సాక్షి, జనగాం జిల్లా : రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రయాణికులను హడలెత్తిస్తున్నాయి. నిత్యకృత్యంగా మారిన రహదారి ప్రమాదాలతో ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా జనగాం మండలం పెంబర్తి గ్రామ శివార్లలో ఆర్టీసి బస్సు, బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మృతులను రామన్నగూడెం గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు తీగల నర్సయ్య(56), తీగల కృష్ణ(28)గా గుర్తించారు. నర్సయ్య ప్రమాద అక్కడికక్కడే చనిపోగా, కృష్ణ జనగాం ఏరియా అసుపత్రిలో చికిత్స పొందుతు మృతి చెందాడు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు.
మరో ఘటనలో..
పాలకుర్తి మండలం సిరిసన్న గూడెం శివారులో ట్రాక్టర్ బోల్తా పడిన దుర్ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. హూటాహుటిన వారిని ఆసుపత్రికి తీసుకురావటం వల్ల ప్రమాదం తప్పింది. అధిక లోడు కారణంగానే ట్రాక్టర్ బోల్తా పడిందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
పాము కాటుకు రైతు మృతి
బచ్చన్నపేట మండలంలోని సాల్వాపూర్ గ్రామంలో పాము కాటుకు పడాల నరేందర్ అనే రైతు మృతి చెందాడు. రాత్రి సమయంలో పొలానికి నీరు పెట్టేందుకు వెళుతుండగాదారిలో పాము కాటువేసింది. సకాలంలో వైద్యం అందకే మృతి చెందాడని కుటుంబ సభ్యులు విలపించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment