- ట్రాక్టర్ డ్రైవర్ అశ్రద్ధతో ఉపాధి కూలీ మృతి
- చావుబతుకుల్లో మరొకరు..
గణపురం(వరంగల్ జిల్లా): ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణాలు బలిగొనగా, మరో మహిళ తీవ్రంగా గాయపడింది. గణపురం మండలం ధర్మారావుపేటలో గురువారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నారుు.. ధర్మారావుపేటలో జరుగుతున్న ఉపాధి పనుల్లో భాగంగా ట్రాక్టర్‌లోని మట్టిని బయటకు తరలించిన డ్రైవర్.. తిరిగి వస్తున్న క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి కూలీలు కూర్చున్నవైపే రానిచ్చాడు. గమనించిన పలువురు కూలీలు తప్పించుకోగా విషయం తెలియని బాపని జయసుధ(28), జీడీ భాగ్యమ్మ అలాగే ఉండిపోయారు.
దీంతో ట్రాక్టర్ వారి పైనుంచి వెళ్లగా జయసుధ తీవ్రంగా గాయపడింది. భాగ్యమ్మ రెండు కాళ్లు విరిగిపోయాయి. జయసుధ భర్త రవీందర్ అక్కడికి చేరుకుని ఆస్పత్రికి తరలిస్తుండగా.. భర్త ఒడిలోనే కన్నుమూసింది. తీవ్రంగా గాయపడిన భాగ్యమ్మను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. గణపురం ఎస్సై విజయ్‌కుమార్, తహసీల్దార్ జీవాకర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.
ప్రాణం తీసిన నిర్లక్ష్యం
Published Thu, Mar 31 2016 10:56 PM | Last Updated on Sun, Sep 3 2017 8:57 PM
Advertisement
Advertisement