ఫిట్స్ రావడంతో డ్రైవర్ మృతి
భిక్కనూరు : నిజామాబాద్ జిల్లా భిక్కనూరు మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో జరుగుతున్న మిషన్ కాకతీయ పనుల్లో మంగళవారం అపశ్రుతి చోటుచేసుకుంది. చెరువు నుంచి మట్టిని తరలిస్తుండగా ట్రాక్టర్ డ్రైవర్‌కు ఆకస్మత్తుగా ఫిట్స్ రావడంతో కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలు.. గ్రామానికి చెందిన పి.రవి (23) టాక్టర్ డ్రైవర్.
మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా మంగళవారం పూడికమట్టిని రైతుల పొలాలకు తరలిస్తున్నాడు. అయితే, చెరువు కట్ట పైనుంచి వెళ్తుండగా, ఫిట్స్ రావడంతో ట్రాక్టర్ పైనుంచి కిందపడి మతి చెందాడు. దీంతో ట్రాక్టర్ అదుపు కట్ట కిందకు దూసుకుపోయింది. ఎస్సై రాంబాబు వివరాలు సేకరించి, కేసు నమోదు చేశారు.