![Prisoner Tried Molestation And Kill Female Doctor In Delhi - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/28/Doctor4%27.jpg.webp?itok=Z14plpJf)
న్యూఢిల్లీ: జైలులోని ఖైదీలను విజిటి చేసేందుకు వచ్చిన వైద్యురాలిపై ఖైదీ అఘాయిత్యానికి తెగబడ్డాడు. ఈ ఘటన ఢిల్లీలోని మండోలి జైలులో చోటు చేసుకుంది. జైలు అధికారులు తెలిపిన ప్రకారం...ఒక మహిళా డాక్టర్ జైలులోని ఖైదీలను విజిట్ చేసేందుకు వచ్చారు. ఇంతలో ఒక ఖైదీ ఆమెపై అత్యాచారం చేసేందుకు యత్నించడమే కాకుండా ఆమెను చంపేందుకు కూడా ప్రయత్నించాడు.
ఈ ఘటనతో స్పందించిన అధికారులు హుటాహుటిన సదరు భాదితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సదరు నిందితుడు ఖైదీ సుబ్రత్ పిళ్లైపై అత్యాచారం, హత్యాయత్నం వంటి కేసులను నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. సదరు నిందితుడు పిళ్లైపై ఒక కేసులో కోర్టు పదివేలు పూచికత్తుతో జరిమాన విధించడమే కాకుండా ఒక ఏడాది జైలు శిక్షను కూడా విధించింది. ఈ శిక్షను అనుభవిస్తున్న తరుణంలోనే ఈ ఖైదీ మరో అఘాయిత్యానికి తెగబడ్డాడు. అలాగే ఈఘటన ఎలా జరిగిందనే దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
(చదవండి: ఫోన్‌లో పరిచయం.. యువతిని ప్రేమించా.. పెళ్లి చేయకుంటే చంపుతా)
Comments
Please login to add a commentAdd a comment