tractor accident
-
రోజు మాదిరిగానే.. సైకిల్‌పై పాఠశాలకు బయల్దేరుతుండగా..
మహబూబ్‌నగర్: సైకిల్‌పై పాఠశాలకు బయల్దేరిన ఓ విద్యార్థిని ట్రాక్టర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈవిషాదకర ఘటన కృష్ణా మండలం ఆలంపల్లి గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు ఆలంపల్లికి చెందిన కావలి హన్వేష్ కుమారుడు ప్రకాష్ (14) కున్సి ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. రోజు మాదిరిగానే గురువారం సైకిల్‌పై పాఠశాలకు బయల్దేరగా.. గ్రామ సమీపంలో పత్తి లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ప్రమాదంలో ప్రకాష్‌కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘట నా స్థలానికి చేరుకొని కన్నీరు పెట్టుకున్నారు. విద్యార్థులకు సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుందని గ్రామస్తులు వాపోయారు. విద్యార్థి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇవి చదవండి: హడలెత్తిస్తున్న ఏనుగు.. దాడిలో ఇద్దరి రైతుల విషాదం! -
ట్రాక్టర్‌తో విన్యాసం.. అతడి ప్రాణం తీసింది
చండీగఢ్: ట్రాక్టర్‌తో విన్యాసం చేస్తూ ఓ వ్యక్తి దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా సర్చుర్లో శనివారం ఈ విషాదం చోటుచేసుకుంది. సుఖ్‌మన్‌దీప్ సింగ్(29) గ్రామంలో జరుగుతున్న ఉత్సవంలోని మైదానంలో ట్రాక్టర్‌తో విన్యాసాలు చేస్తున్నాడు. స్టంట్స్‌లో నిపుణుడైన సుఖ్‌మన్‌దీప్ ముందుగా తన ట్రాక్టర్ రెండు చక్రాలను గాల్లోకి లేపి కిందికి దిగాడు. ఆ వాహనం గిరగిరా తిరుగుతుండగానే తిరిగి టైరుపైకి కాలుపెట్టి డ్రైవర్ సీట్లో కూర్చునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కాలు జారీ ట్రాక్టర్ వెనుక చక్రాల కిందపడిపోయాడు. వేగంగా తిరుగుతున్న ట్రాక్టర్ అతడిపైకి పలుమార్లు వెళ్లడంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ఇలాంటి తరహా వినాస్యాలు చేయకుండగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. The Punjab Government should impose a ban on such activities at events. A young man, Sukhmanjeet Singh, aged 29, lost his life while performing stunts on a tractor. He raised the front wheels, pressed the rear tires into the soil, and got down from the tractor while it was… pic.twitter.com/w8DVAN1b3u — Gagandeep Singh (@Gagan4344) October 29, 2023 -
ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మహిళా కూలీల దుర్మరణం
తాడేపల్లిగూడెం రూరల్: ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు మహిళా కూలీలు మృతి చెందారు.. మరో పది మంది కూలీలు, డ్రైవర్ గాయపడిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మాధవరంలో సోమవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని అప్పారావుపేట గ్రామానికి చెందిన మాచర్ల రామారావు మాధవరం కోతిగుంట సమీపంలోని బాడవా పొలాల్లో కలుపు తీత కోసం అదే గ్రామానికి చెందిన 12 మంది కూలీలను తన ట్రాక్టర్‌పై తీసుకెళ్లాడు. మధ్యాహ్నం పనులు ముగించుకుని తిరిగి వారిని అప్పారావుపేట తీసుకెళ్తుండగా కోతిగుంట చెరువు గట్టు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో మహిళా కూలీలు ఆకుమర్తి సుజాత (46), పాకా భారతి (35) మృతి చెందారు. డ్రైవర్ మాచర్ల రామారావు, కూలీలు కోట సింహాచలం, షేక్ మస్తాన్ బీబీ, జొన్నాడ శివపార్వతి, పెరుమళ్ల నాగలక్ష్మి, పెరుమళ్ల కోట సత్తెమ్మ, కోయిల నాగజ్యోతి, పెరుమళ్ల రామలక్ష్మి, తానేటి వరలక్ష్మి, మడిపల్లి సుబ్రహ్మణ్యం, మిద్దే పద్మ గాయపడ్డారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ వైకేవీ అప్పారావు, తాడేపల్లిగూడెం పట్టణ సీఐ నాగరాజు, పెంటపాడు సీఐ జి.సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను మాధవరం పీహెచ్‌సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం తాడేపల్లిగూడెంలోని ట్రినిటీ ఆస్పత్రికి పంపించారు. ట్రాక్టర్ డ్రైవర్ రామారావును సాయిసంజీవని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాస్పత్రికి చేర్చారు. ప్రమాద ఘటనతో మాధవరం, అప్పారావుపేట గ్రామాల్లో విషాదం నెలకొంది. క్షతగాత్రులకు ఉప ముఖ్యమంత్రి పరామర్శ ట్రినిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి వైద్యులను ఆదేశించారు. మృతులు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు చొప్పున బీమా రూపేణా పరిహారం అందిస్తామని ప్రకటించారు. -
చిత్తూరులో ఘోరం.. పెళ్లింట పెనువిషాదం
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పరిధిలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో 22 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన రాత్రి 10 గంటల సమయంలో పూతలపట్టు, కాణిపాకం మార్గంలోని లక్ష్మయ్య ఊరు అనే గ్రామం వద్ద జరిగింది. ఐరాల మండలం బలిజపల్లికి చెందిన హేమంత్‌కుమార్‌కు పూతలపట్టు మండలం జెట్టిపల్లిలో గురువారం వివాహం జరగాల్సి ఉంది. ఇందుకోసం వరుడి తరఫు బంధువులు సుమారు 30 మంది వరకు బుధవారం రాత్రి ట్రాక్టర్లో జెట్టిపల్లికి బయలుదేరారు. ఈ క్రమంలో పూతలపట్టు మండలం లక్ష్మయ్య ఊరు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో సురేంద్రరెడ్డి (52) (డ్రైవర్), వసంతమ్మ (50), రెడ్డెమ్మ (31), తేజ (25), వినీషా (3), దేశిక (2) ఉన్నారు. గాయపడ్డ వారిని అంబులెన్స్‌లో చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ సురేంద్రరెడ్డి ట్రాక్టర్ గేర్‌ను న్యూట్రల్ చేసి వేగంగా వెళ్లడంతో వాహనం అదుపుతప్పి రోడ్డుపక్కనే గుంతలో దిగి బోల్తాపడింది. గాయపడ్డవారిలో వళ్లెమ్మ (60), సోమశేఖర్ (25), లక్ష్మమ్మ (60), చిన్నప్ప (55), మునీశ్వరి (46), సుభాíÙణి (35), అరుణ (44), ఉదయ్ (35), లీలావతి (27), మాలతి (35), మాధవి(25), కృష్ణవేణి (38), యశోద (30), నవీన (26), శంకయ్య (70), హేమంత్ (31), వినాయక (39), సుమతి (49), మోనిక (23), కాంతమ్మ (45), అన్నపూర్ణ (43,) శోభన్‌బాబు(43) ఉన్నారు. -
అమానుషం..ఫైనాన్స్ కంపెనీ దాష్టికం..గర్భిణిని ట్రాక్టర్‌తో తొక్కించి...
లోన్ రికవరి కోసం ప్రజలను నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేసే ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు గురించి నిత్యం వింటూనే ఉన్నాం. అచ్చం అలానే ఒక ఫైనాన్స్ కంపెనీ లోన్ రికవరీ కోసం ఒక మహిళ పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించింది. వివరాల్లోకెళ్తే...మహిద్ర ఫైనాన్స్ కంపెనీ అధికారులు లోన్ రికవరి కోసం దివ్యాంగుడైన ఒక రైతు ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ఇంట్లో రైతు, అతని కుమార్తె మాత్రమే ఉన్నారు. ఫైనాన్స్ అధికారులకు రైతుకి మధ్య ఫైనాన్స్ విషయమే చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది. అంతే సదరు ఫైనాన్స్ అధికారులు ఏకంగా కోపంతో ట్రాక్టర్‌తో సదరు రైతు కూతురుని తొక్కించి.. హత్య చేశారు. బాధితురాలు మూడు నెలల గర్భిణి. ఈ ఘటన జార్ఖండ్‌లో హజారీబాగ్‌లో చోటు చేసుకుంది. దీంతో పోలీసులు ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ రికవరీ ఏజెంట్, మేనేజర్‌తో సహా నలుగురిపై హత్య కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. మహీంద్రా ఫైనాన్స్ కంపెనీ అధికారులు తమకు సమాచారం ఇవ్వకుండా ఇంటికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ట్రాక్టర్ ఫైనాన్స్ రికవరీ కోసం బాధితుడి నివాసానికి వెళ్లే ముందు స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఈ మేరకు మహీంద్రా గ్రూప్ మేజేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనీష్ షా మాట్లాడుతూ...కంపెనీ అన్ని కోణాల్లో ఈ ఘటనపై దర్యాప్తు చేస్తోంది. ఏజెన్సీలు లోన్‌రికవరీ విషయంలో ఎలా వ్యవహరిస్తున్నారో తెలుసుకుంటాం. కేసు దర్యాప్తు విషయమై పోలీసులకు అన్ని రకాలుగా సహకరిస్తాం అని హామీ ఇచ్చారు. (చదవండి: ప్రేమకు నిరాకరించిందన్న కక్ష్యతో నవ వధువు దారుణ హత్య) -
మూడేళ్ల క్రితం భార్య.. నేడు భర్త.. అదే ట్రాక్టర్.. మరో విషాదం..
మాడుగులపల్లి(నల్లగొండ జిల్లా): మూడేళ్ల క్రితం పంచాయతీ ట్రాక్టర్ ఒక మహిళను బలి తీసుకుంటే.., నేడు అదే వాహనం మృత్యుశకటమై ఆమె భర్త మరణానికి కూడా కారణమైంది. నల్లగొండ జిల్లాలో జరిగిన ఈ విషాద సంఘటన వివరాలివి. మాడుగులపల్లి మండల పరిధిలోని కన్నెకల్ గ్రామానికి చెందిన గంటెకంపు నరేష్ (32)సౌందర్య దంపతులకు ఇద్దరు సంతానం. నరేష్ గ్రామ పంచాయతీ కార్మికుడిగా, సౌందర్య ఐకేపీలో పనిచేస్తుండేవారు. చదవండి: ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ.. ఇంతలోనే షాకింగ్ ఘటన మూడేళ్ల క్రితం సౌందర్య ఐకేపీ పని నిమిత్తం పంచాయతీ ట్రాక్టర్లో మిర్యాలగూడకు వెళ్లి తిరిగి వస్తుండగా వేములపల్లి మండలం శెట్టిపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. బుధవారం నరేష్ గ్యారకుంటపాలెంలో నిర్మిస్తున్న సీసీ రోడ్డుకు అదే ట్రాక్టర్‌కు అమర్చిన ట్యాంకర్లో నీటిని తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో గ్యారకుంటపాలంలోని విద్యుత్ తీగ ట్యాంకర్ పై భాగాన తగలడంతో నరేష్ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఒకే ట్రాక్టర్ దంపతుల్ని కబళించడంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. -
పంట అమ్ముకుని వస్తుండగా నదిలో పడ్డ ట్రాక్టర్.. 20మంది రైతులు..!
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని హర్దోయ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. 20 మంది రైతులతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ వంతెనపై నుంచి గర్రా నదిలో పడిపోయింది. ఈ ప్రమాందంలో ఇప్పటి వరకు ఒకరు ప్రాణాలు కోల్పోగా.. ఐదుగురు గల్లంతయ్యారు. మరో 14 మందిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన బాధితుడు ముకేశ్‌గా గుర్తించినట్లు తెలిపారు హర్దోయ్ జిల్లా మేజిస్ట్రేట్ అవినాశ్ కుమార్. ‘ట్రాక్టర్ ట్రాలీలో వెళ్తున్న 20 మంది గర్రా నదిలో పడిపోయినట్లు సమాచారం అందింది. వారిలోంచి 14 మందిని సురక్షితంగా కాపాడారు. ముకేశ్ మృతదేహాన్ని వెలికితీశారు. గల్లంతైన ఐదుగురి కోసం గాలిస్తున్నా’మని తెలిపారు అవినాశ్ కుమార్. సంఘటనా స్థలంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పీఏసీ బలగాలను మోహరించినట్లు చెప్పారు. ట్రాక్టర్, ట్రాలీని స్వాధీనం చేసుకున్నామని, గల్లంతైన వారందరినీ వెలికితీసిన తర్వాతే ఆపరేషన్ పూర్తవుతుందన్నారు. ఏం జరిగింది? బెగ్రాజ్‌పుర్ గ్రామానికి చెందిన రైతులు తమ పంటను సమీపంలోని మార్కెట్లో విక్రయించి ట్రాక్టర్లో తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో పాలీ ప్రాంతంలో గర్రా నదిపై ఉన్న వంతెనపైకి రాగానే ట్రాక్టర్ టైర్ పేలింది. దీంతో అదుపు తప్పి ట్రాక్టర్ నదిలోకి దూసుకెళ్లింది. #UttarPradesh: Twenty people riding on a tractor-trolley fell into the #Garra river after the driver lost control of the vehicle and it fell off the bridge in #Hardoi on Saturday, officials said. Six people are missing in the tragedy. pic.twitter.com/sy5MYbfJmJ — Siraj Noorani (@sirajnoorani) August 27, 2022 ఇదీ చదవండి: భయానక రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి -
అర్థరాత్రి ప్రమాదం! బతుకులను చీకట్లో కలిపేసిన కాళరాత్రి
అర్ధరాత్రి.. చిమ్మ చీకటి.. దానికి తోడు గాలీవాన.. రోడ్డు పక్కన బోల్తా పడిన ట్రాక్టర్. దాని కింద ఇద్దరు యువకులు.. అంత రాత్రి పూట ఎవరూ వారిని చూడలేదు. ప్రకృతి సాయం చేసే వీలూ ఇవ్వలేదు. తెల్లారే సరికి వారిద్దరి బతుకులు తెల్లారిపోయాయి. ఒక్క ప్రమాదం వీరి ద్దరి ప్రయాణాలకు శాశ్వతంగా ముగింపు పలికింది. ఒక్క కాళరాత్రి వీరి బతుకులను చీకటిలో కలిపేసింది. లఖిదాసుపురం గ్రామానికి చెందిన బొంగి వంశీకృష్ణ(23), గున్న అజయ్‌కుమార్(19)లు ఆదివారం రాత్రి ప్రతాపవిశ్వనాథపురం రెవెన్యూ పరిధిలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందారు. నందిగాం: లఖిదాసుపురానికి చెందిన బొంగి అశోక్‌కుమార్, వనిత దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దవాడు వంశీకృష్ణ ట్రాక్టర్, లగేజీ వ్యా న్ నడుపుతూ కుటుంబానికి అండగా ఉంటున్నా డు. అలాగే ఇదే గ్రామానికి చెందిన గున్న సీతా రాం, అనిత దంపతులకు ఇద్దరు కుమారులు. అందులో అజయ్‌కుమార్ చిన్నవాడు. ఇంటర్ సెకండియర్ చదువుతూ చిన్న చిన్న పనులు చేస్తున్నాడు. వంశీకృష్ణ వాళ్ల ట్రాక్టర్‌తో సిమెంట్ లోడ్‌ను వజ్రపుకొత్తూరు మండలం పూండీ తీసుకువెళ్లేందుకు అజయ్‌కుమార్‌ను ఆదివారం రాత్రి తోడు తీసుకెళ్లాడు. పూండీలో లోడ్ దించేసి మళ్లీ రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి వస్తుండగా ప్రతాపవిశ్వనాథపురం పరిధి మూలపొలం వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న పొలంలో బోల్తా పడింది. ట్రాక్టర్ నడుపుతున్న వంశీకృష్ణ, అజయ్‌కుమార్ ఇద్దరూ బండి కింద పడిపోయారు. ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన చిన్న వర్షం వల్ల ఆ మార్గాన వెళ్లే వారు ఈ ప్రమాదాన్ని గుర్తించలేదు. ట్రాక్టర్ తీసు కెళ్లిన వారు ఎంతకూ తిరిగి రాకపోవడంతో వంశీకృష్ణ తండ్రి అశోక్‌కుమార్, అజయ్‌కుమార్ తండ్రి సీతారాంలు కుమారులకు కాల్ చేశారు. కానీ ఎవరూ రిసీవ్ చేసుకోకపోవడం, ఒకరి ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉండడంతో అనుమానం వచ్చి కణితూరు వరకు వెళ్లి చూశా రు. ఎక్కడా జాడ లేకపోవడంతో తిరిగి వెనక్కి వచ్చేశారు. సోమవారం ఉదయం ఆ మార్గాన వెళ్లే వారు ట్రాక్టర్ ప్రమాదాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్ ప్రమాద సమాచారం అందుకుని మృతదేహాలను ట్రాక్టర్ కింద నుంచి తీయడానికి క్రేన్ తెప్పించారు. అజయ్‌కుమార్ తండ్రి సీతారాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని నందిగాం ఎస్ఐ మహమ్మద్ యాసిన్ తెలిపారు. (చదవండి: పన్నెండేళ్ల ప్రేమ.. పోలీసుల సమక్షంలో పెళ్లి..) -
బంధువుల ఇంట్లో గృహ ప్రవేశం.. పెరుగు తెస్తానని వెళ్లి
సాక్షి, కోరుట్ల(కరీంనగర్): బంధువుల ఇంట్లో గృహ ప్రవేశానికి హాజరై.. తెల్లవారుజామున పెరుగు తెస్తామని ఇద్దరు మైనర్లు మోటర్‌సైకిల్‌పై వెళ్లగా ట్రాక్టర్ ఢీకొని ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఎస్సై సతీశ్ కథనం ప్రకారం.. కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో ఆడెపు ప్రసాద్ గృహాప్రవేశానికి అతని దగ్గరి బంధువుల అబ్బాయి ఆడెపు రోహిత్(16) హాజరయ్యాడు. బుధవారం తెల్లవారుజామున గృహాప్రవేశం ముగియగా సత్యనారాయణ వ్రతం కోసం పెరుగు అవసరం పడింది. అక్కడే ఉన్న ఆడెపు రోహిత్, మరో బంధువుల అబ్బాయి మనోజ్(14)తో కలిసి మోటార్‌సైకిల్‌పై తెల్లవారుజామున 5 గంటలకు పైడిమడుగు శివారులోని పెరుగు విక్రయ కేంద్రం వద్దకు వెళ్దామని బైక్‌పై బయలుదేరారు. ఊరు దాటి కొంత దూరం వెళ్లగానే ఎదురుగా వస్తున్న ట్రాక్టర్, మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోటర్‌సైకిల్ నడుపుతున్న రోహిత్ తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడిక్కడే చనిపోయాడు. మనోజ్‌కు తీవ్రగాయాలు కాగా, కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. దొంగచాటుగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ప్రమాదానికి కారణమైనట్లుగా భావిస్తున్నారు. మనోజ్‌ది మహారాష్ట్రలోని భీవండి కాగా శుభకార్యం కోసం ఇక్కడికి వచ్చినట్లు తెలిసింది. రోహిత్ తల్లి వందన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రోహిత్ కల్లూర్ మాడల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. రోహిత్ తండ్రి సత్యనారాయణ ఉపాధి కోసం గల్ప్ దేశాల్లో ఉంటున్నాడు. చదవండి: కంప్యూటర్ ఆపరేటర్‌కు వేధింపులు.. మాతృ సంస్థకు ఉన్నతాధికారి -
ఆడుకుంటానని వెళ్లిన బాలుడు.. అంతలోనే
సాక్షి, రుద్రంగి(కరీంనగర్): ఆడుకుంటానని చెప్పి వెళ్లిన బాలుడు ట్రాక్టర్ ఢీకొనడంతో మృత్యువాత పడిన ఘటన గురువారం చందుర్తి మండలకేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే వేములవాడ మండలం మర్రిపెల్లి గ్రామానికి చెందిన రాచర్ల కవిత, నర్సయ్యల కుమారుడు రిషి(5). చందుర్తిలోని అమ్మమ్మ ఇంటికి శుభకార్యానికి వచ్చారు. ఆడుకుంటానని చెప్పి వెళ్లి ఇంటిముందు నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని బాలుని మృతికి కారణమైన ట్రాక్టర్‌ను, డ్రైవర్ గామా మహేష్‌ను అదుపులోకి తీసుకొని, బాలుని తండ్రి రాచర్ల నర్సయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు డ్రైవర్ గామా మహేష్‌పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు చందుర్తి ఎస్సై సునీల్ తెలిపారు. మృతదేహంతో ధర్నా.. బాలుడి మృతికి కారణమైన ట్రాక్టర్ యజమాని షేక్ సల్మాన్ ఇంటి ముందు బాలుడి మృతదేహాన్ని ఉంచి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ధర్నాచేశారు. పోలీసులు ధర్నా చేస్తున్న స్థలానికి చేరుకొని నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. -
కామారెడ్డి: పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా
సాక్షి, కామారెడ్డి: దోమకొండ శివారులో చింతామన్ పల్లి గ్రామానికి చెందిన పెళ్లి బృందం ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పది మందికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. చింతామన్ పల్లి గ్రామానికి చెందిన సార్ల సంతోష్ వివాహం ఈ నెల 28న సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బలవంతపుర్ గ్రామానికి చెందిన అమ్మాయితో జరిగింది. ఈ క్రమంలో పెళ్లి కూతురు ఇంట్లో బుధవారం ఫంక్షన్ ఉండటంతో ఉదయం పెళ్ళికొడుకు తరఫున సుమారు 25 మంది ట్రాక్టర్లో చింతామన్ పల్లి గ్రామం నుంచి బయలుదేరారు. శుభకార్యం ముగించుకుని తిరుగు ప్రయాణంలో మార్గమధ్యలో దోమకొండ శివారులోని దొంగల మర్రి ప్రాంతంలో ట్రాక్టర్ అదుపుతప్పింది.(చదవండి: అత్యాచారం.. ఆపై భయంతో ఆత్మహత్య ) ఈ ఘటనలో చింతామన్ పల్లి గ్రామానికి చెందిన సార్ల ప్రమీల, సాయవ్వ, యశోద, నడిపి రాజవ్వ, ఎల్లయ్య, దేవలక్ష్మి, శివరాజు, రాజయ్య, లింగం కాచాపూర్ కు చెందిన గంగవ్వలకు బలమైన గాయాలయ్యాయి. వీరిలో రాజయ్య, లింగంల పరిస్థితి విషమంగా ఉండటంతో 108 అంబులెన్స్‌లో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని దోమకొండ ఆస్పత్రికి తరలించి చికిత్స నిర్వహించారు. సామచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి పరిస్థితి సమీక్షించారు. డ్రైవర్ శ్రీనివాస్ అజాగ్రత్తగా ట్రాక్టర్ నడపడంతో ఈ ప్రమాదం జరిగిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ట్రాక్టర్ ప్రమాదం.. ఎస్ఐ మానవత్వం
సాక్షి, కరీంనగర్: పోలీసులు అనగానే కఠినంగా ఉంటారు.. పరుషంగా మాట్లాడతారు.. అని మనలో చాలామంది అనుకుంటారు. కానీ వారు కూడా మనుషులేనని.. కష్టం వస్తే.. మానవత్వంతో వెంటనే స్పందిస్తారనే దానికి ఉదాహరణలు కోకొల్లలు. తాజాగా కరీంనగర్లో జరిగిన ఓ సంఘటన చూస్తే.. ఈ మాటలు నిజమే అని మరోసారి రుజువు అవుతాయి. ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తికి ఆ ప్రాంత ఎస్సై ప్రథమ చికిత్స చేయడమే కాక తన జీపులోనే ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. వివరాలు.. జిల్లాలోని సైదాపూర్ మండలం గణపూర్ గ్రామానికి చెందిన భాషావేని కిరణ్ అనే వ్యక్తి వ్యవసాయ పనుల నిమిత్తం ట్రాక్టర్ వేసుకుని పొలానికి వెళ్లాడు. పొలం దున్నుతుండగా.. ట్రాక్టర్ కాస్తా ఉల్టా అయ్యింది. ఇది గమనించిన ఇరుగుపొరుగు రైతులు వెంటనే అంబులెన్స్‌కు, పోలీసులకు సమాచారం అందించారు. అయితే సమయానికి అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో.. స్థానిక ఎస్ఐ ప్రశాంత్ రావు వెంటనే స్పందించి కిరణ్‌ను తన పోలీసు వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో ప్రశాంత్ రావు.. కిరణ్ గుండెల మీద చేతులతో ఒత్తి ఊపిరితీసుకునేలా ప్రథమ చికిత్స చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఫసి అబీబ్ అనే వ్యక్తి ట్వీట్ చేయగా.. డీజీపీ మహేందర్ రెడ్డి తెలంగాణ డీజీపీ పోలీస్ ట్విటర్లో రీట్వీట్ చేశారు. అవసరమైన ప్రతి సమయంలో ఇలాంటి ఓ మంచి పోలీసు ఉంటాడంటూ ప్రశంసించారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. ప్రశాంత్ చూపిన మానవత్వాన్ని నెటిజనులు తెగ ప్రశంసిస్తున్నారు. -
ట్రాక్టర్ కిందపడి బాలిక దుర్మరణం
కట్టంగూర్ ( నకిరేకల్) : ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ట్రాలీ కిందపడి ఓ బాలిక దుర్మరణం చెందింది. ఈ ఘటన మండలంలోని పరడ గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అదే గ్రామానికి చెందిన మార్త వాణి(15) తన తల్లిదండ్రులు, అక్కయ్యతో కలిసి వ్యవసాయబావి వద్దకు వెళ్లింది. అక్కడ పనులు ముగించుకుని నలుగురు నడుచుకుంటూ ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలో అదే దారిగుండా గ్రామంలోకి వెళుతున్న లింగయ్యట్రాక్టర్ ఎక్కి ఇంజన్ మడ్‌గర్‌రేకుల మీద కూర్చున్నారు. అదే దారిలోని జోలం ఎర్రయ్య బావి సమీపంలోకి రాగానే వర్షం మొదలైంది. ఆ సమయంలో బాటపై ఉన్న రాయిని ఇంజన్ పెద్ద టైర్ ఎక్కడంతో మడ్గర్ రేకుపై ఉన్న వాణి కిందపడింది. ఈ క్రమంలో ట్రాలీ టైరు బాలికపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి వెంకటనర్సింహారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ జీ. కరుణప్రసాద్ తెలిపారు. -
తేరుకునే లోపే ప్రాణాలు విడిచారు..
తల్లిన కోల్పోయిన బిడ్డ.. బిడ్డలను పోగొట్టుకున్న తల్లిదండ్రులు.. స్నేహితులు, బంధువులను కోల్పోయిన సహచరులు.. రక్త సంబంధీకులంతా ఘొల్లుమనడంతో ఆ గ్రామం కన్నీటి సంద్రంగా మారింది. సహచరులు తమ కళ్ల ముందే విగత జీవులు కాగా.. త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన వారు ప్రమాదాన్ని తలచుకుని గగుర్పాటుకు గురవుతున్నారు. నాగులుప్పలపాడు మండలం మాచవరం సమీపంలో గురువారం మిర్చి కూలీలతో వస్తున్న ట్రాక్టర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న దుర్ఘటనలో 10 మంది మృత్యువాత పడ్డారు. వారందరి మృతదేహాలను శుక్రవారం ఒంగోలు జీజీహెచ్‌లో పోస్టుమార్టం అనంతరం ఇళ్లకు తరలించారు. దీంతో మాచవరంలో రోదనలు మిన్నంటాయి. ఎమ్మెల్యే సుధాకర్ బాబు దగ్గరుండి మృతుల బంధువులతో అంత్యక్రియలు నిర్వహిస్తుండగా పల్లె కన్నీరు పెట్టింది.... నాగులుప్పలపాడు/ఒంగోలు సబర్బన్: ఒకరు కాదు..ఇద్దరు కాదు ఏకంగా పది మందిని విద్యుదాఘాతం రూపంలో మృత్యువు కబళించింది. గురువారం సాయంత్రం మండలంలోని రాపర్ల పొలాల్లో విద్యుత్ ప్రమాదం చోటు చేసుకుంది. మాచవరానికి చెందిన తొమ్మిది మందితో పాటు చీమకుర్తి మండలం ఎర్రగుడిపాడుకు చెందిన మరో యువకుడు మృత్యువాత పడ్డాడు. కాకుమాను భాగ్యవతి అనే మహిళ జీజీహెచ్‌లో మృత్యువుతో పోరాడుతోంది. ట్రాక్టర్ ట్రక్కు తగిలి విద్యుత్ స్తంభం విరిగి కరెంట్ తీగలు తగిలి మృత్యువాత పడిన పది మంది మృతదేహలకు శుక్రవారం ఉదయం 9 గంటల్లోపే అధికారులు పోస్టుమార్టం పూర్తి చేశారు. మృతదేహలను ఉదయం 10 గంటల్లోపు మాచవరం తరలించి బంధువుల రోదనలు అధికంగా ఉండటంతో ఉన్నతాధికారుల సూచనలు మేరకు పోలీసులు మృతదేహలను నేరుగా శ్మశాన వాటికకే తీసుకెళ్లారు. మృతుల్లో విద్యార్థులు, విద్యార్థినులు కూడా ఉండటంతో ఆయా కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. తొమ్మిది మృతదేహాలు మాచవరంలో ఖననం తొమ్మిది మంది మృతదేహాలను మాచవరంలో ఖననం చేశారు. ఏడుగురిని ఒకే శ్మశాన వాటికలో ఖననం చేశారు. గ్రామంలోని పెద్ద మాలపల్లెకు చెందిన వారిలో ఏడుగురిని ఒకే శ్మశాన వాటికలో వేర్వేరుగా ఖననం చేశా>రు. ఇక్కడ ఖననం చేసిన మృతదేహాలు పీకా కోటేశ్వరమ్మ, నూకతోటి లక్ష్మమ్మ, కాకుమాను రమాదేవి, ఆమె కొడుకు శివ, కాకుమాను కుమారి, కాకుమాను మౌనిక, కాకుమాను అమూల్యవి. మాచవరం గ్రామ శ్మశాన వాటికలోనే పొక్లెయిన్‌తో గొయ్యిలు తవ్వించి సమాధి కార్యక్రమాలు పూర్తి చేశారు. మృతుల్లో గోళ్ల రవిశంకర్ మృతదేహం అతడి స్వగ్రామం చీమకుర్తి మండలం ఎర్రగుడిపాడు తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ నల్లూరి చెంచయ్య మృతదేహానికి హిందూ సంప్రదాయ పద్ధతిలో వారి శ్మశాన వాటికలో ఖననం చేశారు. కాకుమాను రవీంద్ర అనే మహిళ మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యుల కోరిక మేరకు వారి సొంత పొలంలో సమాధి చేశారు. సంతనూతలపాడు శాసనసభ్యుడు టీజేఆర్ సుధాకర్‌బాబు ఒంగోలు నుంచి మాచవరానికి మృతదేహాలతో పాటు వచ్చారు. ఆయన దగ్గరుండి జేసీబీ సాయంతో గోతులు తీయించి మృతదేహాలను ఖననం చేయించారు. అనంతరం మృతుల కుటుంబాలను ఓదార్చారు. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేసియా ప్రభుత్వం అందించనున్నట్లు భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ఎప్పుడూ అండగా ఉంటామని ఎమ్మెల్యే టీజేఆర్ భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలకు వైవీ పరామర్శ విద్యుత్ షాక్‌తో మృతి చెందిన మాచవరం బాధిత కుటుంబాలను టీటీడీ పాలక మండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఫోన్లో పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం నుంచి అన్నిరకాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నానన్నారు. నర్స్ అవుదామని.. ట్రాక్టర్ విద్యుత్ స్తంభాన్ని ఢీ కొన్న ప్రమాదంలో ఇరువురు స్నేహితులు మరణంలోనూ ఒక్కటయ్యారు. మాచవరం గ్రామానికి చెందిన కాకుమాను అమూల్య(16), కాకుమాను మౌనిక(18)ఇరువురూ బంధువులు. బంధుత్వంతో పాటు ఇద్దరూ ఒకరిని మరొకరు విడిచిపెట్టి ఉండరు. నర్సింగ్ డిప్లొమో మొదటి సంవత్సరం చదువుతుండగా, మౌనిక ఇంటర్ మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు రాసింది. ఇద్దరూ ఇంటి వద్దే ఖాళీగా ఉండటమెందుకని ఇద్దరూ కలిసి మిర్చి కోతలకోసం కూలీ పనులకు వెళ్ళారు. చిన్ననాటి నుంచి కలిసి, మెలసి ఎంతో ప్రేమ, ఆప్యాతలతో ఉంటున్న వీరిద్దరి చూసి మృత్యువుకే కన్నుకుట్టినట్లయింది. అంతే ఎంతో స్నేహంగా ఉంటున్న వీరిద్దరినీ కలిసి కభళించుకుపోయింది. వీరి స్నేహం గురించి గ్రామంలో గొప్పగా చెప్పుకుంటున్నారు. – అమూల్య, మౌనిక (ఫైల్) తేరుకునే లోపే ప్రాణాలు విడిచారు.... ప్రాణాపాయం నుంచి బయటపడిన :పీకా హేమలత... మిర్చి కోతలు ముగించుకొని గ్రామంలోని అందరం ఉత్సాహంగా వస్తున్నాం. మధ్యలో ట్రాక్టర్ ట్రక్కు విద్యుత్ స్థంభానికి ఢీ కొనటంతో తీగపైనపడి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. అందరూ అరుపులూ, కేకలు వేసుకుంటూ ట్రాక్టర్ ట్రక్కులో నుంచి ఎటువాళ్ళు అటు దూకే ప్రయత్నంలో ఉన్నారు. తేరుకునే లోపే దాదాపు పక్కన ఉన్న వాళ్ళూ, ముందు ఉన్న వాళ్ళూ ప్రాణాలు విడిచారు. ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీలో ఎంబిఏ చదువుతున్నాను. ఈ సంవత్సరం ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ప్రభుత్వం ఇచ్చింది. పనికి వెళితే ప్రాణం పోయి మళ్ళీ వచ్చినట్లయింది.–పీకా హేమలత శివ మృతితో ఆసరా కోల్పోయిన మూడు కుటుంబాలు.. గ్రామం మొత్తం మీద కాకుమాను రమాదేవి, ఆమె కుమారుడు శివ మృతి అందరినీ కలిసి వేసింది. ముగ్గురు అన్నదమ్ముల కుటుంబాలకు ఒకే ఒక్క వారసుడు శివ(17). తండ్రికి తలలో గడ్డ వస్తే ఆపరేషన్ చేసినప్పుడు కంటి చూపు పోయింది. కంటి చూపు కోల్పోయిన డానియేల్ భార్య ర మాదేవి, కుమారుడు శివను తలుచుకుంటూ విలవిల్లాడుతున్నాడు. అతని ఓదార్చటం ఎవరితరం కావటం లేదంటే అతిశయోక్తి కాదు. దీంతో కరోనా మహమ్మారితో ఖాళీగా ఇంటి వద్ద తన కుమారుడు వాళ్ళ అమ్మతో కలిసి మిర్చి కోతలకు వెళ్ళాడంటూ తండ్రి డానియేలు కుమిలి కుమిలి రోదిస్తున్నాడు. తన కుటుంబంతో పాటు తన అన్న, తమ్ముడు కుటుంబానికి కూడా ఒక్కడే మగ సంతానం అని విలవిలలాడుతున్నాడు. రెక్కాడితే కానీ డొక్కాడని తమ కుటుంబానికి ప్రభుత్వం ఇస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా కందుకూరులోని ప్రైవేటు కళాశాలలో పాలిటెక్నిక్‌లో ఎలక్ట్రికల్ విభాగంలో మొదటి సంవత్సరం పూర్తి చేశాడని ఇక తనకు దిక్కెవరు అంటూ కుమిలిపోతున్నాడు. వద్దన్నా పనికి వెళ్లి మృత్యు ఒడికి.. మిర్చి కోతలకు తల్లి కాకుమాను వెంకాయమ్మతో కలిసి కుమార్తె మౌనిక(18)కూడా కూలీ పనికి వెళ్ళింది. అయితే ట్రాక్టర్, విద్యుత్ స్తంభం ప్రమాదంలో తల్లి వెంకాయమ్మ ప్రాణాపాయం నుంచి బయట పడింది. కుమార్తె తన కళ్ల ముందే ప్రాణాలు విడిచింది. దీంతో ఆ కుటుంబంలో మౌనిక మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తండ్రి ఎఫెఫ్రా గ్రామ పంచాయితీ సహాయకుడుగా(వీఆర్ఏ) పనిచేస్తున్నాడు. ఈ దంపతులకు అబ్బాయి, అమ్మాయి. కుమారుడు ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. చదువులో ఎంతో ఉత్సాహంగా ఉండే మౌనికను చేతులారా పొట్టను పెట్టుకున్నానంటూ తల్లి వెంకాయమ్మ కన్నీరు మున్నీరవుతోంది. తన కళ్ల ముందే బిడ్డను పోగొట్టుకున్నానంటూ విలపిస్తోంది. తన బిడ్డ మౌనిక చదువుకోసం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అమ్మఒడి పథకం ద్వారా నా బ్యాంకు అకౌంట్లో రూ.15 వేలు వేశాడంటూ గుర్తు చేసుకొని విలవిల్లాడింది. పనికి తీసుకెళ్లకుండా ఉన్నా ప్రభుత్వ సాయంతో బిడ్డ బాగా చదువుకొని తమ కుటుంబాలకు అండగా ఉండేదని బోరున విలపిస్తోంది. – మౌనిక ఫొటో చూపుతున్న తల్లిదండ్రులు ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా నర్సింగ్ చదువు... కాకుమాను అమూల్య తల్లి అన్నమ్మ రోదిస్తూ:నర్సింగ్ డిప్లొమో చదువుతున్న తన కుమార్తె కాకుమాను అమూల్య మృత్యువాత పడటంతో అమూల్య కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. తండ్రి ఏబేలు గ్రామ పంచాయతీకి మంచినీరు వదిలేందుకు కూలీ పనికి వెళుతుంటాడు. ఏబేలు, అన్నమ్మ దంపతులకు ఇద్దరు సంతానం కుమారుడు ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కుమార్తె అమూల్య పదో తరగతి పాస్ కాగానే వైద్య వృత్తిలోకి వెళ్ళాలనుకుందని తల్లి అన్నమ్మ విలపించింది. డాక్టర్ చదువులకు ఆర్థిక స్తోమత సరిపోదని, నర్సు చదువు పూర్తి చేసి ప్రజలకు సేవ చేస్తానని, అందుకే నర్సింగ్ కోర్సులో చేరిందని సెల్ఫోన్లో ఉన్న అమూల్య ఫోటో చూసి రోదించింది. నర్సింగ్ కోర్సులో చేరి మొదటి సంవత్సరం పూర్తి చేసిందని, ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి ఈ బిడ్డ చదువుకు ప్రోత్సహించిందని, అయినా మా బిడ్డ కష్టాన్ని తినే ప్రాప్తం మాకు లేదని భోరున విలపించింది. – అమూల్య ఫొటో చూపుతూ రోదిస్తున్న తల్లి చదువుల ఒడి నుంచి.. కూలికెళ్లి.. మాచవరం గ్రామస్తులంతా అక్షర పిపాసులే. అందుకే.. ఎప్పుడూ చదువులమ్మ ఒడిలో ఓలలాడుతుంటారు. అక్కడి విద్యార్థులకు సెలవులొస్తే బలాదూర్ తిరగటం ఇష్టముండదు. ఖాళీ సమయాన్ని ఏమాత్రం వృథా చేయకుండా వ్యవసాయ పనులకు వెళ్తుంటారు. పదో.. పరకో సంపాదిస్తూ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుంటారు. లాక్డౌన్ వేళ చదువులకు సుదీర్ఘ విరామం రావటంతో.. ఇంటిపట్టున ఉండలేక గ్రామంలోని కూలీలతో కలిసి మిర్చి కోతలకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురై.. విద్యుదాఘాతంతో వారిలో నలుగురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. మరో ఆరుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
ట్రాక్టర్ బీభత్సం
చైతన్యపురి: నగరంలోని చైతన్యపురి ప్రాంతంలో శనివారం ఓ ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది. అయితే ఈ ఘటనలో రెండు కార్లు, ఐదు బైక్‌లు ధ్వంసం కాగా అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. గణేశ్పురి కాలనీలోట్రాక్టర్లో బిల్డింగ్ వ్యర్థాలను తీసుకెళ్తున్న డ్రైవర్ లింగయ్యకు ఫిట్స్ వచ్చి డ్రైవింగ్ సీటునుంచి కిందికి పడిపోయాడు. దీంతో ట్రాక్టర్ అదుపు తప్పి రోడ్డు పక్కన నిలిపిన బైక్‌లు, కార్లను ఢీకొంటూ వెళ్లి ఆగింది. ఫిట్స్ తో కిందపడిపోయిన లింగయ్యను స్థానికులు దగ్గర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై జానకిరెడ్డి తెలిపారు. -
పుట్టిన రోజే.. ఆఖరి రోజు
హుస్నాబాద్: ట్రాక్టర్ బోల్తాపడి బీటెక్ విద్యార్థిని మృతి చెందింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన నవీన(20) వరంగల్ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. శుక్రవారం ఆమె పుట్టిన రోజు కావడంతో గురువారం ఇంటికి వచ్చింది. శుక్రవారం ఉదయం పొలం పనుల్లో తండ్రికి సహాయ పడేందుకు వెళ్లింది. వరినారు చేరవేసేందుకు నవీన ట్రాక్టర్ వెనుక భాగంలో ఉన్న రోటవేటర్‌పై నారు వేసుకొని ట్రాక్టర్ నడుపుకుంటూ పొలం ఒడ్డు వద్దకు చేరుకుంది. ఒడ్డుపై ఉన్న ట్రాక్టర్‌ను కొంత వెనుకకు తీసుకురావాలని తండ్రి కోరగా, ఒక్కసారిగా ట్రాక్టర్ పొలంలోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. నవీనపై ట్రాక్టర్ పడటంతో ఆమె బురదలో కూరుకుపోయి ఊపిరి ఆడక మృతి చెందింది. -
ట్రాక్టర్ బోల్తా: మహిళ మృతి
సాక్షి, నందిగామ: కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ కాల్వలోకి బోల్తా పడిన ఘటన వీరులపాడు మండలం పొన్నవరం గ్రామ శివారులో జరిగింది. ట్రాక్టర్ ఇంజన్ కింద డ్రైవర్‌తో సహా వ్యవసాయ కూలీలు ఇరుక్కుపోగా.. స్థానికులు వారిని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో తమ్మిశెట్టి ధనలక్ష్మి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని విజయవాడ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గడ్డి ట్రాక్టర్ బోల్తా.. ముగ్గురు మృతి
-
దూసుకొచ్చిన మృత్యువు
శ్రీకాకుళం , రాజాం సిటీ: నగరపంచాయతీ పరిధిలోని పాలకొండ రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పొనుగుటివలస గ్రామానికి చెందిన రెడ్డి బాబూరావు(49) మృతిచెందాడు. ఈయన ప్రైవేటు మెడికల్ ప్రాక్టీస్‌నర్‌గా సేవలందిస్తూ వచ్చే కొద్దొగొప్పో ఆదాయంతో ఇంటిని నెట్టుకొస్తున్నాడు. రోజువారీ దినచర్యలో భాగంగా గురువారం కూడా రేగిడి మండలం కొర్లవలస గ్రామానికి ప్రాక్టీస్ నిమిత్తం వెళ్లి తిరిగి ఇంటి ముఖం పట్టాడు. అయ్యప్పస్వామి గుడి సమీపంలో వెనుకగా వస్తున్న ఇటుకల ట్రాక్టర్ ఢీకొనడంతో బాబూరావు రోడ్డుపై పడిపోయాడు. ఈయన తలపైభాగం మీదుగా ట్రాక్టర్ చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అటుగా వెళుతున్న ప్రయాణికులు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన జరిగిన ప్రాంతం సంతకవిటి మండల పరిధిలో ఉండడంతో సంతకవిటి ఎస్సై సీహెచ్ రామారావుతో పాటు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ఆరా తీశారు. కుటుంబీకులకు సమాచారం అందించారు. కేసు నమోదుచేసి సీఐకి సమాచారం అందించారు. మరోవైపు రాజాం రూరల్ సీఐ రుద్రశేఖర్ సంఘటనా స్థలం వద్దకు చేరుకొని ఘటనపై వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించి అనంతరం కుటుంబీకులకు అందజేశారు. రోడ్డున పడిన కుటుంబం బాబూరావు సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తి. ప్రతి రోజు కష్టపడుతూ మెడికల్ ప్రాక్టీస్‌నర్‌గా సేవలందించి వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈయనకు భార్య ధనలక్ష్మి, తల్లి రత్నాలమ్మతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి జీవన భారం మొత్తం బాబూరావుపైనే ఉండేది. ఈయన పెద్ద కుమారుడు సందీప్ డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా చిన్నకుమారుడు సుదీప్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మరోవైపు కొత్త ఇళ్లు కూడా నిర్మించుకొని మరో పది రోజుల్లో గృహప్రవేశానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఇంతలో విధి వక్రీకరించి ఇటుక ట్రాక్టర్ రూపంలో మృత్యువు కబళించింది. బాబూరావు మృతిని కుటుంబం జీర్ణించుకోలేకపోతుంది. భర్త మృతదేహంపై భార్య ధనలక్ష్మి రోధించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. కళ్లముందున్న కొడుకు మృతదేహం చూసి తల్లి రత్నాలమ్మ రోదిస్తున్న తీరు పలువురిని కంటతడిపెట్టించింది. దేవుడా మా కుటుంబానికి ఎందుకింత అన్యాయం చేశావంటూ ఆమె గుండెలవిసేలా విలపించింది. పొనుగుటివలసతో పాటు పరిసర గ్రామాలకు చెందిన బాబూరావు స్నేహితులు, బంధువులు పొనుగుటివలసకు చేరుకొని అంత్యక్రియల్లో పాల్గొన్నారు. -
పేద కుటుంబాల్లో విషాదం
పాయకరావుపేట: రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేద కుటుంబాల్లో ట్రాక్టర్ ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. కుటుంబ యజమానులు దుర్మరణం చెందడంతో ఇక తమకు దిక్కెవరంటూ ఆ కుటుంబాల సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జాతీయ రహదారిపై నామవరం సమీపంలో సోమవారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. దీంతో వారి కుటుంబాలు వీధిన పడ్డాయి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం హంసవరం నుంచి విశాఖ జిల్లా ఎస్.రాయవరం మండలం అడ్డురోడ్డు వద్దకు సిమెంటు ఇటుకలు తీసుకు వెళ్తున్న ట్రాక్టర్ నామరం వద్ద ప్రమాదానికి గురైంది. వెనుక వస్తున్న బస్సుకు సైడు ఇచ్చేందుకు ట్రాక్టర్‌ను డ్రైవరు రోడ్డు పక్కకు దింపాడు. బస్సు వెళ్లిన తర్వాత తిరిగి ట్రాక్టర్‌ను రోడ్డు ఎక్కించే సమయంలో అదుపు తప్పి బోల్తాపడింది. తొట్టెలో సిమెంట్ ఇటుకలపై కూర్చొన్న హంసవరానికి చెందిన కూలీలు నట్టే వీరభద్రరావు(40),చిట్టుమూరి అప్పన్న(34) ఇటుకల కిందపడి తీవ్రగాయాలపాలయ్యారు. వెంటనే వీరిని స్థానికులు, పోలీసులు తుని ఏరియా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరణించిన వీరభద్రరావుకు భార్య ఇద్దరు పిల్లలు, అప్పన్నకు భార్య,ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రమాదం విషయం తెసుకున్న బంధువులంతా తుని ఏరియా ఆస్పత్రికి అధిక సంఖ్యలో చేరుకున్నారు. వీరి ఆర్తనాదాలతో ఆస్పత్రి ప్రాంగణం మార్మోగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ లొడ్డు రామకృష్ణ తెలిపారు. స్థానికంగా సిమెంటు ఇటుకలు తయారీ పరిశ్రమ ఉండడంతో ఉపాధి కోసం అప్పన్న, వీరభద్రరావు పనుల్లోకి వెళ్తున్నారు. వీరు సంపాదిస్తేనే కుటుంబ పోషణ జరిగేది. వీరిద్దరి పిల్లలు బాగా చిన్నవారే. మృతదేహాల వద్ద ఆ పిల్లలు రోదిస్తున్న తీరు స్థానికులను కంటతడిపెట్టించింది. ఇటుకల లోడు దించేసి మధ్యాహ్ననానికల్లా ఇళ్లకు భోజనానికి వచ్చేస్తామని చెప్పారని, రెండుగంటలకు పిడుగులాంటి వార్త వినవలసివచ్చిందని బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. -
ప్రమాదాల్లో ఐదుగురి మృతి
జిల్లాలో, జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో చోటుచేసుకున్న వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందారు. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌ను లారీ ఢీకొనడంతో ఇద్దరు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వరదాపురం రైల్వేస్టేషన్ సమీపంలో రైళ్లు ఢీకొని ఇద్దరు కీమెన్లు దుర్మరణం చెందారు. దట్టంగా కురుస్తున్న మంచులో రైళ్లు కనిపించక వారు మృత్యువాత పడ్డారు. చిత్తూరు, కలకడ : ట్రాక్టర్‌ను లారీ ఢీకొన్న దుర్ఘటనలో మండలానికి చెందిన ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో నలుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన చిత్తూరు–వైఎస్సార్ కడప జిల్లా సరిహద్దులో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం.. తిప్పిరెడ్డిగారిపల్లెకు చెందిన ఆరుగురు వ్యక్తులు గురువారం ఉదయం 7గంటల సమయంలో ఇటుకల కోసం ట్రాక్టర్లో కలకడకు బయలుదేరి వస్తుండగా పీలేరు నుంచి రాయచోటి వైపు వెళుతున్న కెఎ 01 ఎజె 4424 నంబరు గల లారీ జిల్లా సరిహద్దులో ఢీకొంది. ఈ ప్రమాదంలో తిప్పిరెడ్డిగారిపల్లె వాసి చిన్నకోట్ల వెంకట్రమణ (45) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ ఎస్.మునాఫ్ (23), రఫీ (17), లక్ష్మీపతి తదితరులను 108లో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మునాఫ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. రఫీ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో తిరుపతికి రెఫర్ చేశారు. కడప జిల్లా సంబేపల్లె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద ఘటనతో తిప్పిగారిపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. రైళ్లు ఢీకొని ఇద్దరు కీమెన్లు..–మంచు తెచ్చిన ముప్పు గుడుపల్లె/కుప్పం రూరల్: రైళ్లు ఢీకొని ఇద్దరు రైల్వే కార్మికులు మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటన గుడుపల్లె సమీపంలోని సరిహద్దు ప్రాంతమైన కర్ణాటక రాష్ట్రం వరదాపురం రైల్వేస్టేషన్ సమీపాన గురువారం చోటుచేసుకుంది. బంగారుపేట రైల్వే పోలీసుల కథనం.. కీమెన్లుగా రామస్వామి (24) బెంగళూరు ట్రాక్ మార్గంలో, రాజప్ప (26) చెన్నై మార్గంలో విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం 4 గంటల సమయంలో ఇద్దరు వరదాపురం రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే రెండు పట్టాలపై రైళ్లు వీరిని ఢీకొన్నాయి. దీంతో రామస్వామి, రాజప్ప అక్కడికక్కడే దుర్మరణం చెందారు. రామస్వామి శాంతిపురం మండలం, సీ.బండపల్లెకు చెందిన వ్యక్తి కాగా, రాజప్ప మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా రైల్వే పోలీసులు గుర్తించారు. రామస్వామి కాంట్రాక్టుపై పని చేస్తుండగా, రాజప్ప రెగ్యులర్ ఉద్యోగి. ఉదయం మంచులో రైళ్లను గమనించకపోవడం వల్లనే ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం వీరి మృతదేహాలను బంగారుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బంగారుపేట రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రైలు కింద పడి యువకుడు.. కురబలకోట : రైలు కింద పడి గుర్తు తెలియని యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం మధ్యాహ్నం కురబలకోట రైల్వేస్టేషన్ దగ్గర చోటుచేసుకుంది. పట్టాల మధ్యనే మృతదేహం పడి ఉంది. కదిరి రైల్వే పోలీసులు సమాచారం ఇచ్చినట్లు రైల్వే స్టేషన్ మాస్టర్ Ðð తెలిపారు. ప్రమాదవశాత్తు జరిగిందా, లేదా అత్మహత్యా? అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
పెళ్లింట విషాదం..శుభకార్యానికి చేరుకునేలోపే..
ఊర్కొండ: పెళ్లి ప్రయాణం విషాదంగా మారింది. శుభకార్యానికి చేరుకునేలోపే అనుకోని ఘటనతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఊర్కొండ ఎస్ఐ కృష్ణయ్య, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... మండల పరిధిలోని ఊర్కొండపేటకు చెందిన బంధువులు, రాచాలపల్లిలో జరిగే పెళ్లికి హాజరయ్యేందుకు ట్రాక్టర్లో ప్రయాణమయ్యారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో బయలుదేరారు. పెళ్లికూతురు పెదనాన్న తాడూర్ మండలం ఆకునెల్లికుదురు గ్రామానికి చెందిన బరిగెల బాలయ్య(60) (పెద్దమ్మ భర్త) ఊర్కొండ ప్రధాన స్టేజీ వద్ద ట్రాక్టర్ ఎక్కారు. అనంతరం డ్రైవర్ వేగంగా, అశ్రద్ధగా నడుపుతుండటంతో తగ్గాలని హెచ్చరించారు. అయినా అతను వినకుండా వెళ్తుండటంతో ఊర్కొండ శివారులో బోల్తాపడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 32మందికి గాయాలయ్యాయి. ఇంజన్ భాగంలో కూర్చున్న బరిగెల బాలయ్య ట్రాక్టర్ ముందుభాగం చక్రంలో ఇరుక్కుని తీవ్రంగా గాయపడ్డారు. వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన అంజలి అనే వివాహిత కుడిచేయి మోచేతి వరకు తెగిపడింది. మరో వివాహిత రజిత కాళ్ల మధ్యలో చర్మం పూర్తిగా తెగిపడింది. అలాగే పద్మ, బాలకిష్టమ్మ, అంజమ్మ, అమృత, పార్వతమ్మ, లక్ష్మమ్మ తీవ్రంగా గాయపడ్డారు. కల్వకుర్తికి క్షతగాత్రులు ప్రమాదం గురించి స్థానికులు పోలీసులకు తెలియజేశారు. వెంటనే చేరుకున్న వారు క్షతగాత్రులను కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం నలుగురిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రి వైద్యులు సిఫారసు చేశారు. వైద్యం అందిస్తుండగానే బరిగెల బాలయ్య మృతి చెందాడు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ కృష్ణయ్య తెలిపారు. 108 వాహనం రావడం లేటవడంతో, పోలీసులు తమ వాహనంలోనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు పరామర్శ కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రి బాధితులతో పూర్తిగా నిండిపోయింది. వారి రోదనలు మిన్నంటాయి. క్షతగాత్రులను కల్వకుర్తి డీఎస్పీ పుష్పారెడ్డి, సీఐ సురేందర్ రెడ్డి పరామర్శించారు. పూర్తి వివరాలను ఎస్ఐని అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటనపై పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
మద్యం మత్తులో వ్యక్తి వీరంగం
నెల్లూరు ,అనుమసముద్రంపేట: మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. పొలం యజమానిని ట్రాక్టర్‌తో ఢీకొట్టి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన ఏఎస్‌పేట మండలంలోని గుడిపాడు గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఆవులమంద కొండయ్య తన పొలం దున్నేందుకు అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి దేవరాల పెంచలయ్య ట్రాక్టర్‌ను అద్దెకు తీసుకెళ్లాడు. ఆ ట్రాక్టర్‌కు డ్రైవర్‌గా అదే గ్రామానికి చెందిన కుండా జంగంరెడ్డిని ఏర్పాటు చేసుకున్నాడు. గురువారం జంగంరెడ్డి ఫూటుగా మద్యం సేవించి ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తూ పొలం పక్క ఉన్న గట్లను చెదర గొట్టేస్తున్నాడు. దీనిని వారించిన పొలం యజమాని కొండయ్య ‘నువ్వు మద్యం మత్తులో ఉన్నావు.. పొలం రేపు దున్నాలని’ కోరాడు. అయితే జంగంరెడ్డి ససేమిరా అంటూ అడ్డు వస్తే నిన్ను తొక్కిస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నేను దున్నేప్పుడే మీరు భూమి దున్నించుకోవాలంటూ ట్రాక్టర్‌ను యజమానికి పైకి తీసుకెళ్లాడు. పొలంలోనే ట్రాక్టర్‌తో తరముతూ వాహనంతో ఢీకొట్టి కాళ్లపై ఎక్కించేశాడు. దీంతో కొండయ్య తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న సమీపంలోని రైతులు వెంటనే వచ్చి కొండయ్యను ఆత్మకూరులోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. ఏఎస్‌పేట ఎస్సై సెలవులో ఉండటంతో సమాచారమందుకున్న ఆత్మకూరు సీఐ అల్తాఫ్ హుస్సేన్, ఎస్సై నరేష్‌లు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
నూతన దాంపత్యంపై విధి కన్నెర్ర
శ్రీకాకుళం, టెక్కలి రూరల్: ఆ నూతన దాంపత్యంపై విధి కన్నెర్ర జేసింది. ఎంతో ఆనందంగా ఉన్న ఆ దంపతులపై విధికి కన్నుకుట్టింది. పెళ్లైన నాలుగు నెలలకే తన భర్తను ట్రాక్టర్ రూపంలో మృత్యువు కాటేసింది. ఈ విషయం తెలుసుకున్న భార్య చెందిన ఆవేదన అరణ్యరోదనగా విగిలిపోయింది. అప్పటివరకు తన పక్కనే ఉన్న భర్త ఇప్పుడే టెక్కలి వెళ్లివస్తానని చెప్పి 10 నిమిషాలు గడవక ముందే మృత్యువు వడిలోకి చేరాడనే వార్త వినడంతో ఆమె గుండె పగిలింది. ఈ ఘటన టెక్కలి మండలం గూడేం గ్రామంలో చోటుచేసుకుంది. ఈ గ్రామానికి చెందిన పువ్వల సుర్యానారాయణ(32) అనే వ్యక్తి సోమవారం సాయంత్రం సన్యాసి నీలాపురం గ్రామ సమీపంలో వంశధార వంతెనపై ఆగివున్న ట్రాక్టర్‌ను ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం... మృతుడు సూర్యనారాయణకు నాలుగు నెలల క్రితం మందస మండలం హరిపురం గ్రామానికి చెందిన శ్రీలక్ష్మితో పెళ్లి జరిగింది. పెళ్లి అయిన తర్వాత సూర్యనారాయణ ఉపాధి నిమిత్తం చెన్నై వెళ్లి అక్కడ పనిచేస్తున్నాడు. దసరా పండుగ సందర్భంగా సూర్యనారాయణ తన భార్య శ్రీలక్ష్మితో కలిసి ఆదివారం తమ గ్రామమైన గూడెం వచ్చాడు. అయితే ఇంట్లో అందరితో కలిసి ఆనందంగా ఉన్నారు. సోమవారం రాత్రి తన భార్యతో టెక్కలి వెళ్లి ఇప్పుడే వస్తానని చెప్పి బైక్‌పై వెళుతుండగా సన్యాసి నీలాపురం గ్రామం సమీపంలో వంశధార బ్రిడ్జి వద్ద కంకర లోడ్‌తో ఆగివున్న ట్రాక్టర్‌ను బలంగా ఢీకొనడంతో తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరు అయ్యారు. పెళ్లైన నాలుగు నెలలకే భర్త మృతిచెందటంతో భార్య రోదన వర్ణనాతీతం. విషయం తెలుసుకున్న టెక్కలి ఎస్ఐ సురేష్ బాబు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుండగా ఈ గ్రామానికి చెందిన ఒక యువకుడు ఆదివారం ఉరివేసుకుని మృతిచెందగా, 24 గంటలు గడవక ముందే ఇదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి ట్రాక్టర్‌ను ఢీకొని మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
మైనర్లే డ్రైవర్లు!
మైనర్లు అతివేగంతో ఇసుక, మట్టి వాహనాలు నడుపుతూ నిండు ప్రాణాలను బలిగొంటున్నారు. ఎస్పీ ఆదేశాలతో కొందరు పోలీసులు నిజాయితీగా పనిచేస్తున్నా మరికొందరు మామూళ్ల మత్తులో వాహన యజమానులకు సహకరిస్తున్నారు. ఫలితంగా మైనర్లు, లైసెన్స్‌లు లేని డ్రైవర్ల చేతిలో అమాయకుల జీవితాలు చితికిపోతున్నాయి. కుటుంబాలు వీధిన పడుతున్నాయి. బుచ్చిరెడ్డిపాళెం (నెల్లూరు): జిల్లాలో మట్టి, గ్రావెల్, ఇసుక రవాణా జోరుగా సాగుతోంది. వీరిలో కొందరు ప్రభుత్వ అనుమతితో తరలిస్తున్నా, మరికొందరు తహసీల్దార్, ఎస్సైల అండదండలతో రవాణా చేస్తున్నారు. కావలి నుంచి సూళ్లూరుపేట వరకు, ఉదయగిరి నుంచి నెల్లూరు వరకు నిత్యం రవాణా జరుగుతూనే ఉంది. మొత్తం 2,800 టిప్పర్లు, నాలుగువేలకు పైగా ట్రాక్టర్లు రవాణా చేస్తున్నట్లు ఓ అంచనా. ఈ క్రమంలో వాహనాలు నడుపుతున్న వారిలో అధిక శాతం మందికి లైసెన్సులు ఉండటంలేదు. పలువురు యజమానులు మైనర్లకు వాహనాలు అప్పగించేశారు. వీరు అతివేగంతో ఇష్టానుసారంగా నడుపుతూ యాక్సిడెంట్లు చేస్తున్నారు. ఆర్టీఏ, పోలీసులు పట్టించుకోవడంలేదని విమర్శలున్నాయి. కనిగిరి రిజర్వాయర్ నుంచి.. బుచ్చిరెడ్డిపాళెం కనిగిరి రిజర్వాయర్ నుంచి రోజుకు సుమారు 50 టిప్పర్లు, 200 ట్రాక్టర్లు మట్టిని తరలిస్తున్నాయి. వీరిలో 70 శాతం మందికి లైసెన్స్‌లు లైవు. ఇదిలాఉండగా వారిలో మైనర్ డ్రైవర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. ముంబై జాతీయ రహదారిపై వీరు ట్రాక్టర్లతో దూసుకెళుతున్న తీరు ప్రయాణికులను, ప్రజలను భయపెడుతోంది. ఏడాదికి 100 మందికిపైనే ఏడాదికి సుమారు వంద మంది మట్టి, ఇసుక, గ్రావె ల్ టిప్పర్లు, ట్రాక్టర్ల కింద పడి మృతిచెందుతున్నట్లు తెలుస్తోంది. బుచ్చిరెడ్డిపాళెం మండలంలో అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా ట్రాక్టర్ యజమానులు మైనర్లనే డ్రైవర్లుగా ఉపయోగిస్తున్నా రు. మైనర్ల ప్రమాదాలు కొందరు పోలీసులకు కాసు ల వర్షం కురిపిస్తోంది. అలాగే లైసెన్స్ లే కుండా ప్రమాదం చేసినా ఆదాయం తెచ్చిపెడుతోంది. దృష్టి సారిస్తే చెక్ పడినట్లే జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి రోడ్డు ప్రమాదాల నివారణకు ఎన్నో చర్యలు చేపట్టారు. అయితే మళ్లీ షరామామూలే అయింది. కొందరు పోలీసులు తనిఖీలు చేసి జరిమానా విధిస్తుంటే, మరికొందరు ఆ వాహనాలు తిరిగే సమయాల్లో అటువైపే వెళ్లడంలేదు. ఇసుక, మట్టి, గ్రావెల్ రవాణా జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు చేపడితే మైనర్ డ్రైవర్లు, లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపేవారికి చెక్ పడుతుంది. ఎస్పీ స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. ఎస్పీ దృష్టి సారించాలి ఎస్పీ ఆదేశాలను కొందరు పట్టించుకోవడంలేదు. పోలీసులు లైసెన్స్‌లు లేకుండా వాహనాలు నడిపే మట్టి, ఇసుక, గ్రావెల్ ట్రాక్టర్ల డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలి. మైనర్లను డ్రైవర్లుగా పెట్టుకునే యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. – పచ్చా మధుసూదన్‌రావు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఎస్సీసెల్ రాష్ట్ర కన్వీనర్ లైసెన్స్ లేకుంటే చర్యలు తప్పవు వాహనాలు నడిపే వారికి లైసెన్స్‌లు తప్పనిసరి. మైనర్లతో వాహనాలు నడిపిస్తే యజమానులపై కేసులు నమోదు చేస్తాం. ఇప్పటికే ఎంతోమందికి జరిమానా విధించాం. కనిగిరి రిజర్వాయర్ నుంచి వెళ్లే వాహనాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. – సుబ్బారావు, సీఐ, బుచ్చిరెడ్డిపాళెం -
చేతిలో సిగరెట్.. కాళ్ల మధ్య స్టీరింగ్
సాక్షి, యాదాద్రి/వలిగొండ : డ్రైవర్ 60 ఏళ్ల వృద్ధుడు.. లైసెన్స్ లేదు.. గతంలో డ్రైవింగ్ చేసిన అనుభవం అంతకంటే లేదు.. ఇటీవల నేర్చుకొని ట్రాక్టర్ స్టీరింగ్ పట్టాడు.. 30 మందిని ఎక్కించుకున్నాడు.. వీటన్నింటికితోడు అంతులేని నిర్లక్ష్యం.. సిగరెట్ వెలిగించుకునేందుకు స్టీరింగ్‌ను కాళ్లకు అప్పగించాడు.. అంతలోనే చిన్న కుదుపు.. కంట్రోల్ చేసేందుకు బ్రేకు తొక్కాడు.. అయినా అదుపు తప్పింది.. పక్కనే ఉన్న మూసీ కాల్వలోకి బోల్తా కొట్టింది.. చూస్తుండగానే ట్రాలీ తిరగబడి 15 మంది నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి! మృతుల్లో 14 మంది మహిళలు, నాలుగేళ్ల బాలుడు ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండ గ్రామంలో ఆదివారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదమిదీ!! బయల్దేరిన ఐదు నిమిషాలకే అమాయకులైన నిరుపేద కూలీలు జలసమాధి అయ్యారు. మరో పది నిమిషాల్లో చేనుకు చేరి పనులు చేసుకునే వారి బతుకులు డ్రైవర్ నిర్లక్ష్యంతో తెల్లారిపోయాయి. ఎలా జరిగిందంటే..? వేములకొండలో ఓ రైతుకు చెందిన వ్యవసాయ భూమిని వెంకటనారాయణ మూడు సంవత్సరాలుగా కౌలుకు తీసుకుని పత్తి సాగు చేస్తున్నాడు. ఈ సంవత్సరం కూడా సాగుకు సిద్ధమయ్యాడు. ఇటీవల వర్షం కురవడంతో ఆదివారం పత్తి విత్తనాలు వేసేందుకు తన ట్రాక్టర్ఈ ట్రాక్టర్(ఏపీ16 ఏబీ 8775)లోనే లోనే 30 మంది కూలీలను తీసుకుని చేనుకు బయల్దేరాడు. కూలీలకు పంచేందుకు స్వీటు డబ్బా కూడా తీసుకుని వెళ్లాడు. ట్రాక్టర్ ఇంజిన్‌పై వెంకటనారాయణతోపాటు మరో ఐదుగురు కూర్చున్నారు. డ్రైవర్ వెనుక చెక్కపై ముగ్గురు, రెండువైపులా టైర్లపైన ఒక్కొక్కరు చొప్పున కూర్చున్నారు. ఇది పాత మోడల్ ట్రాక్టర్. టైర్లు పూర్తిగా అరిగిపోయాయి. కొంతకాలంగా వాడటం లేదు. కూలీలను తీసుకెళ్లేందుకు ఆదివారమే బయటకు తీశాడు. రెండు బ్రేక్‌లు ఒకేసారి కొడితేనే ట్రాక్టర్ నిలకడగా ఆగుతుంది. ఎడమ, కుడి బ్రేక్‌లలో ఏ ఒక్కదాన్ని నొక్కినా ట్రాక్టర్ అటువైపే లాగుతుంది. కూలీలతో బయల్దేరిన ఐదు నిమిషాలకు సిగరెట్ ముట్టించేందుకు వెంకట నారాయణ రెండు చేతులు విడిచిపెట్టి స్టీరింగ్‌ను రెండు కాళ్ల మధ్య పెట్టి తిప్పాడు. ఇదే సమయంలో ట్రాక్టర్ అదుపు తప్పి కుడివైపు ఉన్న మూసీ కాల్వ వైపు మళ్లింది. దీంతో డ్రైవర్ కుడి వైపు బ్రేక్ తొక్కడంతో ట్రాక్టర్ ట్రాలీ కూడా అటువైపే ఒరిగింది. అది నల్లరేగడి భూమి కావడం, శుక్రవారం కురిసిన వర్షానికి నానడంతో స్కిడ్ అయి ట్రాలీ కాల్వలో పడిపోయింది. గుర్రపు డెక్క.. పట్టా.. ట్రాక్టర్ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరగడానికి గుర్రపు డెక్క కూడా కారణంగా కనిపిస్తోంది. మూసీ కాల్వ వెంట గుర్రపు డెక్క ఏపుగా పెరిగి ప్రమాదకరంగా మారింది. ట్రాలీ తిరగడి పడిపోవడం, అందులోని కూలీలు గుర్రపు డెక్క మధ్య చిక్కుకుపోవడంతో బయటపడే మార్గం మూసుకుపోయింది. అలాగే ట్రాలీలో కూర్చునేందుకు యూరియా బస్తాల పట్టా పరిచారు. కాల్వలో ట్రాక్టర్ పడిపోగానే ఇది కూడా కూలీలపై పడిపోయి ఊపిరి ఆడకుండా చేసింది. ప్రమాదం జరిగిన వెంటనే వెంకటరమణ అక్కడ్నుంచి పారిపోయాడు. మృతులు వీరే.. జడిగె మారమ్మ( 55), ఎనుగుల మాధవి (26), బందారపు స్వరూప (35), పంజాల భాగ్యమ్మ (27), బీసు కవిత (27), కాడిగల్ల లక్ష్మమ్మ (35), మనీషా (18), కాడిగల్ల నర్మద( 25), ఇంజమూరి శంకరమ్మ (30), ఇంజమూరి నర్సమ్మ (50), అంబాల రాములమ్మ(50), అరూరు మణెమ్మ (30), గన్నెబోయిన అండాలు( 35), బోయ శంకుతల(23), మల్లిఖార్జున్ (4). వీరిలో కాడిగల్ల లక్ష్మమ్మ, మనీషాలు తల్లికూతుళ్లు. మృతదేహాలకు వేములకొండలోని పీహెచ్సీలో పోస్టుమార్టం నిర్వహించారు. బయటపడిన 15 మంది.. ప్రమాదంలో 15 మంది గాయాలతో బయటపడ్డారు. వారిలో కాడిగల్ల అఖిల, కాడిగల్ల హేమలత, గన్నెబోయిన మంజుల, రత్నకుమారి, జోగు శాంతమ్మ, మట్టిపల్లి లక్ష్మమ్మ, ఇంజమూరి లక్ష్మమ్మ , రాపోలు జయమ్మ, బొంగు లక్ష్మమ్మ, కాడిగల్ల తేజ, అంబుల సోమమ్మ, కోట అనిత, బొంత మంజుల, కాడిగల్ల ఇందిర ఉన్నారు. వీరిని రామన్నపేట, భువనగిరి ఏరియా ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. ఏడాది క్రితం తండ్రి.. ఇప్పుడు తల్లి.. వేములకొండకు చెందిన సుంచు నర్మద (25) భర్త నరేశ్ గతేడాది ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆమె గ్రామంలోని తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఆమెకు మహీదర్(6), అవంతిక(4) సంతానం. గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కాంపౌండర్‌గా శిక్షణ పొందుతోంది. నర్మద సాధారణంగా కూలీకి వెళ్లదు. ఆదివారం రోజు ఇంటి దగ్గర ఉండలేక తన చెల్లి మనీషతో కలసి పత్తి గింజలు పెట్టేందుకోసం వెళ్లింది. ప్రమాదంలో నర్మద మృతి చెందగా, శిరీష ట్రాక్టర్ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకుంది. ఇప్పటికే తండ్రి చనిపోగా, ఇప్పుడు తల్లి మరణించడంతో పిల్లలు మహీదర్(6), అవంతిక అనాథలయ్యారు. అమ్మమ్మ, మేనత్త, పిన్నిల వద్దకు వెళ్లి అమ్మ కావాలంటూ చిన్నారులు ఏడ్వడంతో చూసినవారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. అయ్యో పాపం..! చౌటుప్పల్: పొట్ట చేతపట్టుకొని ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఓ కుటుంబం ట్రాక్టర్ ప్రమాదంతో ఛిన్నాభిన్నమైంది. కర్నూలు జిల్లా ఆధోని గ్రామానికి చెందిన బోయ పరశురాం(35).. భార్య శకుంతల(30), నాలుగేళ్ల కుమారుడు మల్లిఖార్జున్‌తో కలిసి 15 రోజుల క్రితం జీవనోపాధి కోసం భువనగిరి జిల్లా వేములకొండకు వచ్చారు. గ్రామంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు. ఇంటి వద్ద కుమారుడి ఆలనాపాలనా చూసే వాళ్లు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వెంట తీసుకెళ్తున్నారు. ఆదివారం కూడా ముగ్గురు కలిసి ట్రాక్టర్లో ఎక్కారు. బాలుడు తల్లి ఒడిలో కూర్చోగా పరశురాం ట్రాలీ వెనుక భాగంలో బాడీపై కూర్చున్నాడు. ప్రమాదంలో తల్లి, కుమారుడు మృతిచెందగా పరశురాం ప్రాణాలతో బయటపడ్డాడు. మేమే బయటకు తీశాం ట్రాక్టర్ బోల్తా పడిందని తెలియగానే పరుగున వచ్చాం. 15 మంది చనిపోయారు. వారందరినీ బయటకు తీశాం. మరో ఏడుగురికి కాళ్లు, చేతులు విరిగాయి. వారిని బయటకు తీసి ఆస్పత్రికి పంపించాం. – ఏర్పుల యాదయ్య, వేములకొండ పట్టా చుట్టేసింది ట్రాక్టర్ బోల్తా పడిన సమయంలో ట్రాలీలో కూర్చున్న మహిళలంతా నీటిలో పడిపోయారు. వారిపై ట్రాలీ పడింది. మహిళలు కూర్చునేందుకు ట్రాలీలో పట్టా ఏర్పాటు చేశారు. అది మహిళలను చుట్టేసింది. లోపల ఉన్న వారు బయటకు రాలేకపోయారు. పైన బçస్తా పట్టా, ఆపై ట్రాలీ ఉండడంతో ఊపిరాడక చనిపోయారు. – గుడెళ్ల శ్రీహరి, ప్రత్యక్ష సాక్షి ఊపిరాడకే చనిపోయారు: పోస్టుమార్టం నివేదిక ట్రాక్టర్ ప్రమాద మృతుల పోస్టుమార్టం నివేదికను వైద్యులు విడుదల చేశారు. ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడం వల్లే కూలీలంతా చనిపోయినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోట్యానాయక్ ‘సాక్షి’కి తెలిపారు. ఛాతీపై బరువు పడడంతో 9 మంది, నీళ్లు మింగి ఆరుగురు చనిపోయినట్టు నివేదికలో పేర్కొన్నారు. కాగా ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వెంకటనారాయణపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ముందే హెచ్చరించిన సాక్షి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాల్వ కట్టలు బలహీనంగా, ఇరుకుగా ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ‘సాక్షి’ముందే హెచ్చరించింది. ఏప్రిల్ 6న పెద్ద అడిశర్లపల్లి మండలం పడమటితండాలో కాల్వలో ట్రాక్టర్ బోల్తా పడి తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు. ఆ సమయంలో ఉమ్మడి జిల్లాలోని మూసీ, ఏఎమ్మార్పీ, ఎస్ఎల్బీసీ కాల్వ కట్టల పరిస్థితిపై ‘సాక్షి’ప్రత్యేక ఫొటో ఫీచర్ ప్రచురించింది. ఎక్కడెక్కడ ప్రమాదం పొంచి ఉందో వివరించింది. అయినా అధికారుల్లో చలనం రాకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కేసీఆర్ దిగ్భ్రాంతి సాక్షి, హైదరాబాద్: ట్రాక్టర్ ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబీకులు, బంధువులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి సరైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఉత్తమ్, జానా సంతాపం వేములకొండలో జరిగిన ప్రమాదంపై కాంగ్రెస్ సంతాపం వ్యక్తం చేసింది. ఈ ఘటన చాలా బాధాకరమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ప్రతిపక్ష నేత జానారెడ్డి డిమాండ్ చేశారు. -
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం
మొరెనా: మధ్యప్రదేశ్‌లో గురువారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 15మంది మృత్యువాతపడ్డారు. గ్వాలియర్ జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 20 మంది జీపులో ఘుర్గాన్ గ్రామంలో బంధువుల ఇంట్లో జరిగే సంతాప కార్యక్రమానికి వెళ్తున్నారు. వీరి వాహనాన్ని మొరెనా జిల్లా గంజ్రాంపూర్ గ్రామ సమీపంలో ఎదురుగా వేగంగా వచ్చిన ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో జీపులోని 12 మంది అక్కడికక్కడే చనిపోగా తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు మొరెనా ప్రభుత్వ ఆస్పత్రిలో కన్నుమూశారు. మిగతా ఐదుగురు చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రాక్టర్ డ్రైవర్ పరారయ్యాడు. -
పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా
సాక్షి, భద్రాద్రి: పెళ్లి బృందాన్ని తీసుకుని వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఆశ్వారావు పేట మండలం సున్నంబట్టి గ్రామం వద్ద జరిన ఈ ఘటనలో ఆరుగురు గాయ పడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలం రావిగూడెం చెందిన 30మంది భద్రాదిలోని ముల్కలపల్లికి పెళ్లికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. -
పెళ్లి సరదా తీరకుండానే..
కొత్తూరు : వివాహం జరిగిన 40 రోజులకే ఆ నవ వరుడును మృత్యువు కబళించింది. పెళ్లి సరదా తీరకుండానే నూరేళ్లు నింపేసింది. నవ వధువును వితంతువుగా మార్చేసింది. ఎన్నో ఆశలతో మెట్టినింటిలో కొత్త జీవితం ప్రారంభించిన ఆమెకు కాళ్ల పారాణి ఆరకముందే విషాదం మిగిల్చింది. ట్రాక్టర్ ప్రమాదంలో నవ వరుడు దుర్మరణం చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలావున్నాయి. మండలంలోని మదనాపురం పంచాయతీ పరిధి వెంకటాపురం కాలనీకి చెందిన సన్నిబోయిన సాయిరాం(26) తన సొంత ట్రాక్టర్‌తో గురువారం మట్టి పెరుగుతున్నాడు. అయితే మట్టి లోడుతో వస్తున్న ట్రాక్టర్ కలిగాం వద్ద ఎత్తు మీదకు వస్తున్న తరుణంలో ఇంజిన్‌మీదకు లేచింది. ఈ తరుణంలో తొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో సాయిరాంకు తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ వైద్యం పొందుతూ మృతి చెందాడు. దీంతో సాయిరాం కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయారు. మృతుడు సాయిరాంకు అదే కాలనీకి చెందిన నర్సమ్మతో గత నెల 18వ తేదీన వివాహం జరిగింది. ఇంకా పెళ్లి సరదా తీరక ముందే ట్రాక్టర్ రూపంలో సాయిరాంకు మృత్యువు కబళించింది. సాయిరాం మృతి చెందిన వార్త విన్నవెంటనే భార్య నర్సమ్మ, తల్లిదండ్రులు భాస్కరరావు, చెల్లమ్మ రోదనలు మిన్నంటాయి. వివాహం జరిగి 40 రోజులకే ఈ దారుణ సంఘటన జరగడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. కాళ్ల పారాణి ఆరక ముందే భర్తను పోగొట్టుకున్న నర్సమ్మను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. సాయిరాం అందరితో మంచిగా ఉన్నందున ఈయన మృతిని కాలనీ వాసులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ సంఘటనపై రిమ్స్ వైద్యులు చేసిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్ఐ విజయ్‌కుమార్ కేసు నమోదు చేసినట్టు హెచ్‌సీ శ్రీనివాసరావు తెలిపారు. -
రోడ్ టెర్రర్..
సాక్షి, జనగాం జిల్లా : రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రయాణికులను హడలెత్తిస్తున్నాయి. నిత్యకృత్యంగా మారిన రహదారి ప్రమాదాలతో ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా జనగాం మండలం పెంబర్తి గ్రామ శివార్లలో ఆర్టీసి బస్సు, బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మృతులను రామన్నగూడెం గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు తీగల నర్సయ్య(56), తీగల కృష్ణ(28)గా గుర్తించారు. నర్సయ్య ప్రమాద అక్కడికక్కడే చనిపోగా, కృష్ణ జనగాం ఏరియా అసుపత్రిలో చికిత్స పొందుతు మృతి చెందాడు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. మరో ఘటనలో.. పాలకుర్తి మండలం సిరిసన్న గూడెం శివారులో ట్రాక్టర్ బోల్తా పడిన దుర్ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. హూటాహుటిన వారిని ఆసుపత్రికి తీసుకురావటం వల్ల ప్రమాదం తప్పింది. అధిక లోడు కారణంగానే ట్రాక్టర్ బోల్తా పడిందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పాము కాటుకు రైతు మృతి బచ్చన్నపేట మండలంలోని సాల్వాపూర్ గ్రామంలో పాము కాటుకు పడాల నరేందర్ అనే రైతు మృతి చెందాడు. రాత్రి సమయంలో పొలానికి నీరు పెట్టేందుకు వెళుతుండగాదారిలో పాము కాటువేసింది. సకాలంలో వైద్యం అందకే మృతి చెందాడని కుటుంబ సభ్యులు విలపించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. -
పెళ్లి బారాత్‌లో అపశ్రుతి
నిజామాబాద్ లింగంపేట(ఎల్లారెడ్డి) : పెళ్లి వేడుకల్లో అపశ్రుతి జరగడంతో ఒక వృద్ధురాలు మృతి చెందగా, పెళ్లికొడుకు, మరో మహిళలకు తీవ్రగాయాలైన సంఘటన లింగంపేట మండలం లింగంపల్లి పంచాయతీ పరిధిలోని కొయ్యగుండు తండాల్లో చోటు చేసుకుంది. తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన అమ్రియానాయక్ కుమారుడు దేవిసింగ్ వివా హం బుధవారం నిజామాబాద్ జిల్లా మోపాల్ మండ లం బైరాపూర్ తండాలో జరిగింది. వివాహానంతరం పెళ్లికొడుకు, పెళ్లికూతురు, బంధువులు రాత్రి బైరాపూర్ తండా నుంచి కొయ్యగుండు తండాకు చేరుకున్నారు. తండా సమీపంలోని గిరిజనుల ఆలయం వద్ద పూజలు చేసి ఇంటికి డీజే సౌండ్ సిస్టమ్‌తో నృత్యాలు చేసుకుంటూ వెళ్తున్నా రు. ఇంటి సమీపంలో నిలిపిఉన్న ట్రాక్టర్‌ను బంధువుల యువకుడు స్టార్ట్ చేయడంతో గేర్‌లో ఉన్న ట్రాక్టర్ బారాత్ తీస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కామారెడ్డిలోని రుద్ర ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పెళ్లి కూతురు బంధువు మాలీబాయి(68) మృతిచెందింది. ట్రాక్టర్ ముందు నడుస్తున్న పెళ్లి కొడుకు, పెళ్లికూతురితో పాటు పలువురిపై ట్రాక్టర్ దూసుకెళ్లడంతో పెళ్లి కొడుకు కేతావత్ దేవిసింగ్ చాతిపైకి ట్రాక్టర్ చక్రం ఎక్కగా తండావాసులు వెంటనే టైర్‌ను పైకి లేపి బయటకు తీశారు. ఈ ఘటనలో తండాకు చెందిన కేతావత్ బగ్లీ, శాంత, సునీత, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పెళ్లి ముగించుకుని ఇంటికి చేరుకున్న బంధువులు ఇంట్లోకి వెళ్లే సమయంలో ఈ దుర్ఘటన జరగడంతో తండాలో విషాదచాయలు అలుముకున్నాయి. -
జల సమాధి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/పెద్ద అడిశర్లపల్లి/దేవరకొండ : పొట్టచేత పట్టుకుని పొద్దున్నే కూలికి బయల్దేరిన తొమ్మిది మంది గిరిజన మహిళలు కానరాని లోకాలకు వెళ్లారు. ఇళ్ల నుంచి బయల్దేరిన ఐదు నిమిషాలకే మృత్యు వాత పడ్డారు. వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ కాల్వలోకి పడిపోవడంతో జలసమాధి అయ్యారు. మరో పది మందికి గాయాల య్యాయి. ట్రాక్టర్లో పరిమితికి మించి కూలీలను ఎక్కించడం, సెల్‌ఫోన్ మాట్లాడు తూ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. శుక్రవారం నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి (పీఏపల్లి) మండలం వద్ది పట్ల గ్రామపంచాయతీ పరిధిలోని పడమటితండా వద్ద ఈ ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ఎలా జరిగింది..? పడమటి తండా సమీపంలోని పులిచర్లలో ఓ రైతుకు చెందిన వ్యవసాయ పొలంలో పని కోసం కూలీలు బయల్దేరారు. ఉదయం 6 గంటల సమయంలో సుమారు 25 మంది ట్రాక్టర్లో ఎక్కి కూర్చున్నారు. స్థలం సరిపో కపోవడంతో కొందరు మహిళల్ని ఇంజన్‌పై కూర్చోబెట్టారు. ఇంకొంత మంది వెనుక ఆటోలో బయల్దేరారు. ట్రాక్టర్ బయల్దేరి ఐదు నిమిషాల్లోపే తండాను ఆనుకొని ఉన్న ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ) లింక్ కాల్వలో బోల్తా కొట్టింది. పుట్టం గండి సిస్టర్న్ నుంచి అక్కపెల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీరు తీసుకువెళ్లే ఈ కాల్వలో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రధాన రహదారిని చేరుకోవడానికి ఈ కాల్వకట్టే ఆధారం. ప్రమాదం సమయంలో డ్రైవర్ బుచ్చిరెడ్డి ఫోన్ మాట్లాడుతున్నట్టు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ట్రాక్టర్ కెనాల్లోకి దూసుకువెళ్తున్న సమయంలో డ్రైవర్ పక్కనే కూర్చున్న ఓ మహిళ బ్రేక్ వేసేందుకు యత్నించింది. డ్రైవర్ ట్రాక్టర్‌ను మళ్లీ రోడ్డుపైకి తెచ్చేందుకు యత్నించినా సాధ్యం కాలేదు. ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న వారిలో మహిళలే ఎక్కువుండటం, వారికి ఈత రాకపోవడంతో తొమ్మిది మంది జలసమాధి అయ్యారు. మృతుల్లో రమావత్ సోనా(70), రమావత్ జీజా(65), జర్పుల ద్వాలీ(30), రమావత్ కేలి(50), రమావత్ కంసాలి(50), బానోతు ధరి(55), రమావత్ భారతి(35), రమావత్ సునీత(30) ఉన్నారు. రమావత్ బాజు(45) మృతదేహం కోసం గాలిస్తున్నారు. ప్రమాదం నుంచి బయట పడిన 10 మందికి దేవరకొండ ప్రభుత్వా స్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. రూ.2 లక్షల ఆర్థిక సాయం మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఘటన గురించి తెలియగానే సీఎం కేసీఆర్ తనతో మాట్లాడారని, బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, మూడెకరాల భూమి మంజూరు చేస్తామన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా? 15 మందిని ఎక్కించాల్సిన ట్రాక్టర్లో ఏకంగా 25 మందిని ఎక్కించారు. అదీగాకుండా డ్రైవర్ 15 అడుగులున్న బీటీ రోడ్డుపై సెల్‌ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని మృతుల బంధువులు చెబుతున్నారు. తాము చెబుతూనే ఉన్నా డ్రైవర్ పరిమితికి మించి ఎక్కించాడని వారు ఆరోపించారు. ఇదే ట్రాక్టర్లో కూలీకి వెళుతున్న హనుమ అనే యువకుడు ధైర్యం చేసి 12 మందిని కాపాడాడు. లేదంటే మృతుల సంఖ్య మరింత పెరిగేదని ప్రమాదం నుంచి బయటపడినవారు తెలిపారు. శోకసంద్రంలో తండా పడమటి తండా వద్దే మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. ఒకే తండాకు చెందిన తొమ్మిది మంది చనిపోవడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుము కున్నాయి. ప్రమాదం విషయం తెలుసుకున్న తండావాసులు, మృతుల బంధువులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మృతుల బంధువుల రోదనలతో తండా శోకసంద్రంలో మునిగి పోయింది. మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఓదార్చారు. కలెక్టర్, ఎస్పీలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి తదితరులు బాధితులను పరామర్శించారు. దేవుడైన పూజారి పడమటితండా బాలాజీ దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్న హనుమ కూలీల పట్ల దేవుడయ్యాడు. ఈయన గుడిలో పూజలు నిర్వహించడమే కాకుండా కూలి పనులకు వెళ్తుంటాడు. ప్రమాదానికి గురైన ట్రాక్టర్లోనే హనుమ కూడా ఉన్నాడు. ట్రాక్టర్ పడిపోగానే కాల్వలోంచి ఆయన 12 మంది మహిళలను ఒడ్డుకు చేర్చాడు. ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న 25 మందిలో ఒకరిద్దరే పురుషులున్నారు. ప్రమాదం తర్వాత డ్రైవర్ కాల్వ నుంచి బయటపడి పారిపోయాడు. హనుమ ధైర్యసాహసాలను తెలుసుకున్న కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎస్పీ రంగనాథ్ ఆయన్ను అభినందించారు. హనుమ పేరును రాష్ట్రపతి మెడల్‌కు సిఫారసు చేస్తామని ఎస్పీ తెలిపారు. -
ఘోర ప్రమాదం.. 12 మంది మృతి
సాక్షి, నల్గొండ : జిల్లాలోని పీఏపల్లి మండలంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయాన్నే వ్యవసాయ పనులకు కూలీలతో బయల్దేరిన ట్రాక్టర్ అదుపు తప్పి కాల్వలో పడింది. ఈ ఘటనలో 12 మంది కూలీలు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మద్దిపట్ల గ్రామం నుంచి పనులకు 30 మంది కూలీలు ట్రాక్టర్లో బయల్దేరారు. వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. నిండు కుండలా ప్రవహిస్తున్న కాలువలో పడటంతో ఎక్కువ మంది ఊపిరాడక ప్రాణాలు వదిలినట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతులు రమావత్ సోనా, రమావత్ జీజా, జవుకుల ద్వాలి, రమావత్ కేలీ, రమావత్ కంసాలి, బాణవత్ బేరీ, రమావత్ భారతి, రమావత్ సురితలుగా గుర్తించారు. ప్రమాద ఘటనపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. -
ట్రాక్టర్ ఢీకొని బాలుడి మృతి
అయిజ (అలంపూర్) : ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో ఓ బాలుడు దుర్మరణం పాలయ్యాడు. మండలంలోని పెద్ద ధన్వాడకు చెందిన మద్దిలేటి, సుజాత దంపతుల కుమారుడు మహేష్(15), హరికృష్ణలు మంగళవారం స్వ గ్రామం నుంచి అయిజకు బైక్‌పై వస్తుండగా చిన్నతాండ్రపాడు వద్ద వెనకనుంచి వస్తున్న ఇసుక ట్రాక్టర్ ఢీ కొట్టింది. మహేష్ అక్కడికక్కడే మృతిచెందగా బైక్ నడుపుతున్న హరికృష్ణకు స్వల్పగాయాలయ్యాయి. వెంటనే ట్రాక్టర్ డ్రైవర్ పరారయ్యాడు. ఈ సంఘటనపై కేసునమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా కేంద్రానికి తరలించినట్టు ఏఎస్ఐ శేషిరెడ్డి తెలిపారు. -
దారికాచిన మృత్యువు
వర్గల్(గజ్వేల్): మృత్యువు దారికాచింది. కరెంటు తీగల రూపంలో మాటేసింది. ట్రాక్టర్‌పై గడ్డి నింపుకొస్తున్న యువ రైతుపై పంజా విసిరింది. క్షణాల్లో ఉసురు తీసింది. పండగ పూట మిన్నంటిన రోదనలతో ఆ రైతు కుటుంబం పెను విషాదంలో మునిగిపోయింది. ఈ విషాదకర దుర్ఘటన మంగళవారం వర్గల్ మండలం సామలపల్లిలో జరిగింది. మృతుడి కుటుంబీకులు, బంధువుల కథనం ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నెంటూరు గ్రామపంచాయతీ పరిధిలోని సామలపల్లి గ్రామానికి చెందిన రైతు నాగులపల్లి కేశవరెడ్డి (35) సన్నకారు రైతు. కుటుంబానికి కాసింత ఆసరాగా రెండు పాడి గేదెలు ఉన్నాయి. పొలం వద్ద ఉన్న పశుగ్రాసాన్ని ట్రాక్టర్లో నింపి కోళ్లఫారం వద్ద ఖాళీ చేసొస్తానని భార్య ఇందిరకు చెప్పిన కేశవరెడ్డి ఉదయం ఇంటి నుంచి బయల్దేరాడు. గడ్డి జారిపోకుండా ట్రాక్టర్ ట్రాలీకి ఇరువైపుల ఇనుప పైపులను నిలబెట్టాడు. మజీద్‌పల్లికి చెందిన కూలీ సాయంతో గడ్డిని ట్రాక్టర్ నిండా నింపారు. హైడ్రాలిక్ ట్రాక్టర్ కావడంతో ఖాళీ చేయడానికి మనిషి అవసరం లేదని చెప్పగా కూలీ వెళ్లిపోయాడు. ఆ తరువాత తానే స్వయంగా గడ్డి ట్రాక్టర్‌ను నడుపుకుంటూ కోళ్ల ఫారమ్ వైపు బయల్దేరాడు. పొలంగట్లు, ఎత్తు, పళ్లాలకు తోడు దారి మధ్యలో కొద్దిగా సాగి వేలాడుతున్న 11 కేవీ కరెంట్ తీగలు అనూహ్యంగా ట్రాక్టర్ ట్రాలీకి బిగించిన ఇనుప పైపులను తాకాయి. ఆ వెంటనే ట్రాలీ నుంచి ఓ వైపు ఇనుప పైపు జారిపోయి ఎర్తింగ్ అయ్యేలా భూమిని, ట్రాలీని తాకుతూ నిలిచింది. దీంతో ఒక్కసారిగా ట్రాక్టర్ మొత్తానికి కరెంట్ షాక్ తగిలింది. ఏం జరిగిందో గుర్తించే లోపలే షాక్‌కు గురై రైతు కేశవరెడ్డి ట్రాక్టర్ ఇంజన్ కిందికి విసిరేసినట్లుగా పడిపోయాడు. చేతులు కాలి, ఛాతి కమిలిపోయి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ట్రాక్టర్ తీగల కిందే నిలిచిపోయింది. ట్రాక్టర్ టైర్లు తగలబడుతున్నట్లు గమనించి స్థానికులు అక్కడికి చేరుకుని సబ్‌స్టేషన్‌కు సమాచారం చేరవేసి విద్యుత్ సరఫరాను నిలిపివేయించారు. మంటలు చెలరేగకుండా సమీపంలో నుంచి తెచ్చిన నీళ్లు, చెట్టు కొమ్మలతో చల్లార్చారు. ట్రాక్టర్ ట్రాలీకి గడ్డి జారిపోకుండా పొడవైన కర్రలకు బదులు ఇనుప గొట్టాలు బిగించడం, కొద్దిగా కిందికి సాగిన కరెంటు తీగలు వాటికి తాకడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. గొల్లుమన్న సామలపల్లి మేం ఏం పాపం చేసినం దేవుడా.. పండుగ పూట మాకు ఎంత అన్యాయం జేస్తివి అంటూ మృతుడు కేశవరెడ్డి భార్య ఇందిర హృదయ విదారక రోదనలతో ఘటన స్థలం వద్ద విషాద వాతావరణం అలుముకుంది. పండుగ పూట బిరాన వస్తానని చెప్పి కానరాకుండా మమ్ములను ఆగం చేసి పోతివా అని భర్తను తలుచుకుంటూ కుమిలిపోయింది. తండ్రి చనిపోయిన విషయం అర్థం కాని స్థితిలో ఐదేళ్లలోపు వారి ఇద్దరు పిల్లలు మౌనిక (5), నవీన్ (3)లు తల్లి ఒడిలో కూర్చుని రోదిస్తున్న తీరు చూపరుల హృదయాలు ద్రవింపజేసింది. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో వ్యవసాయ క్షేత్రంలో విషాదం నెలకొంది. చిన్న వయసులో ఎంత పెద్ద కష్టమొచ్చిపడిందని అక్కడికి వచ్చిన వారు వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు. అందరితో కలిసిపోయేలా ఉండే కేశవరెడ్డి మరణం ఊరి జనాన్ని కలచివేసింది. కాగా ఈ ఘటనపై మృతుడి భార్య ఇందిర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. గజ్వేల్‌లో మృతదేహానికి పోస్టుమార్టం జరిపించి కుటుంబీకులకు అప్పగించారు. -
పేదల ఇళ్లలో పెను విషాదం
దేవరాపల్లి(మాడుగుల): మరో రెండు నిమిషాల వ్యవధిలో ఇంటికి చేరుకోవలసిన ఆ ఇద్దర్నీ వారు ప్రయాణిస్తున్న ట్రా క్టర్ రూపంలో మృత్యువు çకబళించి, వారి కుటుంబ సభ్యులకు తీరని వ్యథను మిగి ల్చింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మామిడిపల్లికి చెందిన సన్నకారు రైతు గొర్లి నాయుడు పశువుల పాక నిర్మించేందుకు తాటి కమ్ములు(పాక నిర్మాణానికి ఉప యో గించే దూలాలు) నిమిత్తం గ్రామానికి చెందిన కార్పెంటర్ పెదగాడి కామేశ్వరరావుతో కలిసి ఎం.అలమండ వెళ్లారు. అక్కడ కొట్టించిన తాటి దుంగలను ట్రాక్టర్‌పై లోడు చేసి తారువా మీదుగా స్వగ్రామం మామిడిపల్లి బయలుదేరారు. తారువా కాలనీ మలుపు వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయే క్రమంలో అదుపు తప్పి ఎడమ పక్కన లోతుగా ఉన్న సరుగుడు తోటవైపు ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో ఇంజిన్ నుంచి తొట్టి భాగం విyì పోయింది. తాటి దుక్కలపై ఎక్కి కూర్చొని ప్రయాణిస్తున్న గొర్లినాయుడు(38),కార్పెం ట ర్ పెదగాడి కామేశ్వరరావు(50) దుక్కలు కిం ద చిక్కుకొని అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం జరిగిన సమయంలో అటుగా వెళ్తు న్న వారు గమనించి, వారిని అతికష్టంమీద బయటకు తీసేసరికే మృతి చెందారు. వీరి మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు.దేవరాపల్లి, ఏ.కోడూరు ఎస్ఐలు పి. నర్సింహమూర్తి, ఏ.సత్యనారాయణ, చోడవరం సీఐ ఎం.శ్రీని వాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్టర్‌ను పొక్లెయిన్‌తో బయటకు తీయిం చారు. పోస్టుమార్టం నిమి త్తం మృతదేహాల ను చోడవరం ప్రభుత్వఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే బూడి పరామర్శ ట్రాక్టర్ ప్రమాదంలో ఇద్దరు మరణించారన్న వార్త తెలుసుకున్న మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనా యుడు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటి పెద్ద దిక్కలను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. పంచనామా జరిపి, త్వరతిగతిన పోస్టుమార్టం నిర్వహించేలా సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే పోన్లో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు చంద్రన్న భీమా సొమ్ము సకాలంలో అందేలా తన వంతుగా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. పిల్లలను ఎలా చదివించాలి కార్పెంటర్ పెదగాడి కామేశ్వరరావు వృత్తి ద్వారా రోజూ సంపాదించే కూలి సొమ్ముపైనే ఆ కుటుంబమంతా ఆధారపడి జీవిస్తోంది. రెక్కాడితే డొక్కాడని కార్పెంటర్ వృత్తిలో భాగంగా కూలి పని నిమిత్తం తాటి కమ్ములు కోయించేందుకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లి పోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. కామేశ్వరరావుకు భార్య కాసులమ్మ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తెకు ఇటీవల వివాహం చేయగా రెండవ కుమార్తె లత వేచలం హైస్కూల్లో పదో తరవగతి చదువుతోంది. కుమారుడు పెందుర్తిలో ఐటీఐ చదువుతుండగా ఎలక్ట్రికల్ సామగ్రి కనుగోలు నిమిత్తం శుక్రవారం గుంటూరు వెళ్లాడు. ఇద్దరు పిల్లల చదువులతో పాటు పోషణ, పెళ్లిళ్లు ఎలా చేయాలని మాకు దిక్కెవరంటూ భార్య కాసులమ్మ భోరున విలపించింది. ఇదరు ఆడ పిల్లల్ని ఎలా పోషించాలి .. గొర్లి నాయుడుకు భార్య వెంకటలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు దీపు(8), గ్రీసు(5) ఉన్నారు. తనకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేయడంతో పాటు చిన్న పాటి టీ దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని నెట్టికొస్తున్నాడు. అయితే కుటుంబ పోషణ కష్టంగా ఉండడంతో ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంత మేర గట్టెక్కెందుకు పశువులను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో పశువుల పాక నిర్మించేందుకు తాటి కమ్ములు తీసుకొచ్చేందుకు వెళ్లి మృత్యువు వాత పడడంతో అతని కుటుంబం రోడ్డున పడింది. తమకు దిక్కెవరని, తన ఇద్దరి పిల్లల్నీ ఎలా పోషించాలంటూ భార్య వెంకట లక్ష్మి గుండెలవిసేలా రోదించింది. తండ్రి మృత దేహం వద్ద దీనంగా కూర్చున్న చిన్నారులు చూసిన పలువురు కంటతడిపెట్టారు. -
ట్రాక్టర్ కింద పడి బాలుడి మృతి
మల్యాల(చొప్పదండి): నడుస్తున్న ట్రాక్టర్ పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడి బాలుడు మృతిచెందిన ఘటన మల్యాల మండలం తాటిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అట్ల అంజవ్వ, నారాయణరెడ్డి దంపతులు కూలీపని చేస్తుంటారు. వీరికి ఒక్కగానొక్క కొడుకు రాజు(15) ఉన్నాడు. ఐదోతరగతి వరకు చదివిన రాజు ట్రాక్టర్‌పై కూలీపనికి వెళ్తుండేవాడు. గురువారం ఉదయం ట్రాక్టర్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించేలోపు మార్గంమధ్యలో మృతిచెందాడు. మానవత్వం చూపిన సైనికుడు.. రాజు గాయపడడం చూసిన స్థానికులు ఆస్పత్రికి తరలించేందుకు ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న ఆర్మీసైనికుడు దూడ తిరుపతి ద్విచక్రవాహనంపై తీసుకెళ్లాడు. మల్యాల వ్యవసాయ మార్కెట్ సమీపంలోకి చేరుకోగా, అక్కడి నుంచి 108లోకి తరలించారు. రాజు అప్పటికే మృతిచెందాడని సిబ్బంది నిర్ధారించారు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో తల్లి అంజవ్వ రాజు మృతదేహంపై పడి ఏడ్చిన తీరు అందరినీ కలచివేసింది. తల్లి అంజవ్వ ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్‌పై కేసు నమోదుచేసినట్లు ఎస్సై నీలం రవి తెలిపారు. -
ఇసుక ట్రాక్టర్ బీభత్సం.. బాలుడు మృతి
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో ఇసుక ట్రాక్టర్ శనివారం ఉదయం బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన ట్రాక్టర్ దూసుకురావడంతో రోడ్డుపై ఆడుకుంటున్న చందు(13) అనే బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటనలో రాజేష్ అనే మరో బాలుడు గాయపడ్డారు. రాజేష్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
ట్రాక్టర్ ఇంట్లోకి దూసుకెళ్లి.. ముగ్గురి మృతి
జైపూర్: వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న ముగ్గురు చిన్నారులు శిథిలాల కింద పడి మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం రాజస్థాన్‌లోని ఝల్వార్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి ట్రాక్టర్ డ్రైవర్ పై కేసు నమోదు చేశారు. -
కువైట్ నుంచి వచ్చి కానరాని లోకాలకు..
ప్రకాశం, తాతిరెడ్డిపల్లి (కొమరోలు) : మోటార్ సైకిల్‌ను వేగంగా వస్తున్న ఇటుకల ట్రాక్టర్ ఢీకొనడంతో యువకుడు మృతిచెందగా మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని తాతిరెడ్డిపల్లి– మలికెపల్లి రోడ్డులో మంగళవారం జరిగింది. మలికెపల్లి గ్రామానికి చెందిన ఎదురు శ్రీనివాసరెడ్డి, ఆయన బావమరిది.. గిద్దలూరు మండలం పొదలకుంటపల్లికి చెందిన వల్లగంటి సుబ్బారెడ్డి మోటార్ సైకిల్‌పై కొమరోలుకు వస్తున్నారు. మార్గమధ్యంలో తాతిరెడ్డిపల్లి సమీపంలోని మలుపువద్దకు రాగానే వేగంగా ఇటుకల లోడ్‌తో వస్తున్న ట్రాక్టర్ మోటార్ సైకిల్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటనలో మోటార్‌సైకిల్‌ను నడుపుతున్న శ్రీనివాసరెడ్డి ట్రాక్టర్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న సుబ్బారెడ్డికి కాలు, చేయి పూర్తిగా విరగడంతో 108లో గిద్దలూరు వైద్యశాలకు తరలించారు. గిద్దలూరు ఎస్సై కొమరం మల్లికార్జున, ఏఎస్సై పి. ఇమాన్యూల్ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరుకు తరలించారు. శ్రీనివాసరెడ్డి ఇటీవలే కువైట్ నుంచి సెలవుపై ఇంటికి వచ్చాడు. ఒక్కసారిగా కుమారుని మృతదేహం కనిపించడంతో తల్లి రోదనలు మిన్నంటాయి. ట్రాక్టర్ డ్రైవర్ పరారయ్యాడు. ట్రాక్టర్‌ను పోలీసు స్టేషన్‌కు తరలించారు. -
ట్రాక్టర్ బోల్తాపడి యువకుడు..
ధర్మవరం అర్బన్: ధర్మవరం చెరువు మరువ వద్ద ఆదివారం రాత్రి ట్రాక్టర్ బోల్తాపడిన ప్రమాదంలో మల్లాకాలువ గ్రామానికి చెందిన బోయ గంగాధర్(23) మృతి చెందాడు. ట్రాక్టర్ డ్రైవర్ నారాయణస్వామి తీవ్రంగా గాయపడ్డాడు. ధర్మవరం పట్టణానికి ఇసుక తీసుకొచ్చి తిరిగి ఖాళీ ట్రాక్టర్లో మల్లాకాలువ గ్రామానికి వెళుతుండగా రెండో మరువ వద్ద ప్రమాదం జరిగింది. సీఐ హరినాథ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నారాయణస్వామిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఘోరం..
ట్రాక్టర్ బోల్తా.. టెన్త్ విద్యార్థిని మృతి పది మందికి తీవ్రగాయాలు.. క్షతగాత్రుల్లో ఆరుగురు విద్యార్థులు యల్లనూరు: కూలీలు, విద్యార్థులతో బయల్దేరిన ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో పదో తరగతి విద్యార్థిని మృతి చెందింది. మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఆరుగురు విద్యార్థులు ఉన్నారు. స్పెషల్ క్లాస్‌కు వెళుతున్నానని చెప్పి ఇలా కానరాని లోకాలకు వెళ్లిపోతివా అంటూ మృతి చెందిన విద్యార్థిని తనూజ తల్లిదండ్రులు రాములు, గురక్కలు బోరున విలపించారు. దేవుడా ఎంత పనిచేశావయ్యా అంటూ రోదించారు. వివరాలిలా ఉన్నాయి. యల్లనూరు మండలం నీర్జాంపల్లి సమీపంలో గ్రామానికి చెందిన పెద్దిరాజు, ఆయన భార్య రామలక్ష్మమ్మ, పెద్దిరాజు తమ్ముడు చంద్రయ్య, ఆయన భార్య జయమ్మలు శనివారం ఉదయం తొమ్మిది గంటలకు ట్రాక్టర్లో ఇసుకను తీసుక తేవడానికి బయల్దేరారు. అదే సమయంలో నీర్జాంపల్లికి చెందిన పదో తరగతి విద్యార్థులు తనూజ(15), భాస్కర్, గంగామహేష్, కామాక్షి, మణికంఠ, భారతి, పృధ్విలు తాము చదువుకుంటున్న పార్నపల్లి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులకు వెళ్లేందుకు ట్రాక్టర్లో ఎక్కారు. గ్రామం దాటి కొంతదూరం వెళ్లగానే ట్రాక్టర్ అదుపుతప్పి గోతిలోకి బోల్తాపడింది. అందరూ తీవ్రంగా గాయపడటంతో హుటిహుటిన పులివెందుల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తనూజ మృతి చెందింది. ప్రథమ చికిత్స అనంతరం విద్యార్థిని భారతిని మెరుగైన వైద్యం కోసం కుప్పం ఆస్పత్రికి తరలించారు. కామాక్షి, మణికంఠలను అనంతపురం, పెద్దిరాజును కర్నూలు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. మిగిలిన విద్యార్థులు గంగామహేష్, భాస్కర్‌తో పాటు చంద్రయ్య, జయమ్మ, రామలక్ష్మమ్మలు పులివెందులలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులను పరామర్శ: రోడ్డు ప్రమాద విషయం తెలియగానే ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డి పులివెందుల ఆస్పత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి ధైర్యం చెప్పారు. -
ట్రాక్టర్ బోల్తా.. పెళ్లింట్లో విషాదం
కర్నూలు: మూడు ముళ్ల బంధం కోసం బయల్దేరిన పెళ్లి కూతురి తరఫు వారి వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నరసమ్మ(55) అనే వృద్ధ మహిళ ప్రాణాలు కోల్పోయింది. దీంతో పెళ్లింట్లో విషాదం అలముకుంది. జిల్లాలోని అస్పరి మండలం ములుగుందం గ్రామానికి చెందిన తిక్కయ్య కూతురు లక్ష్మికి పత్తికొండ మండలం అటికెలగుండు నాగేష్ కొడుకు రాజుతో వివాహం నిశ్చయమైంది. ఆదివారం పెళ్లి కొడుకు ఇంటికి తలంబ్రాలు తీసుకెళ్లాల్సివుండటంతో అమ్మాయి తరఫు వారు 40 మంది ట్రాక్టర్లో అటికెలగుండుకు బయల్దేరారు. ములుగుందం దాటిన తర్వాత కైరుప్పల పాఠశాల వద్దకు రాగానే ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో నరసమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. పెళ్లి కూతురితో పాటు మరో 20 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్ధితి విషమంగా ఉంది. ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా
కుందుర్పి : కుందుర్పి–మాయదార్లపల్లి మార్గంలో ఓ ట్రాక్టర్ శనివారం అదుపు తప్పి బోల్తాపడింది. ఘటనలో శెట్టూరు మండల అనుంపల్లికి చెందిన సోమనాథ్(32) మృతి చెందగా, అదే మండలం రంగయ్యపాళ్యం చెందిన లక్ష్మణమూర్తి, తిప్పేస్వామి తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. సోమనాథ్ తన ఇంటి వద్ద పశువుల పాక కోసం అవసరమైన కట్టెల కోసం అనుంపల్లి, రంగయ్యపాళెం చెందిన ఆరుగురితో కలసి కర్ణాటకలోని మరదాసనపల్లెకు వెళ్లాడు. అక్కడ కట్టెలు కొనుగోలు చేసి స్వగ్రామానికి తీసుకువస్తుండగా మార్గమధ్యంలో కుందుర్పి సమీపంలోని కుంట వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడటంతో సోమనాథ్ అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. ఇంజిన్ కింద ఇరుక్కుపోయిన లక్ష్మణమూర్తిని చుట్టుపక్కల వారు గమనించి అతనితో పాటు తిప్పేస్వామిని రక్షించారు. మృతుడికి భార్య, ఒక కూతురు ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఇసుక ట్రాక్టర్ బోల్తా
కూలీ మృతి, డ్రైవర్ పరారు ఎగువపల్లి (సోమశిల) : అధిక లోడుతో అతివేగంగా వెళ్తున్న ఓ ఇసుక ట్రాక్టర్ మలుపు వద్ద అదుపు తప్పి బోల్తాపడి కూలీ మృతి చెందిన సంఘటన అనంతసాగరం మండలంలోని ఎగువపల్లి సమీపంలో బుధవారం జరిగింది. సోమశిల ఎస్ఐ ఎంఎస్ రాకేష్ కథనం మేరకు.. వైఎస్సార్ జిల్లా బద్వేల్ పురపాలక పరిధిలోని మడకరవారిపల్లికి చెందిన ట్రాక్టర్ మండలంలోని పీకేపాడు ఇసుక రీచ్ నుంచి అధిక లోడుతో ఇసుకను తీసుకెళ్తుండగా ఎగువపల్లి సమీపంలోని మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కూలీ చిట్టిబోయిన సుధాకర్ (28) ట్రాక్టర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ పరారీ అయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటాన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాక్టర్ బోల్తా : డ్రైవర్ దుర్మరణం
కావలిఅర్బన్ : ట్రాక్టర్ అదుపుతప్పి పడి డ్రైవర్ దుర్మరణం పాలైయ్యాడు. ఈ సంఘటన మండలంలోని వ్యవసాయ పొలాల్లో బుధవారం జరిగింది. కావలి రూరల్ పోలీసుల కథనం మేరకు.. మండలంలోని ఆనెమడుగు పంచాయతీ ఆకుతోట గిరిజన కాలనీకి చెందిన చిట్టేటి సురేష్ (25) ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రుద్రకోటకు చెందిన జగదీశ్వరరెడ్డి వద్ద ట్రాక్టర్ తీసుకుని నారుమడులు దున్నేందుకు వెళ్లాడు. పని ముగించుకుని తిరిగి పొలాల్లో వేసిన రోడ్డుపై వస్తుండగా ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుగా విలపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాక్టర్ కింద పడి వృద్ధురాలు మృతి
ఆత్మకూరురూరల్ : ట్రాక్టర్ కింద పడి ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని దేపూరు శుక్రవారం రాత్రి జరిగింద చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. చెందిన వై ఎల్లమ్మ (పుల్లమ్మ )(78) రజక వృత్తి చేసుకుంటూ జీవిస్తుంది. శుక్రవారం ఆత్మకూరుకు వచ్చి కొన్ని దుస్తులు తీసుకుని గ్రామానికి వెళ్తుంది. అదే సమయంలో సిమెంట్ ఇటుకలు, వరలు వేసుకుని వస్తున్న ట్రాక్టర్ వెనక్కు వచ్చే క్రమంలో వృద్ధురాలిని ఢీకొంది. దీంతో ట్రాక్టర్ వెనుక చక్రాలు ఆమె రెండు కాళ్లపై వెళ్లడంతో నుజ్జునుజ్జు అయి తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఆత్మకూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. మృతదేహానికి ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు మృతి
బుచ్చిపేట(నరసన్నపేట) : మడపాం నుంచి ముషిడిగట్టుకు వెళ్లే మార్గంలో బుచ్చిపేట సమీపంలో శనివారం ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడిన సంఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. మడపాం నుంచి చేనులవలస ఇసుక ర్యాంపునకు ఇసుక కోసం వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బుచ్చిపేట సమీపంలో బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తున్న యజమాని మడపాం పంచాయతీ కొత్తపేటకు చెందిన గొర్లె శ్రీను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న నరసన్నపేట ఎస్ఐ ఎన్.లక్ష్మణ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య లలిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ట్రాక్టర్ కొన్న 10 రోజులకే.. శ్రీను పది రోజుల కిందటే ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి ఇసుకను తవ్వి అమ్మకాలు చేస్తున్నాడు. శనివారం కూడా అదే పనిలో ఉండగా డ్రైవర్ లేని సమయంలో ట్రాక్టర్‌ను శ్రీను తీసుకొని చేనులవలస ర్యాంపుకు బయలుదేరాడు. బుచ్చిపేట ముందు వర్షాలకు రోడ్డు బాగా కోతకు గురవడంతో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలను తప్పించబోయి ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో ఇంజిన్ కింద ఇరుక్కుపోయిన శ్రీను తలకు బలమైన గాయమైంది. దీంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. వర్షాలకు రోడ్డు కోతకు గురవడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొన్నారు. -
రెప్పపాటులో ఘోరం
పోలీసుల బైక్‌ను ఢీకొట్టి బావిలో పడిన ట్రాక్టర్ నలుగురు యువకులు దుర్మరణం ప్రమాదం నుంచి తప్పించుకున్న యజమాని బాధిత కుటుంబాలకు మంత్రి, ఎమ్మెల్యే పరామర్శ సైదాపూర్/ చిగురుమామిడి : మద్యం మత్తు... అతివేగం.. ర్యాష్ డ్రైవింగ్ రెప్పపాటులో నలుగురి ప్రాణాలు తీసింది. ట్రాక్టర్ కొనుగోలు చేసిన ఓ యువకుడు మిత్రులకు దావత్ ఇచ్చేందుకు వారిని కొత్తవాహనంపై తీసుకెళ్లాడు. అందరూ కలిసి రాత్రి వరకూ మద్యం తాగారు. తిరుగు ప్రయాణంలో రెప్పపాటులో ఘోరం జరిగింది. మద్యం మత్తులో వేగంగా ట్రాక్టర్ నడుపుతూ అటుగా వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టారు. ఏం జరిగిందో అని వెనుకకు తిరిగి చూసేలోపు వాటి ట్రాక్టర్ రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడింది. ఐదుగురిలో నలుగురు ట్రాక్టర్‌తో సహా బావిలో పడి దుర్మరణం చెందారు. మరో యువకుడు త్రుటిలో తప్పించుకుని పారిపోయాడు. ఈ విషాద సంఘటన సైదాపూర్ మండలం దుద్దెనపల్లిలో శుక్రవారం రాత్రి జరిగింది. చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన కత్తుల శివకుమార్ మంగళవారం కొత్త ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. ఇంజిన్ కూలింగ్ కోసం మూడు రోజులుగా ట్రాక్టర్‌ను తిప్పుతున్నాడు. ట్రాక్టర్ కొన్నందుకు దావత్ ఇచ్చేందుకు తమ మిత్రులు అదే గ్రామానికి చెందిన బొల్లి రాజు(18), కొంకట శ్రీకాంత్(22), మాచమల్ల రఘు(22), పిల్లి సంతోష్(24)ను తీసుకుని శుక్రవారం ట్రాక్టర్‌పై సైదాపూర్‌కు వెళ్లాడు. అక్కడి వైన్‌షాపులో అందరూ కలిసి మద్యం తాగారు. రాత్రి 10 గంటల వరకూ అక్కడే ఉన్నారు. బయల్దేరే ముందు మరో మద్యం బాటిల్ కొనుక్కున్నారు. మత్తులోనే ట్రాక్టర్‌పై స్వగ్రామానికి బయల్దేరారు. దుద్దెనపల్లి వద్ద బ్రిడ్జి దాటిన తర్వాత కోహెడ ఏఎస్సై రాజేందర్, మరో కానిస్టేబుల్ వెళ్తున్న బైక్‌ను ట్రాక్టర్ డ్రైవర్ వేగంగా ఢీకొట్టాడు. ఈ క్రమంలో ఏఎస్సై, కానిస్టేబుల్ కిందపడ్డారు. భయంతో వారిని గమనిస్తూనే అంతే వేగంగా ట్రాక్టర్ ముందుకు పోనిచ్చాడు. దీంతో ట్రాక్టర్ అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గమనించిన ట్రాక్టర్ యజమాని శివకుమార్ కిందకు దూకాడు. ట్రాక్టర్ నలుగురు యువకులతో సహా రెప్పపాటులో చెట్లపొదల్లో ఉన్న వ్యవసాయ బావిలో పడింది. దీంతో శివకుమార్ అక్కడి నుంచి పారిపోయాడు. ప్రమాదానికి గురైన ఏఎస్సై వెంటనే స్థానిక పోలీసులకు సమాచారమిచ్చాడు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై శ్రీధర్‌కు సంఘటన వివరాలన్నీ రాజేందర్ వివరించాడు. ఎస్సై క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి తన సిబ్బందితో ప్రమాద స్థలంలో రాత్రంతా బందోబస్తు ఏర్పాటు చేశారు. బావిలో పడిన ట్రాక్టర్, యువకుల కోసం లైట్లు వేసి వెతికినా కనిపించలేదు. దీంతో ఫైరింజన్‌ను రప్పించారు. బావిలోని నీళ్లు తోడేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో మరో మోటార్ బిగించి బావిలోని నీళ్లు తోడేశారు. దీంతో ట్రాక్టర్, పిల్లి సంతోష్ మృతదేహం బయటపడింది. ప్రొక్లెయిన్‌తో శవాన్ని బయటకు తీశారు. ఈలోగా కరీంనగర్ ఆర్డీవో చంద్రశేఖర్, కరీంనగర్ డీఎస్పీ రామారావు, హుజూరాబాద్ రూరల్ సీఐ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆర్డీవో టెలిస్కోపిక్ క్రేన్ తెప్పించి ట్రాక్టర్‌తోపాటు బొల్లి రాజు,కొంకట శ్రీకాంత్, మాచమల్ల రఘు మృతదేహాలను పైకి తీశారు. కత్తుల శివకుమార్ కోసం బావిలో మరోసారి వెతికినా కనిపించలేదు. దీంతో అతడు తప్పించుకుని ఉంటాడని భావించారు. మృతదేహాలను హుజూరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ట్రాక్టర్ యజమాని కనిపించకపోవడంతో మృతుల బంధువులు ఆందోళనకు దిగారు. హుజూరాబాద్ రూరల్, హుస్నాబాద్ సీఐలు ఎండీ.గౌస్‌బాబా, దాసరి భూమయ్య వారికి నచ్చజెప్పారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటాం – మంత్రి ఈటల సంఘటన స్థలానికి మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ వచ్చారు. మృతదేహాలను పరిశీలించారు. సంఘటన జరిగిన తీరు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను ఓదార్చారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. శోకసంద్రమైన బొమ్మనపల్లి.. సైదాపూర మండలంలో జరిగిన ప్రమాదంతో బొమ్మనపల్లి గ్రామంలో విషాదం అలుముకుంది. మృతులందరూ 25 ఏళ్లలోపే కావడంతో ఎదిగిన తమ కొడుకులు దుర్మరణం చెందడంతో తల్లిదండ్రులు తీవ్ర దుఖఃసారగంలో మునిగిపోయారు. డిగ్రీ చదివిన పిల్లి సంతోష్‌కుమార్.. పిల్లి నీలమ్మ–లక్ష్మీనారాయణ దంపతులకు మూడో సంతానం పిల్లి సంతోష్‌కుమార్. డిగ్రీవరకు చదివాడు. జీవనోపాధి నిమిత్తం నాలుగేళ్లుగా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి అన్న, అక్క ఉన్నారు. వీరిది సామాన్య రైతుకుటుంబం. ఎనిమిది నెలల క్రితం శ్రీకాంత్ వివాహం కొంకట శ్రీకాంత్ హుస్నాబాద్ మండలం అంతకపేట్కు చెందిన హరిణిని ప్రేమించాడు. ఎనిమిది నెలల క్రితం వీరు పెళ్లి చేసుకున్నారు. హరిణి ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి. 9వ తరగతి వరకే చదువుకున్న శ్రీకాంత్ కూడా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి నలుగురు సోదరులు, ఒక అక్క ఉంది. నానమ్మ వద్ద ఉంటున్న బొల్లి రాజు.. బొల్లి రాజు తల్లిదండ్రులు బొల్లి స్వరూప, బొల్లి శ్రీనివాస్ జీవనోపాధి నిమిత్తం సైదాపూర్ మండలం చింతపల్లిలో ఉంటున్నారు. రాజు బొమ్మనపల్లిలోని తన నానమ్మ వద్ద ఉంటూ కూలీపనులకు వెళ్తున్నాడు. ఇతడు 9వ తరగతి వరకు చదువుకున్నాడు. రాజుకు ఒక చెల్లి ఉంది. వీరిది కూడా సామాన్య కుటుంబమే. స్నేహానికి ప్రాణం ఇచ్చే రఘు.. బొమ్మనపల్లికి చెందిన మాచమల్ల పద్మ, మల్లేశం దంపతులకు రెండో కుమారుడు మాచమల్ల రఘు. పదో తరగతి వరకు చదువుకున్నాడు. బతుకుదెరువు కోసం ఆటో నడుపుతున్నాడు. ఆటోను కూడా బ్యాంకులో రుణం తీసుకుని కొనుగోలు చేశాడు. స్నేహితుడు కత్తుల శివకుమార్ పిలవడంతో వెళ్లి మత్యువాతపడ్డాడు. -
ట్రాక్టర్ బోల్తా.. ఐదుగురికి గాయాలు
కూసుమంచి : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు జలాశయంలో వినాయక నిమజ్జనం చేసి తిరిగి వెళ్తుండగా శుక్రవారం వేకువజామున ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ఘటనలో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. మిగతా వారిని ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రమాదానికి గురైన ట్రాక్టర్ ఉడతలగూడెం గ్రామానికి చెందినదిగా గుర్తించారు. -
ట్రాక్టర్ తిరగబడి రైతు దుర్మరణం
పూతలపట్టు: చిత్తూరు జిల్లా పూతలపట్టు, ఎం.బండమీదపల్లి గ్రామానికి చెందిన జనకమహారాజు(40) అనే రైతు పొలంలో ట్రాక్టర్ నడుపుతుండగా ఇంజన్ తిరగపడి అక్కడికక్కడే మృతి చెందాడు. శనివారం ఉదయం ట్రాక్టర్‌తో పొలం దున్నుతుండగా ఒక్కసారిగా ఇంజన్ తిరగబడింది. ట్రాక్టర్ నడుపుతున్న జనకమహారాజు అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ సంఘటనలో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. రైతు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
ట్రాక్టర్ ట్రక్కు బోల్తా : యువకుడి మృతి
మరొకరికి గాయాలు కోట : ట్రాక్టర్ బోల్తాపడి ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడారు. ఈ సంఘటన మండలంలోని చంద్రశేఖరపురం వద్ద ఆదివారం రాత్రి జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. చంద్రశేఖరపురానికి చెందిన కయ్యాల వెంకటేశ్వర్లు (18), తన స్నేహితుడైన ట్రాక్టర్ డ్రైవర్ ముమ్మడి వెంకటేశ్వర్లుతో కలిసి తోడుగా ట్రాక్టర్లో వెళ్లాడు. పనులు ముగించుకుని చిట్టేడు నుంచి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పి ట్రక్ బోల్తాపడటంతో అందులో కూర్చుని ఉన్న కయ్యాల వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ ముమ్మడి వెంకటేశ్వర్లును 108 సిబ్బంది చికిత్స కోసం గూడూరుకు తరలించారు. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న మృతుడి తల్లిదండ్రులు రవీంద్ర, రాధమ్మలను ఓదార్చడం ఎవరితరం కాలేదు. వెంకటేశ్వర్లు విద్యానగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం కావడంతో స్నేహితునికి తోడుగా వెళ్లి ప్రమాదంలో మృతి చెందాడు. ఎస్సై అజయ్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాక్టర్ కింద నలిగిన మూడేళ్ల చిన్నారి
ఉప్పర్‌పల్లిలో ఘటన l కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు చేగుంట: ట్రాక్టర్ కిందపడి మూడేళ్ల బాలుడు నలిగిపోయాడు. ఒక్కగానొక్క కొడుకును కోల్పోయి ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటన మండలంలోని ఉప్పర్‌పల్లిలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... ఉప్పర్‌పల్లి గ్రామానికి చెందిన చింతల శ్యామల, చంద్రం దంపతులు. వీరికి ఒక్కగానొక్క సంతానం రేవంత్(3). మంగళవారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. అదే దారిలో వచ్చిన ట్రాక్టర్ కింద బాలుడు నలిగిపోయాడు. డ్రైవర్ చూసుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పోస్టుమార ్టం నిమిత్తం బాలుడి శవాన్ని మెదక్ ఏరియా ఆస్పత్రికి తరళించినట్టు ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. -
బావిలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్
- ఇద్దరు రైతులు మృతి నర్మెట: వరంగల్ జిల్లా నర్మెట మండలం గండిరామవరంలో బుధవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఇద్దరు రైతులు మృతి చెందారు. గండిరామవరానికి చెందిన ఇద్దరు రైతులు పొలంలో ఉన్న వరిగడ్డిని తీసుకు వచ్చేందుకు ట్రాక్టర్లో బయలుదేరారు. వారి ట్రాక్టర్ అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న బావిలోకి దూసుకు పోయింది. దీంతో ట్రాక్టర్ పై ఉన్న రైతులు నూన్సావత్ బోడ్యా, అజ్మీరా లోక్యా అక్కడికక్కడే మృతి చెందారు. -
ట్రాక్టర్‌పై నుంచి పడి యువకుడి మృతి
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా వంగర మండలం పలగాం వద్ద ట్రాక్టర్‌పై నుంచి జారిపడి శివ్వాపు అప్పడు (25) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాలీలో చెరకు కట్టలను ఎక్కించడానికి శివ్వం గ్రామం నుంచి పొలానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని అప్పడు మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాక్టర్ బోల్తా : యజమాని మృతి
పొలంలో దుక్కి దున్నుతున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు తిరగబడిన ఘటనలో యజమాని మృతి చెందాడు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా రాయచోటి రూరల్ మండలం ఎండపల్లె పంచాయతీ బోయపల్లెలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. సానికులు తెలిపిన వివరాలివీ.. బోయపల్లె సమీపంలోని పొలంలో చిన్నరామిరెడ్డిగారి పల్లె గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ట్రాక్టర్ తో దుక్కి దున్నుతున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ బురదలో కూరుకుపోయింది. డ్రైవర్ ఈశ్వరయ్య ట్రాక్టర్ ను బయటకు తీసేందుకు యత్నించినా ఫలితం కనిపించలేదు. విషయం తెలుసుకున్న ట్రాక్టర్ యజమాని బి.ఆంజనేయులు(29) అక్కడికి చేరుకుని డ్రైవింగ్ సీట్లో కూర్చుని, ట్రాక్టర్ బయటకు తీసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ ఒక్కసారిగా ముందు వైపు పైకి లేచింది. దీంతో డ్రైవింగ్ చేస్తున్న ఆంజినేయులు వెనక్కి బురదలో పడిపోయాడు. తలకు తీవ్రంగా గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతడికి భార్య, ఏడాది వయస్సున్న కుమారుడు ఉన్నారు. -
టిప్పర్ ట్రాక్టర్ ఢీ.. ఒకరి మృతి
ఎమ్మిగనూరు: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం చెన్నాపురం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నర్సయ్య అనే రైతు పండిన పంటను ఇంటికి తేవడం కోసం ట్రాక్టర్‌పై కూలీలతో వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. దీంతో నర్సయ్య(30) అక్కడికక్కడే మృతిచెందగా... ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. -
పొలంలో ట్రాక్టర్ బోల్తా.. ఒకరి మృతి
స్టేషన్‌ఘన్‌పూర్(వరంగల్ జిల్లా): వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం సముద్రాలలో బుధవారం జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో యజమాని భారతపు సమ్మయ్య (32) అక్కడిక్కడే మృతిచెందాడు. మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన సమ్మయ్య రోజూ మాదిరిగానే బుధవారం సముద్రాలలోని సొంత పొలం దున్నేందుకు ట్రాక్టర్ తీసుకెళ్లాడు. అక్కడ కేజీవీల్స్ బిగించి దున్నుతున్న సమయంలో ట్రాక్టర్ బురదలో దిగబడింది. ఈ క్రమంలో ఎక్స్‌లేటర్‌ను ఒక్కసారిగా తొక్కడంతో ట్రాక్టర్ ఇంజన్ లేచి బోల్తా పడింది. దానికిందనే ఇరుక్కుపోయిన సమ్మయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య స్వర్ణలత, తొమ్మిదిరోజుల కూతురు ఉంది. -
ట్రాక్టర్ కింద పడి చిన్నారి మృతి
రంగారెడ్డి: అప్పటివరకు తండ్రితో ఆటలాడుకున్న ముక్కుపచ్చలారని ఆ చిన్నారి ఆడుతూ.. ఒక్కసారిగా ట్రాక్టర్ కింద పడి చనిపోయిన ఘటన రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలంలోని లింగాపూర్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగాపూర్ గ్రామానికి చెందిన మహేష్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మహేష్ భార్య లక్ష్మీ, వారి 14 నెలల కూతురు సంజీవ ఇంటి వద్దె ఉంటున్నారు. మహేష్ కూతురితో ఆడుకుని ట్రాక్టర్ బయటకు తీయడానికి చిన్నారిని తల్లికి ఇచ్చి.. ట్రాక్టర్ వద్దకు వచ్చాడు.. ఆ సమయంలో 'నాన్నా నేను కూడా వస్తాను' అని అరుస్తూ.. చిన్నారి తండ్రి వెంట ట్రాక్టర్ వద్దకు వచ్చింది.. ఇది గమనించని మహేష్ ట్రాక్టర్ స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు. ట్రాక్టర్ వెనక టైర్ కొద్దిగా కదిలి ఆగిపోయింది. ఎందుకు కదలడం లేదని ట్రాక్టర్ దిగి చూడగా తన చిట్టితల్లి టైరుకింద పడి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆ చిన్నారి చనిపోయిందని వైద్యులు తెలిపారు. దీంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. -
ట్రాక్టర్ దూసుకెళ్లి బాలుడి మృతి
కందుకూరు(రంగారెడ్డి జిల్లా): కందుకూరు మండలం తిప్పరపల్లి గ్రామంలో సోమవారం రాత్రి ట్రాక్టర్ దూసుకెళ్లడంతో మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన అంబటి జంగయ్య, చిట్టి దంపతులకు పండు(3) అనే కుమారుడు ఉన్నాడు. సోమవారం రాత్రి పండు ఇంటి ముందు ఆడుకుంటుండగా అటుగా వచ్చిన ట్రాక్టర్, రోడ్డుపై ఆగి ఉన్న ఆటోను ఢీ కొట్టింది. ఆ తరువాత ట్రాక్టర్ బాలుడిపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. -
ఇంట్లోకి దూసుకువెళ్లిన ఇసుక ట్రాక్టర్
నల్గొండ: నల్గొండ జిల్లా పెన్‌పహాడ్ మండలం దుబ్బగూడెంలో దారుణం చోటు చేసుకుంది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఇసుక ట్రాక్టర్ ఇంట్లోకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో ట్రాక్టర్ డ్రైవర్ అక్కడి నుంచి పరారైయ్యాడు. గ్రామస్థులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా ఈ ఘటనపై గ్రామస్తులు .. పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా వారు స్పందించలేదు. దీంతో గ్రామస్తులు పోలీసులు, రెవెన్యూ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. -
పాఠశాల సెలవు...ఓ బాలుడి ప్రాణం తీసింది
పెనుమూరు : ఆ అబ్బాయికి పాఠశాల అంటే ఎంతో ఇష్టం. రోజూ క్రమం తప్పకుండా బడికి వెళ్లేవాడు. టీచర్లతో ఎంతో అన్యోన్యంగా మెలిగేవాడు. అతడంటే టీచర్లకు ఎంతో ఇష్టం. తల్లిదండ్రులు లేక లేక కలిగిన ఆ అబ్బాయిని అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అయి తే రెండవ శనివారం వచ్చిన పాఠశాల సెలవు అతని ప్రాణం తీసింది. ఈ సంఘటన పెనుమూరు మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, స్నేహితులతో కలిసి గుడికి వెళ్లిన పద్నాలుగేళ్ల ఆ బాలుడు ట్రాక్టర్ ప్రమాదంలో ప్రాణాలొదిలాడు. ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు, పెనుమూరు ఎస్ఐ ప్రతాపరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నారుు. పెనుమూరు మండలం మోపిరెడ్డిపల్లె పంచాయతీ బాలాజీనగర్‌కు చెందిన పి.సుబ్రమణ్యానికి ఎంతో ఆలస్యంగా పెళ్లరుున 20 ఏళ్ల తర్వాత అబ్బారుు పుట్టాడు. అతనికి కార్తీక్ అనే పేరు పెట్టారు. ఒక్కడే కుమారుడు కావడంతో తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచారు. ఉగ్రాణపల్లెలో తొమ్మిదో తరగతి చదువుతున్న కార్తీక్ క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్లడం, బాగా చదవుతుండడంతో టీచర్లు అభినందించేవారు. క్రమశిక్షణ, దైవభక్తి చూసి గ్రామస్తులు కూడా ప్రశంసించేవారు. ఈ నేపధ్యంలో శనివారం పాఠశాలకు సెలవు కావడంతో గ్రామానికి సమీపంలో ఉన్న కొండపై జరిగే పూజకు స్నేహితులు, గ్రామస్తులతో కలిసి ఓ ట్రాక్టర్లో కొబ్బరి మట్టలు, మామిడి తోరణాలు, అరటి చెట్లు తీసుకుని వెళ్లాడు. వాటిని ట్రాక్టర్‌పై నుంచి కిందికి దించాడు. స్వామిని దర్శించుకున్నాడు. సాయంత్రం ఆలయం వద్ద జరిగే పూజకు సామాన్లు తీసుకు రావడానికి ట్రాక్టరుపై బయలుదేరాడు. గ్రామస్తులు, స్నేహితులతో కలిసి కార్తిక్ ట్రాక్టర్ ట్రాలీలో కుర్చున్నాడు. కొండపై నుంచి ట్రాక్టర్ కిందకు దిగే సమయంలో డ్రైవర్ అదుపుచేయలేక పోయాడు. ట్రాలీలో అతనితోపాటు ఉన్న పవన్(14), రంజిత్ కుమార్(16), హేమంత్(16) ఎగిరి కిందకు దూకేశారు. కార్తీక్ భయంతో ట్రాలీలోనే కూర్చున్నాడు. ట్రాక్టర్ ట్రాలీ ఇంజిన్ నుంచి విడిపోయి బోల్తా పడింది. కార్తీక్ ట్రాలీ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాలీలోనే ఉన్న మరో ముగ్గురు స్వల్పగాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు సంఘటనా స్థలం చేరుకొని బోరున విలపించారు. స్వామి నీ వద్దకు భక్తితో వస్తే ప్రాణాలు తీశావా ! అంటూ తల్లిదండ్రులు కన్నీరు పెట్టారు. తల్లి అనారోగ్యంతో ఉన్నా కొండపైకి వచ్చి మృత్యువాత పడ్డ కుమారుడిని చూసి సొమ్మసిల్లి పడిపోరుుంది. పెనుమూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. -
నిద్రిస్తున్న రైతుపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్
అనంతపురం: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురంలో విషాదం చోటు చేసుకుంది. కాల్వ గట్టుపై నిద్రిస్తున్న ఓ రైతుపై నుంచి ట్రాక్టర్ దూసుకెళ్లింది. ఆ ఘటనలోఅబ్దుల్లా అనే రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు వెంటనే స్పందించి ట్రాక్టర్‌ను అడ్డుకుని... డ్రైవర్‌కు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసులు ఘటన స్థలం నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
పొట్టకూటికోసం వచ్చి..మృత్యువాత
ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు మహిళా కూలీల మృతి పలువురికి గాయాలు శోకసంద్రంలో బత్తులవారిగూడెం రెక్కాడితే గానీ డొక్కాడని ఆ కుటుంబాల్లో వీడని విషాదం అలముకుంది. కూలి పనుల కోసం వచ్చినవారిలో ఇద్దరు మహిళలతో పాటు ఇంటర్ విద్యార్థిని మృతిచెందటంతో వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి స్వగ్రామమైన బత్తులవారిగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గన్నవరం, న్యూస్‌లైన్ : పొట్టకూటి కోసం కూలి పనులకు వచ్చిన ముగ్గురు మహిళా కూలీల నిండు ప్రాణాలు ట్రాక్టర్ ప్రమాదంలో గాలిలో కలిసిపోయాయి. మామిడి కాయలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి గోతిలోకి బోల్తా కొట్టడంతో ఈ ఘటన జరిగింది. మండలంలోని కొండపావులూరు గ్రామసమీపంలో బుధవారం జరిగిన ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నూజివీడు మండలం బత్తులవారిగూడెం గ్రామానికి చెందిన 23 మంది కూలీలు మామిడికోతల పనుల నిమిత్తం రెండు రోజులుగా మండలంలోని కొండపావులూరు గ్రామ సమీపంలోని వెంకట తిరుమల కృష్ణారావు తోటలోకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో నున్న మామిడి మార్కెట్‌కు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌పై సూరంపల్లి వరకు వెళ్లేందుకు ఎక్కారు. కొంతమంది లోడుపై ఎక్కగా, మరికొంతమంది ట్రాక్టర్ ఇంజన్ భాగంలో కూర్చున్నారు. ట్రాక్టర్ తోటలో నుంచి కొంతదూరం వెళ్లిన తర్వాత ఎత్తుగా ఉన్న గట్టు ఎక్కించే క్రమంలో డ్రైవర్ గంగుల బుడ్డయ్య తడబడ్డాడు. దీంతో ట్రాక్టర్ అదుపుతప్పి గట్టుపై నుంచి ఒక్కసారిగా వెనక్కి జారిపోయి ట్రక్కుతో సహా పక్కనే ఉన్న గోతిలోకి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఇంజిన్ భాగంలో కూర్చున్న బత్తుల కాసులు (34) తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ట్రక్కుపై ఉన్న కొంతమంది కూలీ లు కిందకు దూకేసి ప్రాణాలు కాపాడుకున్నారు. మిన్నంటిన హాహాకారాలు... ఈ ప్రమాదంలో మరికొంత మంది కూలీలు ట్రాక్టర్ లోడు సహా గోతిలోకి పడిపోయారు. దీంతో రక్షించమంటూ హాహాకారాలు చేశారు. కిందకు దూకిన కూలీలు షాక్ నుంచి తేరుకుని ట్రక్కులో చిక్కుకున్న కూలీలను బయటకు లాగే ప్రయత్నం చేశారు. లోడు కింద చిక్కుకున్న చెన్ను కుమారి, చెన్ను సునీత లను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేసినప్పటికి సాధ్యం కాలేదు. విషయం తెలుసుకున్న కొంతమంది గ్రామస్తులు అక్కడికి చేరుకోవడంతో వారి సహాయంతో తిరగబడిన ట్రక్కును పైకి లేపారు. మామిడికాయల మధ్య చిక్కుకుని కుమారి, సునీతలు ఊపిరాడక అప్పటికే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన తిరుపతమ్మ (45), మురళీ (40)లను విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద అనంతరం డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. విషాదఛాయలు... తల్లిదండ్రులకు సహాయపడేందుకు వేసవి సెలవుల్లో బంధువులతో కలిసి మామిడికోత పనులకు వచ్చిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తిచేసుకున్న సునీత మృత్యువాతకు గురవడం అందరినీ కలచివేసింది. సమాచారం తెలుసుకున్న ఆమె తండ్రి వెంకటేశ్వరరావు ఘటనాస్థలికి చేరుకుని విగతజీవిగా ఉన్న కుమార్తెను భోరున విలపించారు. మృతి చెందిన కాసులు, కుమారి కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బత్తులవారిగూడెంలో విషాదఛాయలు నూజివీడు రూరల్ : ట్రాక్టర్ ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురు మహిళల స్వగ్రామమైన నూజివీడు మండలం బత్తులవారిగూడెంలో విషాదఛాయలు అలముకున్నాయి. పేద కుటుంబాలకు చెందిన వీరు కూలి పనులు చేసుకుంటూ కాలం వెళ్లబుచ్చుతుండగా ట్రాక్టర్ ప్రమాదం వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ప్రమాదంలో మృతిచెందిన బత్తుల వడ్డీకాసులుకు భర్త సాంబశివరావుతో పాటు ఇద్దరు పిల్లలు, చెన్ను కుమారికి భర్త నాగేశ్వరరావుతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. చెన్ను సునీత పట్టణంలోని ఒక కాలేజీలో ఇంటర్ చదువుతూ సెలవులు కావడంతో మామిడి కోతలకు వెళుతోంది. -
ఆటో- ట్రాక్టర్ ఢీ: 10 మందికి గాయాలు
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో శనివారం ఆటో - ట్రాక్టర్ డీ కొన్నాయి. ఆ ప్రమాదంలో 10 మంది గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దాంతో క్షతగాత్రులను గుంటూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారంతా ముప్పాళ్ల మండలం మాదల గ్రామస్తులని పోలీసులు తెలిపారు. -
ఆటో - ట్రాక్టర్ ఢీ: ఒకరు మృతి
గుంటూరు జిల్లా రేపల్లె మండలం పుల్లమెరక వద్ద శుక్రవారం ఆటో - ట్రాక్టర్ ఢీ కొన్నాయి. ఆ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వేళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.