domakonda
-
దోమకొండ కోటను టూరిస్ట్ స్పాట్‌గా మార్చాలి..!
చారిత్రక దోమకొండ కోటకు దేశ విదేశాల్లో గుర్తింపు యునెస్కో అవార్డుతో మరింత పెరిగిన ఖ్యాతి కాకతీయ శిల్ప శైలి ఉట్టిపడేలా కోటలో అద్భుత కట్టడాల నిర్మాణం పూర్తిస్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని స్థానికుల విజ్ఞప్తి దోమకొండ: చారిత్రక సంపదకు నిలయంగా ఉన్న దోమకొండ కోటకు అంతర్జాతీయ ఖ్యాతిని సాధించింది. అద్భుత కాకతీయ శైలి శిల్ప నైపుణ్యం ఉట్టిపడే నిర్మాణాల కారణంగా ఈ గడీ పురాతన కట్టడాలు, వారసత్వ సంపద పరిరక్షణ విభాగంలో ఇటీవల ఐక్య రాజ్యసమితి విద్యా శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ యునెస్కో అవార్డును అందుకుంది. ఆసియా పసిఫిక్ దేశాలకు యునెస్కో ప్రకటించిన అవార్డుల జాబితాలో హైదరాబాదులోని కుతుబ్ షాహీ సమాధుల ప్రాంగణంలో ఉన్న గోల్కొండ మెట్ల బావికి అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్, కామారెడ్డి జిల్లాలోని దోమకొండ గడీకి అవార్డు ఆఫ్ మెరిట్ విభాగంలో గుర్తింపు లభించడంతో ఈ కోట, అందులోని శిల్ప సంపద మరోమారు దేశ విదేశాల్లో చర్చనీయాంశంగా మారాయి అపూర్వ శిల్పకళ.. గడీలోని శిల్పకళా సంపద, దాన్ని జాగ్రత్తగా నిర్వహించడమనే అంశాలలో యునెస్కో గుర్తింపుతో దోమకొండ కోట పేరు స్థానిక, జాతీయ స్థాయిని దాటి అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతోంది. ఈ కోటను 400ఏళ్ల క్రితం 60 ఎకరాల విస్తీర్ణంలో పాకనాటి రెడ్డి రాజులైన కామినేని వంశస్థులు నిరి్మంచారు. సరైన నిర్వహణ లేని కారణంగా గడీ ప్రధాన ద్వారం, ఇతర భవనాలు, కొన్ని ఇళ్లు దెబ్బతినడంతో గడీ వారసులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి స్వర్గీయ ఉమాపతిరావు కుమారుడు కామినేని అనిల్ కుమార్ ఆధ్వర్యంలో కోట మరమ్మతు పనులు జరిగాయి. గతంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసిన సినీహీరో చిరంజీవి కోట అభివృద్ధి విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఇకాకతీయ శిల్పకళా శైలిలో ఈ పురాతన కట్టడాలు ప్రసిద్ధి చెందాయి. కోటకు తూర్పు ద్వారం, పడమర ప్రధాన ద్వారాలను 200 ఫీట్లు ఎత్తులో నిరి్మంచారు. 60 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన గడీకోట చుట్టూ 50 ఫీట్ల వెడల్పు, పది ఫీట్ల లోతుతో నిర్మించిన కందకం ఇప్పటికీ చూపరులను ఆకర్షిస్తుంది. కామినేని అనిల్ ఆధ్వర్యంలో పునరుద్ధరణ పనులు... దోమకొండ సంస్థానా«దీశుల పాలనలో నిరి్మంచిన వెంకటపతి భవన్లో శిల్పకళా నైపుణ్యం, రాజసం ఉట్టిపడతాయి. అలాగే వీరి పాలనలోనే మహాదేవుని ఆలయ పునర్మిర్మాణం జరిగింది. అప్పట్లో మహాదేవుని ఆలయానికి కాకతీయ రాణి రుద్రమదేవి వచ్చినట్లు శిలా ఫలకం వెల్లడిస్తుంది. దోమకొండ కోటను సంస్థాన వారసుడు కామినేని అనిల్ పునరుద్ధరించారు. అనిల్ కుమార్తై ఉపాసన, మెగాస్టార్ చిరంజీవి తనయుడు, సినీహీరో రామ్‌చరణ్ వివాహ వేడుకలు దోమకొండ కోటలోనే జరిగిన విషయం తెలిసిందే. యునెస్కో గుర్తింపుతో.. కామినేని వంశస్థులుదోమకొండ సంస్థానాన్ని 400 ఏళ్లకు పైగా పరిపాలించారు. 1760లో మొదటి పాలకుడుగా రాజన్న చౌదరిగా చరిత్ర పేర్కొంటోంది. ఆనాటి నుంచి జమిందారీ వ్యవస్థ రద్దు వరకు కామినేని వంశస్థులు దోమకొండ కేంద్రంగా పరిపాలన కొనసాగించారని ఆధారాలు ఉన్నాయి. ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాలు వీరి పాలనలో కొనసాగాయని శిలాశాసనాలు చెబుతున్నాయి. చివరగా స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ విలీనమైనప్పుడు ఈ కోట రాజా సోమేశ్వర్ రావు పాలనలో ఉందని చెబుతారు. వీరి కాలంలోనే భిక్కనూరు సిద్దరామేశ్వరం, తాడ్వాయి భీమేశ్వరం, కామారెడ్డి వేణుగోపాలస్వామి, రామారెడ్డి కాలభైరవ స్వామి, లింగంపేట మెట్ల బావి వంటి ప్రసిద్ధ కట్టడాలు నిరి్మంచినట్లు తెలుస్తోంది. వీరి వారసుల పేర్లతో నేటికి కామారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట జిల్లాలలో అనేక గ్రామాల పేర్లు ఉండటం విశేషం. రాజధాని నుంచి 100 కి.మీ దూరంలో.. ఈ కోట కామారెడ్డి జిల్లాలోని దోమకొండ జిల్లా కేంద్రానికి 20 కి.మీ దూరంలో...రాష్ట్ర రాజధాని హైద్రాబాద్‌కు కేవలం 100 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో కోటను పర్యాటక కేంద్రంగా మారిస్తే స్థానికులకు ఉపాధి లభించే అవకాశముంటుందని గతంలో గ్రామ ప్రజా ప్రతినిధులు కోట వారసులైన కామినేని అనిల్‌కుమార్‌ను కలిసి వివరించారు. దీంతో ఆయన గడీ కోసం ఓ ప్రత్యేక ట్రస్టును ఏర్పాటు చేసి దీని ద్వారా గ్రామంలో పలు అభివృద్ది పనులు, స్వచ్చంద సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. కాగా కోటను పూర్తిస్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే గ్రామానికి చెందిన యువతకు స్వయం ఉపాధి లభిస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. దోమకొండ కోటను టూరిస్ట్ స్పాట్‌గా మార్చాలి -
గోల్కొండ మెట్లబావి, దోమకొండ కోటలకు యునెస్కో పురస్కారాలు
సాక్షి, హైదరాబాద్/కామారెడ్డి: ప్రజలు, పౌర సంస్థలు, వ్యక్తుల ఆధ్వర్యంలో సాంస్కృతిక వారసత్వ కట్టడాల పునరుద్ధరణలో మంచి ప్రతిభ కనబరిచిన పనులకు యునెస్కో పురస్కారాలు ప్రకటించింది. ఆసియా–పసిఫిక్ విభాగానికి మన దేశం నుంచి మూడు నిర్మాణాలు ఎంపిక కాగా, అందులో రెండు తెలంగాణకు చెందినవే కావడం విశేషం. సాంస్కృతిక వారసత్వ కట్టడాల పున రుద్ధరణ (ఏసియా–పసిఫిక్) కింద కుతుబ్‌షాహీ టూంబ్స్ పరిధిలోని గోల్కొండ మెట్ల బావి ‘అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్’కు, కామారెడ్డి జిల్లా దోమకొండ కోట ‘అవార్డ్ ఆఫ్ మెరిట్’కు ఎంపికయ్యాయి. దోమకొండ కోటను నాటి సంస్థానాధీశుల వారసులు పునరుద్ధరించుకుంటూ వస్తుండగా, మెట్ల బావిని ఆగాఖాన్ ట్రస్ట్ సొంత నిధుల తో పునరుద్ధరించింది. కుతుబ్‌షాహీల కాలంలో అద్భుత నిర్మాణ కౌశలంతో ఈ బావి రూపుదిద్దుకుంది. ఈ తరహా మెట్లబావులు కాకతీయుల కాలంలో నిర్మించిన దాఖలాలున్నాయి. గోల్కొండ కోటను కూడా తొలుత కాకతీయులే నిర్మించినందున, ఈ బావి కూడా వారి హయాంలోనే రూపుదిద్దు కుని ఉంటుందన్న వాదనా ఉంది. భారీ వర్షాలతో బావి కొంతభాగం కూలి పూడుకుపోయింది. ఆగాఖాన్ ట్రస్టు దాన్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించడంతో మళ్లీ అందులో నీటి ఊట ఏర్పడి ఇప్పుడు పూర్వపు రూపాన్ని సంతరించుకుంది. ఈ పునరుద్ధరణ పనులు అద్భుతంగా సాగిన తీరును యునెస్కో గుర్తించింది. వారెవ్వా.. ముంబై మ్యూజియం.. ఏసియా–పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి 6 దేశాలకు చెందిన 13 కట్టడాలు పురస్కారాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. భారత్, చైనా, అఫ్ఘానిస్తాన్, ఇరాన్, నేపాల్, థాయిలాండ్ మాత్రమే ఈ ఘనత సాధించాయి. ఇందులో మన దేశం నుంచి నాలుగు కట్టడాలున్నాయి. పురస్కారాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన విభాగం ‘అవార్డ్ ఆఫ్ ఎక్సెలెన్స్’. ఈ కేటగిరీలో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయ మ్యూజియం ఒక్కటే చోటు దక్కించుకోవటం విశేషం. దీని నిర్మాణాన్ని పునరుద్ధరించిన తీరు అత్యద్భుతమని యునెస్కో పురస్కారాల జ్యూరీ అభిప్రాయపడింది. రెండో కేటగిరీ అయిన డిస్టింక్షన్లో మెట్లబావి చోటు దక్కించుకుంది. అలాగే ముంబైలోని బైకులా స్టేషన్ మెరిట్ విభాగంలో చోటు దక్కించుకుంది. ఎంగ్ టెంగ్ ఫాంగ్ చారిటబుల్ ట్రస్టుతో సంయుక్తంగా యునెస్కో ఈ పురస్కారాలను ప్రకటిస్తోంది. 40 ఎకరాల విస్తీర్ణంలో... 40 ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ ఎత్తైన రాతి కట్టడంతో ప్రహరీ, దాని చుట్టూ కందకం.. ఇప్పటికీ దోమకొండ కోట చెక్కు చెదరలేదు. కోటకు తూర్పు, పడమర దిక్కుల్లో పెద్ద ద్వారాలున్నాయి. సంస్థానాదీశుల ప్రధాన నివాసంగా వెంకటభవనం రాజసం ఉట్టిపడేలా కనిపిస్తుంది. కోటలో రాతితో మహదేవుని ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు. కోటలో అద్దాల మేడ ప్రత్యేకం. ప్రముఖ సినీ హీరో చిరంజీవి తనయుడు రాంచరణ్, ఉపాసనల వివాహం ఇక్కడే జరిగింది. ఆర్కిటెక్ట్ అనురాధ నాయక్ కోట పరిరక్షణ బాధ్యతలు చూస్తున్నారు. గుర్తింపు రావడంపై దోమకొండ సంస్థానం వారసుడు అనిల్ కామినేని, అతని సతీమణి శోభన కామినేని మాట్లాడుతూ.. కోటకు వచ్చిన గుర్తింపు దోమకొండ ప్రజలకేకాక తెలంగాణ ప్రజలందరికీ దక్కిన గుర్తింపుగా భావిస్తున్నామన్నారు. -
బీడీ చుట్టలు చుడితేనే జీవనం సాగేది.. అలాంటిది పది లక్షలంటే..
సాక్షి, నిజామాబాద్(దోమకొండ): బీడీ చుట్టలు చుడితేనే ఆ పేద కుటుంబం జీవనం సాగేది. ఆర్థికంగా ఇబ్బందులున్నా చదువు ఉంటేనే భవిష్యత్తుల్లో ఏదో ఒకరకంగా జీవనం సాగించవచ్చని భావించి పాఠశాలకు పంపుతున్నారు. ఈలోగా తొమ్మిదో తరగతి చదువుతున్న తమ కుమార్తె యాయత్రికి బోన్ క్యాన్సర్ అని తెలిసి దోమకొండకు చెందిన బీసు రాజనర్సు, అర్చన దంపతలు ఒక్కసారిగా కుంగిపోయారు. ఆపరేషన్ కోసం రూ. 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో దాతల కోసం ప్రస్తుతం ఆ పేద కుటుంబం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం విద్యార్థిని హైదరాబాద్‌లోని బసవతారకం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నెల కిందట చేతినొప్పి రావడంతో డాక్టర్ల సూచన మేరకు పరీక్షలు నిర్వహించిన అనంతరం బోన్ క్యాన్సర్‌గా ధృవీకరించారు. విద్యార్థిని తండ్రి రాజనర్సు కామారెడ్డిలోని వస్త్ర దుకాణంలో పనిచేస్తుండగా, తల్లి అర్చన బీడీలు చుడుతుంది. తమ కుమార్తె వైద్యం కోసం దాతలు ముందుకొచ్చి ఆదుకోవాలని విద్యార్థిని తల్లిదండ్రులు రాజనర్సు (ఫోన్ నెంబర్ 9951068730) అర్చన (7036475197) విజ్ఞప్తి చేశారు. -
కామారెడ్డి: పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా
సాక్షి, కామారెడ్డి: దోమకొండ శివారులో చింతామన్ పల్లి గ్రామానికి చెందిన పెళ్లి బృందం ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పది మందికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. చింతామన్ పల్లి గ్రామానికి చెందిన సార్ల సంతోష్ వివాహం ఈ నెల 28న సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బలవంతపుర్ గ్రామానికి చెందిన అమ్మాయితో జరిగింది. ఈ క్రమంలో పెళ్లి కూతురు ఇంట్లో బుధవారం ఫంక్షన్ ఉండటంతో ఉదయం పెళ్ళికొడుకు తరఫున సుమారు 25 మంది ట్రాక్టర్లో చింతామన్ పల్లి గ్రామం నుంచి బయలుదేరారు. శుభకార్యం ముగించుకుని తిరుగు ప్రయాణంలో మార్గమధ్యలో దోమకొండ శివారులోని దొంగల మర్రి ప్రాంతంలో ట్రాక్టర్ అదుపుతప్పింది.(చదవండి: అత్యాచారం.. ఆపై భయంతో ఆత్మహత్య ) ఈ ఘటనలో చింతామన్ పల్లి గ్రామానికి చెందిన సార్ల ప్రమీల, సాయవ్వ, యశోద, నడిపి రాజవ్వ, ఎల్లయ్య, దేవలక్ష్మి, శివరాజు, రాజయ్య, లింగం కాచాపూర్ కు చెందిన గంగవ్వలకు బలమైన గాయాలయ్యాయి. వీరిలో రాజయ్య, లింగంల పరిస్థితి విషమంగా ఉండటంతో 108 అంబులెన్స్‌లో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని దోమకొండ ఆస్పత్రికి తరలించి చికిత్స నిర్వహించారు. సామచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి పరిస్థితి సమీక్షించారు. డ్రైవర్ శ్రీనివాస్ అజాగ్రత్తగా ట్రాక్టర్ నడపడంతో ఈ ప్రమాదం జరిగిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యూరియా కోసం బారులు..
-
యూరియా కోసం బారులు.. లైన్లో మందు సీసాలు
సాక్షి, కామారెడ్డి : దోమకొండ మండల కేంద్రంలోని సొసైటీ వద్ద రైతులు యూరియా కోసం బారులు తీరారు..ఎరువులు తీసుకునేందుకు పడిగాపులు కాశారు. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడే ఓపిక లేకపోవడంతో క్యూ లైన్లో తమ గుర్తుగా వస్తువులు ఉంచారు. చెప్పులు, రాళ్లతో పాటు మందు బాటిళ్లను కూడా లైన్లో ఉంచారు. తాగి పడేసిన మందు సీసాలను లైన్లో పెట్టడంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (విక్రయాల్లో విచిత్రాలెన్నో..) -
దోమకొండ సంస్థాన వారసుడు ఉమాపతిరావు కన్నుమూత
దోమకొండ/ సాక్షి, హైదరాబాద్: కామారెడ్డి జిల్లాలోని దోమకొండ సంస్థాన వారసుడు, రిటైర్డు ఐఏఎస్ అధికారి కామినేని ఉమాపతిరావు (92) బుధవారం తెల్లవారు జామున మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ప్రముఖ సినీ హీరో రామ్‌చరణ్ భార్య ఉపాసన, ఉమాపతిరావు మనుమరాలు. ఉమాపతిరావు కుమారుడు అనిల్‌కుమార్, అపోలో ఆస్పత్రుల చైర్మన్ ప్రతాప్‌రెడ్డి కూతురు శోభనల కుమార్తె అయిన ఉపాసన నిశ్చితార్థాన్ని దోమకొండ కోటలోనే నిర్వహించారు. టీటీడీ ఎగ్జిక్యూటివ్ అధికారిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ జిల్లాల కలెక్టర్‌గా ఉమాపతిరావు సేవలందించారు. ఉమాపతిరావుకు భార్య పుష్పలీలతో పాటు, కుమారుడు అనిల్ కామినేని, కూతురు శోభ ఉన్నారు. నేడు దోమకొండలో అంత్యక్రియలు దోమకొండలోని లక్ష్మీబాగ్‌లో ఉమాపతిరావు అంత్యక్రియలను గురువారం ఉదయం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. అంత్యక్రియలకు ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, రామ్‌చరణ్ కుటుంబ సభ్యులతో పాటు, పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి సంతాపం ఉమాపతిరావు మృతిపట్ల సీఎం కేసీఆర్ సం తాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
కోర్టుకు హాజరైన కామినేని వారసులు
సాక్షి, కామారెడ్డి: దోమకొండ కోట ఆస్తుల విషయంలో కామినేని వారసుల మధ్య తలెత్తిన ఆస్తి వివాదం చివరకు కోర్టుకు చేరింది. వారసుల్లో ఒకరైన సత్యనారాయణరావు కుటుంబం కోటలోని ఆస్తుల్లో తమ వాటా కోసం కామారెడ్డి కోర్టులో కేసు వేసింది. దీనిపై నోటీసులు అందుకున్న మిగతా వారసులందరూ గురువారం కోర్టుకు హాజరయ్యారు. కామినేని వంశస్తులైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఉమాపతి, అనిల్ కామినేని, సత్యనారాయణరావు, రోహిత్ రాజేశ్వర భూపాల్, లావణ్యతో పాటు మొత్తం 14మంది న్యాయస్తానం ఎదుట హాజరయ్యారు. కోటలోని వెంకటభవన్, అద్దాల బంగ్లా, అజ్గర్ మంజిల్, భరత్‌రాంభూపాల్ బంగ్లాతో పాటు స్థలాల విషయంలో వారసుల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ కేసు విచారణ వచ్చే నెల 28కి వాయిదా పడినట్లు సమాచారం. చదవండి: వీధికెక్కిన ‘కామినేని’ ఆస్తుల తగాదా కోటలోని శివాలయంలో పూజలు చేస్తున్న ఉపాసన, రాంచరణ్ (ఫైల్ ఫోటో) కాగా కామినేని అనిల్...అపోల్ ఆస్పత్రి చైర్మన్ ప్రతాప్ రెడ్డి కుమార్తె శోభనను వివాహం చేసుకున్నారు. అలాగే వారి కూతురు ఉపాసన హీరో రాంచరణ్‌ను వివాహమాడిన విషయం తెలిసిందే. ఉపాసన-రాంచరణ్ వివాహ వేడుకలు కూడా కోటలో జరిగాయి. వివాహం సందర్భంగా వారిద్దరూ కోటలోని శివాలయంలో పూజలు కూడా నిర్వహించారు. ఇక దోమకొండ కోటకు సంబంధించిన నలభై ఎకరాల ప్రహరీ గోడ ప్రస్తుతం పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. మిగతా భవనాలు, భూములు కామినేని వంశస్తులవి. ప్రస్తుతం ఆస్తుల వారసత్వంపై కోర్టులో వివాదం కొనసాగుతోంది. కోటలో చిరంజీవి, రాంచరణ్, ఉపాసన -
మత్తడి కోసం గ్రామాల మధ్య ఘర్షణ
సాక్షి, దోమకొండ (కామారెడ్డి): ఎడ్లకట్ట నీటి విషయంలో సోమవారం ఇరు గ్రామాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. మండలంలోని గొట్టిముక్కుల గ్రామ శివారులో ఎడ్లకట్ట వాగు మత్తడి నుంచి నీటి కాలువ ద్వారా ప్రవహించే నీటి విషయంలో ఈ ఘర్షణ నెలకొంది. సంఘమేశ్వర్ గ్రామానికి చెందిన వంద మంది రైతులు మత్తడికి చేరుకున్నారు. దీంతో గొట్టిముక్కుల గ్రామస్తులు, రైతులు కూడా అక్కడికి చేరుకున్నారు. మత్తడి నుంచి వెళ్లే కాలువ ద్వారా నీరు సంఘమేశ్వర్ గ్రామ చేరువులోకి వెళ్లాల్సి ఉందని, కాని గొట్టిముక్కుల గ్రామస్తులు కాలువ నీటిని గొట్టిముక్కుల చెరువులోకి వెళ్లేలా అడ్డుగా ఉన్న కాలువ రాళ్లను తొలగించారని ఆరోపించారు. కాగా తమ చెరువులోకి కూడా నీరు గతంలో నుంచే వెళుతుందని ఇది కొత్తగా తాము చేసింది కాదని గొట్టిముక్కుల గ్రామస్తులు వాదించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రాజేశ్వర్‌గౌడ్ అక్కడికి చేరుకుని రైతులను సముదాయించారు. విషయంపై ఉన్నతాధికారులతో పాటు ఇరిగేషన్ అధికారులకు వివరించారు. సోమవారం వినాయక చవితి పండుగ సందర్భంగా అధికారులు అందుబాటులో ఉండరని, మంగళవారం ఇరిగేషన్ అధికారుల సమక్షంలో సమస్య పరిష్కరించుకోవాలని ఇరుగ్రామాల వారికి ఆయన సూచించారు. రెండు గ్రామాలకు చెందిన రైతులను, గ్రామస్తులను, నాయకులను అక్కడి నుంచి పంపించి వేశారు. మంగళవారం రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు అక్కడికి చేరుకుని నీటిని గతంలో రెండు గ్రామాల చెరువులకు వాడటానికి కాలువ తీశారని సంఘమేశ్వర్ గ్రామానికి 60 శాతం, గొట్టిముక్కుల గ్రామానికి 40 శాతం నీటిని వాడుకోవాలని సూచించారు. -
సంఖ్యాబలం ఉన్నా అభ్యర్థి కరువు
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇక్కడ తొమ్మిది ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్ ఐదింటిలో విజయం సాధించగా.. టీఆర్ఎస్ నాలుగు స్థానాలకే పరిమితమైంది. అయితే అత్యధిక స్థానాలను గెలిచిన ఆనందం కాంగ్రెస్ పార్టీకి లేకుండాపోయింది. దోమకొండ ఎంపీపీ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఇద్దరు బీసీ మహిళలూ ఓటమి పాలయ్యారు. దీంతో ఆ పార్టీకి ఎంపీపీ అభ్యర్థి లేకుండా పోయారు. ఎంపీపీ పీఠం కైవసం చేసుకునే సంఖ్యాబలం ఉన్నా.. ఎంపీపీ పదవి కోసం బీసీ మహిళ లేకపోవడంతో ఆ పదవిని వదులుకునే పరిస్థితి వచ్చింది. అన్నాసాగర్‌లో ఒకే ఒక్కటి ఎల్లారెడ్డి మండలంలోని అన్నాసాగర్ ఎంపీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన హన్మన్నగారి శ్రీనివాస్‌రెడ్డికి ఒకే ఒక్క ఓటు దక్కింది. ఆయనకు కూలర్ గుర్తు కేటాయించారు. అయితే మంగళవారం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో శ్రీనివాస్‌రెడ్డికి ఒకే ఒక్క ఓటు వచ్చింది. మరో స్వతంత్ర అభ్యర్థి జంగింటి ఉమాదేవి 1,005 ఓట్లు దక్కించుకుని విజయం సాధించారు. 661 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి గోలి వసంతం రెండో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి చిలుక నర్సింలుకు 263 ఓట్లు, బీజేపీ అభ్యర్థి లక్ష్మారెడ్డికి 32 ఓట్లు పోలయ్యాయి. -
అనుకున్నది జరుగుతుంది!
‘‘దోమకొండ శివాలయానికి 800 ఏళ్ల చరిత్ర ఉంది. 400 ఏళ్ల క్రితం మా పూర్వీకులు ఆ ఆలయం చుట్టూ దోమకొండ కోటను నిర్మించారు. 2003లో మా తాతగారు కామినేని ఉమాపతి (దోమకొండ ఫ్యామిలీ 20వ తరం) పురావస్తు శాఖ వారితో కలిసి ఆలయాన్ని పునరుద్ధరించడం మొదలుపెట్టారు. ఇక్కడి శివలింగం విచిత్రమైన నీలం రంగులో ఉంటుంది. నాకు, మిస్టర్ సి (రామ్‌చరణ్)కి ఆలయాన్ని, దాని పరిసర ప్రాంతాలను శుభ్రం చేస్తే అనుకున్నది జరుగుతుందని నమ్మకం’’ అన్నారు ఉపాసన కొణిదెల. భర్త రామ్‌చరణ్‌తో కలసి శివరాత్రి పర్వదినాన దోమకొండ కోట శివాలయాన్ని సందర్శించి, భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ ఫొటోను ఉపాసన తన ట్వీటర్ ద్వారా షేర్ చేశారు. కాగా శివరాత్రికి ముందు కొన్ని రోజులు ఉపాసన ఆధ్యాత్మిక యాత్ర వెళ్లారు. ఇందులో భాగంగా ప్రయాగలో జరిగిన కుంభమేళాని సందర్శించారు. ‘‘ఆరు పవిత్ర స్థలాలను సందర్శించాను. కుంభ్ ఓ మంచి అనుభూతి. తేలికగా, సంతోషంగా, నూతనోత్సాహాన్నిచ్చింది. జై శివ శంభో’’ అంటూ ఆ హోలీ ట్రిప్ గురించి పేర్కొన్నారు ఉపాసన. Shraddha, Bhakti & complete LOVE & devotion to Lord Shiva. 🙏🏼 OM NAMAH SHIVAYA #ramcharan at the #Domakonda Shivalayam 🙏🏼 restore ancient temples pic.twitter.com/sme3oPMo7P — Upasana Konidela (@upasanakonidela) 4 March 2019 -
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే రైతుల సంక్షేమం: సినీనటి విజయశాంతి
సాక్షి, దోమకొండ: దొరల పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి అన్నారు. ఆదివారం రాత్రి దోమకొండలో ఆమె మండలి విఫక్షనేత షబ్బీర్‌అలీతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాల గురిం చి ప్రజలకు ఆమె వివరించారు. విజయశాంతి రోడ్‌షోకు పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. కాంగ్రెస్‌తోనే రైతు సంక్షేమం బీబీపేట: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతోనే రైతు సంక్షేమం ముందుకు సాగుతుందని, టీఆర్ఎస్తో రైతులకు కష్టాలు తప్పవని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం కామారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ గెలుపు కోసం రోడ్‌షో నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన ప్రతి అంశాన్ని ప్రజా సంక్షేమం నెరవేర్చే దిశగా ముందుకు సాగుతుందన్నారు. ప్రజల సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెబుతున్న టీఆర్ఎస్ గ్రామాల్లోని ఒకరిద్దరి పార్టీ నాయకులకు ట్రాక్టర్లు ఇచ్చినంత మాత్రాన అది ఏ కరంగా సంక్షేమం చేపట్టినట్లు అవుతుందని ప్రశ్నించారు. నాలుగున్నరేళ్ల పాలన లో అభివృద్ధి చేయకుండా మాటల గారడితో ప్రజలను మోసం చేశారని అన్నారు. టీఆర్ఎస్ వారిని మీ ఓటుతో తరిమికొట్టండి అని ప్రజలకు పిలుపునిచ్చారు. 2014లో చేసిన తప్పును సరిదిద్దుకొనే అవకాశం మీ ముందు ఉందని కాంగ్రెస్ పార్టీని గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలన్నారు. ఈ ఎన్నికలు దొరలతో కాంగ్రెస్ చేస్తున్న యుద్ధం అని మీ అమూల్యమైన ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఎమ్మెల్యే అభ్యర్థిగా షబ్బీర్ అలీని గెలిపించుకోవాలన్నారు. కాంగ్రెస్ నాయకులు యూసుఫ్ అలీ, ఎంజీ వేణుగోపాల్, జమునా రాథోడ్, మండల నాయకులు భూమాగౌడ్, సుతారి రమేష్, మ్యాదరి సత్తయ్య, విఠల్, వెంకట్ గౌడ్, కొరివి నర్సింలు, సాయి పాల్గొన్నారు. సభకు భారీగా తరలిన కాంగ్రెస్ శ్రేణులు భిక్కనూరు: సినీనటి విజయశాంతి దోమకొండ లో నిర్వహించిన రోడ్‌షోకు భిక్కనూరు మండలం నుంచి కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఆదివారం భారీగా తరలి వెళ్లారు. మండల కేంద్రలోని అన్ని వీధుల గుండా బైక్ ర్యాలీ తీసి దోమకొండకు తరలివెళ్లారు. కాంగ్రెస్ నేతలు ఇంద్రకరణ్‌రెడ్డి, లింబాద్రి, చంద్రకాంత్‌రెడ్డి, సుదర్శన్, నాగభూషణంగౌడ్, అంకంరాజు, సిద్దగౌడ్, వెంకటిగౌడ్, ప్రభాకర్, కుంట లింగారెడ్డి, కుంట మల్లారెడ్డి, ఎల్లారెడ్డి ఉన్నారు. -
వీధికెక్కిన ‘కామినేని’ ఆస్తుల తగాదా
శతాబ్దాల చరిత్ర గల దోమకొండ కోటలోని భవనాల విషయంలో వారసుల మధ్య వివాదం ముదురుతోంది. గడీకోటలోని భవనాలు తమవంటూ మూడు కుటుంబాలకు చెందిన వారు తాళాలు వేయగా.. మరో వారసుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా వేసిన తాళాలను తొలగించారంటూ పోలీసులకు మరో ఫిర్యాదు అందింది. దీనిపైనా కేసు నమోదైంది. సాక్షి, కామారెడ్డి: దోమకొండ సంస్థాన వారసుల మధ్య ఆస్తుల కొట్లాట ముదురుతోంది. దోమకొండ కోట కేంద్రంగా కామినేని వంశీయులు శతాబ్దాల పాటు పాలించారు. సంస్థానాల రద్దు అనంతరం దోమకొండ కోట ఎవరిది అన్న విషయం ఎప్పుడూ చర్చకు రాలేదు. 2013లో సినీ నటుడు రాంచరణ్ తేజ పెళ్లితో కోట వివాదం వెలుగులోకి వచ్చింది. అనిల్ కామినేని కుమార్తె ఉపాసనకు రాంచరణ్‌తో పెళ్లి కుదరడం, అప్పట్లో చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉండడంతో కోటలో కదలికలు మొదలయ్యాయి. ఒక దశలో గడీని రాంచరణ్ సొంతం చేసుకున్నాడన్న ప్రచారం జరిగింది. పెళ్లికి ముందు కార్యక్రమాలు ఇక్కడే నిర్వహించారు. అప్పుడు కోటలో కొన్ని భవనాలు కొత్త రూపు సంతరించుకున్నాయి. ప్రస్తుతం కోట వ్యవహారాలు అనిల్ కామినేని చూస్తున్నారు. ఆయనకు సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది ఆధీనంలోకి కోట వెళ్లింది. దీంతో సామాన్య ప్రజలకు కోట సందర్శన అవకాశం లేకుండా పోయింది. గొడవ మొదలైందిలా..... కోట పూర్తిగా అనిల్ కామినేని వశమైందన్న ప్రచారం జోరుగా సాగడంతో ఇతర వారసులైన రాజేశ్వర్రావ్, సత్యనారాయణరావ్, రాజేశ్వర్‌భూపాల్, లావణ్య కుటుంబాలకు చెందిన వారు స్థానిక కలెక్టర్‌కు ఆస్తుల విషయంలో ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా పంచాయతీ అధికారి రాములును విచారణ అధికారిగా నియమించారు. పంచాయతీ అధికారులు విచారణ జరిపినా వివాదం తేలలేదు. దీంతో ఈ నెల 9న ఆయా కుటుంబాలకు చెందిన వారు కోటలోకి ప్రవేశించి భవనాలకు తాళాలు వేశారు. ఇవి తమ ఆస్తులని పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. అక్కడ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న అనిల్ కామినేని మనుషులు పోలీసులను ఆశ్రయించారు. కోటలోకి అక్రమంగా చొరబడి భవనాలకు తాళాలు వేశారని ఫిర్యా దులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు తాళాలు వేసినవారిపై కేసు నమోదు చేశారు. ఇంతటితో ఆగకుండా భవనాలకు వేసిన తాళాలను తొలగించారు. విషయం తెలిసిన సత్యనారాయణరావ్, రాజేశ్వర్‌భూపాల్, లావణ్యలు తమ ఇళ్లకు వేసుకున్న తాళాలను అనిల్ కామినేని మనుషులు తొలగించారంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాశంగా మారింది. ఫిర్యాదు నమోదు.. దోమకొండ: కోటలో తమ ఆస్తులకు సంబంధించిన భవనాలకు తాళాలు వేసి ఫ్లెక్సీలు కట్టగా.. కామినేని అనిల్‌కుమార్ మనుషులు వాటిని తొలగించారని కోట వారసులుగా చెప్పుకుంటున్న కామినేని సత్యనారాయణ, కామినేని రాజేశ్వర్‌భూపాల్, లావణ్యలు బుధవారం దోమకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని ఎస్సై నరేందర్ తెలిపారు. అద్దాలమేడ, అస్గర్‌మంజిల్, ఉమా మంజిల్ భవనాలకు ఈనెల 8వ తేదీన తాళాలు వేశామని, ఈనెల 12వ తేదీన కామినేని అనిల్ మనుషులు వాటిని తొలగించి, ఫ్లెక్సీలను తీసివేశారని ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. వారి ఫిర్యాదు మేరకు అనిల్ కామినేని మనుషులపై కేసు నమోదు చేశామన్నారు. -
వీధికెక్కిన గడీ వివాదం!
సాక్షి, కామారెడ్డి/దోమకొండ: ప్రసిద్ధి గాంచిన దోమకొండ గడీ వారసత్వ పోరు వీధికెక్కింది. సంస్థానాధీశుల వారసులు కోటలోని భవనాలను స్వాధీనం చేసుకోవడానికి పోటీ పడుతున్నారు. దశాబ్దాల కాలంగా వారసత్వ పోరు నడుస్తున్నప్పటికీ శనివారం రాజా ఉమాపతిరావ్ వారసులు కోటలోని ముఖ్య భవనాలకు తాళాలు వేసి హెచ్చరికలు జారీ చేస్తూ ఫ్లెక్సీలు కట్టడంతో వ్యవహారం మరోమారు రచ్చకెక్కింది. ప్రస్తుతం గడీలో మరో వారసుడు అనిల్ కామినేని (నటుడు చిరంజీవి వియ్యంకుడు) గడీకోటలో గత పది పదిహేనేళ్లుగా మరమ్మతులు చేయిస్తూ, అప్పుడప్పుడు వచ్చిపోతున్నారు. ఆయన కూతురు ఉపాసన, అల్లుడు రామ్‌చరణ్ పలుమార్లు కోటలోని మహదేవుని ఆలయంలో పూజలు సైతం నిర్వహించారు. ఇప్పుడు మరో వారసుడు కోటలోని భవనాలు తమవేనంటూ తాళం వేయడంతో పోరు తారాస్థాయికి చేరింది. ఆది నుంచీ వివాదాలే.. అనిల్ కామినేని నటుడు చిరంజీవితో వియ్యం అందుకున్న సందర్భంలో కోటలో మరమ్మతులు జరిగాయి. చిరంజీవి కొడుకు రామ్‌చరణ్ తేజ, అనిల్ కామినేని కూతురు ఉపాసనల వివాహానికి ముందు కొన్ని కార్యక్రమాలు కోటలోనే నిర్వహించారు. కోటలోని భవనాలన్నింటినీ మరమ్మతులు చేయడంతో పాటు మహదేవుని ఆలయాన్ని పునర్నిర్మించారు. మహదేవుని ఆలయం పురావస్తు శాఖ పరిధిలో ఉన్నప్పటికీ, దానికి మరమ్మతులు చేయడం అప్పట్లో వివాదాలకు తావిచ్చింది. కోటలోని ఓ భవనంలో నివాసం ఉంటున్న ఎండపల్లి లింబయ్య అనే వ్యక్తి కామారెడ్డి కోర్టులో కేసు సైతం దాఖలు చేశాడు. మరమ్మతులు జరుగుతున్నపుడే మిగతా వారసుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. గడీ ప్రహరీ, మహదేవుని ఆలయం మాత్రమే పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్నాయి. మిగతా భవనాలు రూపు మారకుండా మరమ్మతులు చేయడానికి మాత్రం పురావస్తు శాఖ అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. దీన్ని అడ్డు పెట్టుకుని గడి లోపలికి సామాన్య ప్రజల రాకపోకలను పూర్తిగా కట్టడి చేశారు. ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. కాగా భవనాలు తమవేనంటూ కొందరు వారసులు ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అసలు పోరు ఇదే.. దోమకొండ గడీలో పలు భవనాలు ఉన్నాయి. ఇందులో అద్దాల మేడ, ఉమా మహాల్, వెంకట్ భవన్, ఆగన్న భవంతి పేరుతో ఉన్న భవనాలు ప్రైవేటు ఆస్తులుగా ఉన్నాయి. ఆయా భవనాలను తమకు చెందినవని అనిల్ కామినేని కొంత కాలంగా చెబుతూ పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే, శనివారం దోమకొండ గడీకోటకు వచ్చిన ఇతర వారసులు.. ఆస్తుల పంపకాల్లో వెంకట్భవన్ అనిల్ కామినేనికి, అద్దాల మేడతో పాటు అందులోని బావి రాజేశ్వర్రావ్, సత్యనారాయణరావ్లకు, ఉమా మహాల్ రాజేశ్వర్ భూపాల్‌లకు చెందినవంటూ ఆయా భవనాలకు తాళాలు వేసుకున్నారు. గడీకోటలోని గడీకోటలోని సిబ్బందిని బయటకు పంపి.. వెంకటపతిభవన్ గేటుకు, ఉమా మంజిల్, అద్దాలమేడ, క్లాక్ టవర్ గేటుకు వారు తాళాలు వేశారు. కోటలోని అస్తులు ప్రైవేట్ ఆస్తులని, అవి మూడు కుటుంబాలకు చెందిన ఉమ్మడి ఆస్తులని పేర్కొంటూ ఫ్లెక్సీలను గడీకోటలోని భవనాలు, ఇతర ప్రదేశాల్లో కట్టారు. వెంకటపతి భవన్ మాత్రమే కామినేని అనిల్దని, మిగతావి తమ ఆస్తులని, అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ తమ వద్ద ఉన్నాయని సత్యనారయణరావ్, రాజేశ్వర్‌రావు తెలిపారు. దీనిపై ఇప్పటికే కలెక్టర్‌కు, డీపీవోకు ఫిర్యాదు చేశామని చెప్పారు. గడీకోట వివాదంపై జిల్లా పంచాయతీ అధికారి రాములును ‘సాక్షి’ వివరణ కోరగా.. తమకు వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టామని, కుటుంబానికి సంబంధించిన సమస్య అయినందున వారే పరిష్కరించుకోవాలని సూచించామని బదులిచ్చారు. -
రెండు పెళ్లిళ్లు జరిగినా..
దోమకొండ నిజామాబాద్ : మండలంలోని అంచనూర్ గ్రామానికి చెందిన గుండు మహిపాల్(44) అనే వ్యక్తి జీవితంపై విరక్తి చెంది బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్ఐ లింబాద్రి తెలిపారు. మృతుడు మహిపాల్‌కు 2003లో వివాహం కాగా భార్య కల్పన పుట్టింటికి వెళ్లిపోయి వరకట్నం కేసు పెట్టిందని తెలిపారు. తిరిగి 2011లో మరో వివాహం చేసుకోగా భార్య కాపురానికి రావడం లేదన్నారు. రెండు పెళ్లిళ్లు జరిగిన సంసార జీవితం లేకపోవడంతో జీవితంపై విరక్తి చేంది ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. మృతుడు గ్రామంలో కరెంట్ మోటార్ల మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఆయన వివరించారు. -
విద్యార్థిపై కొడవలితో హత్యాయత్నం
దోమకొండ : మండలంలోని అంబారిపేటకు చెందిన చిందం మధుకుమార్ అనే విద్యార్థిపై ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు కొడవలితో దాడి చేసి హత్యాయత్నం చేశారు. గ్రామానికి చెందిన చిందం బుచ్చయ్య కుమారుడు మధుకుమార్ రోజు మాదిరిగా వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ముఖానికి మాస్క్ ధరించి కొడవలితో మధుకుమార్‌పై దాడిచేసి గొంతుపై కోశాడు. దీంతో భయపడ్డ మధుకుమార్ అతడి నుంచి తప్పించుకుని పక్కనే ఉన్న వ్యవసాయ బావి వద్దకు పరుగుతీశాడు. అక్కడే ఉన్న గ్రామానికి చెందిన వారికి తనపై ఎవరో దాడి చేశాడని తెలుపగా వారు వెంటనే దుస్తులను విద్యార్థి మెడకు చుట్టి 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మధుకుమార్ తండ్రి బుచ్చయ్య గొర్ల కాపరి కాగా మన్యం వెళ్లాడు. తల్లి లక్ష్మి కూలి పనికి వెళ్లింది. సంఘటన స్థలాన్ని కామారెడ్డి డీఎస్పీ ప్రసన్నరాణి సందర్శించారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ నర్సింలు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం మధుకుమార్‌ను హైదరాబాద్‌కు తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కారణాలు తెలియరాలేదు. -
కరెంట్ షాక్ తగిలి బాలుడు మృతి
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా దోమకొండలో ఓ బాలుడు ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్ తగిలి మరణించాడు. వివరాలు ఇలా ఉన్నాయి... వివేక్ (16) అనే బాలుడు బుధవారం వేకువజామున ప్రమాదవశాత్తూ కరెంటు షాక్‌కు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం కామారెడ్డిలోని రుద్ర ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాద్దిసేపటికే మరణించాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
షష్టిపూర్తి వేడుకలకు హాజరైన చిరంజీవి
దోమకొండ : నిజామాబాద్ జిల్లాలోని దోమకొండ గడీకోటలో శనివారం తన వియ్యంకుడు, అపోలో ఆస్పత్రుల డైరెక్టర్ అయిన కామినేని అనిల్‌కుమార్ షష్టిపూర్తి కార్యక్రమానికి ప్రముఖ సినీనటుడు చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, కుమారుడు రాంచరణ్‌తేజ, ఆయన సతీమణి ఉపాసనలు హాజరయ్యారు. గడీకోటలోని మహదేవుని ఆలయంలో ఉదయం నుంచి షష్టిపూర్తి కార్యక్రమం సందర్భంగా పూజలు నిర్వహించారు. అపోలో ఆస్పత్రుల చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, రిటైర్డు ఐఏఏస్ అధికారి కామినేని ఉమాపతిరావ్, తదితరులు అనిల్‌కుమార్ దంపతులను∙దీవించారు. రాత్రి చిరంజీవి డిన్నర్‌కు హాజరై తిరిగి వెళ్లిపోయారు. రాంచరణ్ మాత్రం ఆయన సతీమణితో కలిసి ఇక్కడే ఉన్నారని గడీకోట ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. -
ట్రాక్టర్ కింద పడి డ్రైవర్ మృత్యువాత
దోమకొండ (నిజామాబాద్) : పొలం దున్నుతుండగా బురదలో కూరుకుపోయిన ట్రాక్టర్‌ను పైకి తీసుకొచ్చే క్రమంలో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలం చింతమాన్‌పల్లి గ్రామంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం... చింతమాన్‌పల్లి గ్రామానికి చెందిన పసుల నాంపల్లి(32) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కాగా శనివారం ఒక రైతు పొలం దున్నేందుకు ట్రాక్టర్‌తో వెళ్లాడు. అయితే దున్నుతుండగా ట్రాక్టర్ బురదలో కూరుకుపోయింది. దానిని పైకి లేపే యత్నంలో ట్రాక్టర్ ముందు టైర్లు పైకి లేచాయి. దీంతో డ్రైవర్ సీట్లో కూర్చున్న నాంపల్లి కింద పడిపోయాడు. అతనిపై ట్రాక్టర్ ఇంజిన్ పడటంతో బురదలో కూరుకుపోయి, అక్కడే చనిపోయాడు. అతనికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అర్హులందరికీ 'ఆసరా'గా నిలుస్తాం
నిజామాబాద్: ఆసరా పింఛన్ల పంపిణీలో అధికారుల తీరుపై కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ఆగ్రహం వ్యక్తంచేశారు. 'పింఛినిప్పించండి సారూ..' అంటూ వేడుకున్న దరఖాస్తుదారులను అనునయించారు. 'అర్హులందరికీ వస్తుందమ్మా..' అంటూ కళ్ల నీళ్లు పెట్టుకున్న వృద్ధులను ఓదార్చారు. న్యాయబద్ధంగా మీకు రావాల్సిన పింఛన్ల కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దని, అలా అడిగిన వారిపై ఫిర్యాదు చేయాలని సూచించారు. కలెక్టర్ రొనాల్డ్‌రోస్ మంగళవారం కామారెడ్డి, డిచ్పల్లి, దోమకొండ మండలాల్లో పర్యటించారు. ఆసరా పింఛన్ల సర్వే, లబ్ధిదారుల ఎంపికల తీరుపై సమీక్షించారు. అధికారులు, సిబ్బంది చేసిన తప్పులు, లోపాలపై మండిపడ్డారు. దరఖాస్తుదారులతో నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను ఓపిక విని.. పరిష్కరిస్తానంటూ భరోసానిచ్చారు. తమ కాలనీలకు కలెక్టర్ రావడం.. భరోసా ఇవ్వడంతో స్థానికులు ఆనందం వ్యక్తంచేశారు. కామారెడ్డిలో పట్టణంలో ఆసరా పింఛన్ల సర్వే, లబ్దిదారుల ఎంపికలో మున్సిపల్ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యాలయంలోని కంప్యూటర్ విభాగంలో ఎస్కేఎస్ సర్వే, ఆసరా పింఛన్ల రికార్డులను పరిశీలించారు. సరైన వివరాలు లేకపోవడంతో మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి, ఆర్డీవో గడ్డం నగేశ్, తహశీల్దార్ గఫర్‌మియా, మున్సిపల్ ప్రత్యేకాధికారి, ఐకేపీ పీడీ వెంకటేశం,మున్సిపల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగి కుటుంబంలో ఆసరా లబ్ధిదారున్ని ఎంపిక చేయడంతో ఐకేసీ సీఓ అర్చనను సస్పెండ్ చేయాలని పీడీని ఆదేశించారు. పేదలు ఎక్కువగా నివసించే బతుకమ్మ కుంటలో పర్యటించారు. ఆసరా పింఛన్ల గురించి వృద్దులు, వితంతువులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో 13 వేలమందికి టెక్నికల్ సమస్యలతో పింఛన్లు అందించలేకపోయామన్నారు. ఫిబ్రవరి నుంచి అందరికీ ఫించన్లు అందిస్తామన్నారు. అనర్హులకు పింఛన్లు ఇచ్చినట్టు తేలితే అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. దోమకొండలో మండల పరిషత్ కార్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. గ్రామాల వారీగా ఆన్లైన్లో పింఛన్ల పరిస్థితిని సమీక్షించారు. అంగన్వాడీలు, వీఆర్ఏలు, హోంగార్డులు అర్హులుగా ఉంటే వారికి పింఛన్లు అందించాలని సూచించారు. అరవైఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ పింఛన్ వచ్చేలా చూడాలని ఎంపీడీఓ హిరణ్మయిని ఆదేశించారు. ఆయన వెంట మండల ప్రత్యేకాధికారి గంగారాం, ఐకేపీ ఏరియా కోఆర్డినేటర్ సుధాకర్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. డిచ్పల్లి మండలంలో... అమృతాపూర్ పంచాయతీ పరిధిలోని దేవనగర్ లెప్రసీ క్యాంపును కలెక్టర్ సందర్శించి, కాలనీవాసులతో మాట్లాడారు. తమకు పింఛన్లు మంజూరు కాలేదని ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన స్వయంగా క్యాంపును సందర్శించారు. లెప్రసీ రోగులతో మాట్లాడి కారణాలను తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటానని వారికి హామీ ఇచ్చారు. డీఆర్డీఏ పీడీ వెంకటేశం, ఎంపీడీఓ గోపాలకృష్ణ, తహశీల్దార్ రవీంధర్ తదితరులు ఉన్నారు. -
అదిగో.. చిరుత
కొద్ది రోజుల క్రితం భిక్కనూరు సౌత్ క్యాంపస్‌లో బహిర్భూమికి వెళ్లిన వాచ్‌మన్ బాలరాజుచిరుతను చూసి జడుసుకున్నాడు. దోమకొండలో పొలానికి వెళ్లిన రైతు వెంకటరెడ్డి భార్య ఇందిర బంతిపూల తోటలో చిరుతను చూసి హడలిపోయింది. మాక్లూరు మండలం మాదాపూర్ శివారులో కస్తూర్బా పాఠశాల విద్యార్థులు చిరుతను చూసి బెంబేలెత్తిపోయారు. అడవులలో సంచరించాల్సిన చిరుతపులులు జనారణ్యంలో అలజడి రేపుతున్నాయి. అటవీ శాఖ అధికారులు మాత్రం ‘నిమ్మకు నీరెత్తినట్లు’ వ్యవహరిస్తున్నారు. - సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ భిక్కనూరు టు మాక్లూరు * వయా పాల్వంచ, దోమకొండ * జనారణ్యంలో చిరుత సంచారం * పొద్దుగూకితే భయం భయం * అభయారణ్యంలో కరువైన రక్షణ * ‘పోచారం’ను వీడి జనావాసాల్లోకి * వన్యప్రాణుల సంరక్షణ గాలికి * చోద్యం చూస్తున్న అటవీ శాఖ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పదిహేను రోజులుగా జిల్లాలో చిరుతల సంచారం కలకలం సృష్టిస్తోంది. ఎన్నడూ లేని విధంగా చిరుతలు జనారణ్యం వైపు రావడంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. అటవీ శాఖ వన్యప్రాణుల సంరక్షణను విస్మరించిన కారణంగానే పులులు, చిరుతలు జనంలోకి వస్తున్నాయంటున్నారు. నిజామాబాద్‌ను ఆనుకుని ఉన్న ఆదిలాబా ద్ జిల్లా కవ్వాల్ అభయారణ్యం నుంచి కూడ చిరుతలు వచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. ప్రహసనంగా వన్యప్రాణుల సంరక్షణ అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో వన్యప్రాణుల సంరక్షణ ప్రహసనంగా మారింది. చట్టం అభాసుపాలవుతోంది. పులి గోర్లు, చర్మాల కోసం జంతువుల వేట ప్రధాన వృత్తిగా పెట్టుకున్న స్మగ్లర్ల కారణంగా వన్యప్రాణుల సంఖ్య తగ్గిపోతోంది. మిగిలిన వాటి ని అధికారులు పట్టించుకోకపోవడంతో అవి జనావాసాల వైపు దూసు కొస్తున్నాయి. జిల్లా వైశాల్యం 17,655 చదరపు కిలోమీటర్లు కాగా, అందులో 17.40 శాతం (2,718.09 చ. కి. మీ) వరకు అడవులు విస్తరించి ఉన్నాయి. పోచారం అభయా రణ్యాన్ని 1952 ఫిబ్రవరి 29 నుంచి జీఓ నంబర్ 124 ప్రకారం వన్యప్రాణుల రక్షిత ప్రదేశంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ అడవిలో మూడు పులులు, పన్నెండు చిరుతలు, నెమళ్లు, దుప్పులు, అడవి జింకలు, కృష్ణజింకలు, అడవిదున్నలు తదితర వన్యప్రాణులున్నాయి. వీటి సంరక్షణ కోసం ప్రత్యేక డివిజన్‌ను ఏర్పాటు చేశారు. కానీ, వేటగాళ్ల ఉచ్చుకు వన్యప్రాణులు చిక్కుతూనే ఉన్నాయి. పులులు, చిరుతల సంతతి రోజు రోజుకూ అంతరించిపోతోందని ‘జాతీయ పులుల గణన సమితి’ ఆందోళన చెం దు తున్నది. వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. అయి తే, అధికారులు వాటికి అడవిలో తగిన వసతులు కల్పించడం లో విఫలమవుతున్నారు. లెక్కలు తేలేది ఇలాగ ప్రభుత్వం ఏటా అభయారణ్యాలలో జీవించే వన్యప్రాణుల గణనను చేపడుతోంది. నాలుగేళ్లకు ఓసారి కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా వన్యమృగాల గణాం కాలపై సర్వే నిరహిస్తోంది. రాష్ట్రంలో మాత్రం దట్టమైన అడవులలో ఏటా మే నెలలో వన్యప్రాణులను గణిస్తారు. జంతువుల ‘అడుగుజాడ (ఇన్‌ప్రింట్)ల’ ఆధారంగా వీటిని లెక్కిస్తారు. గత ఏడాదితో పోల్చి తే ఈ సంవత్సరం వన్యప్రాణుల సంఖ్య తగ్గిందా? పెరిగిందా? అన్నది కూడా ఈ పద్ధతి ద్వారానే తెలుస్తుంది. 2004లో జిల్లాలో మూడు పులులు, పన్నెం డు చిరుతలు ఉండేవి. ప్రస్తుతం పులుల ఆచూకీ లేకపోగా, చిరుతల సంఖ్య ఎనిమిదికి తగ్గిందని సమాచారం. ఇతర వన్యప్రాణుల విషయానికి వస్తే పో చారం అభయారణ్యంలో 168 అడవి పందులు, 96 నీల్గాయిలు, కుందేళ్లు, నెమళ్లు, కృష్ణ జింకలు, 400 సాంబారులు ఉన్నట్లు అధికారుల రికార్డులు తెలుపుతున్నాయి. వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం అధికారులు వ్యవహరిస్తే పులులు, చిరుతలు జనంలోకి రాకుండా అడవులకే పరిమితమవుతాయి. కానీ, అంతరిస్తున్న అడవులు, చట్టు బండలవుతున్న కారణంగా చిరుతలు జనంలోకి చేరి ఆందోళన కలిగిస్తున్నాయి. మా ఇంటికి సమీపంలోనే కన్పించింది మా ఇంటికి సమీపంలోనే సమారు 200 మీటర్ల దూరంలో పులి కన్పించింది, రాత్రి పూటి ఇంటినుంచి బయటకు రావడంలేదు, రాత్రి ఎనిమిది గంటలకు తలుపులు వేస్తే ఉదయం వరకు తీయడంలేదు. భయంగా ఉంది, రాత్రి పూట నిద్రలేకుండా గడుపుతున్నం. అధికారులు వచ్చి పోయిండ్రు.. కానీ, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. -దుర్గేష్, కూలి, మాదాపూర్ ఐదు రోజులలో మూడు సార్లు .. నేను కంకర మిషన్‌లో పని చేస్తా. మేం పని చేసే చోట చిరుత ఐదు రోజులలో మూడు సార్లు కనిపించింది. మొదట ఏడవ తేదీన, తరువాత ఎనిమిది, పదవ తేదీల లో మళ్లీ కన్పిపించింది. మేం ఒంటరిగా పనికి పోవడం లేదు. అందరం కలిసే పోతున్నం. భయంగా ఉంది. అధికారులు చర్యలు తీసుకోవాలి. - అనిల్రామ, మాదాపూర్ -
అమ్మో పులి.. వెన్నులో చలి
- చిరుత సంచారంతో వణుకుతున్న ప్రజలు - పొలాల వద్దకు వెళ్లేందుకు జంకుతున్న రైతులు - అటవీ అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి దోమకొండ : దోమకొండ శివారులో ఆదివారం పులి సంచరించిందని తెలియడంతో జనం భయాందోళనలు చెందుతున్నారు. ముఖ్యంగా మల్లన్న గుడి శివారులోని పరిసర ప్రాంతాల్లో ఉన్న పొలాలకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. కాగా పులి ప్రతిరోజు 25 కిలోమీటర్ల వరకు నడుస్తుందని తాగునీటి కోసం ఇక్కడి ప్రాంతానికి వచ్చి ఉంటుందని అటవీ అధికారులు పేర్కొంటున్నారు. జింకలు, కుందేళ్లు వంటి వాటిని అది వేటాడి తింటుందని, అలాంటి జంతువులు దానికి ఇక్కడ కనిపించక వెళ్లిపోయి ఉంటుందంటున్నారు. కాగా ప్రజలు మాత్రం చిరుతను తలచుకొని భయపడుతున్నారు. దోమకొండ వాసులు రెండు రోజుల క్రితం వరకు మల్లన్న గుడి పక్కనుంచి భిక్కనూరు మండలంలోని జంగంపల్లి శివారులోని శ్రీకృష్ణ మందిరం వరకు గల దారినుంచి కామారెడ్డికి వెళ్లేవారు. ఇది ఇరుకైన మార్గం. అటవీ ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతంలో చిరుతపులి సంచారం విషయం తెలియడంతో ఇక్కడి ప్రాంతానికి చెందిన వారు కామారెడ్డి వెళ్లడానికి లింగుపల్లి, భిక్కనూరు మండలం బీటీఏస్ చౌరస్తా మీదుగా వెళుతున్నారు. మల్లన్న గుడి వద్ద రైతుల సమావేశం చిరుత సంచారం విషయం తెలియడంతో అటవీ శాఖ అధికారులు మల్లన్న గుడి వద్ద రైతులతో సమావేశమయ్యారు. చిరుతపులి సంచరిస్తున్నందున రైతులు తమ వ్యవసాయ బావుల వద్దకు ఒంటరిగా వెళ్లరాదని అటవీ శాఖ బీట్ ఆఫీసర్ ఫారూఖ్ రైతులకు సూచించారు. కనీసం ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున వెళ్లాలని పేర్కొన్నారు. చేతిలో కనీసం కర్రనైనా ఉంచుకోవాలన్నారు. చప్పుడు చేస్తూ నడవడం మంచిదని సూచించారు. దోమకొండ శివారులోకి వచ్చింది చిరుత పులా లేదా పులా అనే విషయం నిర్ధారణ కాలేదన్నారు. ఇక్కడ కనిపించిందని చెబుతున్న పులి పొలం గట్లమీద గడ్డిపై నడించిందని దాని అడుగులు గుర్తించడం కష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు. పులి సంచారం విషయమై డీఎఫ్‌వోకు వివరాలు తెలిపానన్నారు. -
కోతలకు నిరసనగా సబ్‌స్టేషన్ ముట్టడి
దోమకొండ : విద్యుత్ కోతలకు నిరసనగా రైతులు ఆదివారం నిరసనకు దిగారు. జనగామ, సీతారాంపల్లి గ్రామాలకు చెందిన రైతులు జనగామ శివారులోని సీతారాంపల్లి వద్దనున్న సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. సబ్‌స్టేషన్ వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తారోకోకు దిగారు. వ్యవసాయానికి ఏడు గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ట్రాన్స్‌కో ఏఈ వచ్చి హామీ ఇచ్చేంత వరకు కదిలేదన్నారు. రాకపోకలు నిలిచిపోవడంతో సబ్‌స్టేషన్ సిబ్బంది ఏఈ లక్ష్మణ్‌కు సమాచారం అందించారు. ఆయన సబ్‌స్టేషన్ వద్దకు వచ్చి రైతులను సముదాంచారు. కానీ రైతులు శాంతించలేదు. ఏఈ లక్ష్మణ్‌తో పాటు లైన్ ఇన్స్పెక్టర్ రాజు, లైన్‌మన్ నర్సింలు, సబ్‌స్టేషన్ ఆపరేటర్ నాంపల్లి తదితరులను గదిలో నిర్బంధించారు. విద్యుత్ సరఫరాపై లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న బీబీపేట ఎస్సై నరేందర్ అక్కడికి చేరుకుని రైతులను సముదాయించారు. రాస్తారోకో చేయడం, అధికారులను నిర్భందించడం సరికాదన్నారు. సరిగ్గా విద్యుత్ సరఫరా లేకపోవడంతో పంటలు ఎండుతున్నాయంటూ రైతులు ఎస్సైతో వాగ్వాదానికి దిగారు. ఏడు గంటల పాటు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పి నాలుగు గంటలు కూడా సరిగ్గా సరఫరా చేయడం లేదని ఆరోపించారు. అధికారులు ట్రాన్స్‌కో ఏస్ఈతో ఫోన్లో మాట్లాడగా.. వ్యవసాయానికి ఏడు గంటలపాటు విద్యుత్ సరఫరా చేయడానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించారు. ఆందోళనలో రైతులు పాత రాజు, రవీందర్, శివరాములు, జీవన్‌రెడ్డి, కిష్టారెడ్డి, వెంకట్రాంరెడ్డి, దుర్గారెడ్డి, మల్లయ్య, శ్రీని వాస్, నాంపల్లి, రాజలింగం, దుర్గయ్యలు పాల్గొన్నారు. -
‘మహంకాళి’ మురిసేలా..
దోమకొండ : అమ్మవారికి భక్తితో బోనాలు సమర్పించడానికి తరలివచ్చిన భక్తులతో మండల కేంద్రంలోని మహంకాళి అమ్మవారి మందిరం పోటెత్తింది. నైవేధ్యం సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ తర్వాత రెండో అతిపెద్ద మహంకాళి ఆలయంగా పేరుగాంచిన దోమకొండలోని ఆల యం వద్ద ఆదివారం బోనాల పండుగ వైభవంగా జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఉద యం అమ్మవారికి అభిషేకాదులు నిర్వహించారు. 7 గంటలకు ఘటం మొదలైంది. పోతరాజులు సందడి చేశారు. 11 గంటలకు రంగం ప్రారంభమైంది. భవిష్యవాణి వినడానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఆలయ అర్చకులు భావి కృష్ణమూర్తి శర్మ, ఇతర పండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య సాయంత్రం అమ్మవారికి పల్లకీ సేవ నిర్వహించారు. జడ్పీటీసీ సభ్యుడు గండ్ర మధుసూదన్‌రావు, వైస్ ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్, స్థానిక సర్పంచ్ దీకొండ శారదతో పాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఉత్సవం లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపింది. ఆలయ కమిటీ అధ్యక్షుడు రాంచంద్రం, ప్రతినిధులు శ్రీనివాస్, రాజేందర్, నర్సయ్య, శేఖర్, రాజు, నర్సింలు, నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొక్కులు చెల్లిస్తేనే.. ఈసారి వర్షాలు ఆలస్యంగా కురుస్తాయని రంగనాయకి భవిష్యవాణి వినిపించింది. అదీ గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకుంటేనే వానదేవుడు కరుణిస్తాడని కండిషన్ పెట్టిం ది. దోమకొండలో బోనాల పండుగ సందర్భంగా రంగనాయకి భవిష్యవా ణి వినిపించింది. ఈ ఏడాది వర్షాలు తక్కువగా పడతాయని పేర్కొంది. శివుడికి అభిషేకాలు చేయాలని సూ చించింది. పూజలతో దేవతలు కరుణిస్తేనే వర్షాలు కురుస్తాయని, పాడిపంటలు, పిల్లా పాపలతో ప్రజలు సుభిక్షంగా ఉంటారని పేర్కొంది. -
‘కోడ్’ కూసినా ..
దోమకొండ, న్యూస్‌లైన్ : దోమకొండ మండలంలోని తుజాల్పూర్ లో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి , మాజీ మంత్రి శ్రీధర్‌బాబులతో కూడిన బొమ్మలు ఉన్న పంచదార, గోధుమ ప్యాకెట్లను రేషన్‌డీలర్ విక్రయిస్తున్నారని ఆదివారం గ్రామస్తులు కొందరు తహశీల్దార్‌కు ఫోన్లో ఫిర్యాదు చేశారు. దీంతో తహశీల్దార్ బాలయ్యతో పాటు వీఆర్వో ముత్తన్న గ్రామానికి చేరుకుని వాటిని పరిశీలించారు. మండలంలో మొత్తం 37 రేషన్‌షాపులకు గాను 5 షాపుల్లో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్న బొమ్మల ప్యాకెట్లు వచ్చాయని తహశీల్దార్ తెలిపారు. పాత స్టాక్ రేషన్‌డీలర్లకు రాగా, ప్యాకెట్లపై ఉన్న మాజీ సీఎం ఫొటో కనబడకుండా వాటిపై ప్యాకెట్లు కప్పి లబ్ధిదారులకు అందించారని తెలి పారు. దీనిపై జిల్లా అధికారులకు వివరించినట్లు తహశీల్దార్ బాలయ్య చెప్పారు.