ట్రాక్టర్ కింద పడి డ్రైవర్ మృత్యువాత | Tractor driver dies in freak accident | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ కింద పడి డ్రైవర్ మృత్యువాత

Published Sat, Aug 15 2015 4:30 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

Tractor driver dies in freak accident

దోమకొండ (నిజామాబాద్) : పొలం దున్నుతుండగా బురదలో కూరుకుపోయిన ట్రాక్టర్‌ను పైకి తీసుకొచ్చే క్రమంలో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలం చింతమాన్‌పల్లి గ్రామంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం... చింతమాన్‌పల్లి గ్రామానికి చెందిన పసుల నాంపల్లి(32) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కాగా శనివారం ఒక రైతు పొలం దున్నేందుకు ట్రాక్టర్‌తో వెళ్లాడు.

అయితే దున్నుతుండగా ట్రాక్టర్ బురదలో కూరుకుపోయింది. దానిని పైకి లేపే యత్నంలో ట్రాక్టర్ ముందు టైర్లు పైకి లేచాయి. దీంతో డ్రైవర్ సీట్లో కూర్చున్న నాంపల్లి కింద పడిపోయాడు. అతనిపై ట్రాక్టర్ ఇంజిన్ పడటంతో బురదలో కూరుకుపోయి, అక్కడే చనిపోయాడు. అతనికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement