ట్రాక్టర్ బోల్తా.. ఐదుగురికి గాయాలు
Published Fri, Sep 16 2016 11:54 AM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM
కూసుమంచి : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు జలాశయంలో వినాయక నిమజ్జనం చేసి తిరిగి వెళ్తుండగా శుక్రవారం వేకువజామున ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ఘటనలో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. మిగతా వారిని ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రమాదానికి గురైన ట్రాక్టర్ ఉడతలగూడెం గ్రామానికి చెందినదిగా గుర్తించారు.
Advertisement
Advertisement