tractor rolls
-
పెళ్లికి వెళ్తుండగా...
బొబ్బిలి రూరల్: వారంతా ఉల్లిభద్రలో శనివారం రాత్రి జరగబోయే వివాహానికి ఆనందంగా బయలుదేరారు. గ్రామం దాటి కిలోమీటరున్నర దూరం వెళ్లేసరికి ట్రాక్టర్ బోల్తా çపడింది. దీంతో 20 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురిని మెరుగైన వైద్యం కోసం విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారు. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి...బొబ్బిలి మండలం పిరిడి పంచాయతీ పరిధిలో కొల్లివలసకు చెందిన పూతి పైడితల్లి వివాహం ఉల్లిభద్రలో శనివారం రాత్రి జరగనుంది. ముందుగా ఆటోలో పెండ్లి కుమార్తె, కుటుంబ సభ్యులు వెళ్లిపోగా గ్రామానికి చెందిన బంధువులు ట్రాక్టర్లో శనివారం ఉదయం బయలుదేరారు. ట్రాక్టర్ పిరిడి వద్దకు వచ్చేసరికి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పూడి అజయ్, పూడి సింహాచలం, పుట్ట రాములమ్మకు చేతులు విరిగిపోయాయి. భోగాది నారాయణమ్మ, పి.తిరుపతి, తియ్యాల అచ్చెమ్మ, తియ్యల సంధ్య, కొల్లి సత్యవతి, వెంకటలక్ష్మి, తియ్యాల లక్ష్మి, దురగాసి పార్వతి, తియ్యాల పద్మ, తదతరులు గాయపడ్డారు. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను 108 వాహనంలో బొబ్బిలి పీహెచ్‌సీకి తరలించారు. కొంతమందికి చిన్న చిన్న గాయాలు కావడంతో పిరిడి పీహెచ్సీలో వైద్యసేవలందించి పంపించివేశారు. బొబ్బిలి పీహెచ్సీ వైద్యాధికారులు శోభారాణి, రామనరేష్ క్షతగాత్రులకు వైద్యం అందించి, మెరుగైన వైద్యం కోసం ఆరుగురిని విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు క్షతగాత్రుల పరిస్థితిపై ఆరా తీశారు. ఆయన సోదరుడు బేబీనాయన ఆస్పత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించారు. వైఎస్సార్సీపీ నాయకులు మజ్జి శ్రీనివాసరావు, శంబంగి వెంకట చినఅప్పలనాయుడు ప్రమాదంపై ఆరా తీశారు. ట్రాక్టర్ తరలింపు... ప్రమాదం జరిగిన వెంటనే ట్రాక్టర్‌ను తరలించేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై ప్రసాదరావు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి ట్రాక్టర్ లేదు. దీంతో ఆయన స్థానికులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు బైక్‌లు ఢీ..∙ఇద్దరికి గాయాలు భోగాపురం: మండలంలోని లింగాలవలస వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయాలపాలయ్యారు. స్థానికులు తెలియజేసిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా రణస్థలానికి చెందిన విజయ్, రమేష్ ద్విచక్రవాహనంపై విశాఖపట్నం బయలుదేరారు. లింగాలవలస వద్దకు వచ్చేసరికి ఒక యువకుడు ద్విచక్రవాహనంతో డివైడర్ పైనుంచి రోడ్డు దాటే ప్రయత్నంలో ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చేయడంతో విజయ్ తన ద్విచక్రవాహనంతో ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో విజయ్, రమేష్ గాయపడ్డారు. ఆటో – బైక్ ఢీ.. గజపతినగరం రూరల్: మండలంలోని మధుపాడ గ్రామ సమీపంలో స్వీట్‌హోమ్ వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. మెంటాడ మండలం రాబంద గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ తవుడు ప్రయాణికులను ఎక్కించుకుని గజపతినగరం వైపు వస్తుండగా, స్వీట్‌హోమ్ వద్దకు వచ్చేసరికి గజపతినగరం నుంచి మానాపురం వైపు వెళ్తున్న ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు కొర్లాపు శ్రీనుతోపాటు ఆటోలో ఓ పక్కన కూర్చున్న వ్యక్తి గాయపడ్డారు. పోలీసులు రెండు వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. -
ట్రాక్టర్ బోల్తా..డ్రైవర్ మృతి
గుత్తిరూరల్: మండలంలోని బసినేపల్లి తండా శివార్లలో కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జి.ఎర్రగుడి వద్ద పొలంలో మంగళవారం ట్రాక్టర్ టిల్లర్ అదుపు తప్పి గుంతలో పడి డ్రైవర్ బండారు నాగరాజు(35) మృతి చెందాడు. వివరాలు. జి.ఎర్రగుడికి చెందిన బండారు నాగరాజు ట్రాక్టర్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గ్రామ శివార్లలో పొలంలో పెద్ద రాళ్లను ట్రాక్టర్ టిల్లర్‌తో తొలగించేందుకు వెళ్లాడు. వెనుక వైపు గుంత ఉంటడం గమనించకుండా ట్రాక్టర్ రివర్స్‌లో వేగంగా తీసుకెళ్లడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్ నాగరాజుపై ట్రాక్టర్ పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతడికి భార్య యమున, ఇద్దరు వికలాంగ కుమారులు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించి, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ దుర్మరణం
ఉరవకొండ రూరల్: ట్రాక్టర్ బోల్తాపడిన ప్రమాదంలో డ్రైవర్ దుర్మరణం చెందాడు. వివరాలిలా ఉన్నాయి. ఉరవకొండ మండలం రేణుమాకులపల్లికి చెందిన బోయ తిప్పయ్య (21)కు మూడు నెలల కిందట బొమ్మనహాళ్ మండలం గోవిందవాడకు చెందిన యువతితో వివాహమైంది. ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. బుధవారం ఉదయాన్నే ఇసుక కోసం కోసం రాయంపల్లి వైపు బయల్దేరాడు. మార్గం మధ్యలో అదుపుతప్పి ట్రాక్టర్ పక్కనున్న గుంతలోకి బోల్తాపడింది. డ్రైవింగ్ చేస్తున్న తిప్పయ్యకు తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. జీవితాంతం తోడుంటానని చెప్పి ఇలా నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్లిపోతివా.. ఇక నేనెట్లా బతకాలి దేవుడా.. అంటూ భార్య విలపించడం చూపరులను కలచివేసింది. ఎస్ఐ నగేష్‌బాబు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ట్రాక్టర్ బోల్తా: యువకుడి దుర్మరణం
చిలమత్తూరు : కర్ణాటకలోని బాగేపల్లి సమీపంలోగల దేవర గుడ్డపల్లి(గడిదం) చెరువులో ట్రాక్టర్ బోల్తా పడి అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కందూరుపర్తికి చెందిన డ్రైవర్ గంగాధర్(27) మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కందూరుపర్తికి చెందిన నిడిమామిడమ్మ, ఆదినారాయణప్ప కుమారుడు గంగాధర్ జేసీబీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పని నిమిత్తం బాగేపల్లి సమీపంలోని గడిదం వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ట్రాక్టర్‌ను డ్రైవ్ చేసుకుంటూ చెరువులో వస్తుండగా అదుపు తప్పి గుంతలో బోల్తా పడటంతో మరణించినట్లు వివరించారు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. బాగేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి
చిలమత్తూరు : అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడటంతో డ్రైవర్ మృతి చెందాడు. మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన ఆదినారాయణప్ప, పార్వతమ్మ దంపతుల కుమారుడు ప్రకాష్ (23) ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. బుధవారం వీరాపురం గ్రామానికి చెందిన గణేష్ అనే బాలుడిని వెంటబెట్టుకుని వీరాపురం చెరువు నుంచి ఇటుకల బట్టీలకు మట్టి తరలించారు. ఈ క్రమంలో చెరువు నుంచి తిరుగు ప్రయాణంలో వెంకటాపురం వెళ్తున్నపుడు ట్రాక్టర్ ఇంజన్లో సాంకేతిక లోపంతో ఎక్సలేటర్ సరిగా పనిచేయలేదు. దీంతో వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రకాష్ అక్కడిక్కడికే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన గణేష్‌ను చిక్సిత కోసం చిలమత్తూరు ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ జమాల్‌బాషా పరిశీలించి, కేసు నమోదు చేసుకున్నారు. -
ట్రాక్టర్ బోల్తాపడి వ్యక్తి మృతి
కూడేరు : ట్రాక్టర్ బోల్తాపడిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆత్మకూరు మండల కేంద్రం నుంచి కూడేరు మండలం బ్రాహ్మణపల్లికి మంగళవారం ఇసుకలోడుతో ట్రాక్టర్ బయల్దేరింది. పి.నారాయణపురం వద్దకు రాగానే మలుపు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ట్రాలీలో కూర్చున్న ఆత్మకూరుకు చెందిన శివారెడ్డి(48)పై ఇసుకంతా పడింది. దీంతో ఊపిరాడక ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని రోదించారు. మృతుడికి భార్య ప్రమీలమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాక్టర్ బోల్తా : ఇద్దరి మృతి
తూర్పు గోదావరి: ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా కొట్టి కాల్వలో పడిపోయింది. దీంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు ఈ ఘటన తూర్ప గోదావరి జిల్లా తొండంగి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. మండలంలోని ఎ.వి నగరంలో బొడ్డు సత్యనారాయణ అనే వ్యక్తి పొలం పనులు పూర్తి చేసుకుని ట్రాక్టర్‌పై ఇంటికి వస్తుండగా వాహనం అదుపు తప్పి పంట కాల్వలో పడిపోయింది. దీంతో సత్యానారయణ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే ట్రాక్టర్ లో ఉన్న మరో వ్యక్తి కూడా ప్రాణాలొదిలాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (తొండంగి)