Ten years girl
-
బాలికకు నీలి చిత్రాలు చూపిన మృగాడు
తెనాలి రూరల్: పదేళ్ల బాలికకు నీలి చిత్రాలు చూపాడో మృగాడు. గుంటూరు జిల్లా తెనాలిలోని చంద్రబాబునాయుడు కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పసుపులేటి దుర్గాప్రసాద్‌కు 16 ఏళ్ల క్రితం వివాహమైనా పిల్లలు కలగలేదు. వేధింపుల కారణంగా భార్య అతన్ని వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. వెదురు బొంగుల నిచ్చెనలు తయారు చేసి, విక్రయించడం, స్థానికంగా కొద్ది మొత్తాలు వడ్డీకి ఇవ్వడం చేస్తుంటాడు. ఇతనికి సెల్ఫోన్లో నీలిచిత్రాలు చూడడం వ్యసనంగా మారింది. అంతటితో సరిపెట్టుకోకుండా ఇంటి సమీపంలోని బాలికలను పిలిచి ఫోన్లో వారికి ఆ చిత్రాలను చూపించే సైకోలా మారాడు. గతంలో అదే ప్రాంతంలోని ఓ బాలికతో ఈ విధంగానే ప్రవర్తించగా, స్థానికులు దేహశుద్ధి చేశారు. తాజాగా శనివారం ఇంటి వద్ద ఆడుకుంటున్న పదేళ్ల బాలికను పిలిచి సెల్ఫోన్లో చిత్రాలు చూపించాడు. చిన్నారి భయపడి, రోదిస్తూ ఇంటికి వెళ్లి తల్లికి చెప్పుకుంది. ఆమె వచ్చి స్థానికులతో కలిసి దుర్గాప్రసాద్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది. -
పదేళ్ల బాలికపై అత్యాచారం
ఎచ్చెర్ల క్యాంపస్: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని డి.మత్స్యలేశం గ్రామానికి చెందిన పదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి నిర్భయ కేసు నమోదు చేశారు. శ్రీకాకుళం డీఎస్పీ భీమారావు బుధవారం ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు తెలిపారు. ఐదో తరగతి చదువుతున్న బాలికపై ఈ నెల 14వ తేదీ(శనివారం) సాయంత్రం 7 గంటల సమయంలో నిందితుడు గనగళ్ల కొరయ్య.. చిల్లర డబ్బులు ఆశజూపి ప్రాథమిక పాఠశాల వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడని వివరించారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్నాడని తెలిపారు. బాలిక ఇంటికి వెళ్లే సరికి రక్తస్రావం అవుతుండటంతో కుటుంబ సభ్యులు గమనించి హుటాహుటిన ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి.. శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స చేసిన వైద్యులు.. అత్యాచారం జరిగినట్లు గుర్తించారు. ఆదివారం ఉదయం బాలిక తల్లి ఎచ్చెర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. బాలిక చెప్పిన వివరాలను పోలీసులకు తెలిపారు. వైద్య పరీక్షలు నివేదిక, తల్లి ఫిర్యాదు, బాలిక వివరణ అధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. డీఎస్పీ భీమారావు, సీఐ రామకృష్ణ, ఎస్సై కృష్ణ దర్యాప్తుచేయగా.. నిందితుడిని సుదీర్ఘంగా విచారించి బుధవారం అరెస్టు చేశారు. గతంలో పొన్నాడ గ్రామంలో ఇలాంటి కేసు నమోదైంది. 60 ఏళ్ల వృద్ధుడు బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. మత్స్యలేశం వంటి గ్రామంలో ఇటువంటి అఘాయిత్యాలు జరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
పదేళ్ల బాలికపై అత్యాచారం, హత్య
సాక్షి, నిర్మల్ : నిర్మల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సోన్ మండలం కూచన పల్లి శివారులో పదేళ్ల బాలికపై అత్యాచారం చేసి, ఆపై హత్య చేశాడు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాద చాయాలు అలుముకున్నాయి. వివరాలివి.. బాలిక శనివారం ఉదయం సోన్ గ్రామానికి చెందిన తోకల ప్రవీణ్ ఇంటి ముందు అడుకుంటూ ఆదృశ్యమైంది. ఎంతసేపటికి బాలిక ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు కంగారుపడి పలు ప్రాంతాల్లో కూతురి కోసం వెతికారు. గోదావరి నది ఒడ్డున నిర్మానుష ప్రాంతంలో స్థానికులు మృతదేహాన్ని గుర్తించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సంఘన స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో తోకల ప్రవీణ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేసి, ఆపై హత్య చేసినట్టలు ప్రవీణ్ విచారణలో ఒప్పుకున్నాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో నిందితుడు ఉన్నాడు. అతన్ని అప్పగించాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మండల కేంద్రానికి ఏఎస్పీ దక్షిణామూర్తి చేరుకుని విషయాలు తెలుసుకుంటున్నారు. -
పదేళ్ల బాలికపై యువకుడి అత్యాచార యత్నం
-
పదేళ్ల బాలికపై లైంగికదాడి.. ఆపై హత్య
* బావిలో తేలిన చిన్నారి మృతదేహం * మద్యం మత్తులో ఉన్న యువకుల అరెస్ట్ ప్యారిస్: పదేళ్ల బాలికపై ముగ్గురు లైంగిక దాడి చేసి, గొంతు నులిమి చంపేశారు. ఈ ఘటన తేని జిల్లాలో కలకలం రేపింది. వివరాలు.. తేని జిల్లా చిన్నమనూర్ సమీపంలోని కామాక్షిపురానికి చెందిన గణేశన్ కుమార్తె నందిని (10) అదే ప్రాంతంలో ఐదో తరగతి చదువుతోంది. గత రెండో తేదీ గ్రామంలో ఉన్న బావిలో నందిని శవంగా తేలింది. ఆమె మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు శవ పంచనామా చేయగా, బాలిపై అత్యాచారం జరిగినట్లు తెలిసింది. దీంతో పోలీసులు సందేహంతో విచారణ జరిపారు. విచారణలో కామాక్షిపురం రవి (23), సుందర్ (23), అజిత్ (23) కలిసి చిన్నారిపై లైంగికదాడికి పాల్పడి హత్య చేసినట్టు తెలిసింది. ఈ ఘటన జరిగిన రోజున నందిని సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వెళుతుండగా రవి, సుందర్, అజిత్ ముగ్గురూ నందినిని బలవంతంగా ఎత్తుకుని సమీపంలో ఉన్న తోపులోకి వెళ్లారు. అక్కడ ముగ్గురూ కలిసి నందినిపై అత్యాచారం జరిపారు. అనంతరం గొంతు నులిమి చంపి సమీపంలోని బావిలో వేసి అక్కడి నుంచి పరారయ్యూరు. ఆ ముగ్గురూ ఎప్పుడూ గంజాయి మత్తులో ఉంటారని గ్రామస్తులు తెలిపారు. రాస్తారోకో చిన్నారిపై లైంగికదాడి జరిగినట్టు తెలుసుకున్న గ్రామస్తులు, స్థానిక తమిళ్పులి ఇయక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, న్యాయవాది తిరువళ్లూవర్, న్యాయవాదుల బృందం రాష్ట్ర డెప్యూటీ కార్యదర్శి మురుగానందం తదితరుల అధ్యక్షతన రాస్తారోకో నిర్వహించారు. లైంగికదాడికి పాల్పడిన ముగ్గురికీ కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.