట్రాక్టర్ పైనుంచి కిందపడి మతి చెందాడు. దీంతో ట్రాక్టర్ అదుపు కట్ట కిందకు దూసుకుపోయింది. ఎస్సై రాంబాబు వివరాలు సేకరించి, కేసు నమోదు చేశారు. -
ప్రాణం తీసిన నిర్లక్ష్యం
- ట్రాక్టర్ డ్రైవర్ అశ్రద్ధతో ఉపాధి కూలీ మృతి - చావుబతుకుల్లో మరొకరు.. గణపురం(వరంగల్ జిల్లా): ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణాలు బలిగొనగా, మరో మహిళ తీవ్రంగా గాయపడింది. గణపురం మండలం ధర్మారావుపేటలో గురువారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నారుు.. ధర్మారావుపేటలో జరుగుతున్న ఉపాధి పనుల్లో భాగంగా ట్రాక్టర్‌లోని మట్టిని బయటకు తరలించిన డ్రైవర్.. తిరిగి వస్తున్న క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి కూలీలు కూర్చున్నవైపే రానిచ్చాడు. గమనించిన పలువురు కూలీలు తప్పించుకోగా విషయం తెలియని బాపని జయసుధ(28), జీడీ భాగ్యమ్మ అలాగే ఉండిపోయారు. దీంతో ట్రాక్టర్ వారి పైనుంచి వెళ్లగా జయసుధ తీవ్రంగా గాయపడింది. భాగ్యమ్మ రెండు కాళ్లు విరిగిపోయాయి. జయసుధ భర్త రవీందర్ అక్కడికి చేరుకుని ఆస్పత్రికి తరలిస్తుండగా.. భర్త ఒడిలోనే కన్నుమూసింది. తీవ్రంగా గాయపడిన భాగ్యమ్మను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. గణపురం ఎస్సై విజయ్‌కుమార్, తహసీల్దార్ జీవాకర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. -
రోడ్డుప్రమాదంలో డ్రైవర్ మృతి
పరుచూరు (ప్రకాశం జిల్లా): గన్నవరం- మార్టూరు మార్గమధ్యలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందాడు. వివరాలు.. ప్రకాశం జిల్లా పరుచూరు మడలం పెద్దనపూడి సమీపంలో టాటాఏస్ వాహనం - ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో డ్రైవర్ మైలా సురేష్ (27) అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య శిరీష, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ట్రాక్టర్ కింద పడి డ్రైవర్ మృత్యువాత
దోమకొండ (నిజామాబాద్) : పొలం దున్నుతుండగా బురదలో కూరుకుపోయిన ట్రాక్టర్‌ను పైకి తీసుకొచ్చే క్రమంలో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలం చింతమాన్‌పల్లి గ్రామంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం... చింతమాన్‌పల్లి గ్రామానికి చెందిన పసుల నాంపల్లి(32) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కాగా శనివారం ఒక రైతు పొలం దున్నేందుకు ట్రాక్టర్‌తో వెళ్లాడు. అయితే దున్నుతుండగా ట్రాక్టర్ బురదలో కూరుకుపోయింది. దానిని పైకి లేపే యత్నంలో ట్రాక్టర్ ముందు టైర్లు పైకి లేచాయి. దీంతో డ్రైవర్ సీట్లో కూర్చున్న నాంపల్లి కింద పడిపోయాడు. అతనిపై ట్రాక్టర్ ఇంజిన్ పడటంతో బురదలో కూరుకుపోయి, అక్కడే చనిపోయాడు. అతనికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాక్టర్ బోల్తా: యువకుడి మృతి
తొండూరు: పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్లిన ఓ యువకుడు అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తాపడిన సంఘటనలో మృతి చెందాడు. పనికి వెళ్లి వస్తానంటూ ఇంట్లో చెప్పి వెళ్లిన ఆ బడుగు జీవి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆ కుటుంబం శోకసంద్రమైంది. పోలీసుల కథనం మేరకు.. మల్లేల గ్రామానికి చెందిన ఓతూరు మల్లికార్జున(25) ఏడాది నుంచి అత్తగారి ఊరైన తొండూరులో నివాసముంటున్నాడు. బుధవారం ఉదయాన్నే బూచుపల్లె గ్రామంలోని కొండ సమీపంలో ట్రాక్టర్లో బోలర్స్(కంకరరాళ్లు) నింపేందుకు కూలి పనులకు వెళ్లాడు. ట్రాక్టర్లో బోలర్స్ నింపాక ట్రాక్టర్ కొండపై నుంచి కిందకు దిగాక అందులో ఎక్కుదామని భావించి ట్రాక్టర్ ముందు నడుచుకుంటూ వస్తుండగా వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడింది. ఈ సంఘటనలో పక్కనే నడుచుకుంటూ వస్తున్న మల్లికార్జునపై ట్రాక్టర్ పడటంతో దాని కింద ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్ డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. వెంటనే అతను మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశాడు.మృతుని తల్లి దస్తగిరమ్మ, తండ్రి ఓతూరు పీరాలతోపాటు భార్య సిద్ధేశ్వరి సంఘటన స్థలానికి వెళ్లి విగతజీవిలా పడి ఉన్న మల్లికార్జున మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు. వివాహమైన నాలుగేళ్లకే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయావా అంటూ వారు మృతదేహంపై పడి రోదిస్తుంటే చూపరుల హృదయం ద్రవించిపోయింది. రెండేళ్ల వయసున్న మృతుని కుమారుడు తన తండ్రికి ఏం జరిగిందో.. అమ్మ ఎందుకు ఏడుస్తుందో తెలియక అమాయకంగా చూస్తుంటూ ప్రతి ఒక్కరూ అయ్యో పాపం అంటూ కంట తడిపెట్టారు. ఈ సంఘటనపై హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసులు కేసు నమోదు చేశారు. మల్లికార్జున మృతదేహానికి పులివెందుల ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ నాయకుల పరామర్శ బూచుపల్లె కొండ సమీపంలో బుధవారం మధ్యాహ్నం ట్రాక్టర్ బోల్తాపడిన సంఘటనలో మల్లికార్జున మృతి చెందిన విషయం తెలుసుకున్న బూచుపల్లె, మల్లేల గ్రామాలకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు సంఘటనా స్థలానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలంటూ ఓదార్చారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ రవీంద్రనాథరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సురేష్‌రెడ్డి, బూచుపల్లె సర్పంచ్ వెంకటచలమారెడ్డి, మాజీ సర్పంచ్ గంగులయ్య, వైఎస్ఆర్సీపీ నాయకులు బాలనరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
యువకుడిపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్
హైదరాబాద్: ట్రాక్టర్ షెడ్లో రిపేర్ చేస్తున్న సాయి(22) అనే యువకుడిపైకి ట్రాక్టర్ దూసుకెళ్లటంతో అతను అక్కడిక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన కుషాయిగూడ పరిధిలోని నాగార్జునానగర్ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
పరారీలో ట్రాక్టర్ డ్రైవర్: కేసు నమోదు
నల్గొండ: నందమూరి హరికృష్ణ కుమారుడు జానకిరామ్ (42) మృతికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం సాయంత్రం జానకిరామ్ ప్రయాణిస్తున్నటాటా సఫారీ ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి కారణమైన ఆ ట్రాక్టర్ గరిడేపల్లి మండలం కోనాయిగూడెం చెందినదిగా గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ట్రాక్టర్ డ్రైవర్ పై 304(ఏ) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. నందమూరి జానకిరామ్ శనివారం హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు టాటా సఫా రీ వాహనం (ఏపీ 29 బీడీ 2323)లో బయలుదేరారు. సాయంత్రం 6:45 నిమిషాల సమయంలో నల్లగొండ జిల్లా ఆకుపాముల శివారులో ఉండగా.. వరినారు తీసుకొని రాంగ్రూట్లో వెళుతున్న ట్రాక్టర్‌ను తప్పించబోయి దాని ట్రాలీని ఆయన వాహనం ఢీకొట్టడంతో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. -
‘మాఫీ’యా!
ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: మున్సిపల్ కమిషనర్ ఇంటిపై ఇసుక అక్రమ రవాణాదారులు దాడికి యత్నించిన సంఘటనలో క మిషనర్ యూ టర్న్ తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న ట్రాక్టర్ డ్రైవర్‌కు, జరిగిన సంఘటనకు సంబంధం లేదని కమిషనర్ వెంకటకృష్ణ లిఖిత పూర్వకంగా పోలీస్ స్టేషన్లో రాయించడంతో డ్రైవర్‌పై కేసు నమోదు కాలేదు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్న ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ ఇంటిపై దాడికి ప్రయత్నించిన సంఘటన పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరగడంతో పోలీసులు తక్షణం స్పందించి మున్సిపల్ కమిషనర్ ఇంటిపైకి వెళ్లిన రామాపురం గ్రామానికి చెందిన ఇసుక మాఫియా నాయకుడికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే 24 గంటలు తిరగకముందే ఆ డ్రైవర్‌కు, జరిగిన సంఘటనకు సంబంధం లేదని లిఖిత పూర్వకంగా పోలీస్‌స్టేషన్‌లో కమిషనర్ రాయించడంతో డ్రైవర్‌పై కేసు నమోదు కాలేదు. ఈ సంఘటన వెనుక ప్రధానంగా అధికార పార్టీ నేతల ఒత్తిడే కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రొద్దుటూరు ప్రాంతంలో విచ్చల విడిగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుండటంతో పెన్నానదిలో భూగర్భ జలాలు నానాటికి అడుగంటిపోతున్నాయి. చాలా రోజులుగా మున్సిపల్ అధికారులు ఇసుక అక్రమ రవాణాపై దృష్టి సారించినా పూర్తి స్థాయిలో నివారించలేకపోయారు. కాగా మండలంలోని రామాపురం గ్రామంలో మాత్రం యధావిధిగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. ఇందుకోసం అధికార పార్టీకి చెందిన సీనియర్ నేత అనుచరుడు ఏకంగా భారీ యంత్రాలు, ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకున్నారు. నిత్యం పెన్నానది నుంచి ఇసుక తవ్వకాలు జరిపి గ్రామంలో రాశులు పోయడం, డిమాండ్‌ను బట్టి వాటిని అమ్మడం జరుగుతోంది. చాలా కాలం నుంచి ఇలాగే జరుగుతున్నా అధికారులు నివారించలేని పరిస్థితి. గతంలో ఇలానే ఇసుక ట్రాక్టర్‌కు ఓ తహశీల్దార్ అడ్డుపడగా ఇసుక మాఫియా నేత నడిరోడ్డుపైనే హెచ్చరించాడు. దీంతో తహశీల్దార్ వెనుదిరగాల్సి వచ్చింది. అనేక మార్లు ఇతని ట్రాక్టర్లను అధికారులు స్వాధీనం చేసుకోవడం, నేతల ఒత్తిళ్లతో వదిలేయడం జరుగుతోంది. రామాపురంలో ఇసుక రాశులు ఉన్నాయని తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ నాలుగు రోజుల క్రితం గ్రామంపై దాడులు నిర్వహించారు. గ్రామంలోని ఇసుక రాశులను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇకపై ఇసుక అక్రమ రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలావుండగా శుక్రవారం రాత్రి ఇసుక అక్రమ రవాణాపై తనిఖీ చేసేందుకు కమిషనర్ రామాపురం గ్రామానికి వెళ్లారు. అదే సమయంలో ఇసుక మాఫీయా నేత డ్రైవర్‌తోపాటు మరికొందరు పట్టణంలోని కమిషనర్‌పై దాడి చేసేందుకు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో కమిషనర్ ఇంటిలో లేకపోగా దాడి చేసేందుకు వచ్చిన డ్రైవర్‌ను సిబ్బంది పట్టుకుని వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు. వెంటనే కమిషనర్ తనపై దాడికి వచ్చిన సంఘటనకు సంబంధించి సిబ్బంది చేత ఫిర్యాదును లిఖిత పూర్వకంగా రాసి స్టేషన్‌కు పంపారు. ఇదిలావుండగా కొంత సేపటి తర్వాత స్వయంగా మున్సిపల్ కమిషనర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి డ్రైవర్‌ను వదిలిపెట్టాలని డ్యూటీలో ఉన్న పోలీసులను కోరారు. కాగా సీఐ వచ్చిన తర్వాత మాట్లాడితే డ్రైవర్‌ను వదిలేస్తామని, అంతవరకు తామేమి చేయలేమని పోలీసులు తెలిపారు. కమిషనర్ యూటర్న్ ఇదిలావుండగా శుక్రవారం రాత్రి జరిగిన సంఘటనకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం స్పందించింది. ప్రసార మాధ్యమాల ద్వారా కమిషనర్‌పై దాడియత్నానికి సంబంధించిన సంఘటనను తెలుసుకున్న జిల్లా అధికారులు శనివారం ఉదయం కమిషనర్ చాంబర్లో సమావేశం నిర్వహించారు. జమ్మలడుగు ఆర్డీఓ రఘునాథరెడ్డి, డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో ఇసుక అక్రమ రవాణా అరికట్టడంపై చర్చించారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం కమిషనర్ తనపై ఎవ్వరు దాడికి ప్రయత్నించలేదని, అదుపులోకి తీసుకున్న డ్రైవర్‌ను వదిలివేయాలని పోలీసులకు లిఖిత పూర్వకంగా రాసి పంపారు. శుక్రవారం రాత్రి తాను ఆఫీసు పని నిమిత్తం బయటికి వెళ్లానని, గుర్తు తెలియని వ్యక్తి తాగిన మైకంలో తన ఇంటి తలుపు తడుతుండగా అనుమానంతో సిబ్బంది అతన్ని పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. అంతేగానీ అతను దాడికి యత్నించలేదని ఆయన లిఖితపూర్వకంగా పోలీసులకు తెలిపారు. దీంతో ఎట్టకేలకు పోలీసులు తమ అదుపులో ఉన్న ట్రాక్టర్ డ్రైవర్‌ను వదిలిపెట్టారు. ఇసుక మాఫియా నిర్వహిస్తున్న వ్యక్తి అధికార పార్టీకి చెందిన వాడు కావడంతో రాజకీయ ఒత్తిళ్లవల్లే ఇలా జరిగి ఉండవచ్చని పలువురు చర్చించుకుంటున్నారు.