పురుగుల మందు తాగి వ్యక్తి మృతి | stomach ache.. person suicide | Sakshi
Sakshi News home page

పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

Published Thu, Oct 13 2016 1:44 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

stomach ache.. person suicide

ఏలూరు(సెంట్రల్‌) : కడుపునొప్పి తాళలేక ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అవుట్‌ పోలీసుల కథనం ప్రకారం.. చింతపల్లి రామారావు(40)  కృష్ణాజిల్లా ముసునూరు మండలం పెద్దపాటివారి గూడెంలో నివాసం ఉంటున్నాడు. అతను ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.  రామారావుకు తరచూ కడుపునొప్పి వస్తుంటుంది. బుధవారం కడుపునొప్పి ఎక్కువగా రావడంతో ఆ బాధను భరించలేక రామారావు  తన ఇంట్లోనే పురుగుల మందును తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. దీనిని గమనించిన కుటుంబసభ్యులు అతడిని చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అక్కడ అతను మృతిచెందాడు.  రామారావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement