పదేళ్ల బాలికపై లైంగికదాడి.. ఆపై హత్య | ten-year-old girl murder and sexually assaulted in paris | Sakshi
Sakshi News home page

పదేళ్ల బాలికపై లైంగికదాడి.. ఆపై హత్య

Published Sat, Dec 6 2014 4:34 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

పదేళ్ల బాలికపై లైంగికదాడి.. ఆపై హత్య - Sakshi

పదేళ్ల బాలికపై లైంగికదాడి.. ఆపై హత్య

* బావిలో తేలిన చిన్నారి మృతదేహం
* మద్యం మత్తులో ఉన్న యువకుల అరెస్ట్

ప్యారిస్: పదేళ్ల బాలికపై ముగ్గురు లైంగిక దాడి చేసి, గొంతు నులిమి చంపేశారు. ఈ ఘటన తేని జిల్లాలో కలకలం రేపింది. వివరాలు.. తేని జిల్లా చిన్నమనూర్ సమీపంలోని కామాక్షిపురానికి చెందిన గణేశన్ కుమార్తె నందిని (10) అదే ప్రాంతంలో ఐదో తరగతి చదువుతోంది. గత రెండో తేదీ గ్రామంలో ఉన్న బావిలో నందిని శవంగా తేలింది. ఆమె మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు శవ పంచనామా చేయగా, బాలిపై అత్యాచారం జరిగినట్లు తెలిసింది. దీంతో పోలీసులు సందేహంతో విచారణ జరిపారు. విచారణలో కామాక్షిపురం రవి (23), సుందర్ (23), అజిత్ (23)  కలిసి చిన్నారిపై లైంగికదాడికి పాల్పడి హత్య చేసినట్టు తెలిసింది.

ఈ ఘటన జరిగిన రోజున నందిని సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వెళుతుండగా రవి, సుందర్, అజిత్ ముగ్గురూ నందినిని బలవంతంగా ఎత్తుకుని సమీపంలో ఉన్న తోపులోకి వెళ్లారు. అక్కడ ముగ్గురూ కలిసి నందినిపై అత్యాచారం జరిపారు. అనంతరం గొంతు నులిమి చంపి సమీపంలోని బావిలో వేసి అక్కడి నుంచి పరారయ్యూరు. ఆ ముగ్గురూ ఎప్పుడూ గంజాయి మత్తులో ఉంటారని గ్రామస్తులు తెలిపారు.
 
రాస్తారోకో
చిన్నారిపై లైంగికదాడి జరిగినట్టు తెలుసుకున్న గ్రామస్తులు, స్థానిక తమిళ్‌పులి ఇయక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, న్యాయవాది తిరువళ్లూవర్, న్యాయవాదుల బృందం రాష్ట్ర డెప్యూటీ కార్యదర్శి మురుగానందం తదితరుల అధ్యక్షతన రాస్తారోకో నిర్వహించారు. లైంగికదాడికి పాల్పడిన ముగ్గురికీ కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement