ఇల్లెందు/ఇల్లెందురూరల్: వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులను ఏఎస్‌ఐ ఘని.. డ్రైవర్ తో కలిసి రక్షించాడు. బుధవారం నామాలపాడు వద్ద బయ్యారం పెద్దచెరువు అలుగువాగు ఉధృతిలో మహ బూబాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. అకస్మాత్తుగా చెరువు అలుగు పెరగటంతో లోలెవల్ కాజ్‌వే మీదుగా ప్రవహిస్తున్న నీటి గుండా బస్సును దాటించే ప్రయత్నంలో మధ్యలో నిలిచిపోయింది.
డ్రైవర్ నిజాంతో పాటు ఏడుగురు ప్రయాణికులున్నారు. ఇల్లెందు పోలీస్ స్టేషన్‌కు చెందిన ఏఎస్‌ఐ ఘని కూడా అదే బస్సులో ఉన్నాడు. నీటి మధ్యలో బస్సు చిక్కుకుని స్టార్ట్ కాకపోవటంతో ఏఎస్‌ఐ ఘని చాకచక్యంగా ఆ ప్రయాణికులందరినీ ఒకరి చేతులు ఒకరు పట్టుకొమ్మని చెప్పి ఒడ్డుకు చేర్చాడు. డ్రైవర్ నిజాంతో పాటు ఏఎస్‌ఐ ఘని చూపిన చొరవతో ప్రయాణికులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోవటంతో వారంతా వారికి కృతజ్ఞతలు తెలిపారు. బస్ మాత్రం నీటి ఉధృతిలోనే చిక్కుకుని ఉంది.
Comments
Please login to add a commentAdd a comment