చిలమత్తూరు : అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడటంతో డ్రైవర్ మృతి చెందాడు. మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన ఆదినారాయణప్ప, పార్వతమ్మ దంపతుల కుమారుడు ప్రకాష్ (23) ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. బుధవారం వీరాపురం గ్రామానికి చెందిన గణేష్ అనే బాలుడిని వెంటబెట్టుకుని వీరాపురం చెరువు నుంచి ఇటుకల బట్టీలకు మట్టి తరలించారు.
ఈ క్రమంలో చెరువు నుంచి తిరుగు ప్రయాణంలో వెంకటాపురం వెళ్తున్నపుడు ట్రాక్టర్ ఇంజన్‌లో సాంకేతిక లోపంతో ఎక్సలేటర్ సరిగా పనిచేయలేదు. దీంతో వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రకాష్ అక్కడిక్కడికే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన గణేష్‌ను చిక్సిత కోసం చిలమత్తూరు ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ జమాల్‌బాషా పరిశీలించి, కేసు నమోదు చేసుకున్నారు.
ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి
Published Wed, Feb 1 2017 10:45 PM | Last Updated on Tue, Sep 5 2017 2:39 AM
Advertisement
Advertisement