
సాక్షి, నందిగామ: కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ కాల్వలోకి బోల్తా పడిన ఘటన వీరులపాడు మండలం పొన్నవరం గ్రామ శివారులో జరిగింది. ట్రాక్టర్ ఇంజన్ కింద డ్రైవర్‌తో సహా వ్యవసాయ కూలీలు ఇరుక్కుపోగా.. స్థానికులు వారిని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో తమ్మిశెట్టి ధనలక్ష్మి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని విజయవాడ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment