![At Least 10 Members Injured Tractor Accident Kamareddy District - Sakshi](/styles/webp/s3/article_images/2020/12/31/Tractor-Accident.jpg.webp?itok=FLAAC9rC)
సాక్షి, కామారెడ్డి: దోమకొండ శివారులో చింతామన్ పల్లి గ్రామానికి చెందిన పెళ్లి బృందం ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పది మందికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. చింతామన్ పల్లి గ్రామానికి చెందిన సార్ల సంతోష్ వివాహం ఈ నెల 28న సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బలవంతపుర్ గ్రామానికి చెందిన అమ్మాయితో జరిగింది. ఈ క్రమంలో పెళ్లి కూతురు ఇంట్లో బుధవారం ఫంక్షన్ ఉండటంతో ఉదయం పెళ్ళికొడుకు తరఫున సుమారు 25 మంది ట్రాక్టర్‌లో చింతామన్ పల్లి గ్రామం నుంచి బయలుదేరారు. శుభకార్యం ముగించుకుని తిరుగు ప్రయాణంలో మార్గమధ్యలో దోమకొండ శివారులోని దొంగల మర్రి ప్రాంతంలో ట్రాక్టర్ అదుపుతప్పింది.(చదవండి: అత్యాచారం.. ఆపై భయంతో ఆత్మహత్య )
ఈ ఘటనలో చింతామన్ పల్లి గ్రామానికి చెందిన సార్ల ప్రమీల, సాయవ్వ, యశోద, నడిపి రాజవ్వ, ఎల్లయ్య, దేవలక్ష్మి, శివరాజు, రాజయ్య, లింగం కాచాపూర్ కు చెందిన గంగవ్వలకు బలమైన గాయాలయ్యాయి. వీరిలో రాజయ్య, లింగంల పరిస్థితి విషమంగా ఉండటంతో 108 అంబులెన్స్‌లో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని దోమకొండ ఆస్పత్రికి తరలించి చికిత్స నిర్వహించారు. సామచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి పరిస్థితి సమీక్షించారు. డ్రైవర్ శ్రీనివాస్ అజాగ్రత్తగా ట్రాక్టర్ నడపడంతో ఈ ప్రమాదం జరిగిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment