కోల్‌కతా: స్వలింగసంపర్కానికి పాల్పడినట్లు విద్యార్థినులతో ఓ పాఠశాల యాజమాన్యం లేఖలు రాయించుకున్న ఘటన పశ్చిమబెంగాల్‌లో కలకలం రేపింది. విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కోల్‌కతాలోని కమల గర్ల్స్ హైస్కూల్‌కి చెందిన 10 మంది బాలికలు స్వలింగసంపర్కానికి పాల్పడినట్లు ఇతర విద్యార్థులు ప్రిన్సిపాల్‌కి ఫిర్యాదు చేశారు. పాఠశాల యాజమాన్యం బాలికలను పిలిచి విచారించింది.
తాము స్వలింగ సంపర్కానికి పాల్పడ్డామని వారు విచారణలో ఒప్పుకున్నట్టు పాఠశాల వర్గాలు పేర్కొన్నాయి. పాఠశాల యాజమాన్యం వారిచే లేఖలు రాయించుకుని విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. అయితే స్కూల్ యాజమాన్యం తీరుపై తల్లిదండ్రులు మండిపడ్డారు. తమ పిల్లలు స్వలింగ సంపర్కానికి పాల్పడలేదని, బలవంతంగా వారిచే లేఖలు రాయించారని ఘర్షణకు దిగారు. తమ పిల్లలపై అనవనరంగా నిందలు మోపారని, చేతులు పట్టుకోవడం లేదా ఒకరి భుజాల మీద ఒకరు చేయి వేయడం స్వలింగ సంపర్కం కాదని తల్లిదండ్రులు పేర్కొన్నారు. బాలికల ఉదంతాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లి వారిని సరైన మార్గంలోకి తీసుకురావడానికే లేఖలు రాయించామని స్కూల్ యాజమాన్యం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment