పాఠశాల సెలవు...ఓ బాలుడి ప్రాణం తీసింది
పెనుమూరు : ఆ అబ్బాయికి పాఠశాల అంటే ఎంతో ఇష్టం. రోజూ క్రమం తప్పకుండా బడికి వెళ్లేవాడు. టీచర్లతో ఎంతో అన్యోన్యంగా మెలిగేవాడు. అతడంటే టీచర్లకు ఎంతో ఇష్టం. తల్లిదండ్రులు లేక లేక కలిగిన ఆ అబ్బాయిని అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అయి తే రెండవ శనివారం వచ్చిన పాఠశాల సెలవు అతని ప్రాణం తీసింది. ఈ సంఘటన పెనుమూరు మండలంలో చోటుచేసుకుంది.
గ్రామస్తులు, స్నేహితులతో కలిసి గుడికి వెళ్లిన పద్నాలుగేళ్ల ఆ బాలుడు ట్రాక్టర్ ప్రమాదంలో ప్రాణాలొదిలాడు. ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు, పెనుమూరు ఎస్‌ఐ ప్రతాపరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నారుు. పెనుమూరు మండలం మోపిరెడ్డిపల్లె పంచాయతీ బాలాజీనగర్‌కు చెందిన పి.సుబ్రమణ్యానికి ఎంతో ఆలస్యంగా పెళ్లరుున 20 ఏళ్ల తర్వాత అబ్బారుు పుట్టాడు. అతనికి కార్తీక్ అనే పేరు పెట్టారు.
ఒక్కడే కుమారుడు కావడంతో తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచారు. ఉగ్రాణపల్లెలో తొమ్మిదో తరగతి చదువుతున్న కార్తీక్ క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్లడం, బాగా చదవుతుండడంతో టీచర్లు అభినందించేవారు. క్రమశిక్షణ, దైవభక్తి చూసి గ్రామస్తులు కూడా ప్రశంసించేవారు. ఈ నేపధ్యంలో శనివారం పాఠశాలకు సెలవు కావడంతో గ్రామానికి సమీపంలో ఉన్న కొండపై జరిగే పూజకు స్నేహితులు, గ్రామస్తులతో కలిసి ఓ ట్రాక్టర్‌లో కొబ్బరి మట్టలు, మామిడి తోరణాలు, అరటి చెట్లు తీసుకుని వెళ్లాడు. వాటిని ట్రాక్టర్‌పై నుంచి కిందికి దించాడు. స్వామిని దర్శించుకున్నాడు.
సాయంత్రం ఆలయం వద్ద జరిగే పూజకు సామాన్లు తీసుకు రావడానికి ట్రాక్టరుపై బయలుదేరాడు. గ్రామస్తులు, స్నేహితులతో కలిసి కార్తిక్ ట్రాక్టర్ ట్రాలీలో కుర్చున్నాడు. కొండపై నుంచి ట్రాక్టర్ కిందకు దిగే సమయంలో డ్రైవర్ అదుపుచేయలేక పోయాడు. ట్రాలీలో అతనితోపాటు ఉన్న పవన్(14), రంజిత్ కుమార్(16), హేమంత్(16) ఎగిరి కిందకు దూకేశారు. కార్తీక్ భయంతో ట్రాలీలోనే కూర్చున్నాడు. ట్రాక్టర్ ట్రాలీ ఇంజిన్ నుంచి విడిపోయి బోల్తా పడింది. కార్తీక్ ట్రాలీ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాలీలోనే ఉన్న మరో ముగ్గురు స్వల్పగాయాలతో ఆస్పత్రి పాలయ్యారు.
విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు సంఘటనా స్థలం చేరుకొని బోరున విలపించారు. స్వామి నీ వద్దకు భక్తితో వస్తే ప్రాణాలు తీశావా ! అంటూ తల్లిదండ్రులు కన్నీరు పెట్టారు. తల్లి అనారోగ్యంతో ఉన్నా కొండపైకి వచ్చి మృత్యువాత పడ్డ కుమారుడిని చూసి సొమ్మసిల్లి పడిపోరుుంది. పెనుమూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.