నిర్మల్‌లో నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య | Nirmal Crime: Man Murdered Day Light Few Recorded Cell Phones | Sakshi
Sakshi News home page

నిర్మల్‌లో నడిరోడ్డుపై కత్తెరతో గొంతుకోసి దారుణ హత్య .. సెల్‌ఫోన్‌లలో రికార్డింగ్‌లు!!

Published Thu, May 12 2022 9:08 PM | Last Updated on Thu, May 12 2022 9:11 PM

Nirmal Crime: Man Murdered Day Light Few Recorded Cell Phones - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, నిర్మల్‌: నడిరోడ్డుపై ఎంతటి ఘోరాలు జరుగుతున్నా.. అడ్డుకునే ప్రయత్నాలు మాట అటుంచి.. సెల్‌ఫోన్‌లలో రికార్డు చేసే కల్చర్‌ పెరిగిపోతోంది. తాజాగా అలాంటి ఘటన ఒకటి జరిగింది. నిర్మల్‌లో అంతా చూస్తుండగానే ఓ యువకుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. 

నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే.. ఓ వ్యక్తి మరో యువకుడి గొంతు కోశాడు. కత్తెరతో గొంతు కోసి మరీ యువకుడిని దారుణంగా దాడి చేశాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడిన ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. హత్య అనంతరం పోలీసుల ఎదుట నిందితుడు లొంగిపోయాడు. 

జిల్లా కేంద్రంలోని భారత్ పెట్రోల్ పంప్ సమీపంలో ఈ ఘోరం జరిగింది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే దాడి సమయంలో.. ఆ తర్వాత కూడా కొందరు అక్కడ సెల్‌ఫోన్‌లతో వీడియోలు తీస్తూ కనిపించారు. ఘటనకు సంబంధించిన వీడియో వాట్సాప్‌లలో వైరల్‌ చేస్తున్నారు కొందరు. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement