సాక్షి, కామారెడ్డి : దోమకొండ మండల కేంద్రంలోని సొసైటీ వద్ద రైతులు యూరియా కోసం బారులు తీరారు..ఎరువులు తీసుకునేందుకు పడిగాపులు కాశారు. గంటల తరబడి క్యూ లైన్‌లో నిలబడే ఓపిక లేకపోవడంతో క్యూ లైన్‌లో తమ గుర్తుగా వస్తువులు ఉంచారు. చెప్పులు, రాళ్లతో పాటు మందు బాటిళ్లను కూడా లైన్‌లో ఉంచారు. తాగి పడేసిన మందు సీసాలను లైన్లో పెట్టడంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (విక్రయాల్లో విచిత్రాలెన్నో..)
Comments
Please login to add a commentAdd a comment