ట్రాక్టర్ కింద పడి చిన్నారి మృతి | girl dies of tractor accident | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ కింద పడి చిన్నారి మృతి

May 17 2015 10:53 PM | Updated on Sep 28 2018 3:39 PM

అప్పటివరకు తండ్రితో ఆటలాడుకున్న ముక్కుపచ్చలారని ఆ చిన్నారి ఆడుతూ.. ఒక్కసారిగా ట్రాక్టర్ కింద పడి చనిపోయింది.

రంగారెడ్డి: అప్పటివరకు తండ్రితో ఆటలాడుకున్న ముక్కుపచ్చలారని ఆ చిన్నారి ఆడుతూ..  ఒక్కసారిగా ట్రాక్టర్ కింద పడి చనిపోయిన ఘటన రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలంలోని లింగాపూర్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది.  గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగాపూర్ గ్రామానికి చెందిన మహేష్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

మహేష్ భార్య లక్ష్మీ, వారి 14 నెలల కూతురు సంజీవ ఇంటి వద్దె ఉంటున్నారు. మహేష్ కూతురితో ఆడుకుని ట్రాక్టర్ బయటకు తీయడానికి చిన్నారిని తల్లికి ఇచ్చి..  ట్రాక్టర్ వద్దకు వచ్చాడు.. ఆ సమయంలో 'నాన్నా నేను కూడా వస్తాను'  అని అరుస్తూ..  చిన్నారి తండ్రి వెంట ట్రాక్టర్ వద్దకు వచ్చింది.. ఇది గమనించని మహేష్ ట్రాక్టర్ స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు.

ట్రాక్టర్ వెనక టైర్ కొద్దిగా కదిలి ఆగిపోయింది. ఎందుకు కదలడం లేదని ట్రాక్టర్ దిగి చూడగా తన చిట్టితల్లి టైరుకింద పడి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆ చిన్నారి చనిపోయిందని వైద్యులు తెలిపారు. దీంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement