![హత్యకేసులో ప్లస్–2 విద్యార్థి అరెస్ట్ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/17/51504326962_625x300.jpg.webp?itok=nPPF3YY8)
హత్యకేసులో ప్లస్–2 విద్యార్థి అరెస్ట్
అన్నానగర్: కారిమంగళం సమీపంలో విద్యార్థిని హత్యకేసులో ప్లస్–2 విద్యార్థిని పోలీసులు గురువారం అరెస్ట్‌చేశారు. వివరాలు.. ధర్మపురి జిల్లా కారిమంగళం సమీపం ఉత్తన్‌డికవుండనూర్‌కు చెందిన సంజీవన్ ప్రభుత్వ బస్సు డ్రైవర్. ఇంటి సమీపంలో చిల్లర దుకాణం నడుపుతున్నాడు. ఇతని కుమార్తె వనిషా(14) మాట్లంపట్టిలోని పాఠశాల్లో 9వ తరగతి చదువుతోంది. గత 27న ఇంట్లో ఒంటరిగా ఉన్న వనిషా హత్యకు గురైంది. దీనిపై కారిమంగళం పోలీసులు విచారణ చేపట్టారు.
అదే ప్రాంతానికి చెందిన ప్లస్–2 విద్యార్థిపై అనుమానం కలగడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్టు అంగీకరించాడు. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తాను గత 27న దుకాణానికి వెళ్లిన సమయంలో వనిషా నగదు లెక్కబెడుతోందని, నగదు చోరీ చేసే క్రమంలో ఆమెను హత్య చేసినట్టు తెలిపాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.