
సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ(పాత చిత్రం)
గుంటూరు జిల్లా : తెనాలి ప్రభుత్వాసుపత్రిలో మోతుకూరు బాధిత బాలికను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ సోమవారం పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. దాచేపల్లి ఘటన మరువక ముందే మరో బాలికపై అత్యాచార ఘటన వెలుగు చూడటం బాధాకరమన్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మాటలు ఆపి చేతలలో పని చూపించాలని హితవు పలికారు. ప్రభుత్వం ప్రచార ఆర్బాటాలు వదిలి, వాస్తవ పరిస్థితులపై దృష్టి సారించాలని సూచించారు.
మానసిక వైద్యులు, మహిళా సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని, అత్యాచారాల నివారణపై వారి సలహాలు, సూచనలు స్వీకరించాలని కోరారు. ప్రభుత్వం దృష్టి సారించకపోతే సీపీఐ ఆధ్వర్యంలోనే సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. గుంటూరు జిల్లాలో ఇటీవల జరిగిన దాచేపల్లి కీచక ఉదంతాన్ని మరువకముందే మోదుకూరులో ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి జరిగిన విషయం తెలిసిందే. బావ వరుసయ్యే నిందితుడు నాగుల్‌మీరా(24) చాక్లెట్లు కొనిపెడతానని తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్నారి చెప్పిన వివరాలతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment