ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, నిర్మల్ : సోన్ మండలం కూచన పల్లి గ్రామ శివారుల్లో పదేళ‍్ల బాలికపై అత్యాచారం జరిపి, హత్య చేయటాన్ని తీవ్రంగా నిరసిస్తూ విద్యార్థి సంఘాలు సోమవారం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చాయి. నిందితులను కఠినంగా శిక్షించి బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని బాలిక బంధువులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.
అసలేం జరిగింది.. నిర్మల్ జిల్లా సోన్ మండలం కూచన పల్లి గ్రామానికి చెందిన పదేళ్ల బాలిక శనివారం ఉదయం సోన్ గ్రామానికి చెందిన తోకల ప్రవీణ్ ఇంటి ముందు అడుకుంటూ ఆదృశ్యమైంది. ఎంతసేపటికి బాలిక ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు కంగారుపడి పలు ప్రాంతాల్లో కూతురి కోసం వెతికారు. గోదావరి నది ఒడ్డున నిర్మానుష ప్రాంతంలో స్థానికులు మృతదేహాన్ని గుర్తించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సంఘన స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు.
వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో తోకల ప్రవీణ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేసి, ఆపై హత్య చేసినట్టలు ప్రవీణ్ విచారణలో ఒప్పుకున్నాడు. పోలీసుల అదుపులో ఉన్న నిందితున్ని అప్పగించాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment