![Person Molestation To Ten Years Girl After Murder In Nirmal - Sakshi](/styles/webp/s3/article_images/2018/06/17/rape.jpg.webp?itok=K55J2qaz)
సాక్షి, నిర్మల్ : నిర్మల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సోన్ మండలం కూచన పల్లి శివారులో పదేళ్ల బాలికపై అత్యాచారం చేసి, ఆపై హత్య చేశాడు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాద చాయాలు అలుముకున్నాయి. వివరాలివి.. బాలిక శనివారం ఉదయం సోన్ గ్రామానికి చెందిన తోకల ప్రవీణ్ ఇంటి ముందు అడుకుంటూ ఆదృశ్యమైంది. ఎంతసేపటికి బాలిక ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు కంగారుపడి పలు ప్రాంతాల్లో కూతురి కోసం వెతికారు.
గోదావరి నది ఒడ్డున నిర్మానుష ప్రాంతంలో స్థానికులు మృతదేహాన్ని గుర్తించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సంఘన స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో తోకల ప్రవీణ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేసి, ఆపై హత్య చేసినట్టలు ప్రవీణ్ విచారణలో ఒప్పుకున్నాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో నిందితుడు ఉన్నాడు. అతన్ని అప్పగించాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మండల కేంద్రానికి ఏఎస్పీ దక్షిణామూర్తి చేరుకుని విషయాలు తెలుసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment