విద్యార్థిపై కొడవలితో హత్యాయత్నం | Murder Attempt On Student | Sakshi
Sakshi News home page

విద్యార్థిపై కొడవలితో హత్యాయత్నం

Published Mon, Apr 23 2018 1:23 PM | Last Updated on Fri, Nov 9 2018 4:31 PM

Murder Attempt On  Student - Sakshi

ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ ప్రసన్నరాణి

దోమకొండ : మండలంలోని అంబారిపేటకు చెందిన చిందం మధుకుమార్‌ అనే విద్యార్థిపై ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు కొడవలితో దాడి చేసి హత్యాయత్నం చేశారు. గ్రామానికి చెందిన చిందం బుచ్చయ్య కుమారుడు మధుకుమార్‌ రోజు మాదిరిగా వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ముఖానికి మాస్క్‌ ధరించి కొడవలితో మధుకుమార్‌పై దాడిచేసి గొంతుపై కోశాడు.

దీంతో భయపడ్డ మధుకుమార్‌ అతడి నుంచి తప్పించుకుని పక్కనే ఉన్న వ్యవసాయ బావి వద్దకు పరుగుతీశాడు. అక్కడే ఉన్న గ్రామానికి చెందిన వారికి తనపై ఎవరో దాడి చేశాడని తెలుపగా వారు వెంటనే దుస్తులను విద్యార్థి మెడకు చుట్టి 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

మధుకుమార్‌ తండ్రి బుచ్చయ్య గొర్ల కాపరి కాగా మన్యం వెళ్లాడు. తల్లి లక్ష్మి కూలి పనికి వెళ్లింది. సంఘటన స్థలాన్ని కామారెడ్డి డీఎస్పీ ప్రసన్నరాణి సందర్శించారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ నర్సింలు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం మధుకుమార్‌ను హైదరాబాద్‌కు తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కారణాలు తెలియరాలేదు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement