వాగు నుంచి ఇసుక తీసుకెళుతుండగా అడ్డుకున్న పోలీసులు
ఉచిత ఇసుకని చెప్పి.. కేసులు పెడతారా.. అంటూ ఆగ్రహం
జాతీయ రహదారిపై ట్రాక్టర్ డ్రైవర్లు, యజమానుల రాస్తారోకో
జంగారెడ్డిగూడెం: ఇసుక ఉచితమంటూ ప్రచారం చేస్తున్నారని.. తీసుకెళుతుంటే మాత్రం అధికారులు కేసులు నమోదు చేస్తున్నారంటూ శుక్రవారం ఓ ట్రాక్టర్ డ్రైవర్ ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. చుట్టుపక్కల వారు గమనించి నిలువరించడంతో ప్రమాదం తప్పింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం జల్లేరు వాగు నుంచి ఇసుకను రవాణా చేసేందుకు 8 ట్రాక్టర్లు వెళ్లాయి. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు జల్లేరు వాగు సమీపానికి వెళ్లి ట్రాక్టర్లను అడ్డుకున్నారు.
అనంతరం వాటిని పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్న క్రమంలో ట్రాక్టర్ డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దుర్గారావు అనే ట్రాక్టర్ యజమాని ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన చుట్టుపక్కల వారు దుర్గారావును నిలువరించడంతో ప్రమాదం తప్పింది. ఎస్‌ఐ ఎస్‌కే జబీర్, సీఐ వి.కృష్ణబాబులు బైపాస్ రోడ్డుకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు.
వారికి సర్ది చెప్పి ఆందోళనను విరమింపజేశారు. ఇసుకను ఉచితంగా ఇస్తామని చెబితే చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లకు ఓట్లేసి ఇప్పుడు నట్టేట మునిగామని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇసుకను ఫ్రీగా ఇస్తామని చెప్పిన కూటమి పెద్దలు.. ప్రభుత్వం వచ్చాక ఆ హామీని విస్మరించారని, ఉపాధి లేక తమ పరిస్థితి దయనీయంగా మారిందని ట్రాక్టర్ డ్రైవర్ వెంకటే‹Ù, ట్రాక్టర్ యజమాని దుర్గారావు చెప్పారు.
నమ్మి ఓట్లు వేశాం
ఇసుక ఉచితంగా ఇస్తే గ్రామాల్లో ఉపాధి పెరుగుతుందని నమ్మి కూటమి పార్టీలకు ఓట్లేశాం. పవన్‌కళ్యాణ్, చంద్రబాబు చెబుతున్న మాటలకు, ప్రస్తుత పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదు. ట్రాక్టర్లు కొనుకున్న ఉపాధి పొందుతున్న యువతను సైతం నిర్వీర్యం చేసేలా కూటమి చర్యలున్నాయి. ఇకనైనా మేలుకోకుంటే కూటమి ప్రభుత్వ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. –కుక్కల సత్యనారాయణ, వేగవరం, జనసేన ఎంపీటీసీ
Comments
Please login to add a commentAdd a comment