బాలికకు నీలి చిత్రాలు చూపిన మృగాడు  | Molestation on Ten years old girl in Tenali | Sakshi
Sakshi News home page

బాలికకు నీలి చిత్రాలు చూపిన మృగాడు 

Sep 29 2019 5:28 AM | Updated on Sep 29 2019 5:28 AM

Molestation on Ten years old girl in Tenali - Sakshi

దుర్గాప్రసాద్‌కు దేహశుద్ధి చేస్తున్న స్థానికులు

వెదురు బొంగుల నిచ్చెనలు తయారు చేసి, విక్రయించడం, స్థానికంగా కొద్ది మొత్తాలు వడ్డీకి ఇవ్వడం చేస్తుంటాడు. ఇతనికి సెల్‌ఫోన్‌లో నీలిచిత్రాలు చూడడం వ్యసనంగా మారింది.

తెనాలి రూరల్‌: పదేళ్ల బాలికకు నీలి చిత్రాలు చూపాడో మృగాడు. గుంటూరు జిల్లా తెనాలిలోని చంద్రబాబునాయుడు కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పసుపులేటి దుర్గాప్రసాద్‌కు 16 ఏళ్ల క్రితం వివాహమైనా పిల్లలు కలగలేదు. వేధింపుల కారణంగా భార్య అతన్ని వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. వెదురు బొంగుల నిచ్చెనలు తయారు చేసి, విక్రయించడం, స్థానికంగా కొద్ది మొత్తాలు వడ్డీకి ఇవ్వడం చేస్తుంటాడు. ఇతనికి సెల్‌ఫోన్‌లో నీలిచిత్రాలు చూడడం వ్యసనంగా మారింది.

అంతటితో సరిపెట్టుకోకుండా ఇంటి సమీపంలోని బాలికలను పిలిచి ఫోన్‌లో వారికి ఆ చిత్రాలను చూపించే సైకోలా మారాడు. గతంలో అదే ప్రాంతంలోని ఓ బాలికతో ఈ విధంగానే ప్రవర్తించగా, స్థానికులు దేహశుద్ధి చేశారు. తాజాగా శనివారం ఇంటి వద్ద ఆడుకుంటున్న పదేళ్ల బాలికను పిలిచి సెల్‌ఫోన్‌లో చిత్రాలు చూపించాడు. చిన్నారి భయపడి, రోదిస్తూ ఇంటికి వెళ్లి తల్లికి చెప్పుకుంది. ఆమె వచ్చి స్థానికులతో కలిసి దుర్గాప్రసాద్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement