భద్రాద్రి: ట్రాక్టర్ డ్రైవర్ సీటు బెల్టు పెట్టుకోలేదంటూ బ్లూ కోల్ట్స్ పోలీసులు జరిమానా విధించిన ఘటన గురువారం వెలుగు చూసింది. పాల్వంచ మండలం నాగారం నుంచి పాల్వంచ వైపు మట్టిలోడ్‌తో ట్రాక్టర్ వస్తోంది.
మార్గమధ్యలో ఆపిన బ్లూ కోల్ట్స్ పోలీసులు ట్రాక్టర్ డ్రైవర్ సీటు బెల్టు పెట్టుకోలేదంటూ రూ.వెయ్యి రూపాయలు జరిమానా విధించారు. అయితే, ట్రాక్టర్‌కు సీటు బెల్టు ఉండదని పోలీసులకు చెప్పినా వినిపించుకోకుండా జరిమానా విధించారని డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా స్టీరింగ్ ఉన్న ప్రతీ వాహనం డ్రైవర్ ట్రాఫిక్ నిబంధనల మేరకు సీట్ బెల్టు పెట్టుకోవాల్సిందేనని చెప్పడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment