ఎల్కతుర్తి, న్యూస్‌లైన్: భయపడిందే నిజమైంది. ఘోరం జరిగిపోయింది. ఆడుతుండగా అదృశ్యమైన బాలుడు నాలుగు రోజుల తర్వాత చెరువులో శవమై తేలాడు. ఈయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మండలకేంద్రానికి చెందిన బొజ్జ లావణ్య-గణేశ్ దంపతుల ఏకైక కుమారుడు బొజ్జ కార్తీక్(13). గురువారం తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా కార్తీక్ ఆడుకుంటున్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు కార్తీక్ కోసం వెతికినా ఆచూకీ దొరకలేదు.
ఠాణాలో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. నాలుగురోజులుగా తల్లిదండ్రులు నరకయాతన అనుభవించారు. క్షణమొక యుగంలా కుమారుడి కోసం కళ్లల్లో వత్తులేసుకుని నిరీక్షించారు. కాలుకు బట్టకట్టకుండా తిరిగారు. కానీ విగతజీవుడిగా కొడుకు కన్పించేసరికి హతాశులయ్యారు. ఎల్కతుర్తి పక్కగ్రామం చింతలపల్లి ఊర చెరువులో కార్తీక్ శవమై తేలాడు. తమ కుమారుడిది హత్యేనని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎప్పుడూ ఇల్లు విడిచి వెళ్లేవాడు కాదని, నీళ్లంటే భయమని.. చెరువువైపు వెళ్లాలంటేనే జంకుతాడని రోదిస్తూ చెప్పారు. ఎవరో తమ బిడ్డను పొట్టనబెట్టుకున్నారని శాపనార్థాలు పెట్టారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
మృతిపై అనుమానాలు
చింతలపల్లి చెరువులో కొన్ని రోజుల క్రి తం ఎల్కతుర్తికి చెందిన ముదిరాజ్ కుల స్తులు చేపలు పట్టారు. కార్తీక్‌ది అదే సా మాజికవర్గం. ఆ బాలుడూ చేపలు పట్టేం దుకు వెళ్లి ఉంటాడని పలువురు అనుమానిస్తున్నారు. ఆ చెరువులోకి ఒక్కడే వెళ్లా డా? లేక ఎవరైనా స్నేహితులతో వెళ్లా డా? అనే సందేహాలూ వ్యక్తమవుతున్నా యి. చెరువులో ప్రమాదవశాత్తు పడ్డాడా? ఎవరైనా తోసేశారా? అనేది తేలాల్సి ఉంది.
చెరువులో పడి మృతిచెం దితే నీళ్లు మింగి శరీరం ఉబ్బిపోయి ఉండేది. కానీ మృతదేహం అలా లేదు. చెరువు కట్టపై 2 జతల చెప్పులు కూడా అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ విషయమై ‘న్యూస్‌లైన్’ ప్రొబిషనరీ ఎస్సై ఉదయ్‌ను సంప్రదించగా ‘ప్రమాదవశా త్తు జరిగి ఉంటుం ది. అన్ని విషయాలు పోస్టుమార్టం తర్వాత తెలుస్తాయి’అన్నారు.
శవమై వస్తివా బిడ్డా..
Published Sun, Jan 19 2014 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM
Advertisement
Advertisement