కోస్గి (కర్నూలు) : కడుపునొప్పి తాళలేక ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కర్నూలు జిల్లా కోస్గి మండలం చినముంపల్లి గ్రామంలో మంగళవారం జరిగింది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లక్ష్మమ్మ(48) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.
ఈ క్రమంలో గత కొన్నేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతోంది. కాగా మంగళవారం కడుపునొప్పి ఎక్కువ కావడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గమనించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించేలోపే మరణించింది.
వివాహిత ఆత్మహత్య
Published Tue, Sep 22 2015 5:14 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement